పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు సిధ్ధం..డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టి ఫోన్లు,కేటుగాళ్ల కొత్త వ్యూహం….రైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు..డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు..రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించిన దామచర్ల.

👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యింది.
ప్రభుత్వానికి హడ్కో (హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. గత వారంలో రెండు రోజుల పాటు హడ్కో ప్రతినిధులు టిడ్కో అధికారులతో సమావేశం అయ్యారు. రుణాలకు సంబంధించి హామీనిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లు ఎంత వరకు పూర్తయ్యాయి?.. ఏ దశల్లో ఉన్నాయి? అని నివేదిక రూపొందించారు.ఈ పెండింగ్ టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని హడ్కో అధికారులు కోరారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా.. మరో రెండు రోజుల్లో నివేదికను హడ్కోకు అందించ బోతున్నారు. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3.14 లక్షల గృహాలను చేపట్టింది.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 2019లో 52 వేల టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. వీటిలో 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పగా.. ఎన్నికల సమయానికి 1.45 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది.అయితే వీటిలో ఎక్కువ ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతంపైగా పూర్తి చేసినవే ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన 1.17 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా.. దీని కోసం రూ.5,070 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
👉ఏపీలో అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం..
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ..ఆగస్టు 2వ తేదీ నాటికి తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశం ..సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది..
👉రొట్టెల పండుగ‌కు 95 శాతం ప‌నుల‌న్నీ పూర్తి*- భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్నీ వ‌స‌తులు క‌ల్ప‌న‌..
కుల‌మ‌తాల‌క‌తీతంగా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించేదే… రొట్టెల‌పండుగ‌ నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో రొట్టెల‌పండుగ నిర్వ‌హ‌ణ‌పై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌…వ‌స‌తుల క‌ల్ప‌న‌పై అన్నీ శాఖ‌ల అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చ‌..టీడీపీ ప్ర‌భుత్వ‌హ‌యాంలోనే బారాష‌హీద్ ద‌ర్గా అభివృద్ధి..రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ… రొట్టెల‌పండుగ నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ ఆనంద్‌తో పాటు అన్నీ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాష‌హీద్ ద‌ర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వ‌హించే రొట్టెల‌పండుగ ఏర్పాట్ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. భ‌క్తుల‌కు ఎక్క‌డ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని సూచించారు. అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రొట్టెల‌పండుగ‌ను విజ‌యవంతం చేయాల‌ని ఆదేశించారు.ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిండుకున్న నెల్లూరులోని బారాష‌హీద్ ద‌ర్గా రొట్టెల పండుగ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికి సుప‌రిచిత‌మేన‌న్నారు. 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ క‌నీవినీ ఎగుర‌ని రీతిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ పండుగ‌ను దాదాపుగా 20 ల‌క్ష‌ల మందికి పైబ‌డి బారాష‌హీద్ ద‌ర్గా సంద‌ర్శ‌న‌కు విచ్చేస్తార‌ని చెప్పారు. కుల‌మ‌తాల‌క‌తీతంగా అంద‌రు విచ్చేసి స్వ‌ర్ణాల చెరువులో కోరిన కోర్కెలు తీరేందుకు రొట్టెలు ప‌ట్టుకోవ‌డం… త‌ర్వాత సంవ‌త్స‌రంలో వ‌చ్చి కోరిన కోర్కె తీరిన అనంత‌రం మ‌ళ్లీ రొట్టెలు వ‌ద‌ల‌డం గ‌త 400 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డి నుండి ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుగుతుంద‌న్నారు. ఏడాదికేడాది భ‌క్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి న‌మ్మ‌క‌మ‌ని చెప్పారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు తాను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎంతో అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. 2014 ఏడాదికి ముందు అధ్వానంగా ఉన్న స్థితిలో నుండి అప్పుడు మేయ‌ర్‌గా ఉన్న అబ్దుల్ అజీజ్ చొర‌వ‌తో బారాష‌హీద్ ద‌ర్గాను ఎంతో డెవ‌ల‌ప్‌మెంట్ చేసిన‌ట్లు చెప్పారు. ద‌ర్గాలో శాశ్వితంగా మ‌రుగుదొడ్ల ఏర్పాట్లు, వ‌స‌తుల క‌ల్ప‌న ఆ స‌మ‌యంలోనే చేప‌ట్టామ‌న్నారు. దీంతో రొట్టెల పండుగ స‌మ‌యంలో భ‌క్తుల సంఖ్య అనూహ్యం పెరుగుతూ వ‌స్తుంద‌ని నారాయ‌ణ తెలియ‌జేశారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు బారాష‌హీద్ ద‌ర్గాలో రొట్టెల పండుగ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో నిరంత‌రం స‌మీక్షిస్తున్నామ‌ని తెలిపారు. వ‌చ్చే భ‌క్తుల‌కు ఎక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, ఆరోగ్య శిబిరాలు, ఎల‌క్ట్ర‌సిటీ, ఫైర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, దివ్యాంగుల సౌల‌భ్యంగా ఏర్పాట్లు, స్వ‌చ్ఛంధ‌సంస్థ‌ల వారు భోజ‌నాలు ఏర్పాటు చేస్తే వారికి వ‌స‌తుల క‌ల్ప‌న‌, త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్‌తో పాటు అన్నీ శాఖ‌ల అధికారులతో మాట్లాడిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలియ‌జేశారు. బారాష‌హీద్ ద‌ర్గాలో రొట్టెల పండుగ‌కు సంబంధించి 95 శాతం మేర ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయ‌ని, మిగిలిన 5 శాతం కూడా పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
అనంత‌రం టీడీపీ జిల్లా అధ్య‌క్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల‌పండుగ నిర్వ‌హ‌ణ‌పై మంత్రి నారాయ‌ణ… అన్నీ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించార‌ని తెలిపారు. వ‌చ్చే భ‌క్తుల‌కు అన్నీ వ‌స‌తుల క‌ల్ప‌నే ధ్యేయంగా ముందుకెళుతున్నామ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు. రొట్టెల పండుగ‌కు వ‌చ్చే భ‌క్తులు సుర‌క్షితంగా వ‌చ్చి… క్షేమంగా ఇంటికి చేరాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు.కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్‌, అన్నీ శాఖ‌ల అధికారులు, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, టీడీపీ నేత‌లు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఇత‌ర ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు.
👉పేదల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యం…పులివర్తి నాని..ఆరోగ్యకర నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి కృషి…గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు సిమ్స్ సహకారం కోరిన ఎమ్మెల్యే…తిరుపతి..
చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్ లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో యంయల్ఏ నాని పాల‌్గొన‌్నారు. వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన‌్న తన కోరికను మన‌్నించి చర్యలు చేపట్టిన స్కీమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రవికుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరిని ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించటానికి అందరి సహకారం తీసుకొంటున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి సిమ్స్ ఆస్పత్రి సహకారం కావాలన్నారు. ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులు మంజూరు చేయించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల పారిశుధ్యం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట‌్యా ప్రతి ఒక్కరూ వైద్యులు చెప్పే సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స‌్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ సిమ్స్ నందు అవసరమగు చికిత్సలను పొంది ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
👉 అమరావతి: పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా మెడికల్‌ అంబులెన్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేశాయి. కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్‌ తరఫున ఆయన తనయుడు పి.వివేక్‌ ఆనంద్‌.. సీఎం చంద్రబాబు చేతులమీదుగా అంబులెన్స్‌ను అందించారు. క్రిటికల్‌ కేర్‌ వైద్యంలో ఈ అంబులెన్స్‌ కీలకంగా పనిచేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వివేక్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన ఉపేంద్రతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
👉హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్..
ముచ్చు మర్రి లో బాలిక మృత దేహం ఇంకా లభించలేదు.విజయనగరం లో 6 నెలల పసి కందు పై అత్యాచారం చేశారు.తాగిన మైకం లో వృద్ధుడు అత్యాచారం చేశాడు.సీఎం చంద్రబాబు వీటి పై సమీక్షించారు.లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలి అని సీఎం చెప్పారు.మచ్చు మర్రి ఘటన, 6 నెలల చిన్నారి ఘటన పై స్పెషల్ కోర్టు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు తో వెతికిన మృతదేహం దొరకలేదు.ముచ్చు మర్రి బాధిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తాం.6 నెలల చిన్నారి కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తాం.అడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం.క్రిమినల్ కి శిక్ష పడాలి.
అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఉరుకొం.
బైరెడ్డి మనుషులా..ఇంకా ఎవరైనా సరే వదలం అన్నారు.
👉 ఎన్టీఆర్ జిల్లా మైలవరం..
మైలవరం మరియు చుట్టూ పక్కల గ్రామాలలో అక్రమ వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వానికి కట్టవలసిన నాలా మరియు చలానాలు కట్టకుండా, మరియు వెంచర్లలో ప్రభుత్వానికి కేటాయించవలసిన 10% భూమిని ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మరియు ప్రజలను మోసం చేస్తూ అక్రమ వెంచర్లు వేసిన వారిపై ఈరోజు స్పందన కార్యక్రమంలోఫిర్యాదు చేయడం జరిగినది.
👉 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ మరియు 36వ డివిజన్ రైతు బజారులో తగ్గింపు ధరకి కంది పప్పు, బియ్యం విక్రయించే కేంద్రాలు ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
👉 గత ప్రభుత్వంలో స్థానిక ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన 4 అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయగా వైకాపా ప్రభుత్వం వచ్చాక జగన్ రెడ్డి అన్న క్యాంటీన్ లను పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టాడు.కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రభుత్వం చేత నడిపించేంతవరకు వుండకుండా పేదల ఆకలి తీర్చేందుకు నగరంలోని 4 అన్నా క్యాంటీన్ వద్ద దామచర్ల జనార్దన్ వారి స్వంత నిధులు మరియు దాతల సహకారంతో పునః ప్రారంభించడం జరిగినది,దాతలు తమ వంతుగా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. దీంతో గత 29 రోజులుగా ఒంగోలు నగరంలో వున్న 4 అన్నా క్యాంటీన్ ల వద్ద అన్నదానం నిర్విరామంగా కొనసాగుతూ చాలామంది పేదలకు జనార్దన్ ఆకలి తీరుస్తున్నారు.ఈరోజు ఒంగోలు గోల్డ్ మార్చంట్స్ అసోసియేషన్ తరపున 100000.00 (లక్ష రూపాయలు) అన్నా క్యాంటిన్ కు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు తాతా ప్రసాద్, సెక్రటరీ పేర్ల రమేష్, ట్రీజరర్ B.శంకర్, స్పీకర్ G. చెంచు రామరావు, G.రామ కృష్ణ ,I.రాజ్ కుమార్, పుట్లూరి సురేష్, Ch. యస్వంత్ తదితరులు పాల్గొన్నారు.


💥డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు అరెస్ట్..హైదరాబాద్, జూలై 15: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌సింగ్‌‌ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.
కాగా.. గతంలో డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 200 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువురు వీఐపీలకు కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
👉 తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు..జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్‌ హైకోర్టులోన్యాయవాది రాంకుమార్‌ పిటిషన్‌.రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
👉 రైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు..
రైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మహారాష్ట్రలోని కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విన్హారే–దివాన్ ఖవాటి స్టేషన్ల మధ్య రైళ్లు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 15 గంటలకు పైగా ప్రయాణికులు రైళ్లలోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తరలింపునకు బస్సులు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు
👉 డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టి ఫోన్లు..
కేటుగాళ్ల కొత్త వ్యూహం..విజృంభిస్తున్న సైబర్‌ నేరగాళ్లు
కోట్లు నొక్కేస్తున్న కేటుగాళ్లు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు ఉన్నతాధికారులకు ఫోన్లు
👉 రీఛార్జ్ ధరలు పెంచినా మెరుగుపడని సేవలు..
రీఛార్జ్ ధరలు పెంచినా మెరుగుపడని సేవలు
జియో, ఎయిర్‌టెల్, VI ఇటీవల టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచినా యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ తెలిపింది. కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యను 89% మంది ఎదుర్కొంటుండగా, 38% మందికి తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మెట్రో నగరాల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య స్వల్పంగా తగ్గినట్లు సర్వేలో తేలింది.
👉 అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త.. 48 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన కేసు..ఖమ్మం – రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఒక ఆస్పత్రిలో పిజియోతెరపిస్టుగా పని చేస్తూ అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సోని ప్రాన్సిస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.సోని ప్రాన్సిస్ తో కలిసి ఉండాలని తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. కారులో గ్రామానికి వెళ్తుండగా, పోస్టుమార్టంలో ఎంత మోతాదులో పాయిజన్ డోస్ ఇస్తే రాదో గూగుల్ లో వెతికి తెలుసుకొని తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చి, 4! ఏళ్ల లోపున్న ఇద్దరు ఆడ పిల్లల గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గురిని చంపేశాడు.ఆ తర్వాత కారును ఒక చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు.. చనిపోయిన భార్య, పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ జరిపిన పోలీసులు కారులో ఒక ఇంజక్షన్, ప్రవీణ్ ఫోన్లో గూగుల్ హిస్టరీతో ప్రశ్నించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం