పార్లమెంట్‌లో ‘నీట్’పై రగడ”..బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం?..వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ చిన్నారుల ర్యాలీ..ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే పరమావధి..ప్రకాశం జిల్లా ఎస్పీ…

👉పార్లమెంట్‌లో ‘నీట్’పై రగడ”..నీట్ పేపర్ లీక్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాల నేపథ్యంలో తొలిరోజే నీట్‌ కేంద్రంగా అధికార, విప క్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.సభ ప్రారంభం కాగానే నీట్‌

పేపర్‌ లీక్‌ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభ మైంది. విపక్షం తరుపున కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీలు ప్రశ్నలు సంధించగా…విపక్ష సభ్యుల ప్రశ్నలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు.నీట్‌ పేపర్‌ లీక్ చాలా పెద్ద సమస్య అని రాహుల్‌ గాంధీ అన్నారు.ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నా రని… డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారుని ఆరోపించారు. పేపర్‌ లీక్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు…

👉బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం?: షర్మిల..జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు.వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది కాదన్నారు.

👉 వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ లో చిన్నారుల ర్యాలీ ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. ఇటీవల ఇలాంటి దారుణం చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. హైదరాబాద్ మహానగరంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్ కాలనీ నార్త్ కు చెందిన పలువురు చిన్నారులు.. తాజాగా చేపట్టిన ఒక ర్యాలీ అందరిని ఆకర్షించింది. సీఎం రేవంత్ అంకుల్.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకున్న చిన్నారులు తమ బుడిబుడి అడుగులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టారు.వీరికి వారి తల్లిదండ్రులు తోడయ్యారు. రెండు రోజుల క్రితం కాలనీలోని బుక్ స్టోర్ లో పని చేసే మన్సూర్ పై వీధి కుక్క ఒకటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో.. కాలనీలోని పిల్లలంతా ఒకటి చేరి.. తాము ఎదుర్కొంటున్న వీధి కుక్కల సమస్యను ప్రభుత్వం వరకు వెళ్లేందుకు వీలుగా వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. సీఎం అంకుల్.. ఎమ్మెల్యే అంకుల్.. కమిషనర్ అంకుల్.. అంటూ తమ సమస్యను తెలిపేలా ప్లకార్డులు పట్టుకున్న పిల్లలు పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాలీ హైదరాబాద్ లోని మిగిలిన కాలనీలకు స్ఫూర్తిగా మారింది. తాము ఎదుర్కొంటున్న సమస్య మీద పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా పరిష్కరించని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ కాలనీ పేరెంట్స్ పలువురు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. గడిచిన రెండున్నరేళ్లలో 70 మందిని వీధి కుక్కలు గాయపర్చినట్లుగా పేర్కొన్నారు. వాటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

👉జగన్ రఘురామ చనుకులు…అసెంబ్లీలో కనిపించిన వెంటనే వైఎస్ జగన్‌ని పలకరించిన ఆర్ఆర్ఆర్.ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడిన రఘురామ.అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని బదులిచ్చిన జగన్.అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి కాసేపు మాట్లాడిన రఘురామ కృష్ణం రాజు.తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరి రఘురామ.తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిన కేశవ్.రఘురామను పలకరించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

👉వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్..అమరావతి..తన రాజీనామా లేఖను వైఎస్ఆర్సిపి అధినేత జగన్ కు పంపిన మద్దాల గిరిధర్..

👉జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్..ప్రకాశం జిల్లా…
జిల్లాలో ఎవరైనా మహిళలు, పిల్లలుపై అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు, లైంగిక దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదు.. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన జిల్లా ఎస్పీ సత్వరం ఒక బాధితురాలికి న్యాయం చేకూర్చారు. బాధితురాలు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా మహిళలు, పిల్లలుపై అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు, లైంగిక దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతకు వారిపై నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ పిర్యాదుపై జిల్లా ఎస్పీ స్యయంగా స్పదించి సత్వరమే తమకు న్యాయం జరిగేలా చేసిన జిల్లా ఎస్పీ కి పోలీసులకు బాధితురాలు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

👉9వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ -2024 పోటీల్లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…జూన్ 24 నుండి 30 వరకు అస్సాంలో జరిగిన 9వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ -2024 జాతీయస్థాయి పోటీలలో ఏపీ పోలీస్ శాఖ నుండి ప్రాతినిథ్యం వహించి జాతీయ స్థాయి జరిగిన పోటీల కోసం ఒంగోలులోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డిటిసి) నందు అద్భుతంగా శిక్షణ పొంది తైక్వాండో, కరాటే పెంచాక్ సిలాత్ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించారని, ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో నిరంతర సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని ప్రసంశించారు. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు. అలాగే భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు.👉 ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే పరమావధి..సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం..ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 92 ఫిర్యాదులు..ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు.

👉రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు..
మార్కాపురం.. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తాపడంతో పలువురికి గాయాలైన సంఘటన సోమవారం జరిగింది.కంభం నుండి మార్కాపురం వైపు వెళుతున్న కారు తిప్పాయపాలెం సమీపంలోకి వెళ్ళగానే ప్రమాదవశాత్తు పొలాల్లోకి దూసుకెళ్ళింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో అక్కడే ఉన్న రాచర్ల మండలం చోళ వీడు పంచాయతీ సర్పంచ్ గోతం వెంకటనారాయణ గాయపడ్డ వారిని అంబులెన్స్ సహాయంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

**అనకాపల్లి జిల్లా పోలీసు 6వ విడతలో రికవరీ చేసిన 176 (రూ.25 లక్షల విలువగల) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక….ఇప్పటి వరకు మొత్తం సుమారు 3500 ఫిర్యాదులు నమోదు కాగా, మొత్తం 6 విడతల్లో 1,756 మొబైల్ ఫోన్లు సుమారు రూ.2 కోట్ల, 45 లక్షల విలువ గలవి, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేశారు…

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం