👉వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రస్తావించారు..వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రసావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు..నీతి ఆయోగ్ భేటీలో విజన్ 2047 డాక్యుమెంట్‌పై మాట్లాడిన చంద్రబాబు, గతంలో తాను రూపొందించిన విజన్-న్యూఢిల్లీ..*నీతి ఆయోగ్ భేటీ – ‘వికసిత్ ఏపీ 2047’ అంశాలు ప్రస్తావించిన చంద్రబాబు*…*నీతి ఆయోగ్ సమావేశం చంద్రబాబు పాల్గొన్నారు.**వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు..*వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది.
👉మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం చంద్రబాబు భేటీ – ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం – సుమారు గంటకుపైగా ఎన్వీ రమణతో చంద్రబాబు భేటీ – ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన సీఎం
👉 పథకాల పేరు మార్పు: లోకేశ్.. జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి పలుకుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి-తల్లికి వందనం, జగనన్న విద్యా కానుక-సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్ద-డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం, మన బడి నాడు, నేడు-మన బడి, మన భవిష్యత్తు, స్వేచ్ఛ-బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు-అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు చెప్పారు.
👉: ఒలింపిక్స్ లో కివీస్ పై తొలి విజయం భారత్ ..పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్లో జరిగిన మ్యాచ్లో 3-2తో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్లో కివీస్ గోల్ కొట్టి ఆధిక్యంలో వెళ్లగా సెకండాఫ్ లో పుంజుకున్న భారత్ స్కోర్ సమం చేసింది. తర్వాత ఇరు జట్లూ చెరో గోల్ కొట్టాయి. చివర్లో ఇండియా మళ్లీ గోల్ చేయడంతో విజయం సాధించింది. భారత్ ప్లేయర్లలో మన్దేప్, వివేక్, హర్మన్హీప్రీత్ తలో గోల్ కొట్టారు.
👉ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. శిథిలావస్థ భవనాలలో రక్షణ చర్యలు తీసుకోవాలి..ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్..నరహరి. యస్,రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ నరహరి,జిల్లా అధ్యక్షులు కోట.శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.నెల్లూరు నగరంలోని కె ఎన్ఆర్ పాఠశాల అనుబంధంగా ఉన్న నాడు నేడు పనులు క్రింద జరుగుతున్న భవనం గోడ కూలి విద్యార్థి మరణం పై సమగ్ర విచారణ జరపాలి. శిథిలావస్థలో ఉన్న భవనానికి రక్షణ బాధ్యతలు తీసుకొని ,నాసిరకం పనులపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లాలో నగరంలో శిథిలావస్థలో ఉన్న నాడు నేడు పనులు వెంటనే పూర్తి చేయాలి పనులు పూర్తయ్యేంతవరకు ఆ భవనాల పనుల ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకోవాలని సంఘటన స్థలానికి వచ్చిన ది ఆంధ్ర ప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున నెల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారిని కోరడమైనది..వారు వెంటనే సంబంధిత ఎంఈఓ ల కు హెచ్ఎం లకు రక్షణ చర్యలు విషమై ఆదేశాలు జారీ చేయాలని నెల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డీఈఓ ను ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాలో నగరంలో శిథిలావస్థలో ఉన్న నాడు నేడు పనులు వెంటనే పూర్తి చేయాలి పనులు పూర్తయ్యేంతవరకు ఆ భవనాల పనుల ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా మన్నారు. విద్యార్థి మరణంపై వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయలు ఎక్సెగ్రేషియా ప్రకటించిన స్థానిక మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉపశమనం కల్పించాలని కోరారు.కేఎన్ఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 600 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండడం ఉపాధ్యాయులు మాత్రమే సిగ్గుచేటైన విషయం. వీరు పిల్లలకు ఏమాత్రం రక్షణ కల్పించలేరు ప్రభుత్వం విద్య పట్ల ఏమాత్రం బాధ్యత యుతంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది వెంటనే విద్యార్థులకు తగిన విధంగా ఉపాధ్యాయులను నియమించాలి డిమాండ్ చేస్తున్నామన్నారు .ఇటువంటి ఘటన మరొకమారు జిల్లాలో జరగకుండ ఈ పనులను పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఎస్ఎస్ఎ పిఓలు డీఈవోలు సంబంధిత ఏఈలు, డీఈలు ప్రధాన బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
👉కర్నూలు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయడం పై హర్షం వ్యక్తం చేసిన ఆవాజ్ కమిటీ..కర్నూలు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయడం పై హర్షం వ్యక్తం చేసిన ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఏ సుభాన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పీ ఇక్బాల్ హుస్సేన్,ఎస్ ఎం డి షరీఫ్ లు ఈ సందర్భంగా వారు ఒక పత్రిక ప్రకటన చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ప్రవీణ్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ భూమిని తిరిగి మసీద్ కి అప్పగించాలని , రిజిస్టర్ చేసిన వక్ బోర్డు ల్యాండ్లను తిరిగి బోర్డ్ కమిటీకి చెందేలా చేయాలని వారు ప్రభుత్వ అధికార్లను వారు డిమాండ్ చేశారు. ఈ రకంగా అనేక ప్రాంతాలలో వక్ఫ్ బోర్డు ల్యాండ్లను అక్రమంగా రిజిస్టర్లు చేస్తా ఉన్నారని, చేయించుకుంటున్నారని, చట్టంలో వక్ఫ్ బోర్డు ల్యాండ్ కొనడం గాని, అమ్మడం గాని చేయడానికి వీలు లేదని చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఇవి ఎలా అక్రమ రిజిస్టర్లు జరుగుతు న్నాయని వారు ప్రశ్నించారు. దీన్ని వెనక వర్క్స్ బోర్డ్ అధికారుల ,కమిటీ సభ్యుల పాత్ర లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారు. వారి పాత్ర లేనిదే ఇంచు భూమి కూడా ఎవరు లాక్కోలేరని, రిజిస్టర్ చేసుకోలేరని వారు వివరించారు. ఇలా అనేక ప్రాంతాలలో అక్రమంగా రిజిస్టర్ అయిన భూమిని , అక్రమంగా రిజిస్టర్ చేసిన అధికారులను ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అలాగే రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకొని, తక్షణమే తిరిగి వక్ఫ్ బోర్డు భూమిని వారి స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
👉43సార్లు రక్తదానం చేసిన మేమున్నాం సేవాసమితి అధ్యక్షులు చల్లా.అశోక్ రెడ్డి…ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన మేమున్నాం సేవాసమితి అధ్యక్షులు చల్లా అశోక్ రెడ్డి 43సార్లు రక్తదానంచేసి రికార్డు సృష్టించాడు. 👉గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాలు ఆపరేషన్ కొరకు ఓ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో చల్లా అశోక్ రెడ్డి రక్తదానం చేసి ఆదుకున్నారు.👉ఇప్పటి వరకూ 43 సార్లు రక్తదానం, పలు సార్లు రక్తకణాలు ఇచ్చానని మునుముందు కూడా రక్త దానం చేస్తానని చల్లా అశోక్ రెడ్డి చెప్పాడు.👉యువకులు అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆపదలో ఉన్న వారిని రక్తమిచ్చి ప్రాణాలను కాపాడాలని చల్లా అశోక్ రెడ్డి యువతకు విజ్ఞప్తి చేశారు.👉రక్తదాతలు రక్తదానం చేయాలి అనుకున్న…రక్తం అవసరమైన ఈ నెంబర్లు సంప్రదించగలరు.చల్లా.అశోక్ రెడ్డి:- 9959954610*
👉 రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు.. వినకొండలో రషీద్ హత్య కేసులో 20 మందికి పైగా నిందితులు ఉన్నట్లు పోలీసులు రిమైండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు నిందితుడు మధ్య తరచూ గొడవలు జరిగేవిని సమాచారం. హత్యకు ముందు నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో కలిసి మద్యం తాగి,హత్యకు సిద్ధమైనట్లు రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. హత్య జరుగుతున్న సమయంలో కత్తులు, కర్రలతో కాపు కాసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
👉 నాదెండ్ల మండలం చిరుమామిళ్ల కమ్యూనిటీ హాల్ లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యం 28 1/2 బస్తాలు స్వాధీనం చేసుకున్న తాసిల్దార్ అష్రఫున్నీస బేగం, సీఎస్ డీటీ లక్ష్మణరావు. అక్రమార్కులు వేసిన తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య ఈ వ్యవహారంపై విచారిస్తున్న అధికారులు.
👉హైదరాబాద్‌లో కొత్త వైరస్… తీసుకోవాల్సిన జాగ్రత్తలివే*.. భాగ్యనగరవాసులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ..నోరో వైరస్ వ్యాధి కలుషిత నీరు, ఆహారంతో వ్యాపిస్తుందని హెచ్చరిక..హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది.’నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.’ అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు…..👉తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి..ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి…
*ట్రైన్‌తో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్న యువకుడు..ముంబై – సెవ్రీ రైల్వే స్టేషన్‌లో గత నెల ఫర్హాత్ ఆజమ్ షేక్ అనే యువకుడు కదులుతున్న రైలుని పట్టుకొని జారుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్లగా కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలిస్తూ యువకుడి ఇంటికి వెళ్లారు.అయితే ఆ వీడియో చేసిన కొద్ది రోజుల తర్వాత ఏప్రిల్‌లో మరోసారి రైలుని పట్టుకొని స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆజమ్ షేక్ తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు.. ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆజమ్ షేక్ పరిస్థితిని చూసి, ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.