👉జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్,రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు.జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని,అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని,ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న,శిక్షలు కఠిన తరం చేస్తామని,జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..
👉కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు .ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోశారని, అత్యధిక మెజారిటీతో పార్లమెంట్‌కు పంపారని, కానీ పాలమూరు ఎత్తిపో తల ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించా రాయన.. మహబూబ్ నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని పార్లమెంట్‌కు కేసీఆర్‌ను పంపితే అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు రేవంత్.
👉రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిత్వం,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని,పేదలకు,విద్యార్థులకు ఆయన చేసే సహాయ సహకరల గురించి సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి .. 👉అసెంబ్లీలో “తొడగొట్టిన కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే.. శనివారం కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు.ప్రతిపక్షాలు పదేపదే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం.. పడగొడతాం అని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు.వారు ప్రభుత్వాన్ని పడగొ తామంటే, తాము తొడ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ.. తొడగొట్టి చూపించారు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…
👉గత పాలకుల అవినీతి అక్రమాలను పాపాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పైన మాట్లాడుతూ *కల్వకుంట్లకాందాన్నిపింకీ పార్టీ బత్తాయిలను,శాసన మండలిలో చెడు,గుడు ఆడుకున్న MLC తీన్మార్ మల్లన్న ..
👉గత BRS పాలకుల తప్పిదాలను ఎండగడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చక్కని వాగ్దాటితో ముక్కు సూటి సమాధానం ఇచ్చిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో పెన్షన్ల పై జరిగిన చర్చ కార్యక్రమంలో మంత్రి సీతక్క గారు చక్కని వాగ్దాటితో ప్రతిపక్షాలకు ముక్కుసూటి సమాధానమిచ్చారు. పెన్షన్లకు సంబంధించి గత పాలకులు దాదాపు ఐదువేల మందికి డబల్ పెన్షన్లు ఇచ్చారని అన్నారు. న్యాయబద్ధంగా అర్హులను పరిగణలోకి తీసుకొని పెన్షన్ల పంపిణీ చేయబడుతుందని వివరించారు. గత పాలకులు పెన్షన్ సమయానికి ఇవ్వకుండా తేదీలను మారుస్తూ ఒక నెల పెన్షన్ ఇవ్వలేదని ఆమె తెలియజేశారు*
👉బాపట్ల జిల్లా: బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరం వద్ద బాపట్ల డిఎస్పి మురళీకృష్ణ. పర్యాటకుల భద్రతపై గజ ఈతగాళ్ళకుపలు సూచనలు చేశారు.
👉కర్ణాటక టూ హైదరాబాద్ ప్లాట్…ప్లాట్‌లో జిగేల్.. జిగేల్.. అని మెరిసే 10 కిలోల బంగారం స్వాధీనం..చేసుకున్న సిట్ అధికారులు..కర్ణాటక ‘వాల్మీకి కార్పొరేషన్’లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ విచారణ మరింత వేగవంతమైంది. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నుంచి దోచుకున్న కోట్లాది రూపాయల సొమ్ములో హైదరాబాద్ సత్యన్నారాయణ వర్మ రూ. 10 కోట్లు విలువైన 14 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసిన విషయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ (సిట్) విచారణలో వెలుగులోకి వచ్చింది…కర్ణాటక ‘వాల్మీకి కార్పొరేషన్’లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ విచారణ మరింత వేగవంతమైంది. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నుంచి దోచుకున్న కోట్లాది రూపాయల సొమ్ములో హైదరాబాద్ సత్యన్నారాయణ వర్మ రూ. 10 కోట్లు విలువైన 14 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసిన విషయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ (సిట్) విచారణలో వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయల్లో ఈ కుంభకోణానికి సంబంధించి సిఐడి, సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మన్ ఇంట్లో బంగారు బుట్ట దొరికింది. 10 కిలోల బంగారు బిస్కెట్లను సిట్ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సిట్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది..వాల్మీకి స్కాం సొమ్ముతో నిందితుడు సత్యనారాయణ వర్మ బంగారం కొన్నాడు. సిట్ బృందం అతడిని తీవ్రంగా విచారించగా.. 15 కిలోల బంగారం ఇస్తానని చెప్పాడు. దాని ప్రకారం తన హైదరాబాద్ ప్లాట్‌లో 10 కిలోల బంగారు కడ్డీని ఉంచినట్లు చూపించాడు. మిగిలిన బంగారు బిస్కెట్ల కోసం సిట్ పోలీసులు ఆరా తీస్తున్నారు. వాల్మీకి స్కాం సొమ్ముతో నిందితుడు వర్మ 35 కిలోల బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం..హైదరాబాద్‌లో సిట్ బృందం వారం రోజులుగా సిట్ బృందం వెతికినా సత్యన్ వర్మ ఆచూకీ లభించలేదు. తర్వాత అతడి సన్నిహిత వర్గాల వారిని లాక్కెళ్లి మాస్టర్ ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. సత్యనారాయణ వర్మను అరెస్టు చేసే సమయానికి డబ్బు, బంగారమంతా వేర్వేరు ప్రాంతాల్లో దాచారు. వర్మను బెంగుళూరుకు తీసుకొచ్చి విచారించగా డబ్బు, ప్లాట్ కొనుగోలు విషయంలో మౌనంగా ఉన్నాడు. అనంతరం సిట్ బృందం కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొంది హైదరాబాద్‌లోని వర్మన ఫ్లాట్‌లో సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని సీమా టౌన్, మీ పురాలోని వాసవీ బిల్డర్స్ నుంచి రెండు ఫ్లాట్‌ల చొప్పున మొత్తం 11 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు సిట్‌కు సమాచారం అందింది. హైదరాబాద్ ఫ్లాట్‌లో 8 కోట్ల డబ్బు దాచి ఉంచగా, బ్యాగ్‌లో 8 కోట్ల డబ్బు దొరికింది. మనీ కౌంటింగ్ మిషన్ తీసుకొచ్చి డబ్బులు లెక్కించి సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో 9 మంది నిందితులను జైలుకు పంపగా, ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.
👉తల్లి హత్య, కొడుకు ఆత్మ హత్య….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూడిది గడ్డలో వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కొడుకు తల్లిని హత్య చేసి ఆత్మ హత్య కు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం అవుతుంది. వినయ్ కుమార్ పాసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తల్లి కొడుకుల పోషణ అదే బస్తీలో ఉండేతుల్జా కుమారి పాసి (55) తల్లి కొడుకుల పోషణ మరిది గుల్లపల్లి రవిశంకర్ (మాజీ కౌన్సిలర్ )చూస్తూ ఉంటారు. తుల్జ్ శనివారం రాత్రి రవిశంకర్ ఇంటిలో భోజనం చేసి కొడుకు కు భోజనం తీసుకువెళ్ళింది. కుమారి ఇంటి పక్కనే కూతురు, అల్లుడు పాసినాగేందర్ నివాసం ఉంటారు. శనివారం ఉదయం తొమ్మిది అయినప్పటికీ తుల్జా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమే మనవరాలు సునన్య ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు మృతదేహాలు కనిపించాయి.దీంతో విషయాన్ని పెద్దలకు తెలిపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుకున్నారు.షేక్ అబ్దుల్ రెహమాన్ పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది…
👉 హైదరాబాద్ లో సీనియర్ ఫోటో జర్నలిస్టు సయ్యద్ బషీర్ పాషా ఖాద్రీ, అలియాస్ ఖాద్రీ భాయ్ అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.
👉రైలు పట్టాలపై శవమై కనిపించిన వైసీపీ కి చెందిన గ్రామ సర్పంచ్..తిరుపతి జిల్లా..సూళ్లూరుపేట కుదిరి గ్రామ సర్పంచ్ బుంగ చెంగయ్య రైలు కింద పడి దుర్మరణం..తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కుదిరి గ్రామ సర్పంచ్ బుంగ చెంగయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు, సర్పంచ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
👉నాకు మరణం వస్తే దేశానికి సెలవివ్వద్దు… ఎప్పటిలాగే పనిచెయ్యాలి’_ అని చెప్పిన గొప్ప దేశభక్తుడు కలాం!..నేడు ఆయన తొమ్మిదవ వర్ధంతి…*ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో… డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు.. *రోజురోజుకూ ఎదుగుతూ.. దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా, మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం. *రాకెట్ల తయారీలో తలమునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చి పోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. *అందుకే దేశం ఆయన్ని మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించింది.
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని శనివారం ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఏఆర్ దామోదర్, తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
👉భారత్ పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్యేల్యే తనయుడు…ప్రజలకు నాణ్యమైన పెట్రల్ అందించాలి.👉వాహనదారుల అభిమానాన్ని చురగొనాలని ఆకాంక్షించిన కందుల విఘ్నేష్…ప్రకాశంజిల్లా పొదిలి మున్సిపల్ పరిధిలోని కాటూరివారిపాలెం గ్రామంలో నూతనంగా కంచర్ల వెంకట నారాయణ ఆధ్వర్యంలో నిర్మించిన భారత్ పెట్రోల్ బంక్ ను మార్కాపురం ఎమ్యేల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విఘ్నేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజల అభిమానాన్ని చురగొనాలని,ఖచ్చితమైన కొలతలతో నాణ్యమైన పెట్రోల్,డిజిల్ అందించాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు కాటూరి నారాయణ ప్రతాప్, నారాయణరావు,స్వర్ణగీత,కాటూరి శ్రీను,పొపురి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
👉గోకులం గోవులకు దాణా గండం..అన్నవరం శ్రీ రమా వీరవెంకట సత్య నారాయణ స్వామి వారి దేవస్థానం పరిధిలో గోకులం ఆవులకు కాంట్రాక్టు పొందిన వ్యక్తి భక్తులు పచ్చ గడ్డి అమ్మకాలు, నిర్ణీత సమయంల్ దాణా అమ్మకాలు చేయవలసి ఉన్నా రోజూ దాణా అమ్మకాలు చేపట్టడంతో అవి తిన్న గోవులు అధికారుల పర్యవేక్షణ లేక అనారోగ్యపాలౌతున్నాయని చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కమీషనర్ కు ఫిర్యాదిచేసినట్లు సమాచారం.