👉 జగన్ పై జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మండిపడ్డారు. వినుకొండలో రషీద్ హత్య వ్యవహారంలో జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్ పై నాగబాబు మండిపడ్డారు.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని దుర్మార్గ పాలన జగన్ హయాంలోనే చూశామని గుర్తు చేశారు. జగన్ ను అధికారంలోకి తీసుకురాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉండేందుకే ధర్నా పేరుతో ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జగన్ బుద్ధి మార్చుకోవడం లేదని ఫైరయ్యారు. జగన్ పాలనలో సామాన్య ప్రజలు నోరెత్తాలంటే భయపడి పోయారని నాగబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన నీతులు వల్లించడం అసలు బాలేదన్నారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవడానికి శోచనీయమన్నారు. వినుకొండలో రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్యకు గురయ్యాడని చెప్పారు. తాము ఈ హత్యను సమర్థించడం లేదని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. గత జగన్ పాలనలో ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని నాగబాబు గుర్తు చేశారు. అమాయకులను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తేనే భౌతిక దాడులు చేసి కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలపై కేసులు కూడా పెట్టారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిపారేశారన్నారు. ఐపీఎస్‌లను వైసీపీ నాయకులుగా మార్చి పని చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు హద్దే లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దందాలకు అమాయకులైన అధికారులు బలయ్యారన్నారు.
👉 నెల్లూరులో మొహరం పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి …
👉నేడు విజయవాడ లోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రైల్వే గతిశక్తి అధికారి శ్రీనివాస్,ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధికారి శ్రీనివాస్ తో టంగుటూరు, సూరారెడ్డి పాలెం, కరవది, అగ్రహారం గేట్ త్వరతగతిన పూర్తి చేయాలని మరియు రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
👉 ఒంగోలు పట్టణంలో
సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా మండలస్థాయి అధికారులతో విక్షణ సమావేశం నిర్వహించారు ..
👉మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఆకస్మిక తనిఖి…
ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల పై కొరడ..
నాలుగు స్కూల్ బస్సుల పై కేసు నమోదు, 50 వేలు జరిమానా…ప్రకాశంజిల్లా పొదిలిలో ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల పై దర్శి మోటర్ వైకిల్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖి చేసారు.స్కూల్ పిల్లలను తరలించే బస్సులు సరైన కండిషనల్ లో లేక పొవడంతో 4 బస్సులకు 50,000 జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు.చిన్నారులను తరలించే స్కూల్ బస్సులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, అన్ని రక్షణ చర్యలు పాటించాలని ఆయన కొరారు.ప్రైవేటు స్కూల్స్ నియమ నిబంధనలు పాటించకుండా చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు._
*👉హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితులు..దర్యాప్తులో కేసును చేధించిన పోలీసులు.
*హత్యకు పాల్పడ్డ నలుగురు అరెస్ట్ : సీఐ పులిశేఖర్ ..అన్నమయ్య జిల్లా పీలేరు ..
గుర్రంకొండ ఏనుగులచెరువుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా పోలీసులు చెందించి నలుగురిని అరెస్టు చేశారు. వాల్మీకిపురం సిఐ పులిశేఖర్, గుర్రంకొండ ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం.. గుర్రంకొండ పెద్దమండెం రోడ్డు లోని, ఏనుగులచెరువుకట్టపై గతనెల 10న సంఘ సముద్రంకు చెందిన గంటా రామకృష్ణ(48), గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడడంతో సంఘ సముద్రానికి చెందిన కే.మల్లికార్జు (30), సద్దాం, వెంకటేష్, ఎల్లంపల్లికి చెందిన ప్రకాష్ లు పథకం హత్యచేశారని టెక్నికల్ ఆధారాలు లభించడంతో నిందితులను శనివారం అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం నిందితులుగా నిర్ధారించి, అరెస్టు చేశామని సీఐ, ఎస్ఐ లు తెలిపారు
👉 గుంటూరు:తెనాలి కి చెందిన తాడిబోయిన రవి తేజ(28) అనే యువకుడు అమెరికాలో స్విమ్మింగ్ ఫుల్ లో జారిపడి మృతి.
అమెరికాలో టెక్సాస్ లోని ఆస్టిన్ సిటీలో 18న ఘటన.
👉అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారు..
ముత్తారంలో ఇంట్లో చంపి గొనసంచిలో మూటకట్టి బావిలో వేశారు..హత్యలో పాల్గొన్న ముగ్గురు అరెస్ట్..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో గత నెల 8వ తేదీన బావిలో మూటలో దొరికిన మహిళ అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూధన్ రావులతో కలిసి నిందితుల వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన ముత్తారంకు చెందిన అమ్ము రజీత అలియస్ లావాణ్య తన ఇంటి సమీపంలో ని పెరక రాజేశ్వరి (65) వద్ద అప్పు లక్ష 50 వేలు అప్పు తీసుకుందని, రాజేశ్వరి తరుచూ అప్పుడబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహంతో 8వ తేదీన అప్పు ఇస్తానని రాజేశ్వరిని ఇంటికి పిలిచిన లావణ్య మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో పాటు భర్త రవి అలియాస్ రమేష్ తో కలిసి ఇంట్లో గొంతు నులిమి చంపి అదే రాత్రి గొనసంచిలో మూటకట్టి బావిలో పారుపల్లికి వేళ్లే వ్యవసాయ బావిలో వేశారన్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురిని శనివారం ఉదయం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు అరెస్ట్ చేశారని తెలిపారు. అప్పు ఇచ్చిన రాజేశ్వరి తమను తరచుగా డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెట్టేదని, అందుకే ఆమెను హత్య చేసి రాజేశ్వరి ఒంటి పై ఉన్న బంగారం తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చమన్నారు. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, బాలగాని కిరణ్ లను ఏసీపీ అభినందించారు.
👉ప.గో జిల్లాలో హత్య.. కత్తితో నరికిన మహిళ*..
ప.గో. జిల్లా: నరసాపురం మండలం వేములదీవిలోని సర్దుకొడప గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం. చినమైనవానిలంకకు చెందిన మైల చంద్రశేఖర్(38)ను సర్దుకొడపకు చెందిన మహిళ ఆమె ఇంటిలోనే కత్తితో తలపై నరికింది. చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.