విద్యాదీవెన,వసతిదీవెన స్థానంలో పాత విధానం: నారా లోకేశ్..వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే..?గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్..ప్రకాశం ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్.. మొహర్రం వేడుకలలో మాజీ ఎమ్మెల్యే అన్నా

👉విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో మళ్ళీ పాత విధానం: నారా లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ లో విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచి పోయాయని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని లోకేశ్ తెలిపారు. కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబును ఏపీ సెక్రటరీయేట్ లోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరియు నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు కొత్తపల్లి ఆశిష్ లాల్ ..

👉మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ 17 వ రోజు మంగళగిరి నియోజకవర్గం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు,తమ సమస్యలపై వినతిపత్రాలు అందిస్తున్నారు,ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా అందరి సమస్యలు పరిష్కరిస్తానని నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు.

👉వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే…?😲 ఇదిలా ఉంటే విజయమ్మ షర్మిల ఇద్దరూ వైసీపీకి చేటు చేశార ని వైసీపీ సీనియర్ నేతలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు.

దాంతో పాటుగా ఆమె తొలి ఎమ్మెల్యే. వైసీపీకి జగన్ తొలి ఎంపీగా ఎలా పార్లమెంట్ లో అడుగుపెట్టారో అలాగే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన విజయమ్మ అసెంబ్లీలో అడుగు పెట్టి పార్టీకు రాజకీయ గుర్తింపు తెచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భాంలో ఆమె ఇచ్చిన స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అయితే వైఎస్ విజయమ్మ పార్టీకి చాలా ఏళ్ళుగా అండగా ఉంటూ వస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాకనే ఆమె తెర చాటుకు పరిమితం అయ్యారు.అయితే వైఎస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడంతో ఆమె కూతురు వైపుగా మళ్లారు.ఆమె 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో అయితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మరీ తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.తాను కుమార్తెకు తోడుగా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పారు.ఆ విధంగా తెలంగాణలో ఆమె షర్మిలతో కలసి ప్రచారం నిర్వహించారు. అయితే షర్మిల తెలంగాణాలోని తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారారు.ఆ తరువాత కొంత న్యూట్రల్ గా విజయమ్మ కనిపించినా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో కుమార్తెకు మద్దతుగా ఒక వీడియో క్లిప్ ని వదిలారు.తన కుమార్తెని గెలిపించాలని అందులో ప్రజలను కోరారు. అదే సమయంలో మిగిలిన చోట్ల వైసీపీని గెలిపించాలని ఎక్కడా ప్రస్తావించకపోవడం తో అది కూటమికి అడ్వాంటేజ్ గా మారింది.వైసీపీకి నష్టం కూడా చేసింది. రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ భారీగా దెబ్బ తినడానికి ఆ వీడియో క్లిప్ చేసిన చెడు ఎంతో అని కూడా వైసీపీ నేతలు అంతర్మధనం చెందుతున్నారు.ఇదిలా ఉంటే విజయమ్మ షర్మిల ఇద్దరూ వైసీపీకి చేటు చేశారని వైసీపీ సీనియర్ నేతలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు.ఇలా వారు బాహాటం అయి ఇలా తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టడం వెనక వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కూడా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అన్నదే వైసీపీ హై కమాండ్ ఆలోచనగా ఉంది విజయమ్మ న్యూట్రల్ గా ఉండడం కంటే అవసరం అయిన సందర్భాలలో కుమార్తె వైపే మొగ్గు చూపిస్తారు అన్నది తాజా ఎన్నికలలో తేలినందువల్ల ఆమెని కూడా రాజకీయ ప్రత్యర్ధి గానే చూస్తేనే తప్ప వైసీపీకి స్పష్టత రాదు అని అంటున్నారు. వైసీపీ క్యాడర్ సైతం విజయమ్మ షర్మిలకు అనుకూలంగా స్టాండ్ తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు.దాంతో పాటు తల్లిని చెల్లెలుని జగన్ దూరం పెట్టారు అని గత కొంతకాలంగా వైసీపీ మీద విమర్శలు ఉండనే ఉన్నాయి. దాని ఫలితాలూ చూశారు. ఇంతకంటే వేరేగా వచ్చే నష్టం ఏమీ ఉండదని కూడా పార్టీ హై కమాండ్ భావిస్తోందని అంటున్నారు. దాంతో ఇక మీద కుటుంబంలోని వారు ఎవరూ వైసీపీకి కావాల్సిన వారు కాదు అన్న మెసేజ్ ని పంపిస్తే అది జనంలోకి ఇపుడే వెళ్తుందని, రేపటి రోజున విజయమ్మ కుమార్తెకు అనుకూలంగా ప్రచారం చేసినా ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని వైసీపీ భావిస్తోందిట. మొత్తం మీద విజయమ్మను కూడా రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ చూస్తుందని అంటున్నారు. మరి వైఎస్సార్ ధర్మ పత్నిగా విజయమ్మకు ఒక గౌరవం అభిమానం జనంలో ఉన్నాయి. ఆమె కనుక రానున్న రోజులలో ఓపెన్ అయి కుమార్తె వెంట తిరిగి కాంగ్రెస్ ని గెలిపించండి అని పిలుపు ఇస్తే అది వైసీపీకి ఎంత మేరకు దెబ్బ తీస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే జగన్ సీఎం గా ప్రతిపక్ష నేతగా ఏమి చేసారు అన్న దాని మీదనే ఎపుడైనా జనాలు తీర్పు ఇస్తారని వారసత్వం చూసి కాదని పార్టీలో నేతల భావన అంటున్నారు.మొత్తానికి షర్మిలతో పాటు విజయమ్మను కూడా దూరం పెట్టాలని వైసీపీ అనుకుంటోందన్న ప్రచారం అయితే సాగుతోంది.అందులో భాగమే సీనియర్ నేతలు సంధిస్తున్న విమర్శలని అంటున్నారు.

👉 పోటేత్తిన రొట్టెల పండుగ.సందర్బంగా కస్మూర్..నెల్లూరు జిల్లా ..కస్మూర్ లో ఈరోజు నుండి మొదలవటం తో మొదటి రోజే పోటెత్తిన భక్త జనం..వేలాది మంది భక్తులు రాక .

👉 గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నీలా.. ఇడ్లీలా? 30 రూపాయలకు ప్లేట్‌ ఇడ్లీ అన్నంత ఈజీగా 30లక్షలకు ఓ కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్‌ చేసుకుంటున్నారు. బాధితులను నిందితులుగా చేస్తోన్న నయవంచన ఇప్పుడు మరో లెవల్‌. ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసుతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులు.గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నీ మార్పిడి రాకెట్‌పై గుంటూరు పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌లు 370, 470, 465, 466, 468, 471, 120(బి)తోపాటు మానవ అవయవాల మార్పిడి చట్టంలోని సెక్షన్‌ 18, 19, 20 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు బాషా, సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు పోలీసులు. మరో ముగ్గురి కోసం గాలిస్తు్న్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ రాకెట్‌ను సీరియస్‌గా తీసుకున్న హోంమంత్రి వి అనిత గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌తో పాటు గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమగ్ర విచారణ జరిపి అందులో ప్రమేయం ఉన్న వారందరినీ పట్టుకోవాలని ఆదేశించారు.నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన గుంటూరు నగరంపాలెం పోలీసులు.. విచారణ అనంతరం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో‌ మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే, డాక్టర్లు, మధ్యవర్తి, కిడ్నీ గ్రహిత తనను దారుణంగా మోసం చేశారని.. రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని బాధితుడు మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడి వైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తనకు న్యాయం కావాలని అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటనపై అటు ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ టీమ్స్‌తో విచారణను వేగవంతం చేశారు. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, దీని వెనుక ఎవరెవరూ ఉన్నారో తేలుస్తామని చెప్పారు డీఎస్పీ మహేష్.

👉గుంటూరు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ ..గుంటూరు…రాజధాని ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించడం గొప్ప అనుభూతి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తాను..గుంటూరు జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్..గంజాయి అక్రమ రవాణా కి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది..మహిళల ఘటనలు జరగకుండా కాలేజీలు.పాఠశాలల్లో అవేర్నెస్ క్యాంపు లు ఏర్పాటు చేస్తాను..జిల్లాల్లో రేష్‌న్ మాఫీయా.క్వారీ లలో అక్రమ మైనింగ్ తరలింపు పై 10 రోజుల్లో వివరాలు తీసుకొని చర్యలు చేపడతా..శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవనీ హెచ్చరించారు.

👉ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ ఐ.పి.యస్

👉..మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మార్కాపురం వైసీపీ ఇంచార్జి అన్నా..  తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో వెలసిన హజరత్ ఖాసీం స్వామి దర్గా లో జరుగుతున్న మొహర్రం వేడుకల్లో మార్కాపురం వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు పాల్గొన్నారు. అనంతరం అన్నా దర్గా లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా అన్నా రాంబాబు గారిని దర్గా కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 ఒకే చోట నాలుగు బోర్ల వైరు చోరీ😱…గిద్దలూరు మండలం అక్కల్ రెడ్డి పల్లె గ్రామంలో బిల్లా వెంకటేశ్వర్లు, చిన్నరంగారెడ్డి, పెద్ద రంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే నలుగురు రైతులకు సంబంధించిన పొలాలలో బోర్లకు ఉన్న వైర్లు చోరీ..ఈ చోరీ చుట్టుపక్కల ఉన్న బోర్లకు తీయకుండా కేవలం మా నలుగురికి సంబంధించిన బోర్ల వైరు పోవడం మాకు పలువురిపై అనుమానంగా ఉందని వాపోతున్న రైతులు..

👉రాచర్ల ఫారం గ్రామ పొలాల్లో పులి సంచారం?😱 రాచర్ల మండలం ఫారం గ్రామ పరిసర పొలాల్లో చిరుత పులి సంచరించినట్లు ప్రజలు గుర్తించారు గ్రామానికి చెందిన కొందరు ప్రజలు గ్రామ పరిసర పొలాల్లో తిరుగుతుండగా పులి సంచరించిన అడుగులను కనుగొన్నారు .దీంతో సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో ఆ శాఖ అధికారులు ఎఫ్ ఎస్ ఓ జమాల్ బాషా శ్రీనివాస్ రెడ్డి లు సంఘటన స్థలానికి చేరుకొని అడుగులను పరిశీలించారు అడుగులను బట్టి పరిశీలిస్తే పులి సంచరించినట్లు కనిపిస్తోందని ప్రస్తుతం స్పాట్ కెమెరాలు ఏర్పాటు చేసి రెండు రోజులు పరిశీలించి చూస్తామని పులి సంచరిస్తున్నట్లు వాటి ద్వారా గుర్తిస్తే తక్షణమే బోన్లు ఏర్పాటు చేసి బంధించడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం ప్రజలు అప్రమత్తగా ఉండాలని గుంపులుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు.

👉 దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి చెందిన మరియమ్మ వయస్సు 24 పుట్టుకతో పోలియో వ్యాధితో మంచానికి పరిమితమైంది .నడవలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న దివ్య హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందించడం జరిగింది. కా ర్యక్రమంలో అధ్యక్షులు లోక్కు శరత్ బాబు సుమన్ పుష్పరాజ్ అనిల్ నాగేంద్ర.శివ కుమార్. పాల్గొన్నారు

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం