నేడు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..జగన్ మీద కసిగా మాజీ మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు..ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా..మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ పై ఫిర్యాదులు..తెలంగాణ లో దారుణం..మహిళపై థర్డ్ డిగ్రీ!!!..

👉జగన్ మీద కసిగా మాజీ మంత్రి… జైలుకేనా ?

కడప జిల్లాలో సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి మొదట కాంగ్రెస్ తరువాత వైసీపీలో ఉన్నారు.కడప జిల్లాలో సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి మొదట కాంగ్రెస్ తరువాత వైసీపీలో ఉన్నారు. ఆయన 2014లో జగన్ పార్టీ ద్వారా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. మూడేళ్ళు తిరగకుండానే వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.జగన్ అధికారానికి దూరంగా ఉన్న రోజులలో కడప మంత్రిగా జిల్లాలో పవర్ ని చలాయించారు. జగన్ తనను తక్కువ చేసి చూశారని తనని సైడ్ చేశారని ఆయన ఎన్నో సార్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. జగన్ ని వీడిన తరువాత ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారు. 2019లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయినా కీలక నేతగా ఉన్నారు. 2024లో బీజేపీ తరఫున ఆది జమ్మలమడుగు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. తన బలం చెక్కుచెదరలేదని కూడా నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే అవకాశం వస్తే చాలు జగన్ మీద ఘాటైన విమర్శలు చేయడంలో ఆదినారాయణరెడ్డి ముందు వరసలో ఉంటారు. తాజాగా ఆయన జగన్ మీద సంచలన ఆరోపణలుచేశారు.ఈసారే కాదు 2029లోనూ ఏపీలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని బంపర్ విక్టరీ కొడుతుందని ఆది జోస్యం చెప్పారు. అంతే కాదు కూటమికి 200 సీట్లు వస్తాయన్నారు. మరి ఏపీలో ఉన్నవి 175 అసెంబ్లీ సీట్లే. కానీ ఆది రెండు వందలు అంటున్నారు అంటే అందులో అసెంబ్లీ సీట్లు 175 ప్లస్ ఎంపీ సీట్లు పాతిక కూడా కలిపి చెప్పారుట. అంటే ఏపీలో వైసీపీకి గుండు సున్నా సీట్లే వస్తాయని ఆది జోస్యం చెప్పారు. అంతే కాదు ఉలివెందులలో జగన్ ని ఈసారి ఓడించి తీరుతామని చాలా కసిగానే ఆది ప్రకటించారు. జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఇక రారని ఆయన నేరుగా వెళ్ళేది జైలుకే అని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు.*అయిదేళ్ళ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏకంగా అయిదు లక్షల కోట్లు దోచేశారని తీవ్ర ఆరోపణలే చేశారు. ఒకటీ రెండూ కాదు వైసీపీ నేతలు గత ఐదేళ్లలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని అలా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.*జగన్ తన 60 నెలల పాలనలో ఏనాడు కూడా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని అంటూ ఆది ఆయన మీద విరుచుకు పడ్డారు. అదే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని కొనియాడారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సామాజిక పింఛనుదారులకు ఒకటో తేదీనే ఠంచనుగా చెల్లింపులు చేయడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమని అభివర్ణించారు. జగన్ అయితే తన అరవై నెలల పదవీ కాలంలో జగన్ బటన్ నొక్కానని గొప్పగా చెప్పుకుంటూ తిరిగారు తప్ప ప్రజలకు తాను చేసిన ఒక్క మంచి పని లేదని ఆది సెటైర్లు వేసారు.*ఏపీలో వైసీపీ బ్యాచ్ మొత్తం అయిదు లక్షల కోట్లు దోచేస్తే అందులో జగన్ వాటా రెండు లక్షల కోట్లు అని మిగతాది మాత్రం అందరూ కలిసి మూడు లక్షల కోట్ల వరకు తిన్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.* వైసీపీ నేతల గురించి కూడా ఆది సెటైర్లు పేల్చారు. కొందరు జైల్లో ఉన్నారు,కొందరు బెయిల్ మీద ఉన్నారు,జగన్ రెడ్డి మాత్రం గాల్లో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ తిరిగినా తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోయే పరిస్థితి దగ్గరకు వచ్చేసిందని ఆది జోస్యం చెప్పారు.👉 ఏదైనా ఆర్ధిక లావాదేవీలలో 40 లక్షలకు మించి అవినీతి జరిగితే ఈడీ రంగంలోకి దిగుతుందని ఏపీలో చూసే లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆది మండిపడ్డారు. దాంతో ఈడీ కనుక ఎంటర్ అయితే జగన్ తో సహా అందరూ జైలుకు వెళ్లాల్సిందే అని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి పులివెందులలో జగన్ని ఓడించడం ఆయనని జైలుకు పంపడం ఖాయమని ఆది చాలా కసిగానే ప్రకటించేశారు. ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

👉నేడు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..

నేడు కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం.ఈరోజు ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సచివాలయం లోని 5 వ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. సాయంత్రం ఎస్పీ లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.రాత్రి 8 గంటల వరకూ సమావేశం జరుగనుంది. పలు కీలక శాఖలపై సమీక్షలు జరుగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఏపీ సీఎం చంద్రబాబు వివరించనున్నారు.
👉ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా..
ఐఐటీ లక్నోలో సీటు సాధించిన అత్తిలి విద్యార్ధి బసవయ్య..ఫీజు చెల్లించలేని పరిస్థితిపై బసవయ్య ట్వీట్..ఫీజు విషయం తాను చూసుకుంటానంటూ లోకేశ్ హామీ..
ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.👉లక్నో ఐఐటీలో చదువుకోవాలన్న ఆ విద్యార్ధి కలను లోకేశ్ సాకారం చేస్తున్నారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4 లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తన తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా నారా లోకేశ్‌కు ఆ విద్యార్థి తెలియజేయగా, వెంటనే స్పందించిన లోకేశ్ అతనికి భరోసా ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఇటీవల లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. అయితే కోర్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. పేదరికంలో ఉన్న తన తల్లిదండ్రులు అంత ఫీజు భరించే పరిస్థితి లేకపోవడంతో బసవయ్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇప్పటి వరకూ అతన్ని చదివించారు. ఐఐటీ ర్యాంక్ సాధించినా లక్నో ఐఐటీలో విద్యనభ్యంసించలేని పరిస్థితి బసవయ్యది.👉ఈ నేపథ్యంలో తన పరిస్థితిని బసవయ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ కు విన్నవించాడు. లక్నో ఐఐటీలో సీటుకు ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని, చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, తన పరిస్థితి చూసి సాయం చేయాలని బసవయ్య కోరాడు. దీనికి స్పందించిన లోకేశ్ రీట్వీట్ చేశారు. “బసవయ్య నువ్వు ఐఐటీ లక్నోలో చదువుతావు. నీ కల నెరవేరుతుంది. నీ ఫీజు విషయం నేను చూసుకుంటా. నీకు శుభాకాంక్షలు” అంటూ లోకేశ్ రీట్వీట్ చేశారు. దీంతో లోకేశ్ భరోసా పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విద్యార్థి కుటుంబసభ్యులు సైతం లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
👉 మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసే పార్టీ ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి ఫిర్యాదు చేశారు. టీటీడీలో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 40మంది దగ్గర డబ్బులు తీసుకుని.. అప్పటి ఈవో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు.గతంలోనే ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాము చెల్లించిన రూ.5లక్షలు తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నాగమాధవి వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు.. బాధితులకు న్యాయం చేయాలని, నకిలీ నియామక పత్రాలపై విచారణ చేపట్టాలన్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ తనతో పాటు చాలామంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదని.. ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ అనే మహిళ వినతిపత్రం అందజేశారు.
👉తాడిగడప మున్సిపాలిటీ* ..దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వలేదట అన్నట్లు ఉంది *తాడిగడప మున్సిపాలిటీ* పరిస్థితి..
మురళి నగర్ లో ఒక అనధికార నిర్మాణ విషయమై ఒక ప్రముఖ వ్యక్తి 3 నెలల నుండి *మున్సిపల్ కమిషనర్* వెంకటేశ్వర రావు కు ఫిర్యాదు చేస్తూ ఉండగా…
ఎట్టకేలకు ఒక వారం క్రితం స్పందించి సంబంధిత టౌన్ ప్లానింగ్ ఏసీపీ *మురళి గౌడ్* ను పిలిచి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు…
కమిషనర్ ఆదేశాలను సైతం ఆ సంబంధిత అధికారి బేఖాతరు చేస్తున్నారు..ఫిర్యాదుదారుడు సదరు అక్రమ కట్టడానికి మున్సిపాలిటీ వారు అందజేసిన నోటీసులు చూపించవలసిందిగా అభ్యర్థిస్తున్న మురళి గౌడ్ ఉదాసీనతగా వ్యవహరిస్తున్నాడు..*కమిషనర్ ఆదేశాలను ధిక్కరించడం వెనక ఆంతర్యం ఏమిటి?*సదరు నిర్మాణదారుడు ఆ అధికారికి ఎంత ముట్ట చెప్పాడు?..ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోక, ప్రభుత్వ ఆదాయానికే గండి కొడుతున్న అలాంటి అధికారులపై చర్యలు ఉండవా?..గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆ అధికారిలో ఎప్పటికీ మార్పు వస్తుంది?
👉తెలంగాణ లో దారుణం.. నేరం రుజువు కాకుండానే కొడుకు ముందే బట్టలు విప్పించి..మహిళపై థర్డ్‌ డిగ్రీ..!!!

దొంగతనం చేసిందని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు..పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టారు. పోలీసు దెబ్బలకు, ఆ థర్డ్‌డిగ్రీ ఎఫెక్ట్‌కి నడవలేని స్థితికి చేరుకుందా మహిళ…కదల్లేని స్థితిలో తీవ్ర నొప్పులతో అల్లాడుతోంది..10 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే యాక్షన్‌లోకి దిగింది.బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ మహిళను కొట్టి చిత్రహింసలకు గురిచేశారు.
👉అసలేం జరిగిందంటే…సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో 2 వారాల కిందట ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందంటూ నాగేందర్ అనే వ్యక్తి గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉంటున్న వారిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశాడు.. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి విచారణ ప్రారంభించారు. మొదట రామ్ రెడ్డి మరో నలుగురు సిబ్బందితో సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు 13 ఏళ్ల జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు.. తల్లి, కొడుకులను ఇద్దరినీ ఒక దగ్గరే ఉంచి వివరాలు సేకరించారు.. నిజం చెప్పడం లేదంటూ తల్లి కొడుకులను కొడుతూ తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు.*డిఐ రాంరెడ్డి తన కొడుకు ముందే కొడుతూ.. చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి వివస్త్రను చేసి.. కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ.. తన కన్నకొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారంటూ పేర్కొంది.. దొంగతనం నేరం ఒప్పుకోకపోవడంతో జగదీశ్వర్‌ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్‌తో కొట్టారని బాధితురాలు పేర్కొంది.. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా తనను ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేసింది.. అది కూడా తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని పేర్కొంది..
*బంగారం దొరికింది…నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని.. అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం: డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి
ఈ దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.. విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకు వచ్చామని అన్నారు. అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని.. అది విచారణలో తేలుతుందన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. పోలీసులు కొట్టిన దెబ్బలతో ప్రస్తుతం బాధితురాలు అస్వస్థతకు గురై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. మరో వ్యక్తి సాయంతోనే కదిలే పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
👉ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ..
ఈ విషయం తెలిసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నేరం రుజువైతే రిమాండ్‌కు తరలించాలి కానీ ఇలా విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు..ఈఘటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మానవ హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.పోలీస్‌ శాఖ అధికార దుర్వినియోగానికి ఈ ఘటననిదర్శనమన్నారు.మహిళపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం