అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

👉 అసెంబ్లీ హైలెట్స్..మాభూములను కబ్జా చేసి, మా పేర్లపై ఉన్న పట్టా పత్రాలను లాక్కుని వాళ్ళ పేరుమీద రాయించుకొని మా భూములను వేరే వాళ్లకు అమ్ముకున్నారు పెద్దిరెడ్డి కుటుంబం..

👉సీఎం చంద్రబాబు :దేవతల రాజధాని అమరావతి అభివృద్ధి చెంది ఉంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ప్రపంచంలోనే ది బెస్ట్ గా తయారై  ఉండేది. హైదరాబాద్’ను ప్రపంచపటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ..గతంలో పరిశ్రమల్లో 7 లక్షల 72 వేల ఉద్యోగాలు సృష్టించాం.. గత వైకాపా ప్రభుత్వం పేదవారికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేక పోయింది..గత ప్రభుత్వంలో తలసరి ఆదాయం తగ్గింది. తలసరి అప్పు పెరిగింది..విభజన వల్ల జరిగిన నష్టం కన్నా, జగన్ వల్ల జరిగిన నష్టమే రాష్ట్రానికి ఎక్కువ..
: గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.74,790 నుంచి రూ.1,44,336 అప్పు భారాన్ని మోపింది .. విశాఖ పట్టణంలో రూ.1,941 కోట్ల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది గత జగన్ ప్రభుత్వం..
: గత జగన్ ప్రభుత్వం రూ.9,74,556 కోట్లు అప్పు పెట్టింది.. గత ఐదేళ్లు దుర్మార్గుడు జగన్  పాలనలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది..
: జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది..జగన్ ఐదేళ్ల పాలనలో రోడ్డుపై తట్ట మట్టి కూడా వేయలేదు. రాష్ట్రాన్ని నాశనం చేశాడు.. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి విచ్చలవిడిగా దోచేశారు గత వైకాపా నేతలు..ఈ దుర్మార్గుడు జగన్  ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టాడు.  పంచాయతీ నిధులను  దారి మళ్లించాడు..విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీల్లో 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంటే గత ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది..ప్రకృతి విపత్తు  వల్ల నష్టపోయిన ప్రజలకు 25కేజీల బియ్యం.1కేజీ పప్పు 1లీటర్ పామాయిల్,కేజీ టమోటా, కేజీ ఉల్లిపాయలు ఇస్తూనే..ఇల్లు పూర్తిగా మునిగిపోయిన కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం చేయడం జరుగుతుంది . ప్రజా సంక్షేమం కోసం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి ఇంటి వద్దనే ఇచ్చాం.. మొట్టమొదటి సారిగా గోదావరి,కృష్ణా జలాల అనుసంధానం మన రాష్ట్రంలో జరిగింది.. 2014-2019 టీడీపీ హయాంలో అభివృద్ధి,సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపించాము. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పనినైనా ప్రజల ప్రయోజనం కోసమే చేస్తుంది…ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు  చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్ కన్నా పోలవరం చాలా పెద్దది..అమరావతి అభివృద్ధి చెంది ఉంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారై  ఉండేది.దుర్మార్గమైన పాలన వలన రూ 466 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టుకి రూ 990 కోట్లు కేటాయించవలసివచ్చింది….గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.74,790 నుంచి రూ.1,44,336 అప్పు భారాన్ని మోపింది . _ సీఎం చంద్రబాబు 36790: విశాఖ పట్టణంలో రూ.1,941 కోట్ల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది గత జగన్ ప్రభుత్వం..ప్రపంచమంతా మన రాజధాని అమరావతి గురించి చర్చించుకునే రోజు ఖచ్చితంగా తీసుకొస్తాను..ప్రపంచమంతా మన రాజధాని అమరావతి గురించి చర్చించుకునే రోజు ఖచ్చితంగా తీసుకొస్తాను అని తెలిపారు.

👉 అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీ ద్వారా విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

👉 కంభం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా..కంభం ప్రభుత్వాసుపత్రిని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యం గురించి రోగులతో మాట్లాడి వైద్యశాలలో అందుతున్న సదుపాయాలను వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కంభం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,  కంభం ఆసుపత్రికి వస్తున్న రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలంటూ వైద్యులను, అధికారులను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించారు..

👉వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు ..నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు..మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించిన సీబీఐ కోర్టు..అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి..సాక్షిగా పరిగణించాలని దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్..
ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని పేర్కొన్న సిబిఐ..దస్తగిరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు..
నిందితుల జాబితా నుంచి పేరును తొలగింపు.
👉 అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి…నల్గొండ – అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్(24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి…
👉ప్రకాశం జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ..
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐ.పి.యస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, పోలీస్ శాఖ, పరిపాలక అధికార యంత్రాంగం మధ్య సమన్వయము, జిల్లాకు సంబంధించి  అంశాలపై చర్చించారు.

👉పొదిలి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ..   పొదిలి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలనీ సీఐ మల్లికార్జున ను ఎస్సై కోటయ్యను పోలీస్ స్టేషన్ సిబ్బందికి తెలియజేశారు.అనంతరం ఆయన పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పిల్లలతో కాసేపు సరదాగా గడిపి వారికి పలు సూచనలు తెలిపారు.

👉పోలీస్ స్టేషన్ సాక్షిగా…రెచ్చిపోయిన నకిలీ విలేకరి..అన్నమయ్య జిల్లా: రాజంపేట..మన్నూరు పోలీస్ స్టేషన్ సాక్షిగా రాజంపేట పాత్రికేయులపై కడప జిల్లా చెన్నూరు కు చెందిన మాధవరెడ్డి అనే నకిలీ విలేకరి బూతులు రెచ్చిపోయాడు.రాజంపేటలో పాత్రికేయులు అందరూ లంచాలు తీసుకుని వార్తలు రాస్తున్నారని నోటితో చెప్పుకోలేని విధంగా పోలీస్ స్టేషన్ లోనే బూతులతో రెచ్చిపోయాడు ఆ రెడ్డి.బూతులు తిడుతూ ఓ వ్యక్తిపై దాడి చేయడానికి వచ్చిన ఆ మాధవరెడ్డి వీడియోలు మన్నూరు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.పాత్రికేయులపై బూతులు తిడుతూ రెచ్చిపోయిన మాధవ రెడ్డి పై మన్నూరు సిఐ రవీంద్ర కు ఫిర్యాదు చేసిన విలేకరులు.వెంటనే స్పందించిన సిఐ రవీంద్ర మాధవరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ.

💥నాగర్ కర్నూల్ జిల్లా*
*ఉపాధి హామీ పథకం కార్యాలయంలో అగ్నిప్రమాదం*
• తెల్కపల్లి ఉపాధి హామీ పథకం కార్యాలయంలో అగ్నిప్రమాదం…వివిధ గ్రామాలకు చెందిన ఎంబీల దస్త్రాలకు నిప్పుపెట్టిన దుండగులు
• ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన అధికారులు..
👉ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారి పాలెం లో మహిళ పై దాడి..చెట్టుకు కట్టేసి హత్యాయత్నం. దారుణం గా కొడుతున్న దృశ్యం. సమాచారం అందటం తో ఆమెను రక్షించి హాస్పిటల్ కు తరలించిన పోలీసులు…
*👉ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన  నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్..

ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్ లో వివేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడ అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని.. హోటల్ ఏమి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇకనుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. రూ 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాలు దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని అందర్నీ అడగగా వాళ్ళు నకిలేని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్ చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గా దేవి పాట సహకరించి బుక్కురి దేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి,పులిగా రాంబాబులను అరెస్టు చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు..వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేస్ చేదించిన ఎస్సై రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
** ఇలాంటి అనైతిక కార్యక్రమాలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానెళ్ళ పేరుతో, వాటికి న్యూస్ ప్రసారం చేసే అధికారం లేదు, అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి ఛానెళ్ళు కి ఏమాత్రం గుర్తింపు లేదు. అయినప్పటికీ తామర తంపరగా పుట్టుకోస్తున్న యూట్యూబ్ ఛానెల్ల విలేకర్లమంటూ డజన్ల సంఖ్యలో ఆఖరికి మండలకేంద్రాల్లో కూడా అక్షరజ్ఞానం లేని నిరక్షర కుక్షులు జర్నలిజానికి అర్ధం కూడా తెలియని వారు విచ్చల విడిగా జర్నలిస్టులుగా చలామణి అవుతుంది ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడుతూ తలఒంపులు తెస్తున్నారు. వీరు చేసే హడావిడి కి అసలు సిసలు పాత్రికేయులు ఏమీ పాలుపోక కిమ్మనాకుండా ఉండాల్సివస్తోందని వాపోతున్నారు. కనుక ఇలాంటి నీచకార్యక్రమాలకు, బ్లాక్ మైలింగ్కి పాల్పడేందుకు అవకాశం ఇస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళ ను నిషేదించి జర్నలిజం విలువను కాపాడాలని కోరుతున్నారు.
👉ఏసీబీకి చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము*
*ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము .కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ACB తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB అధికారులు..
👉రాష్ట్ర విద్య, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్సిలు భూషణం, భాస్కర్.. నంద్యాల..
నవంబర్ 3,4,5 తేదీలలో అనంతపురం నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు ఈ భూషణం కె. భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల పట్టణంలో న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పవన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ.భూషణం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకంగా విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం కోసం అనంతపురం నగరంలో రాష్ట్ర క్లాసులు మరియు జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరైతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ, కాసాయికరణ చేయడానికి సిద్ధమైందని అన్నారు. దేశ విద్యా వ్యవస్థకు ఈ నూతన జాతీయ విద్యా విధానం పేను ప్రమాదమని అన్నారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్య కోసం నీట్ పరీక్ష రాశారని, కానీ NTA అనే సంస్థ అవినీతికి పాల్పడి పరీక్ష పేపర్ను లీకేజ్ చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే నీట్ పరీక్ష నిర్వహించి రాష్ట్రాలకు అప్పగించాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం 3,4,5 తరగతుల విలీన ప్రక్రియ ద్వారా గత ప్రభుత్వం 18వేల ప్రాథమిక పాఠశాల మూసివేశారు. దానికి సంబంధించి 84,85 117 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, పీ డీ ఎస్ యూ ఉపాధ్యక్షుడు మర్రిస్వామి కోశాధికారి సాయి నాయకులు ప్రవీణ్,సుధీర్,మొదలైన వారు పాల్గొన్నారు.
👉ఆవాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట లో ఉన్న పీఎంఆర్ హైస్కూల్ నందు ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ సహాకారం తో రూపోందించబడిన స్వాతంత్ర సమరయోధుల స్టిక్కర్లను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ చాన్ బాషా, నగర కమిటీ సభ్యులు షేక్ రియాజ్, సయ్యద్ అమానుల్లా, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం