👉 ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు.సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తోపాటు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు.రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. శాఖ పనితీరు, పథకాల అమలుపై చర్చించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా దళిళ వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.
👉టాలీవుడ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి..గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ ప్రతిపాదన..నంది అవార్డులను గద్దర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయం..స్పందించని తెలుగు చిత్ర పరిశ్రమ..సినీ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం-రేవంత్..రేవంత్ ప్రతిపాదనపై స్పందించిన చిరంజీవి..సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని..ఫిలించాంబర్, నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి..
👉 సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారుగానీ… ముందుకు తీసుకువెళ్లలేదు..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి ..తన కూతురు సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందించారు.మంగళవారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో కలసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని కోరారు.సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారనీ, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
👉 బాపట్లకు చెందిన సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదానికి గురి కావటం, తీవ్ర గాయాలపాలు అవ్వటంతో, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి, సీఎం ని కలిసి సహాయం కోరగా..వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు, రూ.10 లక్షలు మంజూరు చేశారు.
👉వైకాపా వైఫల్యాలపై తెదేపా ఘాటు వ్యాఖ్యలు.. 😱👉 గత జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.👉గత జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ. 1200 కోట్లు బకాయి పెట్టింది.👉కుప్పంలో వైసీపీ ఖేల్ ఖతం. టీడీపీలో చేరేందుకు సిద్దమైన వైసీపీ కౌన్సిలర్లు.👉ఒక హిట్లర్, ఒక ముస్సోలిని,ఈడీ అమీన్, కిమ్ ఆలోచనల ప్రతిరూపమే ఈ జగన్ రెడ్డి.👉 జగన్ బొమ్మలు,రంగులు పిచ్చోడు.వైసీపీ పబ్లిసిటీ కోసం రూ. 700 కోట్లు ప్రజాధనం వృధా చేశాడు.👉 జగన్ ఫోటోల పిచ్చి ఖరీదు అక్షరాల రూ 700 కోట్లు. దాన్ని తుడిపేయాలంటే మరో రూ15 కోట్ల ఖర్చు…….👉 అసెంబ్లీలో చర్చిస్తున్న శ్వేతపత్రాలపై మీకు అనుమానం ఉంటే.. ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి జగన్.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ముఖ్యమంత్రి సవాల్ చేస్తే.. రాలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు జగన్….👉 రోత పత్రిక సాక్షి ఉందని గోబెల్స్ ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం మాని, అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి..జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనైతికం, చట్టవిరుద్ధం. 👉 గత జగన్ పాలనలో ఎన్నోసార్లు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించలేమని ఆసుపత్రులు చెప్పాయి.రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
👉 మంటగలుస్తున్న మానవత్వం.. కళ్ళు చెమర్చే ఘటన..ఆసుపత్రికి తీసుకు వెళ్తానని చెప్పి తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. అనాథలా ఆకలితో చనిపోయిన తల్లి..హైదరాబాద్ – మేడ్చల్‌కి చెందిన అరవింద్ అనే వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లి బోయిన్‌పల్లిలో ఫుట్‌పాత్‌పై వదిలేశాడు.ఆకలితో అలమటించిన తల్లి స్పృహ తప్పి పడిపోగా పోలీసులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.. ఆ తల్లి ప్రాణాలు విడిచే ముందు కూడా నా కొడుకుని ఒక్కసారి చూడాలని ఉందని, ఒకసారి మాట్లాడాలని ఉందని కోరి చనిపోయింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కోసం గాలిస్తు, దర్యాప్తు చేస్తున్నారు.
👉బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష..*విశాఖపట్నం: ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి ఉప్పాడ గౌరీ శంకరీకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది..ప్రభుత్వం బాధితురాలికి రూ. 4 లక్షలు పరిహారం చెల్లించాలని పేర్కొంది..నిందితునికి శిక్ష ఏడే విధంగా కృషి చేసిన అధికారులను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్నీ అభినందించారు.
👉 అత్యవసర విమాన లాండింగ్ సౌకర్యాల ఏర్పాటుపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న.. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాలు మరియు కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులు సంభవించినపుడు హైవేలపై విమానాలు అత్యవసరంగా దిగుటకు గత 5 సంవత్సరాలలో చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్య, ప్రస్తుత స్థితి మరియు పెంపుదల `గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణ మరియు హైవేస్ శాఖ మంత్రి, నితిన్ జైరాం గడ్కరి సమాదానమిస్తూ…గత 5 సంవత్సరాలలో దేశంలో అత్యవసరంగా హైవేలపై విమానాలు దిగుటకు మొత్తం 11 ప్రాజెక్టులు చేపట్టబడ్డాయని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో శింగరాయకొండ దగ్గర ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన సివిల్ పనులన్నీ పూర్తి కాగా, బాపట్ల జిల్లాలో రేణింగవరం దగ్గర ప్రాజెక్టు పనులు మొత్తం 2021 నవంబర్ నెలలో పూర్తయినాయని తెలిపారు. అస్సాం రాష్ట్రంలో దిబ్రూఘర్ జిల్లాలోని ప్రాజెక్టు, గుజరాత్ రాష్ట్రంలో దేవ్ భూమి ద్వారక జిల్లాలోని ప్రాజెక్టు మరియు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లాలోని ప్రాజెక్టు పనులు జరుగుచుండగా, రాజస్థాన్ రాష్ట్రంలో సంచోరే జిల్లాలోని ప్రాజెక్టు మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మెడినీపూర్ జిల్లాలోని ప్రాజెక్టు పనులు పూర్తికాబడ్డాయని తెలిపారు.అస్సాం రాష్ట్రంలో నాగాన్ మరియు బక్షా జిల్లాలలో మరియు రాజస్థాన్ రాష్ట్రంలో ఫలోడి మరియు బార్మేర్ జిల్లాలలో ప్రతిపాదించిన మొత్తం 4 ప్రాజెక్టుల రిపోర్టులు తయారుచేయబడుచున్నవని, సాధ్యత రిపోర్టులు వచ్చిన వెంటనే పనులు చేపట్టబడునని కేంద్ర మంత్రి తెలియజేశారు.
👉 కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం కె. అగ్రహారం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి ఏర్పాటు చేసిన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యం లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలలకు కుట్టు మెషిన్ పంపిణి కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో అగ్రహారం సర్పంచ్ షేక్ చిన్న మస్తాన్ , ఎంపీటీసీ వంగపాటి రామాంజినేయులు, వైస్ సర్పంచ్ భాగ్యలక్ష్మి , డీలర్ రమణయ్య , మాజీ కోఆప్షన్ మెంబెర్ , ఖాదర్ బాషా ,ట్రైనర్ షేక్ దవల, టీడీపీ లీడర్ బాలకృష్ణ రెడ్డి,అన్నెం లక్ష్మి రెడ్డి, పల్లపోతు రమేష్, కిషోర్ మోటుపల్లి పలువురు నాయకులు మహిళలు పాల్గొన్నారు.
👉పగటిపూట గస్తీ కాస్తున్న పోలీసులు….జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ..పొదిలి పట్టణంలో ఈవ్ టీజింగ్ గంజాయి, పేకాట వంటి వాటిపై ప్రత్యేక ద్రుష్టి సారించిన పోలీసులు.సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, ఎస్సై కోటయ్య పర్యవేక్షణలో గస్తీ కాస్తున్న పోలీస్ యంత్రాంగం……హెడ్ కానిస్టేబుల్ షాకీర్ మరియు కానిస్టేబుల్ నాయక్ లు బైక్ పై తిరుగుతూ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహిస్తున్న ఇరువురు
👉రిలయన్స్ మార్ట్ ను ప్రారంభించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భూపాల్ రెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన రిలయన్స్ మార్ట్ ను పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన మాతృమూర్తి భాగ్య లక్ష్మమ్మ బుధవారం ప్రారంభించారు. రిలయన్స్ మార్ట్ ను ప్రారంభించేందుకు వచ్చిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డికి భాగ్యలక్ష్మమ్మకు రిలయన్స్ మార్ట్ నిర్వహకులు ఘన స్వాగతం పలుకుతూ ఆయనను సన్మానించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి రిలయన్స్ మార్ట్ ను ప్రవీణ్ కుమార్ రెడ్డి,భాగ్యలక్ష్మమ్మ ప్రారంభించారు.