సీఎం చంద్రబాబుపై రఘువీరారెడ్డి ప్రశంసలు..మాజీ సీఎం పై తెదేపా నాయకుల విమర్శలు..హైదరాబాద్ ను అత్యాధునికంగా నిర్మిస్తాం-సిఎం రేవంత్..ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పుకు బీజేపీకి సంబంధం లేదు..ఒంగోలు ఎంపీ మాగుంట ప్రశ్నలు..ఖమ్మంలో దారుణ ఘటన..

👉 లక్షల మంది వాలంటీర్లు లేరు. హంగూ ఆర్భాటాలు లేవు.‌ ఒక్క రోజులోనే 64 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దే రూ.2737 కోట్లు పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వం. 👉 సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రఘువీరారెడ్డి..సీఎం చంద్రబాబు మడకశిర పర్యటనపై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటం లేకుండా నిర్వహించడం చాలా సంతోషకరం. బలవంతపు జన సమీకరణ చేయకుండా ప్రజలతో నేరుగా మాట్లాడటం గొప్పవిషం. పదేళ్లుగా మడకశిర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించే మంచి అవకాశం ఆ దేవుడు చంద్రబాబునాయుడుకి కల్పించారు.

👉మాజీ సీఎం పై తెదేపా నాయకుల విమర్శలు….!!!👉 ఉమ్మడి చిత్తూరు జిల్లాను దోచేసిన పెద్దిరెడ్డి రౌడీ ముఠా.తవ్వేకొద్దీ బయటపడుతున్నపెద్దిరెడ్డి భూ కబ్జాలు. 👉 జగన్ అడ్డగోలు వైఖరితో  భూ హక్కులకు ఎసరు పెట్టాడు. కేంద్రం వద్దన్న అంశాలను  చేర్చి  ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జగన్ రెడ్డి రైతు భూములకు ఉరి వేశాడు.👉తన ఇంట్లో ఎలుకలు పట్టుకోవడానికి ఒక కోటి 34 లక్షల ప్రజాసొమ్మును మింగేసిన జగన్మోహన్ రెడ్డి.

👉హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు.కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు.🔹 ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది.🔹 ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది. 🔹 న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం.🔹 ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలును విస్తరించడం, ఆ తర్వాత దాన్ని నెట్‌ జీరో సిటీ వరకు పొడగించడం.🔹 ఆ ప్రాంతం వరకు 200 అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించడం. 🔹 వచ్చే మూడు నెలల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టడం.🔹 స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే కచ్చితంగా ఉద్యోగం లభించే ప్రణాళికలు.🔹 నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్‌ సిటీగా మార్చడం…

👉మట్టి మీద కూలిపోయి నలుగురు మృతి..నంద్యాల జిల్లా…చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామంలో గురువారం అర్థరాత్రి మట్టి మిద్దె కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఇంటిలో నిద్రిస్తుండగా హఠాత్తుగా మట్టి మిద్దె కూలి వారిపై పడడంతో నలుగురు చనిపోయారు. దీనితో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

👉 భార్యపై అనుమానంతో కొట్టి చంపాడు..హైదరాబాద్ మీర్ పేట్ పీఎస్ పరిధిలోని హస్తినాపురంలో దారుణం జరిగింది. అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూల్ కు చెందిన రాజు అగ్రికల్చర్ కాలనీలోని ఉషోదయ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ.. పెట్రోల్ బంక్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు…

👉 కడప జిల్లా: పులివెందుల – కదిరి మార్గంలో ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.* ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరో 12 మందికి తీవ్రగాయాలు. *క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ప్రభుత్వాసుపత్రి తరలించిన స్థానికులు..ఆటోలో ఉన్న వారంతా కూలి పని కోసం పులివెందుల వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వీరంతా సత్యసాయి జిల్లా బట్రేపల్లె వాసులు…

👉సుప్రీం తీర్పుతో తెరపైకి OBC వర్గీకరణ అంశం.. SC, ST వర్గీకరణపై సుప్రీం తీర్పుతో OBC ఉపకులాల వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. OBCల్లో వర్గీకరణ పై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణీ కమిషన్ గతేడాది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినా, ఏ కారణం తోనో కేంద్రం దానిని బయట పెట్టలేదు. OBC ల్లోనూ కొన్ని కులాలకే ప్రయోజనాలు దక్కాయనే వాదనలుఉన్నాయి. 27% రిజర్వేషన్లను అందులోని ఇతర ఉపకులాలకూ సమంగా పంచాలనే డిమాండ్ ఉంది.తాజా తీర్పుతో OBCల వర్గీకరణపై ఏం జరుగుతుందోచూడాలి…

👉’రైతు ఆర్దికాభివృద్ధికి ఆపరేషన్ గ్రీన్స్ పధకం అమలుపై మాగుంట ప్రశ్న’.. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా పాడై పోయే 22 పంటలకు రైతుల ఆర్ధిక స్థోమతు పెంపుకు మరియు ఉత్పత్తుల నష్టాలు తగ్గింపుకు కేంద్రం అమలుచేయుచున్న ఆపరేషన్ గ్రీన్స్ పధకం క్రింద గత 5 సంవత్సరాలలో లబ్దిపొందిన రైతులు, టమాటో, ఉల్లి, వుర్లగడ్డ మరియు తదితర 22 త్వరగా పాడై పోయే పంటల రేట్లపై ప్రభావం, ధరల నియంత్రణకు చర్యల మరియు ఖర్చుచేసిన నిధుల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, రావ్ నీత్ సింగ్ సమాదానమిస్తూ –   టమాటో, ఉల్లి, వుర్లగడ్డ మరియు తదితర 22 త్వరగా పాడై పోయే పంటలకు సంబంధించి రైతుల ఆర్ధిక స్థోమతు పెంపుకు మరియు ఉత్పత్తుల నష్టాలు తగ్గింపుకు పి.యం.కిసాన్ సంపద యోజన కార్యక్రమం క్రింద ఆపరేషన్ గ్రీన్స్ పధకాన్ని 2018-19 నుండి కేంద్రం 2 భాగాలుగా అమలుచేయుచున్నదని, ధీర్గకాలిక భాగం క్రింద అర్హతగల పంటల కొరకు అమలుచేయుచున్న 52 ప్రాజెక్టుల క్రింద దేశం మొత్తంలో 3,38,074 మంది రైతులు లాభపడగలరని మరియు ఆంధ్రప్రదేశ్ లో 77,140 మంది లాభపడగలరని మరియు స్వల్పకాలిక భాగం క్రింద రూ. 119 కోట్లు సబ్సిడీ మంజూరుచేయగా దేశంలో 31,364 మంది రైతులు వారి ఉత్పత్తుల నిల్వ మరియు రవాణాకు లాభపడగలరని తెలిపారు.ఈ పధకంలో ధీర్గకాలిక భాగం క్రింద టమాటో, ఉల్లి, వుర్లగడ్డ నుండి త్వరగా పాడై పోయే 22 పంటలకు కూడా విస్తరించబడిందని, దీంతో ఆహార తయారీ మరియు మౌలిక సదుపాయాలు సృస్టించడంతోపాటు, దొంగ నిల్వలు అరికట్టబడునని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుటకు “ధరల స్థిరీకరణ నిధి పధకాన్ని” 2014-15 నుండి ప్రభుత్వం రూ.27,489 కోట్లతో అమలుచేయుచున్నదని తెలిపారు. ఈ పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మామిడి ప్రాజెక్టులు, 1 టమాటో ప్రాజెక్టు మరియు 12 రొయ్యలు ప్రాజెక్టులు మొత్తం 16 ప్రాజెక్టులు అమలగుచుండగా, దేశంలో మొత్తంలో పలు పంటలకు 36 ప్రాజెక్టులు అమలగుచున్నాయని తెలిపారు.ఉల్లి ధరలలో అస్థిరత ఏర్పడినపుడు, ఈ పధకం క్రింద రైతుల వద్ద పెద్ద ఉల్లి కొని -నిల్వచేసి, మార్కెటుకు సరుకు రాని నెలలలో ప్రజలకు సరఫరా చేయబడునని కేంద్ర మంత్రి తెలియజేశారు.

👉’ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పుకు బీజేపీకి ఏ సంబంధం లేదని’ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ యునస్ ఆలీ (నారాయణపేట నియోజకవర్గం) తెలిపారు.100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాదిగలను పదేళ్లు బీజేపీ మోసం చేసిందన్నారు. ఫుల్ మెజారిటీ ఉన్నా…పార్లమెంటులో బిల్లు పెట్టి ఆర్టికల్ 341కి సవరణ చేయలేదనీ,కానీ, కాంగ్రెస్ నేతలు,సుప్రీంకోర్టు న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్శిద్ లు వర్గీకరణకు మద్దతుగా వాదనలు చేశారన్నారు. ఈ తీర్పు రావడంలో పంజాబ్ ప్రభుత్వంతో పాటూ (అది కూడా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆమె ఆద్మీ పార్టీ) సిబల్, ఖుర్శిద్ ల పాత్ర ఉన్నదన్నారు. ఆనందంలో , ఆవేశపడిపోయి మాదిగలు బీజేపీకి క్రెడిట్ అంటగట్ట వద్దన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానిదనీ ఈ కేసుకూ బీజేపీకి ఏ సంబంధం లేదన్నారు.👉 ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో వాదనలు వినిపించిన సిద్దార్థ్ లుత్రా ఈ కేసులోనూ వర్గీకరణకు అనుకూలంగా వాదించారన్నారు…

👉 ఖమ్మంలో అర్ధరాత్రి దారుణ ఘటన ఆటోడ్రైవర్ పై కత్తులతో దాడి ..కొత్త బస్టాండ్ ఆటో అడ్డాలో డ్రైవర్ల మధ్య మాటలతో మొదలైన వివాదం చివరకు కత్తులతో దాడి చేసే వరకు వెళ్లింది. తిరుమలాయ పాలెం* *మండలం బీరోలు గ్రామానికి చెందిన సాయి పవన్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఆటో విక్రయ విషయంలో గతంలో ఖమ్మం ఆటో డ్రైవర్లు తో గొడవ జరిగింది.సాయి పవన్ రాత్రి బస్టాండ్ వద్దకు ఆటోతో వెళ్ళాడు. అడ్డాలోని ఆటో డ్రైవర్లు సాయి పవన్ ని ఆటో తీసేయాలని తిట్టారు . తాను కిరాయిల కోసం రాలేదని డ్రాపింగ్ చేయడానికి వచ్చానని సాయి పవన్ చెప్పినా వినకుండా డ్రైవర్లు సాయి పవన్ తిట్టడంతో పాటు వెళ్లిపోతున్న సాయి పవన్ ఆటోను మరో ఆటోలో వెంబడించిన పది మంది డ్రైవర్లు సాయి పవన్ పై కత్తులతో దాడి . సాయిని హాస్పిటల్ కు తరలించారన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం