మీడియాకు చిక్కిన జగన్ !..మీరు సీఎంగా ఉన్న వేళలో జరిగిన దారుణాల మాటేంటి జగన్?.. త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బిబిపేట్ లో రైతు రుణమాఫీ సంబరాలు..బి ఆర్ ఎస్ కు మరో షాక్.. కడపలో యువకుడి దారుణ హత్య.. గంజాయి విక్రయితదారుల అరెస్టు.. దొంగలను అరెస్టు చేసిన చీరాల రైల్వే పోలీసులు..

👉 మీడియాకు చిక్కిన జగన్ ! అవును జగన్ మీడియాకు చిక్కారు. ఆయన ఎప్పుడో అయిదేళ్ల క్రితం కంటే ముందు మీడియాతో మాట్లాడేవారు. అవును జగన్ మీడియాకు చిక్కారు.ఆయన ఎప్పుడో అయిదేళ్ల క్రితం కంటే ముందు మీడియాతో మాట్లాడేవారు. మళ్లీ ఇన్నాళ్ళకు జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఆయన తన ప్రసంగాన్ని సుదీర్ఘంగా కానిచ్చేస్తూ మీడియా ప్రశ్నలను దాటుకుంటూ వెళ్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ చాలా సేపు మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ మధ్యలో ఒక విలేకరి జగన్ ని ప్రశ్నలు అడిగారు. దాంతో జగన్ కాస్తా చికాకు పడ్డారు. మధ్యలో అడ్డుకుంటే ఫ్లో పోతుందయ్యా ఏమి మాట్లాడాలో మరచిపోతాను అని జగన్ అంటూ ఎక్కడ ఆగామని బుర్ర గోక్కున్నారు. ఆ పక్కన ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ వదిలేసిన సబ్జెక్ట్ ని తిరిగి అందించడంతో కొనసాగించారు. అయితే జగన్ కి మళ్లీ మీడియా కొత్తగానే ఉంది అని అంటున్నారు. అంతే కాదు మీడియా వారికి కూడా జగన్ తో కొత్తగానే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు సహా ఇతర నాయకులు అయితే ముందు తాము చెప్పాల్సింది చెబుతారు. ఆ మీదట మీడియాను ప్రశ్నలకు ఆహ్వానిస్తారు. జగన్ వైఖరి అయితే తాను చెప్పదలచింది చెప్పేసి వెళ్ళిపోతారు అని గతంలో అనుకునేవారు. ఇపుడు అయితే ఆయన మీడియాకు చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. వారి ప్రశ్నలను ఫేస్ చేయాలని వారు అడిగే వాటికి జవాబు చెప్పడం ద్వారానే జనాల్లోకి తన సందేశం వెళ్లేలా చూసుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ అయిదేళ్ళ పాటు సీఎంగా మీడియాను ఎక్కడా ఫేస్ చేయలేదు. ఇపుడు విపక్ష నేతగా ఉంటున్నారు. ఆయనకు మీడియా అవసరం చాలా ఉంది. అలాగే మీడియాను హ్యాండిల్ చేయడమూ కాస్తా ఇబ్బందిగానే ఉండొచ్చు. ఎందుకంటే మీడియా కూడా పొలిటికల్ గా చూస్తే వర్టికల్ గా విడిపోయింది. దాంతో పార్టీ సమావేశాలకు అయితే తమకు నచ్చని మీడియాను నిషేధించవచ్చు. కానీ బయట మీడియాను అడ్రస్ చేసినపుడు అందరూ వస్తారు. వారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి తీరాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంత ఇరకాటం అయినా పాలిటిక్స్ లో తప్పదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మీడియాతో టచ్ లో ఉండడం జనంలో ఉండడం ప్రతిపక్ష నేతలకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. వారిని లైవ్ లో ఉంచాలంటే ఇదే సరైన రూట్ అంటున్నారు. జగన్ మీడియాతో ఇక మీదట ఎలా హ్యాండిల్ చేస్తూ సాగుతారు అన్న ఆసక్తి అయితే ఉంది.

👉మీరు సీఎంగా ఉన్న వేళలో జరిగిన ఈ 5 దారుణాల మాటేంటి జగన్? మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా బ్రహ్మారెడ్డిని నియమించారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజుల్లో ఏపీలో ఏదేదో జరిగిపోయిందని.. దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని గగ్గోలు పెడుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా చూశామా? మరెక్కడైనా విన్నామా? అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. గణాంకాల్ని వల్లె వేస్తూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల గురించి ఏకరువు పెడుతున్న ఆయన.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో జరిగిన దారుణాల మాటేమిటి? కార్యకర్తల సంగతిని పక్కన పెడదాం.. మాచర్ల నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఐదేళ్లలో జరిగిన అక్కడ జరిగిన ఐదు అమానుష ఘటనల్ని చూస్తే.. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఏం జరిగిందన్నది ఎవరికి వారు గుర్తు తెచ్చుకోవటం మంచిది. మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా బ్రహ్మారెడ్డిని నియమించారు చంద్రబాబు. ఆయనకు మాచర్ల పట్టణంలో ఇల్లు అద్దెకు దొరకకుండా చేయటం.. చివరకు అద్దెకు దొరికిన కార్యాలయాన్ని సైతం నిర్దాక్షిణ్యంగా నిప్పు పట్టేసిన వైనం ఒక్కటే కాదు.. మంటలు ఆర్పేందుకు వస్తున్న ఫైరింజ్ ను సైతం ఘటనాస్థలానికి రాకుండా అడ్డుకోవటం లాంటి ఘటనల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తు చేసుకోరు? అన్నది ప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతే వేలకు వేల ఉదంతాలు వరుస కడతాయి. ఈ దారుణాలకు సంబంధించి ఎవరినో ఏదో అడిగే కన్నా.. సింఫుల్ గా గూగులమ్మను అడగాలే కానీ.. ఆధారాలకు ఆధారాలు కళ్ల ముందుకు వచ్చేస్తాయి. ఇన్ని చెబుతున్నారు కదా? హింసకు మీరు అనుకూలమా? అంటే అస్సలు కాదనే చెప్పాలి. అలాంటి తీరును అంగీకరించేందుకు మనసు ఒప్పదు. కాకపోతే.. కొన్ని ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు దాని వెనకున్న చరిత్రను అర్థం చేసుకోకుండా మాట్లాడటం తప్పు అవుతుంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. గతాన్ని గుర్తు చేసుకోవటం చాలా అవసరం. ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఏం జరిగింది? ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని కాకున్నా.. మచ్చుకు ఐదు ఉదంతాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఏదైనా రోగం బారిన పడితే.. దానికంటూ ఏదో ఒక కారణం ఉంటుంది. దాన్ని గుర్తించకుండా రోగానికి మందు ఇవ్వటం తాత్కాలికంగా సర్దుకుంటుంది కానీ తర్వాత తిరగబెడుతుంది. అలానే.. మన కళ్ల ముందు కనిపించే హింస వెనకున్న చరిత్రను తెలుసుకోవటం ద్వారా.. దానికి అవసరమైన చికిత్స ఏమిటన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక.. జగన్ ఐదేళ్ల పాలనలో మర్చిపోలేని ఐదు దారుణ హింసాత్మక ఘటనల్ని చూస్తే.. ఒకటో హింస 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రయ్యను నడిరోడ్డు మీద.. పట్టపగలు వైసీపీ నాయకులు గొంతు కోసి హత్య చేశారు. అంతేకాదు.. గొంతు కోసే సమయంలో జై జగన్ అని అంటే వదిలేస్తామంటే.. జై తెలుగుదేశం అన్నందుకు మరో ఆలోచన లేకుండా గొంతు కోసేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం తన ప్రసంగాల్లో చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అస‌లు ఏం జ‌రిగింది? రెండో దారుణం మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జి బ్రహ్మారెడ్డి పట్టణంలో ఇంటి కోసం ప్రయత్నించగా.. ఆయనకు అద్దెకు ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. అతి కష్టమ్మీదా మాచర్ల శివారులోని సొసైటీ కాలనీలో ఇంటిని.. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న బహుళ అంతస్థుల భవనంలో బ్రహ్మారెడ్డి ఉండేవారు. తమ మాటకు భిన్నంగా బ్రహ్మారెడ్డి ఇంటిని తీసుకోవటం.. పార్టీ ఆఫీసును ఓపెన్ చేయటంతో వైసీపీ వర్గాలు రగిలిపోయాయి. దాదాపు రెండు వందల మంది ఇంటిని.. పార్టీ ఆఫీసును ముట్టడించటమే కాదు.. దాదాపు మూడు గంటల పాటు కర్రలతో.. పెట్రోల్ సీసాలతో అరాచకాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లను రియల్ లైఫ్ లో అందరికి చూపించేశారు. ఇంటిని.. కార్యాలయాన్ని ధ్వంసం చేయటం.. ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసుకొచ్చి పడేశారు. అనంతరం నిప్పు పెట్టేశారు. పార్టీ కార్యాలయానికి సైతం నిప్పు పెట్టేశారు. దీంతో.. ఫైరింజన్ కు ఫోన్ చేయగా.. అది బయలుదేరింది. ఇంటికి వస్తున్న క్రమంలో ఒక ఫోన్ కాల్ రావటంతో.. ఫైరింజన్ రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది. దీంతో.. పక్క రోజు ఉదయం వరకు మంటల్లో పార్టీ ఆఫీసు తగలబడుతూనే ఉంది. అంతేనా.. ఇంటి ముందున్న నాలుగు వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆ బిల్డింగ్ లోని ఉన్న టీడీపీ వారి ఇళ్లకు వెళ్లి విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. మూడో ఆరాచకం 2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాచర్లలో కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి టీడీపీ నేతల్ని నియోజకవర్గాలకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు లాంటి నేతలు.. వారి అనుచరులు కలిసి మాచర్ల బయలుదేరారు. మాచర్ల మొయిన్ రోడ్డు మీద వెళుతున్న టీడీపీ నేతల వాహనాలపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ గా మారి.. పలువురిని షాక్ కు గురి చేసింది. బోండా ఉమ పేరుతో రిజిస్టర్ అయిన వాహనంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. పట్టపగలు నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తున్నప్పుడే ఇంత దారుణ దాడి జరిగింది. పక్కన గన్ మెన్ ఉండగానే దాడికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న తురక కిషోర్ ను తర్వాతి కాలంలో పురపాలక సంఘం ఛైర్మన్ ను చేయటం విశేషం. నాలుగో దుర్మార్గం తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఓటు వేశారన్న కారణంగా దుర్గి మండలం ఆత్మకూరు.. జంగమహేశ్వర పాడు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను గ్రామ బహిష్కరణ చేశారు. అయినప్పటికీ కొందరు గ్రామంలోనే ఉండగా.. నూతన సంవత్సర వేడుక సందర్భంగా టీడీపీ వారిపై వైసీపీ వారు దాడి చేసి పలు కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లిపోయేలా చేశాయి. ఐదో అన్యాయం 2020లో వెల్దుర్తి మండలం బోదిలవీడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాల్ని వైసీపీ నాయకులు లాక్కొని పత్రాల్ని చించేశారు. అయినా.. ఎలాంటి చర్యా తీసుకోలేదు.

👉చీమకుర్తిలోని బి.ఆర్.అంబెడ్కర్ బాలికల గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారీయా ..

👉రైళ్లలో బ్యాగులను అపహరించే వాడరేవుకి చెందిన పెదాల వెంకటేష్ అనే చోరుడిని చీరాల రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు అతడి వద్ద నుండి 3 లక్షల 81 వేల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు,లాప్టాప్ లు, సెల్ ఫోన్లు, ఐపాడ్లు,వాచీలు స్వాధీనపరచుకున్నట్లు నెల్లూరు రైల్వే డిఎస్పి విజయభాస్కరరావు మీడియాకు చెప్పారు.చాకచక్యంగా ఈ దొంగను పట్టుకున్న చీరాల రైల్వే ఎస్ఐ కొండయ్య తో పాటు సిబ్బందిని అభినందించారు.

👉కడప జిల్లా…కడప నగర శివారులో యువకుడు హత్య….రాళ్లతో మోదీ హత్య…సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…విచారణ వేగవంతం….

👉గుంటూరు జిల్లా..తాడేపల్లి..*సీతానగరం లో గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు*మహానాడు కు చెందిన యువకులుగా గుర్తింపు..వారి వద్ద నుండి 1 కేజీ 600 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం..విశాఖపట్టణం నుంచి తాడేపల్లి తీసుకువచ్చి విక్రయిస్తున్న యువకులు.ఒక్కొక ప్యాకెట్ 13 గ్రాములు 500 రూపాయలకు విక్రయిస్తూ పోలీసులకు దొరికిన వైనం..*

👉 కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్న రైతు రుణమాఫీ సంబరాలు బీబీపేట్ చౌరస్త నుండి రైతు వేదిక వరకు వేలాది మంది రైతులతో ర్యాలీగా బయలుదేరి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్..

👉లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..*తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల లో 25 వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే. కాంగ్రెస్ 8 నెలల్లోనే 31 వేల కోట్ల రైతు రుణం తీర్చబో తోందన్నారు..ఈరోజు రెవెన్యూ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మాట్లాడుతూ.తెల్ల రేషన్ కార్డుతో సంబం ధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు..ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు**అందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

👉BRS కు మరో షాక్. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నం లావణ్య ఆమె భర్త తో కల్సి కాంగ్రెస్ లో చేరారు. లావణ్య తో పాటు 6 మంది BRS కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు*

👉తిహార్ జైల్లో వున్న కెసిఆర్ కూతురు కవిత 4 నెలల లోనే 10 కేజీ ల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. కవితకు నిన్న భర్త సమక్షంలో ఎయిమ్స్ హాస్పిటల్ లో వైద్యపరిక్షలు చేసారు. మర్నాడు కవిత ను తిహార్ జైల్లో కలవనున్న కుటుంబ సభ్యులు*

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?