👉 ముఖ్యమంత్రిని కలిసిన పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం.. పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కలిసిన గోనుగుంట్ల భూషణ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఉమ్మడి అనంతపురం జిల్లా..
👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాల పై కప్పు స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానం చేసిన మంత్రి రామానాయుడు….అంబేద్కర్, మదర్ థెరిస్సాల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా…యలమంచిలి మండలం ఆర్య పేట గ్రామ అరుంధతి పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాల పై కప్పు స్లాబ్ నిర్మాణ పనుల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు.ఆయన స్వయంగా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఇసుక,కంకర గమేళాలను నెత్తి మీద పెట్టుకుని కార్మికులతో కలిసి మిల్లర్ లోవేశారు. స్లాబ్ ఎత్తు పైకి సెంట్రింగ్ కర్రలు పై నుంచుని కార్మికులతో కలిసి పనిచేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజకవర్గంలో తొలి అభివృద్ధి పనిగా గతంలో ఈ మహనీయుల విగ్రహాల స్లాబ్ నిర్మాణం పనుల్లో శ్రమదానం చేసి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి పనులు నడుస్తూ స్లాబ్ దశకు చేరుకున్నాయి. స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానం చేసిన మంత్రి రామానాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాల స్లాబ్ నిర్మాణాల్లో శ్రమదానం చేసి దాతలను భాగస్వాములను చేస్తామన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మదర్ థెరీసాల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి రామానాయుడు తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఆదరణలేని తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు, నిరుపేదలైన దివ్యాంగులకు గూడు కల్పించేందుకు దాతలు ముందుకు వస్తే శ్రమదానం చేస్తానని మంత్రి చెప్పారు.కార్యక్రమంలో అధికారులు, టిడిపి,జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
👉దమ్ముంటే టచ్ చేయ్ .. మంత్రికి మాజీ ఎమ్మెల్యే సవాల్..!!!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ లోని బీఆర్ఎస్ పార్టీని కూల్చాలని అధికారులను వేధించడం కాదు, దమ్ముంటే నువ్వే వచ్చి పార్టీ ఆఫీస్ మీద చెయ్యి వెయ్యి అంటూ సవాల్ చేశారు. తాను అమెరికా వెళ్లి వచ్చేలోగా అంటే ఆగస్టు 11వ తేదీలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన రియాక్ట్ అయ్యారు. పాలన చేత కాక కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెడుతున్న మంత్రి కోమటిరెడ్డి తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలతో ఫోజులిస్తున్నారే తప్పా.. కొత్తగా చేస్తున్న అభివృద్ది ఏమి లేదంటూ విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప… అభివృద్దేమో గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడన్నారు. నిబంధనలు, అనుమతుల ప్రకారమే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం జరిగిందని చెప్పారు భూపాల్ రెడ్డి. నిబంధనలు మాట్లాడితే హైదరాబాద్ లోని గాంధీభవన్ తో సహా.. తెలంగాణలో అన్ని పార్టీల కార్యాలయాలు కూల్చేయాలన్నారు.
👉వైసిపి ప్రభుత్వం అన్నదాతలను తాకట్టు పెట్టింది -మంత్రి రామానాయుడు..రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం ఇసుక, గనులు, లిక్కర్, భూముల లూటీకి ప్రాధాన్యత ఇస్తే మా ప్రభుత్వం రైతు, బడుగు, బలహీన,పెద వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యలమంచిలి లంక గ్రామంలో పశువులకు సంబంధించి దాణా ను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు కు గ్రామస్తులు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళల హారతులు ఇచ్చి దీవించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని భరోసాఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడకుండా సివిల్ సప్లై మీద 35 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారన్నారు. గత వైసిపి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే వెయ్యి కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేసిందని మిగిలిన 634 కోట్లు వారం రోజుల్లో జమ చేసి రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరదలు అకాల వర్షాలకు నష్టపోయిన లంక, ముంపు ప్రాంతాల ప్రజలతోపాటు రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని చెప్పారు. సమాజం బాగుండాలి అంటే పాడిపంటలు బాగుండాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వ్యవసాయం, రైతును గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని మంత్రి రామానాయుడు తెలిపారు.ఈ అధికారులు,టిడిపి,జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
👉దేవదాయ శాఖలో వెలుగులోకి వస్తున్న వరుస కుంభకోణాలు..అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత వెలుగులోకి మరో అసిస్టెంట్ కమిషనర్ భూబాగోతాలు.. ఏపీలో దేవదాయ శాఖలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత మరో అసిస్టెంట్ కమిషనర్ భూబాగోతాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారని వినోద్ కుమార్‌పై అభియోగం నమోదైంది. దేవదాయ శాఖ భూములకు నిబంధనలకు విరుద్దంగా వినోద్ కుమార్ ఎన్వోసీలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగ పడగల ప్రతిష్టలో వినోద్ కుమార్ స్కాంకు పాల్పడినట్లు తెలిసింది. నాగ ప్రతిష్ట స్కాంలో రూ. 68 లక్షల మేర అవినీతికి వినోద్ కుమార్ పాల్పడినట్లు అభియోగం నమోదైంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో దేవదాయ భూ కుంభకోణాలకు గత ప్రభుత్వ పెద్దలకు సహకరించారని వినోద్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి.
