BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్ ?..ఎస్సీ,ఎస్టీ ..డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు..నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి?.. విద్యార్థిని అనుమానాస్పద మృతి..బిఎస్ఎన్ఎల్ కు పూర్వవైభవం!..గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ముద్దాయిల అరెస్ట్..మంత్రి పొంగూరును కలిసిన ఎస్పీ

👉 BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్..???

జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు బలైపోతున్నారని ఆయన ఆరోపించారు.ఇలాంటివి ఒకదాని తర్వాత మరొకటి జరగడం బాధాకరమన్నారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

👉 ఎస్సీ,ఎస్టీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు..అమరావతి జూలై 16..ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపం లో తిరిగి చెల్లిస్తారు. 2024- 25 ఏడాదికి సంబంధించి రూ. 250కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ ఫైల్ పై ఎమ్ ఎస్ఎమ్ఈ , సెర్ప్, ఎన్ ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూ రుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.డ్వాక్రా సంఘా ల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామసంఘం స్థాయి నుంచి అన్ని దశ ల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరుచేయనున్నారు.ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది..

👉 GPS జీవో, గెజిట్ ఆపాలని AP CM చంద్రబాబు ఆదేశం..గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) జీవో, గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పుడెందుకు బయటపెట్టారో విచారించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. కాగా GPS అమలు చేస్తూ జూన్ 12న గెజిట్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

👉 అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ కానున్న మంత్రివర్గం. వివిధ కీలకాంశాలపై చర్చ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్‌లో సమీక్ష.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై చర్చ. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ.

👉 పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేముందు జాగ్రత్త: హోంమంత్రి..ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. ‘గంజాయి, కల్తీ మద్యానికి బానిసలై వావివరసలు మరచిపోతున్నారు. పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయి. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలి’ అని మంత్రి సూచించారు.

👉 నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి.. పవన్ క్లారిటీ..

నామినేటెడ్ పోస్టుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్లు చేశారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరన్నారు. నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు. కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు. అది కరెక్ట్ కాదని పవన్ వెల్లడించారు.

💥హైదరాబాద్లో మరో దారుణం..అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్..అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది.. తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు.ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు.వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు…

👉గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య…ఒక వ్యక్తిని దారుణంగా రెండు చేతులు, గొంతుపై కత్తితో దాడి చేసిన దుండుగులు…గాజువాక జగ్గూ జుంక్షన్ లో అతి కిరాతకంగా వెంటాడి వేటాడి చంపిన దుండుగులు…భూ తగాదాల నేపద్యంలో దారుణ హత్య..మృతుడు వేమిరెడ్డి అప్పలనాయుడు గా గుర్తించిన గాజువాక పోలీసులు..ఇంకా పూర్తి వివరాలు మృతుడు తెలియాల్సి ఉంది అప్పలనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కేజీహెచ్ మార్చురీ కు తరలింపు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు.

👉 మినిస్ట‌ర్ నారాయ‌ణ‌తో ఎస్పీ భేటీ…మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన కొత్త ఎస్పీ కృష్ణ‌కాంత్‌..రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ను నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో…రాష్ట్ర‌ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌న్ని ఎస్పీ క‌లిసి పూల‌మొక్క‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలోని శాంతి భ‌ద్ర‌త‌పై మంత్రి నారాయ‌ణ‌తో ఎస్పీ చ‌ర్చించారు.

👉 గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు..గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ASP , NACHIKET SHELKE, I.P.S. ఆదేశాల మేరకు, లాలాపేట పోలీస్ స్టేషన్ CI పి. దేవ ప్రభాకర్ ఆద్వర్యములో SI M.సుబ్బారావు మరియ వారి సిబ్బంది లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పీకలవాగు కట్ట డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి *రెండు కేజీల గంజాయిని* స్వాదినపరుచుకోవదమైనది.అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

*ముద్దాయిల వివరాలు*. 1) షేఖ్ కరిముల్లా , నల్లచెరువు 25/2 వ లైన్,గుంటూరు టౌన్, 2) చల్లా ఈశ్వర రావు, నిమ్మలాపేట 1 వ లైన్, నల్లచెరువుగుంటూరు టౌన్ 3) బత్తుల శ్రావణ్ కుమార్, నల్లచెరువు 18/3 వ లైన్,గుంటూరు టౌన్.. పై తెలిపిన ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటుపడి, గంజాయి సేవించే అలవాటు వుండి. భద్రాచలం మరియు ఒరిస్సా సరిహద్దు ప్రాంతలలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, గుంటూరు తీసుకువచ్చి గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రక్కల ప్రాంతాలలో గంజాయి త్రాగుట అలవాటు గల వారికీ అధిక ధరకు అమ్ముచున్నట్లు, అదేవిధముగా ఈ రోజు కుడా పైన తెలిపిన ముద్దాయిలు గంజాయిని పీకలవాగు కట్ట డంపింగ్ యార్డ్ వద్ద అమ్ముచున్నట్లు సమాచారము తెలుసుకొని CI పి. దేవ ప్రభాకర్  ఆదేశాలు మేరకు SI M.సుబ్బారావు మరియ వారి సిబ్బంది ముగ్గరు ముద్దాయిలను మరియు ఒక మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకోని వారి వద్ద నుండి *రెండు కేజీల గంజాయిని* స్వాదినపరుచుకొని ముద్దాయిలను రిమాండ్ కు పంపడమైనది. ఈ కేసులో పూర్వ పరాలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది.

👉BSNL: బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి.పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను BSNL మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్‌లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కేవలం రెండు వారాల్లో 1 లక్షా 15 వేల మంది కస్టమర్లు తమ సిమ్‌లను బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకున్నారు.👉భోపాల్‌లోనే రెండు వారాల్లో 30 వేల మంది కస్టమర్లు తమ నంబర్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతి రోజు డజన్ల కొద్దీ కస్టమర్లు వస్తున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ బృందం పలు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించింది. ఇతర కంపెనీల ప్లాన్‌లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నామని వినియోగదారులు మీడియా సంస్థతో తెలిపారు. భోపాల్ బీఎస్ఎన్ఎల్ పీజీఎం మహేంద్ర సింగ్ ధాకడ్‌ మాట్లాడుతూ.. మెరుగైన నెట్‌వర్క్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “కస్టమర్‌లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు ఒక నెలకు వసూలు చేస్తున్న ప్లాన్‌ను మేము 3 నెలలకు అందిస్తున్నాము. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతోంది.” అని పేర్కొన్నారు.

👉 పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు..వినుకొండ*:- కొండ పై జరుగుతున్న తోలి ఏకాదశి పండుగ ఏర్పాట్లు ను సిఐ లు సాంబశివరావు, సుధాకర్ లను అడిగి తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

👉 గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తిరిగివచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లీ కుమారుడు కలిసి ఊళ్లో వెతికారు. ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించింది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు బాలిక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజుకు పెళ్లయినా.. మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 నాకు 150 ఆయనకు 250 రూపాయలు కొట్టు క్వారీ పట్టు…నాయుకుల వాటా 150 మిగిలిన వాటా ఎవరికో లొగొట్టు పెరుమాళకు ఎరుక…నాయకులకు పట్టని ప్రభుత్వ నిబంధనలు..ప్రభుత్వాలు మారినా పట్టించు కోని అధికారులు..పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో మైనింగ్‌ క్వారీలను కొంతమంది బడా నాయకులు కొల్లగొడుతున్నారు. కాసుల కక్కుర్తిలో అధికారులు కూడా ప్రభుత్వ పాలసీలను పక్కదోవ పట్టించి, కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని దోపిడీ చేస్తున్న నాయకులకే కొమ్ముకాస్తున్నారు.గత ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన మైనింగ్‌ లూటీ, కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతూనే ఉంది. కానీ ఈ సారి వాటా లకు వాటాలు రేట్లు రెట్టింపు అయ్యాయి మండలం లోని కొండమోడు లో క్వారీల పని తీరును పరిశీలిస్తే బడ నాయకుల మైనింగ్‌ మాఫియా ఎలా ఉందో అర్ధమవుతోంది.కొండమోడు లో ఏడు సున్నపురాయి క్వారీలు ఉన్నాయి.వీటిలో సగానికి పైగా క్వారీలు రెన్యువల్‌ జరగక, పూర్తి స్థాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి.ప్రధానంగా పర్యావరణ క్లియరెన్స్‌ (ఇసి)లు లేకపోయినా క్వారీలు నడుపుతున్నారు.ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మైనింగ్‌ నడుపుతున్నారు.ప్రభుత్వం ఈప్పటికే ఆన్లైన్ రాయితీ బిల్లులు ఆపేసింది కానీ యదేచిగా రాజకీయ నాయకులు పేర్లు చెప్పి అడ్డగోలుగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ కి 350 రూపాయలు చొప్పున అధిష్టానానికి ఇస్తున్నట్లు బోగట్ట..350 రూపాయలు కట్టు క్వారీ పట్టు అన్న సామెతగా ఎక్కడ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి అక్రమ సున్నపురాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఎవరైతే మైనింగ్ గురించి మాట్లాడతారో ఎవరైతే మైనింగ్ గురించి వార్తలు రాస్తారో వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వాళ్ళని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్బందులు పెట్టాలని కొంతమంది వ్యాపారస్తులు మాట్లాడుతున్నట్లు సమాచారం…

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త