👉మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా ఇపుడు చూస్తే ఉక్రెయిన్ తో వివాదానికి రష్యా ముగింపు పలికేలా భారత్ ప్రయత్నించి ఒప్పించాలని అమెరికా సూచిస్తోంది. ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లారు.అది కూడా దాదాపుగా అయిదేళ్ల తరువాత. ఇక ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాత మోడీ రష్యా టూర్ చేయడం ఇదే తొలిసారి.
ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది. ఏక ధృవ ప్రపంచాన్ని కోరుకుంటున్న అమెరికా ఉక్రెయిన్ వెనక ఉందని అంతా అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.రష్యా ని దెబ్బ తీయడానికి ప్రచ్ఛన్న యుద్ధానికి తలుపు తెరిచినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా మీద ఒత్తిడి అమెరికా వివిధ రకాలుగా చేస్తూ పోయింది.ఈ పరిణామాల మధ్య భారత తటస్తంగా ఉంటూ వచ్చింది.ఇపుడు ఏకంగా ప్రధాని రష్యా టూర్ పెట్టుకుని దశాబ్దాల భారత్ రష్యా మిత్ర బంధాన్ని మరోసారి చాటారు.మోడీ రష్యా టూర్ మీద అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చింది. ఇపుడు చూస్తే ఉక్రెయిన్ తో వివాదానికి రష్యా ముగింపు పలికేలా భారత్ ప్రయత్నించి ఒప్పించాలని అమెరికా సూచిస్తోంది. ఉక్రెయిన్‌తో వివాదానికి సంబంధించి తన చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించాలని శాశ్వత శాంతిని కనుగొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భారత్ ఈ విధంగా కోరాలని అమెరికా అంటోంది.ఈ విషయంలో రష్యాతో ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా భారతదేశాన్ని కోరింది.అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ దీని మీద మాట్లాడుతూ భారతదేశం రష్యాతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు. అందుకే రష్యాతో ఆ సంబంధాన్ని ఉపయోగించుకుని ఉక్రెయిన్ సమస్య తీర్చాలని భారతదేశాన్ని కోరుతున్నామని అన్నారు.అదే సమయంలో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించమని ఐక్య రాజ్యసమితి చార్టర్‌ను గౌరవించమని భారతదేశం వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పాలని ఆయన అన్నారు. ఒక విధంగా చూస్తే ఇది సూచనగా ఉన్నా భారత్ ని ఇరికిస్తున్నట్లుగానే ఉంది.రష్యా ఉక్రెయిన్ ల విషయంలో భారత్ ఎపుడూ ఒకే మాట చెబుతూ వస్తోంది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతోంది.రష్యా తనదైన రక్షణ పరమైన అనుమానాలు భయాందోళనలు వ్యక్తం చేస్తోంది.ఉక్రెయిన్ వెనక ఉన్న శక్తుల గురించే రష్యా కలవరపడుతోంది.పరిస్థితి ఇలా ఉంటే ఏకపక్షంగా రష్యాను తగ్గమని అడిగే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది. ముందు ఉక్రెయిన్ కి నాటో దేశాల సాయం నిలుపుదల చేసి చర్చలకు వెళ్లమని పెద్దన్న తానే కోరవచ్చు కదా అన్న మాట కూడా ఉంది.👉 ఏది ఏమైనా భారత్ రష్యా బంధాన్ని దెబ్బ తీయడానికే ఈ ఫిట్టింగ్ ని పెద్దన్న పాత్రలో అగ్ర దేశం పెట్టినట్లుగా ఉందని అంటున్నారు.
👉 కొవిడ్ సోకిన పిల్లలకు మరో ముప్పు..!!!కొవిడ్ సోకిన పిల్లలకు మరో ముప్పు ..కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ జర్నల్ నివేదిక ప్రకారం.. విపరీతమైన దాహం,తరచూ మూత్ర విసర్జన, నిద్రలేమి వంటివి టైప్-1 డయాబెటిస్‌లో ప్రధాన లక్షణాలు. కొవిడ్-19 బారినపడ్డ పిల్లల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్‌తో టైప్-1 డయాబెటిస్‌ను వెంటనే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇది ‘రోగ నిరోధక వ్యవస్థ’ ప్యాంక్రియాస్‌పైనా దాడి చేసి దెబ్బ కొడుతుంది
👉 నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. రాష్ట్రపతికి ఫిర్యాదు..
పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. కాగా హత్య చేసింది వైసిపి నాయకుడేనని తమ పార్టీపై కావాలని బురద జల్లుతున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
👉రిమాండ్ ఖైదీ పరారీ..మార్కాపురం వద్ద రైలు నుంచి దిగి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ.విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమాండ్ ఖైదీ పరారీ…పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ నరేష్.గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన రిమాండ్ ఖైదీ నరేష్.గంజాయి రవాణా కేసులో పట్టుబడిన నరేష్.తప్పించుకున్న రిమాండ్ ఖైదీ నరేష్ కోసం గాలిస్తున్న పోలీసులు.
👉 నవదీప్ సింగ్‌కు బెయిల్..రైతు ఉద్యమకారుడు నవదీప్ సింగ్‌కు బెయిల్ లభించింది. అంబాలా కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో, అనంతరం జరిగిన అల్లర్ల సందర్భంగా ఆయన అరెస్టయ్యారు. అల్లర్లు, హత్యాయత్నం సహా పలు అభియోగాలతో నవదీప్ సింగ్‌ను హర్యానా పోలీసులు మొహాలీలో మార్చి 28న అరెస్టు చేశారు. తాజాగా బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
👉 మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కు మరో ఎదురు దెబ్బ……వెలుగులోకి వచ్చిన కొడాలి నాని మరో భూ కబ్జా….గడ్డం గ్యాంగ్ భూకబ్జాల ఫై కోర్టును ఆశ్రయించిన బాధితులు..తవ్విన కొద్ది బయటికి వస్తున్న కొడాలి నాని గ్యాంగ్ అక్రమాలు..కొడాలి నాని ప్రధాన అనుచరుడు కొల్లి విజయ్ బైపాస్ రోడ్ లో ఓ ఖరీదైన అక్షర పాఠశాల స్థలాన్ని బెదిరించి తక్కువ రేటు కి కాజేసిన సంఘటన లో కోర్టును ఆశ్రయించిన పాత యజమాన్యం.. టీచర్స్ కాలనీలో సుమారు 8 కోట్ల విలువైన అక్షర పాఠశాల స్థలాన్ని అప్పడు మంత్రిగా ఉన్న కొడాలి నాని మద్దతుతో బెదిరించి స్వాధీనం చేసుకున్న కొల్లి విజయ్.,
కూటమి ప్రభుత్వంలో కొడాలి నాని ఆయన అనుచరుల కబ్జాలో ఉన్న ఆస్తులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హక్కుదారులకు అప్పగించేలా కృషి చేస్తుండటంతో…… ధైర్యం తెచ్చుకున్న అక్షర పాఠశాల పాత యజమాన్యం..తమ ఆస్తులను బెదిరించి కబ్జా చేశారని కోర్టును ఆశ్రయించిన అక్షర స్కూల్ పాత యజమాన్యం..
పాఠశాల ఆస్తుల కబ్జాపై విచారణ చేపట్టాలని ఆదేశించిన కోర్టు..ఇప్పటికే శరత్ టాకీస్ ను కొడాలి నాని ఆక్రమించుకోగా దానిని ఎమ్మెల్యే రాము అండతో స్వాదీనం చేసుకున్న యాజమాన్యం..బైపాస్ రోడ్డు లో విద్యావికాస్ వద్ద 7.66 ఎకరాల చైతన్య హోసింగ్ కాలనీ స్థలాన్ని ఆక్రమించుకోగా….. గెలిచిన 24 గంటల్లో అసలు ఫ్లాట్ల యజమానులకు అప్పగించిన ఎమ్మెల్యే రాము..
ఐదేళ్లుగా కొడాలి నాని గ్యాంగ్ ఆక్రమణలో ఉన్న ఆస్తులను….అసలు హక్కుదారులకు అప్పగించడంలో ఎమ్మెల్యే రాము చేస్తున్న కృషిని ముక్తకంఠంతో అభినందిస్తున్న గుడివాడ ప్రజానీకం..తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్న కొడాలి నాని ఆయన గ్యాంగ్ చేసిన భూ కబ్జాలు….. సెటిల్మెంట్లు.
👉 MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా..!!! పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణ రాసిన లేఖలోని అంశాలు, ఫెర్రి బకాయిల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
👉 నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం కేసు కీలక మలుపు..కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా సూసైడ్ నోట్..మొబైల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు ఉన్నట్టు గుర్తింపు..రైల్వే స్టేషన్ వైపు పక్కనే ఉన్న ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్.. నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది.. నిన్న (మంగళవారం రోజు) ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా సూసైడ్ నోట్ పంపారు.. అయితే, ఎంపీడీవో మిస్సింగ్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆయన మొబైల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు ఉన్నట్టుగా గుర్తించారు.. ఇక, మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు పక్కనే ఉన్న ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు గుర్తించారు.. దీంతో, ఏలూరు కాల్వలోకి దూకి ఎంపీడీవో సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎం.వెంకటరమణారావు.. కనిపించకుండా పోయారంటూ.. ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీవో వెంకటరమణారావు దంపతులు నివాసం ఉంటుండగా.. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు ఎంపీడీవో.. ఇక, సోమవారం ఉదయం మచిలీపట్నం వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయిన ఆయన.. ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా సూసైడ్ నోట్ రావడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేశారు.. మాజీ విప్ ప్రసాద రాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయలు బకాయి కట్టమంటే.. బెదరిస్తున్నాడని.. అందుకే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారట వెంకటరమణ.. అయితే, రాత్రి నుంచి ఏలూరు కాల్వలో వెంకటరమణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..
👉తిరుపతి జిల్లాలో మరో మానవ మృగానికి 8 ఏండ్ల చిన్నారి బలి..తిరుపతి జిల్లా :జులై 18
గంజాయి మత్తులో ఉన్న మానవ మృగానికి మరో చిన్నారి బలైంది.బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేండ్ల చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేసి, హతమా ర్చాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.బిహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్‌మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అలా పనిచేసే ఒక దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్(20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు.మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి.. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు.నిందితుడు లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.దిలీప్ అనే మృగం బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపినట్టు తెలిసింది.
గంజాయి మత్తులో నింది తుడు బాలికపై లైంగికదాడి, హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు.ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు.
👉పేద విద్యార్థుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు నంద్యాల ఖాసిం వలి పేద విద్యార్థులకు 50వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ బి, ఇస్మాయిల్ కొద్దిరోజుల క్రితం తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లి కూలి పనులకు వెళితే ఇల్లు గడుస్తుంది.ఇస్మాయిల్, హుస్సేన్ బి చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్షుడు నంద్యాల ఖాసిం వలి వారి చదువుల కోసం 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫోన్ పే ద్వారా వారి అకౌంట్ కి నంద్యాల ఖాసీం వలి 50వేల రూపాయలు జమ చేశారు. ఇస్మాయిల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా హుస్సేన్ బి ప్రస్తుతం బీఫార్మసీ చేస్తుంది. భవిష్యత్తులో కూడా వీరికి అండగా ఉంటామని ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ నంద్యాల ఖాసిం వలి వెల్లడించారు.
👉బాలుడి పై వీధి కుక్క దాడి..జగిత్యాల జిల్లా :బీర్‌పూర్ మండలం మంగేళ గోండు గూడెంలో దారి వెంట నడుచుకుంటు వెళుతున్న దివ్య అనూష్ అనే ఓ బాలుడిని వీధి కుక్క దాడి ..గాయపడ్డ బాలుడుని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు….