భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి.. జిల్లా అభివృద్ధిపై ప్రశ్నించిన ఎంపీ మాగుంట…కేంద్ర బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు పదివేల కోట్లు ప్రకటించాలి..సిపిఎం నిరసన

👉భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
*చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి* బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా పాల్గొని..అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని..కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకోవడం జరిగిందన్నారు..గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు.. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి.. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తామంతా హైదరాబాద్ అభివృద్ధి పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని..అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్ తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం..కొత్తగా హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని,హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం.అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అభివృద్ధి  చేసి హైదరాబాద్ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించాలని ముఖ్యమంత్రి  కృతనిశ్చయంతో ఉన్నారని..పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామన్నారు.హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు..దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని..మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే..అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు..పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు..
👉 ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ శివా రులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు  సంబంధించిన వీడియో బయటకు వచ్చింది*
*సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శేఖర్ (25) దీపిక (23) తమ ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి బయలుదేరారు తుర్కపల్లి సమీపంలో కారణాలు అతివేగంగా నడపడంతో అదుపుతప్పి అవతలి రోడ్లో వెళ్తున్న బైక్ ను బస్సును ఢీకొట్టారు శేఖర్ దీపికా మరణించ గా బైకర్ గాయపడ్డాడు..ఈ దృశ ్యాలు  బస్సు వెనకాల వెళుతున్న కారు డాష్ బోర్డు కెమెరాలు రికార్డయ్యాయి.
👉 దేశంలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమ పనితీరు – పెంపుదలపై మాగుంట ప్రశ్న..
దేశంలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం క్రింద జిల్లాల ఎంపికకు ప్రమాణాలు, పనితీరుపై పరిశోధనలు, నిధుల కేటాయింపు – వినియోగం, ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పనితీరు మరియు పెంపుదల గురించి ప్రభుత్వ చర్యలపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన  ప్రశ్నకు కేంద్ర  గణాంకాల మరియు కార్యక్రమాల అమలు, ప్రణాళిక మరియు సాంస్కృతిక శాఖల సహాయక (స్వతంత్ర) మంత్రి, రావ్ ఇందేర్జిత్ సింగ్  సమాధానమిస్తూ –
శారీరక శ్రమపై ఆధారవడిన భూమి లేని గృహాలు, ఆరోగ్యం – పోషణ లేని గృహాలు, కుంగుబాటులోని పిల్లల, ప్రాధమికంగా వదలివేయబడిన పిల్లలు, విధ్యుత్ లేని గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు, నీటి వసతి లేని గ్రామీణ గృహాలు, ఉపాధ్యాయుల తక్కువ నిష్పత్తి మరియు  గ్రామీణ సడక్ యోజన లేని గ్రామాలు మొదలగు ప్రమాణాల ఆధారంగా ఆకాంక్ష జిల్లాలు  ఎంపిక చేయబడునని, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని సమగ్రమైన అంచనా వేయుటకు రెండు సంస్థలు పనిచేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రూ. 34.2 కోట్లు మంజూరు చేయగా, అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.10.19 కోట్లు,  పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 5.05 కోట్లు, విశాఖపట్నం జిల్లాకు రూ. 2.93 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.5.01 కోట్లు మరియు వై.ఎస్.ఆర్. కడప జిల్లాకు రూ.11.07 కోట్లు కేటాయించబడ్డాయని, ఈ మొత్తాలను కమ్యూనిటీ గ్రంధాలయాలు, పాఠశాల భవనాలు, తరగతి గదులు, అంగన్వాడి భవనాలు, వైద్యశాలలు, మరుగుదొడ్లు నిర్మాణాలతోపాటు మంచినీటి వసతులు, అంబులెన్సులు, మౌలికవసతులు, మధ్యాన్న బోజనాలు మొదలగు వాటికి  వినియోగిస్తూన్నారని కేంద్ర మంత్రి తెలియజేశారు.

👉 నీతి ఆయోగ్ సమావేశ సందర్బంగా డిల్లీలో ముఖ్యమంత్రిని కలసిన మాగుంట*..
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు రోడ్ షో తయారు చేసేందుకు ఈ రోజు డిల్లీలో రాష్ట్రపతి భవన్ సాంసృతిక భవనంలో ప్రధానమంత్రి అధ్యక్షతణ  జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతి, నారా చంద్రబాబు నాయుడును కలిశారు.ఈ సమావేశంలో దేశంలో సంపూర్ణ పేదరికం నిర్మూలం కావాలంటే ప్రభుత్వ – ప్రైవేటు – ప్రజాస్వామ్య భాగస్వామ్యం, నదుల అనుసంధానం, సంపన్నులు పేదవారిని దత్తత తీసుకోవడం, నదులు – అన్ని రవాణా మార్గాలు అనుసంధానం, గ్రామ స్థాయి మౌలిక వసతులు కల్పన, పరిశ్రమల స్థాపన, హరిత ఇంధనం, ప్రపంచస్థాయి ఉత్పత్తుల తయారీ, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంటు  తప్పక అవరసమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంతో గొప్పగా సూచినందుకు  నారా చంద్రబాబు నాయుడును  మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభినందించారు.

👉 పాఠశాలలలో డిజిటల్ విధ్యా సేవలు పెంపుపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న..
దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ విధ్యా సేవలు పంపుదల, గత ఇదు సంవత్సరాలలో కవర్ కాబడిన మరియు  మౌలిక సదుపాయాల కల్పనకు గుర్తింపబడిన పాఠశాలలు, సేవల పెంపుకు ప్రచార మరియు అవగాహన కార్యక్రమాల ఏర్పాటు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు  పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విధ్యాశాఖ సహాయక మంత్రి,  జయంత్ చౌదరి  సమాధానమిస్తూ –
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం సాంకేతిక జోక్యాలవలన సాంకేతికతను నేర్చుకోవడం మరియు మూల్యాంకన ప్రక్రియ వృద్ధికావడం, భాషా అడ్డంకులు తొలగడం, ఉపాధ్యాయుల నైపుణ్యం – సమర్ధత పెరగడం, దివ్యాంగుల విధ్యా ప్రవేశాలు పెరుగుదల, విధ్యా ప్రణాళిక – నిర్వహణ – పరిపాలన అమర్చుటకు, ప్రవేశాలు, హాజరు, అంచనా మొదలగు వాటిని మెరుగుపరచడం జరుగునని తెలిపారు.
ఈ పాలసీ లక్ష్యాలు సాధించుటకు పి.యం. ఇ విద్య (PM e-VIDYA) డిజిటల్, ఆన్ లైన్, ఆన్ ఎయిర్ ఎడ్యుకేషన్ కు సంబందించిన అన్ని ప్రయత్నాలను ఏకం చేస్తుందని, దిశా, డి.టి. హెచ్ టి.వి. ఛానల్, రేడియో, సి.బి.ఎస్.ఈ., శిక్షా వాణి, డైసీ, దిక్షా, సమగ్ర శిక్ష మొదలగు కీలక భాగాలను  వినియోగించబడునని, దీంతో దేశం మొత్తంలో 25 కోట్ల మంది పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు ఉపయోగం కలుగుతుందని తెలిపారు.
ఈ పధకం క్రింద గత 2021-22 నుండి 2024-25  వరకు దేశం మొత్తంలో 44,025 లాబులు మరియు 1,26,881 సమర్దవంత తరగది గదులు ఏర్పాటు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,687 లాబులు మరియు 5,190 సమర్దవంత తరగది గదులు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. డిజిటల్ ప్రారంభ కార్యక్రమాలను పలు ప్రింటు – సాంఘిక ప్రసార మాధ్యమాలు, జి -20 – ఎక్ష్ పో సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు, సైన్సు ప్రదర్శనలు, టెక్నో మేళాలు, విద్యార్ధి పరిషత్తులు, పుస్తక ప్రదర్శనల ద్వారా స్వయంప్రతిపత్తి సంస్థలు వృద్ధిచేస్తాయని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.

👉కేంద్ర బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు పదివేల కోట్లు ప్రకటించాలి. సిపిఎం …  కేంద్ర బడ్జెట్లో ఏపీకి అప్పులు మూట తప్ప గ్రాంట్ ఏమీ ఇవ్వలేదని సిపిఎం జిల్లా  నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను ప్రజా అనుకూల బడ్జెట్ గా మార్చాలని ,కేంద్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లా కు 10 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాగర్ హోటల్ సెంటర్లో నిరసన ప్రదర్శన  సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షతన జరిగింది. 👉 కార్యక్రమంలో  సిపిఎం జిల్లా కార్యదర్సి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు.👉కార్పోరేట్ వర్గానికి, సంపన్నులకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ రూపకల్పన చేశారని విమర్శించారు. సామాన్యులకు కేటాయించాల్సిన బడ్జెట్లో అనేక అంశాల్లో కోతలు విధించారని విమర్శించారు. ఆహార సబ్సిడీలపై కోతలు విధించారు ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించారని, ఇతర సంక్షేమ పథకాలు కూడా కోతలు విధించారని విమర్శించారు. 👉కార్పొరేటు,సంపన్న వర్గాలకు మాత్రం మరిన్ని రాయితీలు ఇచ్చి వారి ప్రయోజనాలు చేకూర్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఏపీ కి నిధులు కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని విమర్శించారు.తాము ఎన్డీఏ పక్షానే ఉన్నామని చెప్పుకుంటున్న టిడిపి జనసేన పార్టీలు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో తీవ్రంగా వైఫల్యం విమర్శించారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు  అప్పు ఇస్తామని చెప్పేరు తప్ప గ్రాంటు ఇవ్వడానికి బడ్జెట్‌లో  ప్రతిపాదన ఏదీ లేదన్నారు. బిజెపి బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధులు భారీగాఉన్నాయన్నారు.అదే ఎన్డీఏ కూడా మీకు మద్దతు ఇస్తున్న బీహార్ ప్రభుత్వానికి కూడా భారీగా నిధులు కేటాయింపులు చేశారని విమర్శించారు. ఏపీకి మాత్రం అప్పుల తప్ప ఏమీలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి నిధులు గ్రాండ్ల రూపంలో ఇవ్వాలని అప్పులు కాదని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తిస్తూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారని ఇది ఆహ్వానించదగిన విషయమేనని కానీ ఈ జిల్లాకు నిధుల పరిస్థితి ఏమి చెప్పలేదని విమర్శించారు పదివేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ జిల్లాకు ప్రకటించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈరోజుకి కూడా వలసలు పోయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని దాని కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
👉సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి మాట్లాడుతూ ఏపీ విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు రాష్ట్రం అప్పుల కుప్పలాగా మారిపోయిందన్నారు. ఏపీ అభివృద్ధి కావాలంటే క్రేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి తప్ప మరో మార్గం లేదన్నారు. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర అభివృద్ధి జరగదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో  రాష్ట్ర ప్రభుత్వం  చిత్తశుద్ధితో వివరించడం లేదని, కేంద్రానికి బేసరత్తుగా మద్దతు ఇస్తున్నారు తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. విభజన చట్టంలో ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని జిల్లాకు ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
👉 సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎస్ కె  మాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్యేతపత్రాలు విడుదల చేసి లోటు ఈ పేరుతో ప్రజలపై పన్నుల  భారాలు మోపితే సహించమని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ముందుగా సుందరయ్య భవనము నుండి కర్నూలు రోడ్డు మీదగా సాగర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన  కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ  సభ్యులు కంకణాల ఆంజనేయులు ,చీకటి శ్రీనివాసరావు, ఎం రమేష్ , ఊసా వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఆంజనేయులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ మండల కార్యదర్శులు ,శాఖా  కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం