ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానం లోకి !.. స్కిల్ యూనివర్సిటీ కి భూమి పూజ చేసిన సీఎం రేవంత్.. పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ..ఆధునిక చర్యలతో దోమల నియంత్రణ..నిమ్స్ లో బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్..తిరుమలయ్యకు నివాళులు.

👉నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీ..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా ‘చక్రవ్యూహం’ ప్రసంగం నచ్చలేదు. నాపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. చాయ్, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ గాంధీ తన X ఖాతాలో వెల్లడించారు.
👉నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం*
నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం
అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు రెండు రోజులు పరిశీలించనున్నారు.
👉ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి!..
ఆరోగ్య శ్రీ సేవలను బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీ నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. వీరి అభిప్రాయాన్ని సేకరించి సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు.

👉స్కిల్‌ యూనివర్సిటీకి భూమిపూజ..నెట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకూ శంకుస్థాపన..
“తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” …

తెలంగాణ ప్రజా ప్రభుత్వం  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు..🔹 స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోదముద్ర పడిన కొద్దిసేపటికే భూమిపూజ నిర్వహించారు..🔹 నెట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ వర్సిటీ తోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్,మోడ్రన్ స్కూల్,ప్రైమరీ హెల్త్ సెంటర్,కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ ,పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు…*

👉 నేను ఏం మోసం చేశా..?నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావ్???..అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై సబిత ఫైర్..హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు సభకేరారు.. కేటీఆర్ మాత్రం ప్రభుత్వానికి సహకరిస్తామంటే ఎలా నమ్మాలి? అంటూ ప్రశ్నించారు. ఆ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.*ఒక తమ్ముడుగా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాను. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. సీఎం స్థాయికి వెళ్తావ్ అని నేను ఆశీర్వదించాను. కానీ, ఆయన నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు అవమానిస్తున్నావ్.. నేను ఏం తప్పు చేశా? నేను ఏం మోసం చేశా అంటూ రేవంత్ రెడ్డిని సబిత ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డను ఎందుకు అవమానిస్తున్నావ్.. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి.. నాఇంటిపై వాలడానికి వీలులేదని చెప్పారు.. ఈ రోజు ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని సభితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. నువ్వు కాంగ్రెస్ లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క నాకు చెప్పింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నేను చెప్పే మాట నిజమా కాదా సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. గవర్నర్ ను రిసివ్ చేసుకొని తిరిగి వచ్చి అందరికీ సమాధానం చెప్తానని రేవంత్ రెడ్డి అన్నారు.*ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే టీఆర్ఎస్ లోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ నన్ను సీఎల్పీ లీడర్ ను చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవికోసం ఆమె పార్టీ మారింది. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు ఆమె పార్టీ మారారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందిగాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు అంటూ సబితా ఇంద్రారెడ్డిపై భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అసలు సబిత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

👉హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లేక్ వ్యూ విల్లాస్ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి, క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు …
*ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని కాలనీ లలో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను కూడా పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు.అదేవిధంగా కాలనీల అభివృద్ధి కి కృషి చేస్తానని కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతామని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి కానీ కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి కానీ తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  తెలియచేసారు. కార్యక్రమంలో అధికారులు డీఈ రమేష్, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు మాధవరావు, నాగి రెడ్డి, శ్రీనివాస్, కోలన్ సంజీవ రెడ్డి, కోలన్ చంద్ర మోహన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, బన్నయ్య, సంపత్, వెంకట్, యాది రెడ్డి మరియు నాయకులు నిరంజన్ గౌడ్, మాధవరావు, నిఖిల్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.
👉రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి…విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు..ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలను విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ గురువారం ఉదయం 30వ డివిజన్, రామకృష్ణాపురం మధ్య కట్ట నందు తానే స్వయంగా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకొని, వారితో మాట్లాడి, ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా? ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నారా లేదా? ఎంత పెన్షన్ ఇస్తున్నారు? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సెక్రటరీలు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.తదుపరి 29వ డివిజన్ మధురానగర్ లో గల రోడ్ అండర్ బ్రిడ్జ్, బి ఆర్ టి ఎస్ రోడ్డు దగ్గర గల జిఎస్ శాస్త్రి పార్క్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చివరి దశలో ఉన్న రోడ్ అండ్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుడమేరు కాలువలోని గుర్రపు డెక్కులను తీసి కాలువను పరిశుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫుడ్ జంక్షన్ దగ్గరలో గల జిఎస్ శాస్త్రి పార్క్ ను సందర్శించిన కమిషనర్, పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఎల్లప్పుడూ ఉంచాలని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, పార్క్ ఆవరణలో వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

👉నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్* ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు.కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు.శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరారు..
శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు..అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్నాడు…
దీంతో వైద్యులపై అతని కుటుంబ సభ్యులు మండిపడుతున్నాడు
👉ఆధునిక చర్యలతో దోమల నియంత్రణ*
*కాలువలను ట్రక్సర్ ద్వారా పరిశుభ్రపరచుట, డ్రోన్ ద్వారా యం.ఎల్ ఆయిల్ స్ప్రే*..విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దోమల వల్ల కలుగు వ్యాధులను నివారించడానికి దోమల లార్వను కాలువల్లో నియంత్రించేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలని, విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం రామకృష్ణాపురంలోని, బుడమేరు కాలువ పరిశీలిస్తూ, నిరంతరం వ్యర్ధాలు పేరుపోకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించేందుకు ట్రక్సర్ మెషిన్ ద్వారా శుభ్రపరచాలని, వ్యర్ధాలు పేరుకుపోయినచోట దోమల లార్వా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనుషులు వెళ్లలేని ప్రదేశాలలో డ్రోన్ల సహాయంతో యం ఎల్ ఆయిల్ స్ప్రే నిరంతరం స్ప్రే చేస్తూ దోమలని అరికట్టాలని. తద్వారా దోమల వల్ల కలుగు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు.
కెనాల్ బండ్ పైన ఉన్న వ్యర్ధాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచి, గ్రీనరీని అభివృద్ధి చేయాలని, కెనల్ చుట్టుపక్కల గ్రీనరీ పెంచడం ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా వాతావరణం లో కార్బన్ డయాక్సైడ్ ని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని, తద్వారా ఆక్సిజన్ శాతం పెరగటం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. విజయవాడ నగరంలో ఉన్న బందర్, ఏలూరు, రైవస్ కాలవల్లో ట్రక్సర్ వాహనం వినియోగిస్తూ పేరుకుపోయిన వ్యర్థాలను నిరంతరం తొలగిస్తూ, దోమల వ్యాప్తిని అరికట్టాలని అన్నారు.
👉పల్నాడు జిల్లాలోని నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు, బండ్లమోట్టు, ఐయినవోలు, శావల్యాపురం పోలీస్ స్టేషన్లను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ .,*
▪️పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ల యొక్క భౌగోళిక స్థితిగతులను పరిశీలించి, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాది దారులకు వెయిటింగ్ రూమ్ వుండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చెయ్యాలనీ సూచించారు.▪️ జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలనీ,డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించాలని మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ సూచించారు.

👉త్వరలో రాష్ట్రంలో బోగస్‌ పెన్షన్లు ఏరివేస్తాం.▪️ ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం – *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు*
👉తిరుమలయ్యకు నివాళులు  తెదేపా నాయకుల..

గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో బండా తిరుమలయ్య మృతి పట్ల చింతిస్తూ వారి భౌతిక కాయానికి గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్  పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.. వారితో పాటు మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, దప్పిలి కాశిరెడ్డి మరియు స్థానిక నాయకులు పాముల వెంకట రమణ తదితరులు నివాళులు అర్పించారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం