గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ..!..చెక్కులు పంపిణీ చేసిన షబ్బీర్ ఆలీ..జాతీయ ఆహార భద్రతపై ప్రశ్నించిన ఒంగోలు ఎంపీ మాగుంట…తెలుగుగంగ రిజర్వాయర్ లో పెనుప్రమాదం…ముగ్గురు యువకుల గల్లంతు..నర్సరీల తనిఖీ

.👉 గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇప్పుడొక్కటే చర్చ..! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తే.. నిమిషాల్లోనే సోదరి వైఎస్ షర్మిల బయటికెళ్లిపోతారు..! అదేనండోయ్.. ఢిల్లీ వేదికగా వైసీపీ తలపెట్టిన ధర్నాకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మద్దతివ్వడం.. త్వరలోనే కూటమిలో ఈయన చేరిపోతారనే వార్తలు ఇప్పుడు పెద్ద బర్నింగ్ టాపిక్కే అయ్యాయి*. ఎందుకంటే.. ఇద్దరూ ఒక తల్లి కడుపునే పుట్టినా, ఒకరంటే ఒకరికి ఎదురుపడితే ఏదైనా చేసేయాల్సిందేనన్నట్లుగా కోపతాపాలు ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది అన్న, చెల్లి ఇద్దరూ ఒక్కటేలా ఉండాలంటే అయ్యే పనేనా..! వందకు వెయ్యి శాతం కాదు కాదంటే కాదంతే..!!! *అయ్యే పనేనా..! *రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అస్సలు ఉండరు..! అలాంటిది ఏదో ఆస్తి పాస్తుల విషయాల్లో మనస్పర్థలు, గొడవలు అనేవి కుటుంబంలో సర్వసాధారణం. అదే సమస్యకు పరిష్కారం దొరికితే ఒక్కటవ్వచ్చు.. ఎంచక్కా మునుపటిలాగే ఫ్యామిలీతో గడిపేయచ్చు. కానీ.. ఇది వైఎస్ జగన్-షర్మిల విషయంలో అయ్యే పనేనా అంటే ఏ మాత్రం ఇసుమంత కూడా కనిపించట్లేదు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఎంతో కొంత సోదరి కూడా కారణమన్నది జగన్ భావన్. అందుకే చెల్లిపై పీకల్లోతు కోపం పెరుగుతోందే తప్ప తగ్గిందేమీ లేదు. దీనికి తోడు అధికారంలో లేకున్నా అన్ననే ప్రశ్నిస్తూ వస్తుండటం.. మీడియా ముందుకు వచ్చినప్పుడు వారసత్వం, వారసుడు.. అసలు జగన్ ఆఫ్ట్రాల్ అన్నట్లుగా సెటైర్లు, డైలాగ్స్ పేల్చుతూనే ఉన్నారు.*అటు.. ఇటు.. ఎటో..???వాస్తవానికి వైఎస్ జగన్‌కు ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఆయనపై మెడ చుట్టూ ఉన్న అక్రమాస్తుల కేసులు, దీనికి తోడు త్వరలో కూటమి సర్కార్ పెట్టబోయే కేసులు ఎప్పుడైనా బిగుసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడపడానికి ఒక్కరంటే ఒక్కరు లేరు. అందుకే.. ఇండియా కూటమిలో చేరితే సపోర్టు దొరుకుతుందన్నది వైసీపీ భావన అని టాక్. అయినా కేంద్రంలోని మోదీని ఎదురించి ఇలా చేయడం అంటే పెద్ద సాహసమే. బహుశా న.మో గురించి జగన్‌కు తెలిసినంత ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి. పోనీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవుతుందా అంటే అబ్బే ఇప్పటికీ ఎప్పటికీ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. అయినా జగన్‌ను అంత తక్కువ అంచనా వేయడానికి లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో.. ఎవరికి బద్ధ శత్రువులు అవుతారన్నది ఎవరికీ అర్థం కాదు.. ఊహించలేం కూడా…*సయోధ్య కుదిర్చేదెవరు..?ఒకవేళ జగన్ ఇటు ఇండియా కూటమిలోకి వస్తే.. నిమిషాల్లోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేసి బయటికి వెళ్లాలన్నది షర్మిల ఆలోచనట. అలా కాకుండా కూటమి కట్టినా.. కట్టకపోయినా షర్మిల ఏం కావాలో ఇచ్చేసి వైసీపీలో ఏదో ఒక కీలక పదవి ఇచ్చేసి.. నంబర్-02ను చేయాలన్నది పార్టీలో వస్తున్న డిమాండ్ అట. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా కొన్ని రోజులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తన అత్యంత సన్నిహితులతో జగన్ చర్చలు జరుపుతున్నారట. అందుకే అస్తమానూ యలహంక ప్యాలెస్‌కు ఆయన వెళ్తున్నారని టాక్. రెండే ఆప్షన్లు.. వైసీపీలోకి వచ్చి ముందుకెళ్లడమా.. లేదంటే ఇండియా కూటమిలో చేరినా సరే కలిసి ముందుకెళ్లి.. కష్టకాలంటే పార్టీని కాపాడటమా..? ఈ రెండింటిలో చాయిస్ మీదేననే షర్మిలతో డీకే చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అసలు షర్మిల మనసులో ఏముందో..? ఇదంతా నిజమా కాదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

👉ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం?..వైఎస్ విజయమ్మతో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి..హైదరాబాద్‌లో విజయమ్మ నివాసంలో భేటీ…విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న జేసీ…అరగంట పాటు కొనసాగిన సమావేశం.రాజకీయాలు లేవు.. మామూలుగానే కలిశారంటున్న జేసీ వర్గం.

👉కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ .

👉వారికిదే చివరి సెల్ఫీ..తెలుగుగంగ రిజర్వాయర్ లో పెనుప్రమాదం…ముగ్గురు యువకుల గల్లంతు..

గాలింపులో గజ ఈత బృందం..కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంలో ని తెలుగుగంగ ప్రాజెక్టు అంతర్భాగం సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్ద విహారయాత్ర విషాద యాత్రగా మారింది. సంతోషంతో గంతులు వేసే ముగ్గురు కుర్రోళ్లు ఆ రిజర్వాయర్ లో గల్లంతయ్యారు.ప్రొద్దుటూరు కు చెందిన ఈ ముగ్గురు యువకుల కోసం గల్లంతు గాలింపు కొనసాగుతోంది, ప్రొద్దుటూరు పవర్ హౌస్ రోడ్డుకు చెందిన ఎస్.కె ముధాపీర్ (22), మౌలానా ఆజాద్ వీధికి చెందిన పఠాన్ రహ్మతుల్లా (23), సుందరాచార్ల వీధికి చెందిన వేంపల్లె షాహిద్ (23) గల్లంతు కాగా,మూడు కుటుంబాలను ఈ ఘటన కుదిపేసింది.ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ముగ్గురు యువకులు మధ్యాహ్నం ఈత కోసం వెళ్లినట్లు సమాచారం. వీరు రాత్రి ఇంటికి చేరలేదు, ఇతర స్నేహితుల నుంచి తల్లితండ్రులు ఆరా తీశారు. ఈ సమాచారంతో చల్లబసాయపల్లె సమీపంలో ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం మైన సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్దకు చేరుకుని, దువ్వూరు పోలీసులను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. సోమవారం ఉదయం చల్లబసాయపల్లె రిజర్వాయర్ వద్దకు వెళ్లిన పోలీసులు.. రిజర్వాయర్ గట్టున సెల్ ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు నీళ్ళలో గల్లంతు అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈత బృందాలను నీటిలో దింపి గాలింపు చేపట్టారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ వద్దకు యువకుల స్నేహితులు, బంధువులు చేరుకున్నారు. నదిలో దిగేముందు చివరి సారిగా సెల్ఫీ తీసుకున్న యువకుల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

👉 జాతీయ ఆహార భద్రతపై పార్లమెంటుతో ప్రశ్నించిన.

.మాగుంట..దేశంలో

జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద ప్రజా పంపిణీ పధకం క్రింద 2011 పాత జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వలన గుర్తింపబడిన లభిదారులు పధకంలో తగ్గడం మరియు క్రొత్త జనాభా లెక్కల అందుబాటుకు ముందే తరుగుదల నివారణ చర్యలు మరియు ఆహార భద్రతకు ప్రభుత్వ చర్యల గురించి ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి  ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరి ప్రజాపంపిణీ శాఖ సహాయక మంత్రి,  నిముబెన్ జయంతి భాయ్ బంభానియ  సమాదానమిస్తూ ..దేశంలోని 75 శాతం వరకు గ్రామీణ జనాభాకు మరియు 50 శాతం వరకు పట్టణ జనాభాకు అధిక సబ్సిడీపై ఆహారధాన్యాల సరఫరాను జాతీయ ఆహార భద్రతా చట్టం (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఆక్ట్) ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొత్తం జనాభాలో 2/3 మందికి కలుగజేస్తున్నదని, అనగా 2011 జనాభా లెక్కల ప్రకారం 81.35 కోట్ల మంది లబ్దిదారులు వున్నారని, అందులో 80.54 మందిని మాత్రమే రాష్ట్రాలు గుర్తించాయని, ఇంకా 0.81 కోట్ల మందిని గుర్తించేదానికి ఈ పధకం క్రింద వీలున్నదని తెలిపారు. ఈ పధకం క్రిందకు అర్హతగల లబ్దిదారులను నిర్ణయించిన పరిమితికి లోబడి ఎప్పటికప్పుడు గుర్తించేదానికి రాష్ట్రాలకు సలహాలు ఇవ్వబడ్డాయని తెలిపారు మరియు లబ్దిదారులు గుర్తింపుపై ఏదేని పునః పరిశీలన చేయడమనేది తదుపరి జనాభా లెక్కల ప్రకటనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.  కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలు ఆహార భద్రతకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ అన్న యోజన పధకం ప్రారంభించబడి ఆహార ధాన్యాలు అందజేసిందని మరియు దీనికి అదనంగా ఒక్కో వ్యక్తికి నెలకు 5 కేజీలు ఆహార ధాన్యాలు ప్రజా పంపిణీ పధకం క్రింద గుర్తింపబడిన లభిదారులకు సంవత్సరానికి రెండు లక్షల కోట్ల వ్యయంతో ఉచితంగా కేంద్రం అందజేయుచున్నదని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.

👉పాఠశాలల్లో ఘనంగా సామాజిక భాగస్వామ్య దినోత్సవం..శిక్షా సప్తాహ్

కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక పార్కు వీధి మరియు నెహ్రూ నగర్ లోని పాఠశాలల్లో శుభతిథి సామాజిక భాగస్వామ్య దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పార్క్ వీధి పాఠశాలలో ఏర్పాటు చేసిన గాన కచేరీలో న్యూ లైట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ డిజేబుల్డ్ సంస్థకు చెందిన కృష్ణవేణి,నాగరాజు పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేసేశాయి. దాత మరియు ప్రధానోపాధ్యాయుడు రసూల్ బేగ్, ఆయన మనుమరాలు జన్మదినం సందర్భంగా భోజన ఏర్పాట్లు చేయగా, ఎన్ ఎన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు గోపిశెట్టి.శ్రీనివాసులు స్వీట్లు పంపిణీ చేశారు.ఇతర ఉపాద్యాయులు ఫ్రూట్స్,బట్టర్ మిల్క్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారిణి కె.శర్వాణి హాజరై కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం దివ్యాంగ గాయకుడు నాగరాజు, కృష్ణవేణిలను శాలువాతో సన్మానించి నగదు బహుమతిని అందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రసూల్ బేగ్ ,వి.బాల లింగయ్య, సిఆర్పీ.మురళీమోహన్,ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్ని.పద్మావతి, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

👉 నర్సరీలను తనిఖీ చేసిన ఉద్యాన శాఖ అధికారి శ్వేత..  కంభం మండలం కందులాపురం గ్రామంలోని ఉద్యాన నర్సరీలను ఉద్యాన శాఖ అధికారి డి. శ్వేత సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీల నుండి నాణ్యత కలిగిన మొక్కలను రైతులకు సరఫరా చేయటం చీడలు ,తెగులు లేని నాణ్యత కలిగిన ఆరోగ్యకరమైన మొక్కలను ఉత్పత్తి చేయుట నర్సరీ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని కోకో పిట్ ట్రైలు నింపే ముందు ఒక కిలో వేప పిండి మరియు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి 300 కిలోల కోకోపీట్ లో కలుపుకోవాలి. ట్రేలు భూమిని తాకకుండా ఉండటం కోసం ముందుగా బెడ్లపై ఒక ప్లాస్టిక్ ఒక షీట్ ని పరిచి దానిపైన ట్రేలను అమర్చాలని నర్సరీ యజమానులకు తెలిపారు. నారు ఎదుగుదలను బట్టి 5-7 రోజుల వ్యవధిలో 13.0.45 లేదా 19.19.19 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని నర్సరీ యజమానులకు తెలియజేశారు.అవసరాన్ని బట్టి 3 గ్రాములు సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 1లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. కోకో పిట్ లో తేమను ఉంచాలి కానీ ,నిరంతరం నీరు ఉంచరాదనీ, నారు ను పొలంలో నాటే వారం ముందు నుంచి క్రమేపి నీటి తడవడం తగ్గించడం ద్వారా మొక్కలను దృడపరుచుకోవచ్చని నర్సరీ యజమానులకు తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీలకు నోటీసులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉద్యాన విస్తరణ అధికారి వై సి హెచ్ శేషగిరి,మరియు నర్సరీ యజమానులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం