👉 పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు *ఏపీ సీఎం చంద్రబాబు*. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 2014-19 హయాంలో తమ పాలనలో ప్రారంభించి… ఆ తర్వాత నిలిచిపోయిన పనులు, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు మెట్రో కార్పొరేషన్ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డినే మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వైజాగ్, విజయవాడలో మెట్రో రైలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది.అయితే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే 2014లో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధం చేశారు. విశాఖలో మూడు లైన్లు 34.38 కిలోమీటర్లు, విజయవాడలో 2 లైన్లు 26 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించారు. ఎంత వ్యయం అవుతుందో అంచనాతో కూడిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా మెట్రో ప్రాజెక్టును నిరాకరించింది. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా అప్పట్లో పనిచేసిన శ్రీధరన్ ఏపీకి మెట్రోను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని నగరం అమరావతి అవసరాలను మెట్రో తీర్చలేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు… కొరియా, మలేషియా కంపెనీల ఆర్థిక సహాయంతో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని డిసైడ్ అయ్యింది. టెండర్లు కూడా పిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.ఇక 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చింది వైసీపీ. మెట్రోకి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పినా… పాత టెండర్లన్నీ రద్దయ్యాయి.అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చారు. అలాగే రామకృష్ణారెడ్డిని కూడా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా నియమించారు.అయితే ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో పదవికి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత రాజీనామా చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన రామకృష్ణారెడ్డినే…ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా మళ్లీ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.ఇక విజయవాడలో 26 కిలోమీటర్ల మేర… రెండు మెట్రో కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు, అదే నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు నిర్మించనున్న ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయని తెలిపింది.ఇక విశాఖ విషయానికొస్తే 34.38 కిలోమీటర్ల మేర మూడు లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు కారిడార్లలో మొత్తం 35 స్టేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇటీవలే విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని కీలక సూచనలు చేశారు.ఇక సీఎం సూచనల ఆధారంగా గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లై ఓవర్లకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.మరోవైపు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం మంచి సంబంధాలు కలిగి ఉండటం, తాజా బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో… మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం కూడా సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా…విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం…త్వరలోనే ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుంది.
👉అనాథ బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం… నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న
వంగలిలో నిన్న మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి
చెందిన నలుగురు మృతి చెందారు. దీంతో ఆ
కుటుంబంలోని బాలిక అనాథగా మారింది. ఈ
ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత బాలిక కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం
మంజూరు చేశారు. బాలిక సంరక్షణకు బాధ్యత
తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.
👉ఇజ్రాయెల్ పై దట్టమైన యుద్ధ మేఘం.. రంగంలోకి అమెరికా.. భారత్ అలర్ట్!
ఓవైపు గాజాలోని హమాస్ తో 8 నెలలుగా యుద్ధం.. మరోవైపు లెబనాన్ లోని హెజ్బొల్లాలపై తీవ్ర దాడులు.. ఇంకోవైపు బద్ధ శత్రువు ఇరాన్ లో ఏకంగా హమాస్ చీఫ్ హత్య.. ప్రతీకార దాడులకు ఇరాన్ ఆదేశం.. మొత్తానికి ఇజ్రాయెల్ యుద్ధం ఏదో మలుపు తిరగనుంది. ఈ పరిణామాలు ఎక్కడికో వెళ్లనున్నాయి. మూడు రోజుల కిందట హమాస్ చీఫ్ హనియా హత్యతో ఇరాన్, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్ మీద మండిపడుతున్నాయి. ఇవన్నీ కలిసి ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. కానీ.. ఇజ్రాయెల్ ఏమైనా తక్కువ తిన్నదా..? వారి డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హై అలర్ట్ అయింది. ఈ ఉదంతంలో కీలక మలుపు ఏమంటే.. అమెరికా రంగంలోకి దిగడం. వారికి మిడిల్ ఈస్ట్ (మనకు పశ్చిమాసియా) అయిన ఇజ్రాయెల్ కు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది.
తాడోపేడో.. వాస్తవానికి రెండు నెలల కిందట లెబనాన్ లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హత్యతోనే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంది. కాగా.. అంతా సద్దుమణిగింది అనుకుంటుండగా ఇరాన్ లోనే హమాస్ చీఫ్ ను లేపేసింది ఇజ్రాయెల్. లెబనాన్ లో హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ నూ హతమార్చింది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ నూ చంపేసింది. ఓవైపు హెజ్బొల్లాపై దాడులు చేస్తూనే ఆ పని చేసింది. అంతే.. ఉద్రికత్తలు మరింత పెచ్చుమీరాయి. ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ రాకెట్లను ప్రయోగించింది. దీంతో సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపింది. బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా అందజేసేందుకు సన్నాహాలు సాగిస్తోంది. 👉నలువైపులా చుట్టుముట్టేందుకు..హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. మిత్ర దేశాలతో కలిసి నలువైపుల నుంచి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భరోసా ఇచ్చారు. దాడులు జరిగితే తాము అండగా ఉంటామని చెప్పారు. కాగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ రాయబార కార్యాలయం సూచించింది. దీనికిముందే ప్రయాణాలకు సంబంధించి లెబనాన్ లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేయడం గమనార్హం. 👉తెలుగులోనూ అడ్వైజరీ..
కాగా, అనవసర ప్రయాణాలు చేయుద్దని.. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలంటూ ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఇంగ్లిష్, హిందీ, కన్నడంతో పాటు తెలుగులోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది
*తెలంగాణ వార్తలు👉 యువతకు హామీ ఇచ్చిన ప్రకారం ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలిపిన యువ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… 👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శాసనసభలోని వారి కార్యాలయంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు కలిసి, గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన మన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా విన్నవించుకున్నారు.ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సీఎంతో భేటీ అయిన వారిలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ కన్వీనర్ బీఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, ఇతర ప్రతినిధులు ఉన్నారు… 👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించగా, స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన “ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్”ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు.
హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు.
👉 వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి..ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్ ఉండాలి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు*
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సహా తెలంగాణ పలు జిల్లాల్లో చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
*యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్ ప్రకారం కుక్కల జననాలను తగ్గించాల్సి ఉందని తెలిపింది. నగరం బయట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి స్థానిక అథారిటీలు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.ఏబీసీ రూల్స్‌లోని 10, 11, 15, 16 నిబంధనలు అమలు చేసి అమలు నివేదికను సమర్పించాలని పేర్కొంది.
🐶 కుక్కల దాడులపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని జీవో 315 ద్వారా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు!
👉 మా భార్యలను కాపురానికి పంపించాలి..
కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష
ఏలూరు..పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మోసపోయామంటూ ఇద్దరు తోడు అల్లుళ్లు శనివారం ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు.
👉రాజన్న జిల్లాలో చిరుత దాడిలో రెండు ఆవులు మృతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో మెట్టొర్రే ప్రాంతంలో రాత్రి కొమిరిశెట్టి చంద్రంకు చెందిన రెండు ఆవులను చిరుత చంపింది.
గోరంటాల, సమీప గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికా రులు సూచిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిరుత దాడితో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
👉ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!…SBI పేరుతో ఫోన్లకు ఫేక్ మెసేజ్..*మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ అంటూ కేటుగాళ్ల మెసేజ్..వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలంటూ సూచన..
ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఈ హెచ్చరికను షేర్ చేసింది. అయితే, ఎస్‌బీఐ బ్యాకింగ్‌కు సంబంధించి ఫేక్ మెసేజ్‌లు సర్క్యూలేట్ కావడం ఇదే మొదటిసారి కాదు.
ఫేక్ మెసేజ్‌లో ఏముందంటే..”ప్రియమైన కస్టమర్, మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ. 9980.00) గడువు నేటితో ముగుస్తుంది! ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుంది” అనేది ఫేక్ మెసేజ్ సారాంశం. ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
👉 కొండపల్లి షాదీ ఖానాలో అక్రమం రేషన్ నిలువ
కృష్టా జిల్లా..ఇబ్రహీంపట్నం..ఇంటింటికి పంపిణీ చేసే వాహనం ద్వారా రేషన్ తరలింపు ..సమాచారం తెలుసుకున్న టాస్పోర్ట్ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.సుమారు 6 కింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా రాత్రి సమయంలో తరలిస్తున్నట్లు సమాచారం…
బొమ్మల తయారీ కోసం అంటూ స్థలాన్ని ని బాగు చేసుకుని అక్రమ రేషన్ నిలువ ఉంచినట్లు స్థానికులు తెలిపారు.కొండపల్లి కి రేషన్ తరలిస్తున్న క్రమంలోనే అధికారులు పట్టుకున్నారు.బియ్యం పంపిణీ చేసే వాహనం కూడా తన పేరు మీదే ఉండటం, తానే స్వయంగా వాహనం ద్వారా అక్రమ రవాణా చేయటంపై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పట్టుకోగా విషయాలన్నీ బయటకు వచ్చాయి.
గతంలో కూడా పలుమార్లు పట్టుకున్న మారలేదంటున్న అధికారులు.ఇంటింటికి పంపిణీ చేసే వాహనాన్ని అదుపులోనికి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు.
వాహనంలో 46బస్తాల బియ్యం స్వాధీనంనిలవ ఉంచిన స్థలంలో 105 బస్తాల వరకు ఉన్నాయని తెలిపిన రెవెన్యూ అధికారులు.
👉చౌక ధరల డిపోను తనిఖీ చేసిన అధికారులు*..
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల పట్టణంలోని చౌక ధరల డిపోలను తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కిరణ్, డిటి తిరుపతిరెడ్డి, రేషన్ షాపులు తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో పట్టణంలోని చౌక ధరల దుకాణం26, ప్రభుత్వ చౌకదారుల దుకాణం27, దుకాణాలను పరిశీలించిక్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు, అమ్మకాల నిర్వహణ వివరాలనుడీలర్ల నుంచి సమాచారం తీసుకున్నారు,ఈ తనిఖీల్లో,ఎన్ఫోర్స్మెంట్ డిటితిరుపతి రెడ్డి, కిరణ్, పెద్ద దోర్నాల గ్రామ సచివాలయం -2 వీఆర్వో కాశీ ఈశ్వర్ రెడ్డి, చౌక ధరల డిపో డీలర్లు తదితరులు పాల్గొన్నారు,