👉 మహిళల రక్షణకు షీ టీమ్ కృషి..రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్ పనిచేస్తునట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే వెంటనే షీ టీమ్స్ ను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో షీ టీం నెంబర్ 6303824700కు కాల్, వాట్సాప్ ద్వారా సందేశం లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు…
👉డిప్యూటీ కమిషర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన: కమిషనర్ ఆమ్రపాలి…హైదరాబాద్:ఆగస్టు 03..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికా రులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తు న్నందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన ఆమ్ర పాలి… కొందరు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె నలు గురు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పారిశుద్ధ్యంపై సీరియస్ గా దృష్టి పెట్టక పోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.బాధ్యులైన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమ్రపాలి స్పష్టం చేశారు. నగర పారిశుద్ధ్యం అంశంపై ఆమె నేడు జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిర్ణీత సమయానికే విధులకు హాజరయ్యేలా చూడాలని, చెత్త కుండీ పాయింట్ల ఎలిమినేషన్ పై తగిన చర్యలు తీసుకో వాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశారు. చెరువుల చుట్టూ కంచెలు వేయాలని, ఇప్పటికే ఉన్న కంచెలు ఎంత దృఢంగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించాలని సూచించారు…
👉 ‘డబ్బులు ఊరికే రావు…’ అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి..’ అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన.. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (జీఎస్టీఆర్-9) పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పింటిన రిటర్న్స్ లెక్కల ప్రకారం రూ. 41.22 కోట్లే రావాల్సి ఉన్నది. వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది. ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
👉ముసలి నక్క.. కరస్పాండెంట్ గా స్కూల్ కి కొనసాగుతూ….నాలుగో తరగతి విద్యార్థినిని బలవంతంగారూమ్‌లోకితీసుకెళ్లి..అత్యాచారం…అతనో పాఠశాలకు కరస్పాండెంట్.. వయస్సు 60 ఏళ్లు పైనే ఉంటుంది. పిల్లలకు స్కూల్లో కష్టనష్టాలు తీర్చి.. వారికి మంచి విద్యను అందిస్తూ.. వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన వ్యక్తి.. ఉన్మాదిలా ప్రవర్తించాడు. నాలుగో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ దారుణ ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మహిళ.. విబేధాలతో భర్త నుంచి విడిపోయి.. ఇద్దరు కుమార్తెలతో అనంతపురం వచ్చి.. జీవనం సాగిస్తోంది. రెండో కూతుర్ని ఇటీవల టౌన్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో చేర్పించింది. స్కూల్ హాస్టల్‌లో ఉంటూ.. బాలిక చదువుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం.. అన్నం తిన్నాక ప్లేట్ పై ఫ్లోర్‌లో ఉన్న గదిలో పెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ బాలికను బలవంతంగా తన రూమ్‌లోకి తీసుకెళ్లి.. లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించాడు…
👉సహాయ శిబిరాల్లో 10,042 మంది…కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు 358 మంది చనిపోయారు. ఇక సహాయ శిబిరాల్లో 10,042 మంది ఆశ్రయం పొందుతున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం తెలిపారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. వారి కోసం 93 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 67 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక రాయిపేట కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మరియు పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
👉‘వయనాడ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.వారి క్షేమం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత, బలంగా నిలబడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
👉మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వయనాడ్ బాధితులకు రూ.కోటి విరాళం…కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.ఇప్పుడు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.
👉హైదరాబాద్ : వయనాడ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు స్వచ్చంద సంస్థలు, చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ సాయం చేసి అండగా నిలిచారు.కాగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల భారీ విరాళం అందించారు.ఈ మేరకు కేరళలోని విపత్తు గురించి అల్లు అర్జున్ ఇలా ట్వీట్ చేశారు.
‘వయనాడ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.వారి క్షేమం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత, బలంగా నిలబడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
👉ఎస్బీఐ ఏటీఎంలో రూ.30 లక్షల చోరీ..అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది..ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎం లో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
👉చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ సీఐ గా నూతనంగా నియమితులైన బి.సుబ్బానాయుడుని చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, యడ్లపాడు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన జవ్వాజి మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత పరిధిలో నెలకొన్న పలు సమస్యల మీద సీఐ సుబ్బానాయుడు గారికి వివరించారు . రూరల్ పరిధిలో ఎటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు లేకుండా చూడాలి అని కోరారు. అలానే నియోజకవర్గ పరిధిలో వున్న పలు సమస్యలు వివరించి వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
👉రక్తదానం చేసిన ముత్తుముల వీరాభిమాని*
నంద్యాల జిల్లా, పాణ్యం మండలం, నందవరం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జన్మదినం సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి వీరాభిమాని దూదేకుల దస్తగిరి రక్తదానం చేశారు. పొలాల అమావాస్య సందర్బంగా నందవరం చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బోనేని వెంకటేశ్వర్లు, బొర్రా రాఘవేంద్ర యాదవ్, పందనబోయిన భూపాల్, కాళీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.*
👉ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను..ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ..
కంభం పట్టణంలోని ఉదయగిరి బృందాన్ ఫంక్షన్ హాల్ లో అర్ధవీడు, కంభం, బెస్తవారిపేట మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు.. మూడు మండలాలకు చెందిన ఉద్యోగులు మేళాతాళాలతో, పూలమాల శాలువాలతో ఘణ స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా ఆత్మీయ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచారని, ఇచ్చిన హామీలను నెరవేర్చగా పోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు.విద్యా విలీనం పేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల వద్ద నియమించి వారిని అగౌరవ పరిచారని, వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసుగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటీతంగా పోరాడి 2024 ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని, రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఎన్డీయే కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, వారందరికీ మద్దతు మరువలేనిదని ఎన్డీయే కూటమి గెలుపు వారందరికీ అంకితం అన్నారు.గిద్దలూరు నియోజకవర్గంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,గత పాలనలో జరిగిన నష్టాలను అధిగమిస్తామని, విద్యారంగాన్ని ముందంజలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు.సభ అనంతరం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన అశోక్ రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగులు ఘణంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన ఇన్-ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు మరియు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు పాల్గోన్నారు.*