👉డబుల్ ఇంజన్ సర్కారులో బీజేపీ సాయమెంత ? జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా.. ఇదే ప్రచారాన్ని ఊదర కొట్టారు. ఎన్నికలకు ముందు.. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన గుర్తుందా? “కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం వస్తే.. అభివృద్ధి పరుగులు పెడుతుంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. ఇక తిరుగు ఉండదు“ అని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఊరూ వాడా కూడా.. కమల నాథులు ఇదే ప్రచారాన్ని తీసుకువెళ్లారు.జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా.. ఇదే ప్రచారాన్ని ఊదర కొట్టారు. దీంతో ప్రజలు ఏమనుకున్నారో.. ఏమో,.. ఎన్డీయే కూటమికి ఇక్కడ అధికారం ఇచ్చారు. కేంద్రంలోనూ ఎన్డీయే కకూటమి వచ్చింది. మరి ఏపీకి ఒరిగిన సాయం ఎంత? అనేది ఇప్పుడు లెక్కలు తీస్తే.. కనీసం ఏపీని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక, చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు.. కేంద్రం సాయంతో సూపర్ సిక్స్‌ను అమలు చేస్తాం`
అని చెప్పారు.మరి సూపర్ సిక్స్‌కు కేంద్రం ఇచ్చిన సాయం ఎంత? అని చూస్తే.. అది కూడా కనిపించడం లేదు. గతం గుర్తుచేస్తున్న నెటిజన్లు! కేవలం అమరావతికి రూ.15 వేల కోట్ల రూపాయలు అప్పులుగా ఇప్పిస్తామన్నారు. ఇది ఎవరు కట్టాలో అర్థం కాలేదు. వడ్డీ ఎవరు భరించాలో కూడా చెప్పలేదు. ఇక, పోలవరం విషయాన్ని తీసుకుంటే.. అసలు ఎంతిస్తారో కూడా చెప్పలేదు. కనీసం.. నగదు రూపంలో ఎంత సాయం చేస్తారో ప్రకటించలేదు. వెనుక బడిన జిల్లాల విషయాన్ని తీసుకుంటే.. వాటికి గతంలోనే నిధులు ఇచ్చాం.. ముందు వాటికి లెక్కలు చెప్పాలని.. తర్వాత.. ఇస్తామని ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చినా.. ఏపీకి ఒరిగింది ఏమీ లేదనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. మరి బీజేపీని గెలిపించిన ప్రజలకు ఇదేనా సాయం చేసేది? అనే ప్రశ్నలకు కమల నాథులు మాట్లాడడం లేదు. పైగా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తామన్న మాటను కూడా వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో(యథాతథ స్థితి)ని విధించబట్టి సరిపోయింది. లేకపోతే.. ఏం టి పరిస్థితి? ఎలా చూసుకున్నా.. డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడింది.. కానీ, కేంద్రం మాత్రం పాత విధానంలోనే ముందుకు సాగుతోంది.
👉ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం*..
సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటాం.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది-సీఎం రేవంత్‌రెడ్డి
👉ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని కలిసి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి, భద్రాచలం కరకట్ట నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయవలసిందిగా కోరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం. వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ .
👉ప్రతి సంవత్సరం గోదావరి వరదల కారణంగా భద్రాచలం పట్టణం మరియు చుట్టు పక్కల గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయని,ఈ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.👉సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వద్ద గోదావరి నదికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం కోసం 4000 కోట్ల రూపాయలు త్వరలోనే మంజూరు చేస్తాం అన్నారు.కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ :బీబీపేట్ మండలనికి చేందిన వి. ఆంజనేయులు భార్య మౌనిక అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి మౌనికకి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2,00,000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి మౌనిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
👉ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వైస్ ఎంపీపీ కొలన్ కృష్ణ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ,NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 18 వార్డ్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, శామీర్ పెట్ ప్రకాష్ రావు, కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ మల్లికార్జున్ రెడ్డి, కాసాని సుధాకర్ ముదిరాజ్, వీరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
👉కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు ఎల్లం దేవదాసు నూతనంగా ఆరంజ్ ఫోటో స్టూడియో ఏర్పాటు చేసుకున్న సందర్బంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పద్మ రావు, కొలన్ మల్లికార్జున్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు…..👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే డా తెల్లం. వెంకట్రావ్, పినపాక ఎమ్మెల్యే పాయం. వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ .
👉నెల్లూరు జిల్లా …బుచ్చిరెడ్డి పాలెం లో దుశ్యాసనపర్వం.. అత్యాచారం నుండి తప్పించుకునే క్రమం లో వంటి మీద నూలు పోగు లేకుండా ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని రోడ్డు మీదకు పరుగులు తీసిన మహిళ…*మహిళ పై అత్యాచార యత్నం చేసి,చిత్ర హింసలకు గురి చేసిన కళ్యాణ్ అనే యువకుడు…*లొంగక పోవడం తో రెండు గంటల పాటు చిత్రహింసలు, మొహమంతా పిడిగుద్దులు, చెక్క తో కొట్టి వళ్ళంతా గాయాలు..నాలుగు రోజుల తర్వాత(31-7-2024) దిశ మహిళా సంఘాల చొరవతో నెల్లూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మహిళ* చెవి లో కర్ణ భేరి దెబ్బ తిన్నదని తేల్చిన వైద్యులు*ఘటన జరిగిన రోజే బుచ్చి పోలీసు స్టేషన్ లో పిర్యాదు ఇచ్చిన బాధిత మహిళ…తూతూ మంత్రంగా కేసు నమోదు, నిందితుడు దర్జాగా బయట తిరుగుతూ బెదిరింపులు…మహిళ గాయాలతో,అవమాన భారంతో న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వెళితే మొదట ఆసుపత్రికి పంపి చికిత్స అందేలా చేయాల్సిన పోలీసులు బాధ్యత మరిచిన వైనం.. ఒంటరి మహిళ వ్యక్తిగత విషయాలు ఎత్తి చూపుతో పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న బుచ్చి పోలీసులుకు*అంత పెద్ద నేరం చేసిన తర్వాత కూడా నిందితుడు స్వేచ్చ గా కాలర్ ఎగరేస్తూ బయట తిరుగుతుండడం తో పలు అనుమానాలకు,పుకార్లకు తావిస్తున్న బుచ్చి పోలీసులు…నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో శనివారం (27-7-2024)నాడు దారుణ ఘటన చోటుచేసుకుంది, బుచ్చిరెడ్డిపాలెం రాఘవరెడ్డి కాలనీలో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తుంది,ఈ ఒంటరి మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది,ఇదే క్రమంలో తన ఇంటి సమీపంలో నివసించే కళ్యాణ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతం లో ఆటోలో వచ్చి మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని సమీపంలో తన బందువులకు సంబంధించిన కొయ్యల మిల్లు దగ్గర కి లాక్కెళ్లి అక్కడ అత్యాచారానికి ప్రయత్నించగా మహిళ లొంగకపోవడంతో పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి పిడుగులతో మొహమంతా గాయపరిచి పక్కనే ఉన్న చెక్క దిమ్మెతో ఒళ్లంతా కొట్టాడని సుమారు మూడు గంటల సేపు రూం లో చిత్ర హింసలకు గురిచేసాడని నేను బయట పోతే నిజం చెప్తానని నిన్ను చంపేస్తా అంటూ కాలుతో తీవ్రంగా తంతూ తలమీద కొట్టడం తో దెబ్బలు, నొప్పి భరించలేక నన్ను వదిలేయాలని కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా మొహంమ్మీద గుద్దాడని వంటిమీద నూలుపోగు లేకుండా చించి వేసాడని ఎలాగోలా తప్పించుకుని ఒంటిమీద నూలు పోగు లేకుండానే నిందితుడు కళ్యాణ్ నుండి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదకి రాగా చుట్టుపక్కల వారు బట్టలు కప్పి ఆమెను కాపాడినట్టు, ఈ ఘటనపై అదేరోజు శనివారం(27.7.2024) ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ తెలిపారు…నిరక్షరాస్యులైన బాధిత మహిళ అంత క్షోభ అనుభవించి తనకు జరిగిన అన్యాయం పై పోలీసులకు పిర్యాదు చేస్తే వెంటనే బాధిత మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి అనంతరం విచారణ చేసి నిందితుడి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అటువంటి కార్యక్రమం చేయకపోగా అంత నేరం చేసిన నేరస్తుడు కాలర్ ఎగరేసుకుంటూ భాదిత మహిళను భయపెట్టే విధంగా చుట్టుపక్కల తిరుగుతుండడం తో బుచ్చి పోలీసులపై అనేక అనుమానాలు రేకెత్తాయి.. మహిళ ఒంటరిగా ఉండడం ఆమె వ్యక్తిగత జీవితం సరిగా లేదంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వడం వెనుక అనేక శక్తులు పనిచేసేయని గుసగుసలు వినిపిస్తున్నాయి… చివరకు నాలుగు రోజుల తర్వాత మహిళా సంఘాల ఫౌండేషన్ సభ్యులు భాదిత మహిళను కలిసి జరిగిన అన్యాయంపై తెలుసుకొని,బుచ్చి సీఐతో, అనంతరం నెల్లూరు రూరల్ ఇన్చార్జి డిఎస్పి గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడి, బాధిత మహిళను తమ వాహనం లో తీసుకెళ్ళి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా వైద్యులు పరీక్షించి ఆమె కుడి చెవి తీవ్రంగా దెబ్బతిన్నని వినికిడి సమస్య ఏర్పడిందని తెలిపారు,ఇప్పటి కైనా పోలీసులు బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనే కాదు మహిళ మాన ప్రాణాలకు ఇంత దారుణమైన సంఘటన జరిగితే పోలీసులు స్పందించే తీరు ఇదేనా? అని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా డబ్బు,కులం మతం హోదా లను చూసి కాకుండా ఒక మనిషిగా భారతీయ పౌరులుగా రాజ్యాంగం అందరికీ సమానం గా అమలు అయ్యేలా చూడలిసిన బాధ్యత అధికారులపై వుంటే సమాజం లో నిస్సహాయం గా వున్న వారి పట్ల కాస్త మనుషుల్లా గా మెలగాలి…
👉తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జన్మదిన సందర్భంగా గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయనను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ (పండు) మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కటింగ్ చేయించి పూల మొక్క అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
👉 ఉపాస్ హాస్పిటల్ లో ప్యాంక్రియాస్ ఆపరేషన్ విజయవంతం….ప్యాంక్రియాస్ ట్యూమర్ క్యాన్సర్ ఓ అరుదైనది… దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉపాసస్ లో విజయవంతంగా నిర్వహించాం.గ్యాస్ట్రో సర్జికల్ ఎంట్రాలజీ — డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు….
ఒంగోలు,పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంక్రియాన్ ట్యూమర్ క్యాన్సర్ ఆపరేషన్ ను విజయవంతంగా 27 సంవత్సరాల మహిళలకు నిర్వహించామని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ , గ్యాస్ట్రో సర్జికల్ ఎంట్రాలజీ సర్జన్ డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశం లో గురువారం తెలిపారు. 27 సంవత్సరాల మహిళలకు గత మూడు నెలలుగా పొట్టపై భాగంలో గడ్డతో బాధపడుతుందని, అటువంటి మహిళకు అల్ట్రా స్కానింగ్ సిటీ స్కానింగ్ ద్వారా ప్యాంక్రియాన్ ట్యూమర్ క్యాన్సర్ గా గుర్తించి ఆమెకు ఐదు గంటల పాటు తనతోపాటు ముగ్గురు డాక్టర్లు టీం డాక్టర్ పవన్, డాక్టర్ నవాజ్, డాక్టర్ మనోజ్ ఆపరేషన్ నిర్వహించి విజయవంతం చేసి కేవలం ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్ల కోసం గతంలో చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే వారిని, అలాకాకుండా నేడు ఒంగోలు పట్టణంలోనే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఉపాస్ హాస్పిటల్ కు గర్వకారణమని డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు అన్నారు. ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు లివర్,ప్యాంక్రియాన్, గ్యాస్ట్రిక్, పేగు కు వచ్చే సంబంధిత క్యాన్సర్లు అతి తక్కువ ఖర్చుకే తమ హాస్పిటల్ లో నిర్వహిస్తున్నామని ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ అనిల్, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉపాస్ హాస్పిటల్ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక బాధ్యతతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
👉స్కీం వర్కర్లపై..గతం కన్నా వేధింపులు .. వేధింపులు మానకుంటే ఉద్యమం ఉదృతం.. ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన..
“కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు” మా పరిస్థితి తయారైందనీ, గత వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి పలకకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తామనీ ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరుద్యోగులను రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదన్నారు. ముఖ్యంగా మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్కీమ్ వర్కర్ల అయినా ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారనీ, వారికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా సహకరిస్తూ వేధింపులకు దిగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 94 ప్రకారం, స్టాండింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ప్రకారం ఎవరిని తొలగించోదని డీఈవోగారు ఆదేశాలు జారీచేసిన ఉత్తర్వులు మండల కేంద్రంలోని ఎంఈఓ లు అమలు పరచడం లేదని అన్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా, కార్మికుల ఆరోగ్యం బాగోలేదని , కార్మికులు తామే మానుకున్నట్టుగా కార్మికులకు సంబంధం లేకుండా వారి సంతకాలు సైతం చేసుకొని బలవంతంగా రాజీనామాల పేరుతో తొలగించడాన్ని ఆమె ఖండించారు. 24 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా విద్యార్థులకు వండి పిల్లలకు వడ్డిస్తూ ప్రభుత్వం సకాలంలో వేత్తనాలు బిల్లులు ఇచ్చిన ఇవ్వకపోయినా అప్పులు చేసి సైతం విద్యార్థులకు వండి పెట్టామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకు సమ్మె బాట పట్టిన స్కీమ్ వర్కర్లకు కూటమినేతలు సంఘీభావం ప్రకటించిన సంగతిని మర్చిపోవద్దని అన్నారు. టెంట్ల వద్దకు మా ప్రభుత్వం వస్తే మీ కోర్కెలను తీర్చడమే కాకుండా, రాజకీయ వేధింపులు కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కీం వర్కర్లపై పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి చిరు ఉద్యోగులైన మధ్యాహ్నం భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు లేకుండా అడ్డుకట్ట వేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు.
👉పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా నియామకంపై ‘ముఖ్యమంత్రికి మాగుంట కృతఙ్ఞతలు… 30-04-2025 వరకు పదవీ కాలంగల, 15 మంది సభ్యులుగల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలలో మొదట 19 నామినేషన్లు రాగా, తదుపరి ఎన్నికనుండి నలుగురు ఉపసంహరించుకోనడంతో 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా నియమించబడ్డారు. అందులో నామినేషన్ వేసిన నేను సదరు కమిటీ సభ్యులుగా నియమించబడ్డాను. ఈ కమిటీ సభ్యులుగా తనను నియమింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు..
👉దేశంలో ఉన్నత విధ్య అభివృద్ధిపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న… దేశంలో ఉన్నత విధ్య స్థూల నమోదు నిష్పత్తి పెంపు – మెరుగుదల, విద్యార్ధులు – విధ్యార్దినిలు సీట్ల పంపిణి, ఉపకార వేతనాలు చెల్లింపు, కార్యక్రమాలకు నిధుల విడుదల, వెనుకబడిన ప్రాంతాల వారి అభివృద్ధికి చర్యలు మరియు సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విధ్యా శాఖ సహాయక మంత్రి. డా. సుకాంత మజుందార్ సమాదానమిస్తూ జాతీయ స్థాయి సర్వే 2021-22 ప్రకారం దేశంలో ఉన్నత విధ్య స్థూల నమోదు నిష్పత్తి 2021-22 లో 28.4 గా వున్నదని, ఉన్నత విధ్యా సంస్థలలో 2.26 కోట్ల మంది విద్యార్ధులు నమోదు కాగా, 2.07 కోట్ల మంది విధ్యార్దినిలు నమోదయ్యారని తెలిపారు. దేశంలోని ఎస్.సి., ఎస్.టి., మరియు ఓ.బి.సి. విద్యార్ధుల కొరకు ప్రభుత్వం పలు ఉపకార వేతనాలు మరియు ఫెల్లో షిప్పులు అమలుచేసి ఉన్నత విధ్యా శాఖ, విశ్వ విధ్యాలయ గ్రాంట్స్ కమిషన్, అఖిల భారత సాంకేతిక విధ్యా మండలి, సామాజిక న్యాయం మరియు సాధికారత – గిరిజన సంక్షేమం – మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖల ద్వారా ఆర్ధిక సహాయం అందించుచున్నదని తెలిపారు. ఉన్నత విధ్య రాష్ట్రాల అంశమని, దీని అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్రాలు ప్రయత్నిస్తాయని, చదువులో విద్యార్ధుల స్టేటస్ పెంచుటకు: కళాశాలలు – కాలేజీలు పెంపుదల, ఆర్ధిక సహాయం అందించడం, అత్యంత నాణ్యమైన కోర్సులు నేర్చుకొనుటకు ఆన్ లైన్ కార్యక్రమాల ఏర్పాటు, ఇష్టమైన చదువును ఎంచుకొనుటకు సరళమైన మార్గాల ఏర్పాటు, 13 భాషలలో జే.ఈ.ఈ., నీట్, మరియు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ మొదలగు పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. నమోదుకాబడిన కళాస్థాయి సంస్థలు 2014-15 లో 760 వుండగా, 2021-22 నాటికి 1,168 పెరిగాయని మరియు కాలేజీలు 2014-15 లో 38,498 వుండగా – 2021-22 లో 45,473 పెరిగాయని మరియు కేంద్ర బడ్జెటులలో 2021-22 లో రూ. 93,224 కోట్లు, 2022-23 లో రూ. 1,04,277 కోట్లు, 2023-24 లో రూ. 1,12,899 కోట్లు మరియు 2024-25 లో రూ. 1,21,117 కోట్లు కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రి తెలియజేశారు.
👉 పాఠశాలల్లో మ్రోగిన ఎన్నికల నగారా… కంభం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ(ఎస్ఎంసి) ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని పంచాయతీ కార్యాలయాలలో మరియు పాఠశాలల్లో ఎన్నికల ప్రకటన పత్రాలను మరియు ఓటర్ల జాబితాను నోటీసు బోర్డునందు ప్రదర్శించారు. మండల విద్యాశాఖాధికారి మాల్యాద్రి మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి, ఓటర్ల జాబితాలు మరియు నోటిఫికేషన్ వివరాలను పరిశీలించారు, ఎన్నికల విధివిధానాలపై సూచనలు చేశారు. ఈనెల 5వ తేదీన ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నచో వాటిని పరిష్కరించి 8వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేరోజు ఎన్నికైన కమిటీ సభ్యులచే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం మరియు మొదటి ఎస్ఎంసి సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిఆర్పిలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మరియు సచివాలయం అడ్మిన్లు పాల్గొన్నారు.
👉విద్య సమాచారం -ఏపీలో మిగిలిపోయిన 18,951 ఇంజనీరింగ్ సీట్లు… కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళ వారం తుది విడత సీట్ల కేటాయింపును పూర్తి చేశారు. తుది విడత సీట్ల భర్తీ తర్వాత 18,951 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ తెలిపారు.# అడ్మిషన్లు పొందిన విధ్యార్ధులు ఆగస్టు 3 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయడంతో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. #మరోవైపు ఏపీలో జులై 19 నుండి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం అయ్యాయి.# ఏపీలో కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6981 సీట్లు ఉండగా వాటిలో 6153 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. యూనివర్శిటీ కాలేజీల్లో 828 సీట్లు మిగిలిపోయాయి.# రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 214 ప్రవేటు కళాశాలల్లో 1,24,324 సీట్లు ఉండగా, 1,06, 324 భర్తీ అయ్యాయని 18వేల సీట్లు మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ ప్రకటించింది. # రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7950 సీట్లు ఉండగా, 7826 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. వీటిలో 126 సీట్లు ఖాళీగా ఉన్నాయి.# రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 25శాతం ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. #మొత్తం 247 కళాశాలల్లో 1,39,254 సీట్లు ఉండగా, 1,20,303 సీట్లు భర్తీ అయ్యాయని, 18, 951 సీట్లు ఉన్నాయనీ ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ వారు తెలిపారు.