పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్?..ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..ప్రకాశం జిల్లా ఎస్పీకి ఘనంగా వీడ్కోలు..బాలినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామచర్ల..అభివృద్ధి కోసం పని చేస్తా- ముత్తుముల..అడ్డంగా బుక్కైన వజ్రకరూరు తహసీల్దార్..

👉వెలకట్టలేని సంపద… పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్!? ప్రస్తుతం దేశవ్యాప్తంగా… పూరీ జగన్నాథుడి రత్న భాండాగరంపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా… పూరీ జగన్నాథుడి రత్న భాండాగరంపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భాండాగారాన్ని తెరిపించిన ప్రభుత్వం దాని రిపేర్లు, ఖజానా లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ భాండాగారానికి సంబంధించిన షాకింగ్ సీక్రెట్ ఒకటి చెబుతున్నారు చరిత్రకారులు. ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది. అవును… ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా గతంలో ఈ సంపదను లెక్కించడానికి ఏకంగా 70 రోజుల సమయం పట్టిందని.. అప్పటికీ ఇంకా లెక్కించాల్సింది మిగిలే ఉందని అంటున్న నేపథ్యలో.. అసలు లోపల ఎంత సంపదుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో రహస్య గది టాపిక్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… పూరీ జగన్నాథుని రత్న భాండాగారం కింద ఓ రహస్య గది ఉందని.. ఆ గదికి సొరంగ మార్గం గుండా వెళ్లాలని.. అలా వెళ్లగలిగితే అక్కడ మరింత విలువైన సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే సమయంలో… భాండాగారం తెరిచిన ప్రభుత్వం.. ఈ సొరంగ మార్గం, సీక్రెట్ రూం లను గుర్తించడంపైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.దీంతో.. ఇప్పుడు ఇదో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్ మిశ్రా… తూర్పు, దక్షిణాది రాష్ట్రాలను జయించిన అనంతరం పూరీ రాజు కపిలెంద్రదేవ్ భారీ సంపద తెచ్చి జగన్నాథునికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని అన్నారు. అప్పట్లోనే భాండాగారం కింద సొరంగ మార్గం తవ్వి, ఆభరణాలను భద్రపరచడానికి రహస్య గదిని నిర్మించారని అన్నారు.ఈ రహస్య గదిలో సుమారు 34 కిరీటాలు, రత్నాలతో పొదగబడిన బంగారు సింహాసనాలు, స్వర్ణ విగ్రహాలు, వడ్డాణాలు ఉన్నాయని.. ఆ సంపద వెలకట్టలేనిదని వెల్లడించారు. ఇదే సమయంలో… ముస్లిం దండయాత్రల సమయంలో స్వామిపారి సంపద దోపిడీకి గురవ్వకుండా ఈ రహస్య గదిని నిర్మించారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేశ్ చంద్రదాస్ పేర్కొన్నారు. ఈ రహస్య గదికోసమే 1902లో బ్రిటీష్ పాలకులు ఆ సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపిస్తే అతడి ఆచూకీ తెలియలేదని.. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని అన్నారు. అనంతరం ఈ రహస్యగది, సొంరంగ మార్గం గురించి ఎవరూ కనుగొనలేకపోయారని వెల్లడించారు. ఇప్పుడు ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఒడిశా సర్కార్ ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి!

👉ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కామెంట్స్..

 

బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా నా పై విమర్శలు చేశారు..ఇంత ఘోరంగా ఓడిపోయిన బాలినేనికి సిగ్గు రాలేదు..ఓటమి పై సమీక్ష చేసుకోకుండా ఏదోడో మాట్లాడుతున్నాడు..అమాయక చక్రవర్తి మాదిరి.. బాలినేని నట్టిస్తున్నాడు.. ఎన్నికల సమయంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వాళ్ళు దాడి చేయలేదా..వాడు.. వీడు అనీ మాట్లడితే కొవ్వు దించుతా.. బాలినేని ఇంకొక్కసారి మాట్లాడితే చూస్తూ ఊరుకోను..బాలినేని విల్లాస్ లో పక్కాగా అవినీతి జరిగింది..విల్లాస్ పై ఇంటెలిజెంట్ ఇంక్వారీ విచారణ చేపిస్తాం.. విల్లాస్ లోకి అధికారులే వస్తారు… వాళ్లే విచారణ చేస్తారు.. బాలినేని ఎన్నికల సమయంలో ఒంగోలు టీడీపీ టికెట్ చంద్రబాబును అడిగారు.. చంద్రబాబు నో అంటే ఆగారు..మొన్నటి మొన్న జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు అతనే చెప్పి.. ఇప్పుడు ఎదో మాట్లాడుతున్నాడు.. బాలినేని ఒంగోలు అభివృద్ధిలో చేసింది శున్యం.. ఒంగోలులో గంజాయి బ్యాచ్ సంగతి తెలుస్తాం.. బాలినేని ఇంట్లో పనిచేసే వాళ్ళకి కార్పొరేషన్ లో నుంచి జీతాలు ఇచ్చారు.. కార్పొరేషన్ వాళ్ళ సొంత ఆస్తి కాదు..

👉 న్యాయవాదుల పై దాడికి నిరసనగా విధులను బహిష్కరించిన బార్ అసోసియేషన్. మార్కాపురం..బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు పుప్పాల శ్రీనివాస రావు, పిల్లి సుధాకర్,వై.పూర్ణ మహేష్ లపై జరిగిన అమానుష దాడికి నిరసనగా మంగళవారం పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపని కాశయ్య, యద్దనపూడి అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలంగా వున్న నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థపై దాడి జరగడం అమానుషమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి న్యాయవాదులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని వారు పిలుపునిచ్చారు.దాడులు చేయడం ద్వారా న్యాయవ్యవస్థను అదుపు చేయాలనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. న్యాయవాదులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపని కాశయ్య, వై .అనిల్ కుమార్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పట్టణ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రవీంద్ర నాధ్,మాజీ అధ్యక్షులు కె .శ్రీనివాస చౌదరి, ఎస్ కె యూసఫ్ అలీ, సీనియర్ న్యాయవాదులు సయ్యద్ అలీ జహీర్, శివరాత్రి ప్రసాద్,ఇమ్మడి శెట్టి నాగేశ్వర రావు, కడియం రామయ్య,బి.రంగారెడ్డి, వల్లభనేని కాశయ్య, తోట ఉషా శ్రీ,వై.వెంకటేశ్వర రెడ్డి, నారాయణ రెడ్డి,బత్తుల రామిరెడ్డి తో పాటు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

👉 బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్,కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ..

👉ఎన్నికల సమయంలో ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను: జిల్లా ఎస్పి..👉ఇటీవల జరిగిన సాధారణ బదిలీల నేపథ్యంలో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కి పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలీస్ లు అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించడం వలన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించగలిగామని, పోలీస్ యంత్రాంగం సహకారాన్ని జిల్లా ఎస్పీ కొనియాడారు. శాంతి భద్రత, నేరాల నియంత్రణ, బందోబస్తు, ఎలక్షన్ సమయంలో సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారని, దీనికి హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి ఒక్కరూ అంకిత భావం, నిబద్ధతతో మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించాలని, విధుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలని, కొత్త చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలని ఆకాక్షించారు. బదిలీపై జిల్లా వదిలి వెళ్లినప్పటికీ ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తన పరిధిలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణలో జిల్లా ఎస్పీ గారి సహకారం, దిశానిర్ధేశం మరువలేనిదని, పోలీస్ సిబ్బందికి సదా అండగా నిలిచి తమలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించారని, సిబ్బంది సంక్షేమానికి విశేష కృషి చేసారని ఎస్పీ గారిని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్ )ఎస్ వి. శ్రీధర్ రావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డీపీఓ ఏఓ సులోచన, డిఎస్పీలు కిషోర్ బాబు, రామరాజు, అశోక్ వర్ధన్, బాల సుందరం, పోలీస్ లీగల్ అడ్వైసర్ వేణుగోపాల్, సీఐలు, ఆర్ ఐలు పాల్గొన్నారు.

👉ఆరేళ్ల చిన్నారిపై టీచర్ అనుచిత ప్రవర్తన… ఎటు పోతుంది సమాజం.. ఎక్కడకు వెళుతున్నాం మనం అనే ప్రశ్నించుకునే స్థాయికి రావాల్సిన దారుణ పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి. మహిళలు, యువతులు, ఆడ పిల్లలు, చివరకు పసికందులను కూడా వేధిస్తున్నారు కామాంధులు. తండ్రి, కూతురు రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడో సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారన్న ఇంగిత జ్ఞానం మరిచి.. నోటికి హద్దు అదుపు లేకుండా చర్చా వేదిక పెట్టాడు. చివరకు జైలు పాలయ్యాడు. అలాగే ఎనిమిదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు ‘హత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు ఆ బిడ్డ నేటికి దొరకలేదు. అంతేనా ఆరు నెలల పసికందుపై తాత వరుసయ్యే వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇది అత్యంత గుజుప్సాకరం. ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి.. చిన్నారి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ఆ పాప తల్లిదండ్రులకు చెప్పడంతో టీచర్‌ను చితకబాదారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కిరణ్ ఇంటర్నేషన్ స్కూల్లో ఓ వ్యక్తి డ్యాన్స్ మాస్టర్‌గా పిల్లలకు డ్యాన్సులు నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకటో తరగతి విద్యార్థిపై అనుచితంగా ప్రవర్తించాడు. స్కూల్లో ఆమెను అనుచితంగా తాకాడు. ఇంటికి వెళ్లిన చిన్నారి.. స్కూల్లో డ్యాన్స్ టీచర్ తనను తాకరాని చోట తాకడంటూ చెప్పడంతో ఆవేశంతో పాఠశాలకు వెళ్లి నిలదీశారు. అనంతరం డ్యాన్స్ టీచర్‌ను మేనేజ్ మెంట్ పిలిపించగా.. అతడిపై విరుచుకుపడ్డారు. అతడ్ని కింద పడేసి తన్నారు పస్ట్ క్లాస్ స్టూడెంట్ పేరెంట్స్. ఆవేశంతో దూషణలు చేసి.. ఇలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు అంటూ కొట్టారు. ఆ పిల్ల ఎంత వయస్సు ఉందని అలా టచ్ చేశావంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. తనను టచ్ చేయలేదంటూ పేర్కొన్నాడు టీచర్. అసభ్యకరంగా తాకితేనే పాప చెప్పిందంటూ వెల్లడించారు ఆమె తరుఫు వారు. ఇదిలా ఉంటే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. తమకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పిల్లల్ని బడికి పంపాలంటేనే భయమేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

👉ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..

సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం.కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం.కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం..పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం.

👉ఈ రోజు రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లజిల్లా కలెక్టర్ ప్రశాంతిని కలిసి జిల్లా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్.

👉ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.ప్రకాశం జిల్లా రాచర్ల అర్థవీడు మండలాలలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. మండల అభివృద్ధికి కట్టుబడి అధికారులు అందుకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు.కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

👉ఫోన్ పే ద్వారా లంచం చెల్లింపు..అడ్డంగా బుక్కైన తహసీల్దార్.. అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు.ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు పని చేయాలంటే బల్లకింద చేతులు చాపుతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మారడంలేదు. తాజాగా ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకి చిక్కారు. పక్కా సమాచారంతో అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న తహసీల్దార్ మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమిని మ్యుటేషన్ కోసం ఎమ్మార్వో రఫీని నంద్యాల చెందిన రైతు కలిశారు. దీంతో 65 వేలు లంచం ఇస్తే పని చేస్తానని తహసీల్దార్ డిమాండ్ చేశారు. అంత లంచం ఇచ్చుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు చెప్పినట్టుగా ఎమ్మార్వో రఫీకి లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా పంపారు. వెంటనే రంగంలోకి ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం నిర్ధారణ కావడంతో శాఖా పర్యమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం