👉 పోస్టర్ పట్టుకున్న రాహుల్.. తలపట్టుకున్న నిర్మలమ్మ! రాహుల్ గాంధీ..వీడియో వైరల్… తాజాగా లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు!
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుల్ దూకుడుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మొద్దబ్బాయిగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. పార్లమెంట్ లో అధికారపక్షాన్ని అల్లల్లాడిస్తున్నారనే స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాహుల్ గాంధీ మండిపడ్డారు…. గతకొంతకాలంగా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్న రాహుల్ గాంధీ.. తాజాగా లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు! ఇందులో భాగంగా… కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకొవడానికే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ఈ బడ్జెట్ ను “కుర్చీ బచావో” బడ్జెట్ గా అభివర్ణించారు.ఇదే సమయంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నుంచి ఈ బడ్జెట్ ను కాపీ చేశారని ఆరోపించారు. ఏఏ (అంబానీ – అదానీ)కి మాత్రమే ప్రయోజనం కలిగించేలా, సామాన్య భారతీయులకు ఉపశమనం దక్కకుండా.. దళిత, ఆదివాసీ, ఓబీసీల ప్రస్థావనే లేకుండా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు.ఇదే క్రమంలో… బడ్జెట్ ప్రవేశపెట్టే మందు నిర్మాలా సీతారామన్ “హల్వా” వేడుకలో పాల్గొన్నారంటూ ఓ ఫోటోను సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు రాహుల్. అయితే… సభలో పోస్టర్స్ ప్రదర్శించడానికి అనుమతి లేదంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ చేస్తున్న కామెంట్స్ కి నిర్మలా సీతారామన్ తలపట్టుకుని బాదుకుంటున్నట్లు కనిపించారు! దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
👉మీ శరీరంలో అణువణువు పిరికితనమే… అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్..!!!…షర్మిలను విమర్శిస్తూ వైసీపీ ట్వీట్..
ఘాటైన విమర్శలతో రిప్లయ్ ఇచ్చిన షర్మిల..అందుకే మిమ్మల్ని అద్దంలో చూసుకోమని చెప్పింది అంటూ వ్యాఖ్యలు..జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు అని పునరుద్ఘాటన మీకు మీడియా పాయింటే ఎక్కువ అంటూ వ్యంగ్యం..జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని తాను చెబితే… అది చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు మీకు అనిపిస్తోందా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి… అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే… మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది… అద్దంలో ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనిపిస్తున్నట్టుంది అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.”సోషల్ మీడియాలో నన్ను అవమానించేంత ద్వేషం మీకుంది… అలాంటి ద్వేషం మాకు లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీనా, లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అని చెప్పాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయాలని అన్నాం…వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ వర్గాలను హెచ్చరించింది నేనే. మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఇవాళ వైఎస్సార్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు.వైసీపీలో వైఎస్సార్ ను,విజయమ్మను అవమానించిన వారే పెద్దవాళ్లుగా చెలామణీ అవుతున్నారు కదా. YSRCP లో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు… ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే.వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేతకాదులే… మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమసంబంధం పెట్టుకున్నారు.వైఎస్సార్ ను వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు… మీ అహంకారమే మీ పతనానికి కారణం” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు..’చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతిక్షణం ఆలోచించేవారికి తేడా ఉంటుంది షర్మిల గారూ’ అంటూ వైసీపీ చేసిన ట్వీట్ కు షర్మిల పైవిధంగా స్పందించారు.
👉ఇప్పటికైనా సిద్ధమా???.. విశాఖ కంటైనర్ షిప్ కేసు పై బొత్స సంచలన వ్యాఖ్యలు🚢 ..
విశాఖ సీపోర్టులో 25 వేల కిలోల డ్రగ్‌ను కంటైనర్ షిప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కంటైనర్ షిప్‌ను వైసీపీ నేతకు సంబంధించిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసు ఏమైందని తాజాగా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిందని తమపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆ ఘటనపై కూటమి సర్కార్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖలోని దస్పల్లా భూములపైనా విచారణ చేపట్టాలన్నారు.బ్రెజిల్ నుంచి విశాఖ డ్రగ్స్ తెప్పించిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బీజేపీ ఎమ్మెల్యే పురంధేశ్వరి బంధువులదేనని చెప్పారు. డ్రగ్ కంటైనర్‌పై ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులో ఎవరున్నా వదిలిపెట్టకూడదని, తాము సైతం విచారణకు సిద్ధంగా ఉన్నామని బొత్స పేర్కొన్నారు.
👉అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు.. తెలంగాణ..
ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ – పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ బిల్లును సభ ముందుంచారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు…
*హైదరాబాద్: రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు 7 లక్షల మంది రైతులకు రూ.6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపు.. రెండో విడుతలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం చేతుల మీదుగా 17 మంది రైతులకు చెక్కులను అందజేత…
👉మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రో రైళ్లు ఉదయం 5.30 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉదయం 5.30 గంటలకే రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. దీంతో ప్రతిరోజూ అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు…
👉ఘరానా మోసం…..!!! *సిద్దాపూర్ లో ‘ బ్లిస్ ‘ మాయాజాలం…! *వీకెండ్ హోమ్స్ పేరుతో విల్లాల దందా* కంజర్వేషన్ జోన్ లో అక్రమ కట్టడాలు* ఒక్కో విల్లా కోటిన్నర పైనే అమ్మకాలు*
* సీఎల్ యు సర్టిఫికెట్ లేకుండానే విల్లాల నిర్మాణం*
*50 ఎకరాలకు పైగా అక్రమ వ్యాపారం* చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం*
👉షాద్ నగర్: ఆ గ్రామంలో అసలేం జరుగుతోంది…కలర్ ఫుల్ బ్రోచర్ల తో కలరింగ్ ఇస్తూ… ఇంటర్నెట్ వెబ్ సైటుల్లో మార్కెటింగ్ చేసుకుంటూ ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమంగా విల్లాల నిర్మాణం చేపట్టి యదేచ్చగా ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఘరానా మోసగాళ్ల కథా కమామీషు ఇది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కంజర్వేషన్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ‘బ్లిస్’ సంస్థ పేరుతో ప్రజలను నమ్మించి సొమ్ముచేసుకుంటున్న దందాపై క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం….
రంగారెడ్ది జిల్లా కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో ‘ బ్లిస్ ‘ వీకెండ్ హోమ్స్ పేరుతో ఘరానా మోసం జరుగుతుంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థానిక అధికారులతో కుమ్మక్కై అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సిద్దాపుర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 155,156,157 వగైరాలతో సుమారు 50 ఎకరాలకు పైగా ‘ బ్లిస్ ‘ సంస్థ భూమిని కొనుగోలు చేసింది. ఇక ఆయా భూములలో 13 గుంటల నుండి 20 గుంటల స్థలాల్లో విల్లాల నిర్మాణం చేపట్టి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఒక్కో విల్లా ధర కోటిన్నర పైగానే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. *ఇదేమి చోద్యం…*. హెచ్ ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కంజర్వేషన్ జోన్ లో ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు, అమ్మకాలు చేయరాదు. ఈ జోన్ లో ఎలాంటి కట్టడాలు చేయాలన్నా చెంజ్ లాండ్ యూజ్ (సీ ఎల్ యు) కింద అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే అమాయక ప్రజలను మొసం చేసి వారి నుండి కోట్ల రూపాయలను దండుకుని బ్లీస్ మాటున సొమ్ముచేసుకుంటున్నారు. 👉వారికీ రైతుబంధు….!
*బ్లీస్ వీకెండ్ హోమ్స్ మార్కెటింగ్ మాయాజాలం లో ఇరుక్కుపోయి విల్లాల కోసం డబ్బులను చెల్లించిన వారికీ ఆ సంస్థ 13 గుంటల నుండి 20 గుంటల వరకు వ్యవసాయపొలాలను రిజిష్టర్ చేస్తుంది. ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములుగా నమోదు కావడంతో ఆయా భూములకు రైతు బంధు, రైతు భరోసా కూడా పథకాలు వర్తిస్తున్నాయి.ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ దందా వెనకాల అధికారుల, రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి ?.. ఇంత బహిరంగంగా ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నా ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదనే సంచలన విషయాలు క్రైమ్ మిర్రర్ దిన పత్రిక మరిన్ని కథనాలతో మీ ముందుకు..
👉 కారులో శృంగారం చేస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు..ఉత్తరప్రదేశ్ – కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు.. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు…