సీఎం చంద్రబాబు సమీక్ష..చిరు పవన్ లఫై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..రొట్టెల పండుగ ఉత్సవంలో మంత్రి పొంగూరు..ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!! తిరుపతి జిల్లా ఎస్పీ..ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్..మరిన్ని వార్తా విశేషాలత

  • 👉భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష…

పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు*అమరావతి :-* రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాదారణ వర్షపాతం 185 మి.మి గాను 244 మి.మి నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నాన్న సీఎం…చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని…వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పనిచేయాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని…మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

👉మెగాస్టార్ చిరంజీవి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

రుణమాఫీ అమలవుతున్న సందర్భంగా.. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెం.150” పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో కథానాయకుడు.. రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి.. ఉద్యమాలు చేస్తున్నారు.అయితే.. ఘటనలు ఆధారంగా చేసుకుని.. రైతుల కష్టాలు, ఇబ్బందుల గురించి చిరంజీవి సినిమా వాస్తవమని జగ్గారెడ్డి వివరించారు. చిరంజీవితో పాటు ఆ సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు కోట్ల రూపాయలు వచ్చాయి. మరి.. సినిమాలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమాలు చేసిన చిరంజీవి.. నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడిరోడ్డు మీద హత్య చేస్తారేమోనని సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. రైతులను దారుణంగా హత్య చేసిన మోదీ సర్కారుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుంటే.. వద్దని ఎందుకు చెప్పట్లేదంటూ నినదించారు.రైతుల కథలతో సినిమాలు తీస్తూ.. కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి.. వారి కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు. ఆ సినిమాలు రైతుల కడుపు నింపాయా అంటూ ప్రశ్నించారు. రైతుల సినిమా పేరుతో తీసి డబ్బులు సంపాదించి.. వారికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్న మోదీకి ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్‌ గాంధీకి ఎందుకు సపోర్ట్‌ చేయట్లేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే.. చిరంజీవి సరైన దారిలో ఉండేవారని.. ఇప్పుడు పక్కదారి పట్టారంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఆగస్టు15 లోపు 2 లక్షల మాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఫోన్‌లలో మెసేజ్‌లు చూసి రైతుల ఇళ్లలో సంబురాలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కేవలం ట్విట్టర్‌కే పనికొస్తాడంటూ సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉన్నా.. ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చామని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

👉 ఢిల్లీలో బుధవారం(23.07.2024) ధర్నాకి వైయస్ జగన్ పిలుపు..ఏపీలో పాలనకి నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బుధవారం ఢిల్లీలో ధర్నా ..ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్!

👉కోట‌మిట్ట‌లో ఘ‌నంగా గంధ మ‌హోత్స‌వం..పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ముస్లిం మ‌త పెద్ద‌లు, ముస్లిం సోద‌రులు- అమీనియా మ‌సీదులో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేసిన మంత్రి. నెల్లూరు జిల్లాలో విశిష్టంగా నిర్వహించే రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కోట‌మిట్ట‌లోని అమీనియా మ‌సీదులో మ‌త పెద్ద‌లు… 12 బిందెల‌లో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా గంధం క‌లిపి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. బారాష‌హీద్ ద‌ర్గాలోని ఈద్గాలు, బారాష‌హిద్‌ల వీర‌త్వం, మ‌హిత్యంపై ఫ‌కీర్లు గానం చేస్తూ సాహ‌స కృత్యాలు ప్ర‌ద‌ర్శించారు. కడప దర్గా పీఠాథిపతి ఆరీఫుల్లా హుసేనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, బారా షహీద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ఈ గంధ మహోత్సవానికి రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ,జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌కి, అజిజ్ కు ముస్లిం మ‌త పెద్ద‌లు, ముస్లిం సోద‌రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అల్లాహ్ ద‌య‌తో…నెల్లూరు జిల్లాతోపాటు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఆయూర్ ఆరోగ్యాలు…అష్ఠైశ్వ‌రాల‌తో జీవించాల‌ని నారాయ‌ణ ప్రార్ధించారు. గంధోత్సవానకి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బారాషాహిద్ వద్ద గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.

  • 👉 తిరుపతి జిల్లా…*శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమ వసూళ్లకు పాల్పడే ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్: ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..!!జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డిఎస్పి రవి మనోహర్ ఆచారి..తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమంగా డబ్బులు గుంజుతున్న దళారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు తిరుపతిలోని 6 మంది ఆటో డ్రైవర్లను తీవ్రంగా హెచ్చరిస్తూ తిరుపతి డిఎస్పి రవి మనోహరాచారి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ ఆటో డ్రైవర్లు టీటీడీ యాప్ ను తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని రోజువారి అందుబాటులో ఉన్న శ్రీవారి దర్శన టోకెన్లను చూస్తారు. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వద్ద భక్తులకు ఎలాగైనా దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని నమ్మబలికి విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస మంగాపురం ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లు ఇచ్చు కౌంటర్ వద్ద సదరు భక్తులకు సర్వదర్శన టోకెన్లు ఇప్పించి అధిక మొత్తంలో అమాయక భక్తుల నుండి డబ్బులు గుంజడమే వీరి ప్రవృత్తి అని తెలిపారు.

👉 తిరుపతి : ఒకే కుటుంబంపై కత్తులతో దాడి..ఒకే కుటుంబంపై దాడి ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ రాయల్ నగర్లో నివసిస్తున్న వ్యాపారి కుటుంబంపై గుర్తుతెలియని యువకులు ఇంటిలోకి జొరబడి వృద్ధురాలి పీకకోశారు. అడ్డం వచ్చిన నీతి, ప్రేరణ అనే యువతులను సైతం గొంతు కోసి పరారయ్యారు. యువతులను ఆసుపత్రికి తరలించగా నీతి పరిస్థితి విషమంగా ఉంది. రెండేళ్ల క్రితం ఇదే విధంగా కుటుంబంపై దాడి జరగడం గమనార్హం.

👉జిల్లా ఎస్పీ దామోదర్ ను కలిసిన ఏపీయుడబ్లూజె జిల్లా ప్రతినిధి బృందం.

 

ఒంగోలు..ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏ ఆర్ దామోదర్ ను శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఏపీయుడబ్లూజె జిల్లా కమిటీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలపడం జరిగింది. జిల్లాలో శాంతి భద్రతలను మెరుగుపరచేందుకు తమవంతు సహకారాన్ని అందించడం జరుగుతుందని,అలాగే విధి నిర్వహణలో జర్నలిస్టులకు కూడా పోలీసు శాఖ సహకరించాలని యూనియన్ నాయకులు కోరగా,అందుకు స్పందించిన ఎస్పీ తప్పకుండా సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ దామోదర్ ను కలిసిన వారిలో ఏపీయుడబ్లూజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి సురేష్ కుమార్ ,యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ, జిల్లా కార్యదర్శి డి. కనకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ళ మురళీ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బి.వెంకట రావు,కార్యదర్శి ఇ.శంకర్, కోశాధికారి జయరాం, ఐజేయు సభ్యులు కె.శ్రీనివాస్, యూనియన్ నాయకులు భేతాళము శ్రీనివాసు,పగడాల శ్రీనివాసరావు, ఇఫ్తేకర్ భాష తదితరులు వున్నారు.

🎂 ప్రకాశం జిల్లా ఎస్పీ వారి కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ..యర్రగొండపాలెం నియోజకవర్గంలో శాంతి భద్రతలు, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు…

👉ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఆర్డీవో…తాసిల్దార్ కార్యాలయాలు, సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఆర్ డి ఓ…..పొదిలి, కొనకనమెట్ల తాసిల్దారు కార్యాలయాలను మండలాల్లోని సచివాలయాలను ఆకస్వీకంగా తనిఖీ చేసిన కనిగిరి ఆర్డిఓ జాన్ ఎర్విన్…….*విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన కనిగిరి ఆర్డీవో జాన్ ఎర్విన్…..సిబ్బంది సర్టిఫికెట్ల విషయంలో ఎప్పటికప్పుడు పనిచేయాలి కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్….. కార్యాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి సమస్యలు పరిష్కారమే దిశగా పనిచేయాలని సిబ్బందికి సూచించిన కనిగిరి ఆర్డిఓ జాన్ ఎర్విన్…… తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించెనని రెండు మండలాల సిబ్బందిని హెచ్చరించిన కనిగిరి ఆర్డిఓ జాన్ ఎర్విన్….ఆకస్మిక తనిఖీలో భాగంగా కనిగిరి ఆర్డిఓ జాన్ ఎర్విన్ వెంట ఉన్న పొదిలి కొనకనమిట్ల తహసిల్దార్లు షేక్ మహమ్మద్ జియా, షేక్ సాజిదా, పొదిలి ఆర్ ఐ కిలారి సుబ్బారావు మరియు విఆర్ఓలు పాల్గొన్నారు

👉ప్రకాశం జిల్లా..ఒంగోలు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి..కేసుల దర్యాప్తులో ప్రత్యేక టీంలుగా ఏర్పడి ఛేదించాలి…మహిళాల భద్రతకు స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుస్తాం…ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…

 

👉 ప్రమాదకరమైన జంతువులతో చేసే విన్యాసాలన్నీ శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంటాయి. కానీ, కొందరు లు, రియాల్టీ షోలను చూసి మర్చిపోతుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఇందుకు ఉదాహరణగా జరిగిందే ఈ వీడియోలోని సంఘటన. రీల్ చేయడానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడని ఇలాంటివారిని చాలా మందిని సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఎక్స్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలితో స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’గా మారాలనే తపనతో, అటువంటి షోలలో విన్యాసాలు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయనే విషయాన్ని బహుశా మర్చిపోయినట్టు ఉన్నాడు. అతడు ఏకంగా ఒక ప్రమాదకర మొసలి నోట్లో తల పెట్టి స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే గుండెలు గుబేల్‌ మానాల్సిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా Xలో @NeverteIImeoddలో షేర్‌ చేయబడింది. ఓ యువకుడు మొసలిపై కూర్చొని ఆ మొసలి నోటిని తెరిచి రెండు దవడలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతను ఆ మొసలిపై కూర్చుని తన తలని దాని నోటిలో పెట్టాడు. కానీ మొసళ్ళు ఎంత శక్తివంతమైనవో అతనికి బహుశా తెలియదునుకుంటా. క్షణాల్లో ఆ మొసలి యువకుడి తలను గట్టిగా పట్టేసుకుంది. అక్కడున్న జనం అతన్ని కాపాడేందుకు పరుగులు తీశారు. ఈ వీడియోను షేర్‌ చేస్తున్నప్పుడు క్యాప్షన్‌గా అతి విశ్వాసం అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు. ఇది పిచ్చి అని ఒకరు, అతను స్వయంగా రిస్క్‌లో పడ్డాడు అని మరొకరు రాశారు. ఇలా వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో హోరెత్తించారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం