👉వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోడూరు మండలంలో వద్దిపర్రు వరద ముంపు గ్రామంలో మంత్రి రామానాయుడు పర్యటించారు. నక్కల మురుగు డ్రైన్ పొంగి గ్రామాన్ని వరద నీరుతో ముంచెత్తడంతో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించడంతో పాటు, బాధిత కుటుంబాలను పరామర్శించి, కష్టాలను తెలుసుకుంటూ ప్రభుత్వ సాయంగా 25 కేజీలు బియ్యం, నిత్యవసర సరుకులు, కాయగూరలు, అర్హులైన వారికి రూ.3 వేల నగదు అందచేశారు.
👉ఒలింపిక్స్: భారత హాకీ జట్టుకు మరో విజయం పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు మరో విజయం సాధించింది. ఐర్లాండ్తో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచులో 2-0 తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్హీత్ సింగ్ ఈ మ్యాచులోనూ సత్తా చాటి రెండు గోల్స్ సాధించారు. దీంతో తర్వాతి రౌండు వెళ్లేందుకు అవకాశాలు మరింత మెరుగయ్యాయి. భారత్ తన తర్వాతి మ్యాచును ఆగస్టు 1న బెల్జియంతో ఆడనుంది.
👉 ప్రజా ప్రభుత్వంలో ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదు.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామంటూ ప్రజా దర్బార్ ద్వారా భరోసా ఇస్తున్నారు.మంత్రి నారా లోకేష్ .👉 కష్టాలు చెప్పుకునేందుకు నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివస్తున్న ప్రజలు. బాధితుల కన్నీళ్లు తుడుస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్
👉ఆగస్టు2న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..అమరావతీ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూ అక్రమాల పై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
👉రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా?: షర్మిల..nప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీకాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘కూటమి సర్కారు ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా? రాష్ట్రంలోఆరోగ్యశ్రీ లేనట్లేనా? పెండింగ్ బిల్లులపై ఎందుకునిర్లక్ష్యం?’ అని Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ..రూ.1,600 కోట్ల బకాయిలు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్, స్పీకర్‌కు నోటీసులు..ఏపీ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది. ఇక తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్..స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయాలని కానీ అలా జరగలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు.
👉వీడిన కిడ్నాప్ మిస్టరీ..రైస్ మిల్లర్ కు విముక్తి ..24 గంటల్లోనే కథ సుఖాంతం… పోలీసుల అదుపులో కిడ్నాపర్ ..మరో ఇద్దరు పరారీ …కర్నూలు జిల్లా, గూడూరుకు చెందిన రైస్ మిల్లర్ వెంకటేశ్వరులు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే గూడూరుకు చెందిన వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి తన రైస్ మిల్లు వద్ద ఉండగా ముగ్గురు వ్యక్తులు సుమో వాహనంలో వచ్చి అతని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ. 3 కోట్లు ఇవ్వాలని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. 24 గంటల లోపే కిడ్నాపర్లను గుర్తించారు. కిడ్నాప్ చెర నుంచి వెంకటేశ్వర్లును విడిపించారు. పోలీసుల సమాచారం మేరకు కిడ్నాపర్లు గూడూరు మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన కొండయ్య ,కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గొల్ల వీరేష్, కర్నూలు చెందిన మున్నా భాష గా గుర్తించారు. అంతేకాదు కిడ్నాపర్లలో ఒకరిని పొన్నకల్ కొండయ్య ను పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
👉అంబేద్కర్ కోనసీమ జిల్లా…*నన్ను రక్షించండి అని ఓ మహిళ అర్చకురాలు ఆవేదన..సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాకు మీరే దిక్కు లేకుంటే మరణమే శరణ్యం… అంటున్న బ్రాహ్మణ మహిళ…*గతం లో కన్న కూతురిపై అగత్యానికి పాల్పడ్డ వ్యక్తులు ఇంటి పైకి వచ్చి ఫోక్సో కేసు ను కొట్టేయాలంటూ ఇంటిపై దాడికి దిగుతున్న దుండగులు*పోలీసులు, అధికారులు కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..కొత్తపేట మండలం మందపల్లి గ్రామం బ్రాహ్మణ మహిళ ఆవేదన..ఒంటరి మహిళ గా ఉండతంతో స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తన ఆవేదన..ఒంటరి మహిళ లను టార్గెట్ చేస్తూ వారికి ఉన్న ఆస్తుపాస్తులపై కన్నేస్తున్న స్థానిక నాయకులు.. ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న ఆ మహిళను చిత్ర హింసలకు గురి చేస్తున్న స్థానిక నాయకులు..గత కొన్నాళ్ల క్రిందట చిన్న అమ్మాయిపై అగత్యానికి పాల్పడిన నాయకులు మరల కుటుంబాన్ని హింసిస్తున్నారు..నాకు నా కుటుంబానికి ఆ నాయకులు నుండి ప్రాణహాని ఉన్నది.. నాకు నేనుగా చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు…నన్ను నా కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు..
👉విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసులులలో 17 మందిని నిందితులను అరెస్ట్ చేశాం..విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు..ఈ 17 మంది నిందితులు నేరచరిత్ర కలిగిన వ్యక్తులే..నిందితుల వద్ద నుండి 46 కేజీల గంజాయి స్వాధీనం..వీరిని రిమాండ్ కి పంపుతాం..రాష్ట్రాన్ని మరక ద్రవ్య రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం ..గంజాయి నీ అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ..గతంలో పలు అక్రమ మారకద్రవ్యాల కేసులలో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం..గంజాయి కి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి … అక్రమంగా గంజాయిని కనుగోలు చేసి పలు ప్రాంతాలలో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారు.విజయవాడ నగర పరిధిలో గత ఐదేళ్లలో గంజాయి పై 719 కేసులు రిజిస్టర్ అయ్యాయి.సీలేరు నుండి ఎక్కువగా ఈ గంజాయి తీసుకుని వస్తున్నారు.గంజాయి విక్రయం లో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాం అన్నారు.
👉 సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన **తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు ఉన్నారు.వీరిమధ్య ఏడాదినుంచి ఆస్తితగాదాలున్నాయి. అయితే నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు.*చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పై మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై ముసుగు కప్పి.. ఏపీలోని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో మృతదే హాన్ని పడేసేందుకు బైక్ పై తీసుకెళ్లారు. బైక్ పై మధ్యలో ముసుగు కప్పి మృత దేహాన్ని తీసుకెళ్లడంతో.. అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారు.దీంతో భయపడ్డ వారు శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు.
👉డాక్టర్ రంగారావును పరామర్శించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కర్నూలు : గిద్దలూరు ఒంగోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు పట్టణంలోని మెడికవర్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ ,కంభం సబ్ డివిజన్ డాక్టర్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. బివి రంగారావును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితో పాటు గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, చేరెడ్డి జయరామిరెడ్డి, పాముల విజయ భాస్కరరావు, పిడతల రమేష్ రెడ్డి, మహానంది యాదవ్, మండ్ల శేఖర్, దేశబోయిన వెంకట రాజు,కంభం సాయి డెంటల్ క్లినిక్ డాక్టర్.ఏరువ.శ్రీనివాసులు , తదితరులు పరామర్శించారు..
👉దళారి వ్యవస్థ లేకుండా చేయడమే ఉత్పత్తిదారుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం..ప్రకాశం జిల్లా ఏపీ ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ పివి రమణ, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్..ప్రకాశం జిల్లా ఏపీ
ఏపీ ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ పివి రమణ, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్ మంగళవారం అర్ధవీడు మండలం నాగులవరంలోని కలెక్షన్ సెంటర్ మరియు అర్ధవీడు గ్రామంలో ఉన్న ప్యాక్ హౌస్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతు ఉత్పత్తిదారుల సంఘం లోని రైతులతో మాట్లాడుతూ దళారి వ్యవస్థ లేకుండా చేయడమే ఈ ఉత్పత్తిదారుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. బత్తాయి రైతులతో మాట్లాడారు బత్తాయిలు చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం, బోడో పేస్ట్ ,వాడకం పచ్చిరొట్ట పైర్లు ,వేయడం మట్టి పరీక్ష విధానం వంటి విషయాల గురించి ఆయన రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి డి. శ్వేత, మండల ఉద్యాన విస్తరణ అధికారి వై చిన్న శేషగిరి మరియు గ్రామ ఉద్యాన సహాయకులు మహేష్ ,మౌనిక మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.