👉సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త లిక్కర్ పాలసీ*
రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తరువాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త మద్యం విధానంపై వచ్చే ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని, గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్యం విధానం ఆదాయం కోణంలో కాకుండా..అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
*ఆగస్టు 15 నుంచి ముచ్చటగా మూడు పథకాల అమలు ..మూడు పథకాలు చేసేందుకు సిద్ధమవుతున్న కొత్త ప్రభుత్వం?అమరావతీ :
ఏపీలో ఆగస్టు 15వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడు పథకాలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే అన్నా క్యాంటీన్ లు పునరుద్ధరించడం మొదలైంది.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పై కూడా ఒక క్లారిటీ వచ్చిందని, అలాగే తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కూడా ప్రణాలికలు రచిస్తున్నట్లు సమాచారం….మూడు పథకాలు అమలు.1. పేదలకు అన్న క్యాంటిన్ లు.2. మహిళలకు ఉచిత ప్రయాణం.3. తల్లికి వందనం అమలు.
👉ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష.. లిక్కర్ స్కాంపై సీఐడీ దర్యాప్తు మొదలవుతుందన్న చంద్రబాబు!..గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని సీఎం ఆదేశాలు ..నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదని స్పష్టీకరణ ..సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ తెస్తామని వెల్లడి ..ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వారం రోజుల్లో మొదలవుతుందని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న కారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని…దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు.👉ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించే వారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ…తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యతలేని మద్యం లేకుండా చేస్తే కొంత వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని అన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని అన్నారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని…ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు వచ్చిన ఆదాయాన్నంతా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు.
** శభాష్ ఇండియన్ ఆర్మీ..కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించారు. రంగంలోకి దిగిన భారతసైన్యం ప్రాణాలకు తెగించి వంద లాదిమందిని కాపాడింది.. రాళ్లు, బురదలో కూరుకుపోయిన వారిని బయటకు తీసింది. కేవలం 36 గంటల్లోనే నదిపై వంతెన నిర్మించి బాధితులకు ప్రాణం పోసింది. భారత సైనికులు సహాయక చర్యలను ముగించుకుని వెళ్తుండగా వయణాడ్ ప్రజలు చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు.
👉అమరావతి : రిజిస్ట్రేషన్ ప్రతులను భవిష్యత్తులో ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందంటూ వైకాపా ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ఉపసంహరించుకుంది.వైకాపా ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేస్తే.. కొన్నవారి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు.దీనిపై అప్పట్లో సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేసింది.
👉అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి:సీఎం రేవంత్
హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకా ణాలు తెరిచే ఉంటాయని అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రాత్రి సమయాల్లో బిర్యానీ కి, చాయ్, పాయ తాగడాని కి వెళ్తే.. పోలీసులు కొడుతు న్నారని.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రస్తావించగా..స్పందించిన సీఎం ఇకపై అర్ధరాత్రి ఒంటిగంట వరకూ లిక్కర్ షాపులు తప్ప.. అన్ని దుకాణాలు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు.అయితే.. లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వా నికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు..
👉ప్రైవేట్ విద్యా సంస్థలో 100 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..నంద్యాల జిల్లా..వేంకటేశ్వరపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్/జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది.సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు.ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది.విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
👉వైసిపిలో నంబర్ టూగా చలామణీ అవుతున్న విజయసాయిరెడ్డి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే విజయసాయిరెడ్డి గత వారం రోజుల వ్యవధిలో హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది మూడోసారి.**అమిత్ షాతో భేటీలు ఎందుకు అన్నది బయటకు తెలియకపోయినా పుకారులు అయితే షికారు చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారన్నదే ఆ పుకార్ల సారాంశం.
👉ఎమ్మార్వో వీఆర్ఓ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా..ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండల పర్యటన సమయంలో జాయింట్ కలెక్టర్ కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి ఎమ్మార్వో నాగుల్ మీరా వీఆర్వో శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. భూముల బ్యూటిషన్లకు సంబంధించి ఓ రైతు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిగిరి ఆర్డిఓ ద్వారా విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఆ నివేదిక మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
👉 ఉప్పలపాడు పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 44,250/- నగదును సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ జి. కోటయ్య…
పొదిలి మండలం పరిధిలో పేకాట, కోడిపందాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఇచ్చినట్లయితే సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానికుండా గోప్యతగా ఉంచుతాం…: ఎస్ఐ కోటయ్య…
పేకాట, కోడి పందాలు ఆడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్ఐ కోటయ్య…
👉76మంది పోలీసులకు పదోన్నతి..
తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయం త్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజి పి సత్యనారాయణ తెలిపారు.
చార్మినార్ జోన్- పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కాని స్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు.
వీరందరూ సివిల్ విభాగం లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు..
👉 అంధకారంలో ఆదరణ షెల్టర్ ..కరెంట్ లేక అవస్థలు పడుతున్న వృద్ధులు,అధికారులు స్పందించి విద్యుత్ ఇవ్వాలి ..
కడప : నగరం లోని పాత రిమ్స్ లో ఉన్న ఆదరణ షెల్టర్ లో విద్యుత్ సరఫరా లేక అందులో ఉన్న వృద్ధులు అవస్థలు పడుతున్నారని ఆ షెల్టర్ నిర్వాహకులు ఎన్ జీ ఓ సి హెచ్ విజయ బాబు వాపోయారు గత 5 నెలల క్రితం మునిసిపల్ కమీషనర్ సహకారం తో పాత బిల్డింగ్ నుంచి పక్కన ఉన్న మరో పాత బిల్డింగ్ లో కి షెల్టర్ ను మార్చడం జరిగిందని ఆయన అన్నారు అయితే అదే ప్రాంగణంలో ఉన్న 108 కు సంబంధించిన విద్యుత్ బిల్లును కూడా తమ పైనే వేస్తుండంతో లోక్ అదాలత్ జడ్జీ సహకారం తో పాత బిల్డింగ్ లో ఉన్నప్పుడు విద్యుత్ మీటర్ ను సెపరేట్ గా ఏర్పాటు చేయాలని ఆదేశించారు అయినప్పటికీ ఇంతవరకు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయక పోవడంతో పదే పదే విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందిని చెప్పారు తమ సమీపంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని వాటికి కూడా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు కావున కలెక్టర్ స్పందించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు అంతే కాకుండా తమ ఆదరణ షెల్టర్ కు సెపరేట్ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని కోరారు
👉పల్నాడు జిల్లా..మాచర్ల మండలం నాగార్జున సాగర్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు.ఎన్డీయే ప్రభుత్వం సాగర్ లో నూతనంగా 1800 ఎకరాలల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత ను సంతరించుకుంది.కలెక్టర్ సాగర్ లోని ఫ్లైటెక్ ఏవియేషన్ కు చేరుకొని ఆ సంస్థ ఎండీ కెప్టెన్ మమత తో చర్చించారు.అనంతరం విమానాశ్రయం ఏర్పాటు కు కావాల్సిన భూములను పరిశీలించారు.