నన్ను ఖచ్చితంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లేపేస్తారు-‘జగన్’..సైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్..తిరుపతి రుయాలో రోగుల అవస్థలు..’స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్..టిడిపిలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే దొరబాబు?.ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.

👉సైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్… బంగ్లాదేశ్ లో నెలల తరబడి నిరసనలు.. ఆందో ళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతి. కొన్నాళ్లుగా రిజర్వే షన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతి యుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారితీ శాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్‌ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది.కొన్ని నెలలుగా జరుగుతోన్న ఆందోళన.. రెండు, మూడ్రో జుల నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించారు ఆందోళన కారులు. పరిస్థితి చేయిదా టిపోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.45 నిమిషాల గడువు ..పరిస్థితులు ఆందోళన కరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు భద్రతా కారణాల దృ ష్ట్యా దేశం వెడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్‌కు చేరుకున్నారు. యూపీలోని ఘజియాబాద్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న షేక్ హసీనా లండన్‌కు వెళ్లారు.షేక్ హసీనా బంగ్లా దేశ్‌ను వదిలివెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. హసీనా ఇంట్లో ఉన్న ఫర్నీ చర్‌ ఇతర వస్తువులను పగలగొట్టి.. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్‌ బార్డర్‌లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.*ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ డీజీ కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. కరోనా తర్వాత బంగ్లా దేశ్‌ లో పరిస్థితులు దిగజారు తూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగు మతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాల వరకు అన్నీ ధరలు 20శాతం వరకు పెరిగాయి.యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవ డమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను విధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. స్టూడెంట్స్‌లో ఉన్న ఆగ్రహా వేశాలను బంగ్లాదేశ్‌లోని అపోజిషన్‌ పార్టీ ..బంగ్లా దేశ్‌ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది…

👉అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతోనే ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని గెలిపించారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేశార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.పరిపాలన‌ పరంగా రాష్ట్రంలో సమూల మార్పు రావాల‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతోనే ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని అప్ప‌గించార‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.తాజాగా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో

పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌జ‌ల ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు సహకరించాలని పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వ పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ఇప్పుడు వాటిని బ‌తికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పారు. బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేశార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో చిధ్రం చేశారని ఆరోపించారు. ఎవరినీ పనిచేయకుండా చేశారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞడైన సీఎం చంద్రబాబు అనుభవం, ఆయన చేసే దిశా నిర్థేశం, సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రి వర్గం అంతా సిద్దంగా ఉందన్నారు. 2047 నాటికి భారత దేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత్ ఆంధ్రప్ర‌దేశ్ ను నిర్వచించు కున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు స‌హకరించాలని ప‌వ‌న్ కోరా రు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయితీలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో `గ్రే వాటర్` మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్టు మేనేజ్మెంట్ విధానాన్ని అధునాత పద్దతిలో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద‌ ప్రతి గృహానికీ సురక్షిత తాగు నీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుంచి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయితీల్లో 5 కోట్ల 40 లక్షల ట్యాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకున్న‌ట్టు చెప్పారు.

👉నన్ను ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రభుత్వం లేపిస్తారు…. జగనన్న కోర్టు లో సంచలన స్టేట్మెంట్…తనకు ప్రాణహాని ఉందని.. సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనకు భద్రత తగ్గించేశారని, తనకు ప్రాణహాని ఉండడంతో..ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా… ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విన్నపాలు వినిపించారు. తనకు కేటాయించిన వాహనం కూడా సరిగాలేదని పిటిషన్‌లో తెలిపారు జగన్‌. మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించారని వివరించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ధర్మాసనం.. మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని… అది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేశారని పిటిషన్‌లో తెలిపారు జగన్‌. జడ్ ప్లస్‌గా ఉన్న తన భద్రత తగ్గించడంతో పాటు… భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు ఇద్దరు అధికారులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని.. ఇది తన ప్రాణాలకు ప్రమాదం అని జగన్ పిటిషన్‌లో వివరించారు. గతంలో తనపై జరిగిన కోడికత్తి దాడితో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. జూన్ 3 నాటికి జగన్‌కి 900 మందితో భద్రత ఉంది. ఐతే ఆ రోజున ఉన్న స్థాయికి… తన భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో కోరారు

👉*బదిలీ ఇలా.. పింఛను బదిలీ* బదిలీ ఇలా.. పింఛను బదిలీ చేయించుకోవాలనుకునే వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పింఛను వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పింఛను ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో చిరునామా ఇవ్వాలి. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేర్లు అందులో పేర్కొనాలి.

👉 తిరుపతి జిల్లా .. రోగుల పట్ల నిర్లక్ష్యంగా డాక్టర్లు… తిరుపతి రుయా హాస్పిటల్ లో ఐడి హెచ్ వార్డ్ లో రోజుకు ఒక ప్రాణం పోతున్నది. ట్రైనింగ్ స్టూడెంట్స్ ని పెట్టి రాత్రి వేళలో డాక్టర్లు డుమ్మా కొడుతున్నారు.ఈ ట్రైనింగ్ స్టూడెంట్స్ కూడా రోగులను పట్టించుకోకుండా తలుపులు మూసివేసి నిద్రిస్తున్నారు. రాత్రి వేళలో మమ్మల్ని ఎవరూ పట్టించుకునే వారే లేదని రోగులు వాపోతున్నారు.ఐడి హెచ్డి వార్డులో రోజుకి ముగ్గురు నలుగురు లెక్కన చనిపోతున్నారు . సరైన వైద్యం అందకుండానే చనిపోతున్నారని రోగులు కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఐ డి హెచ్ వార్డ్ డాక్టర్ల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రోగులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

👉ఎల్లుండి టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ..నామినేటెడ్ పదవులపై చర్చ..అమరావతీ..టీడీపీ అధినేత మరియు సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 8న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.నామినేటెడ్ పదవుల పంపకం,పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. అలాగే విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై నిర్ణయంతీసుకోనున్నారు.

👉నాటు తుపాకీ కలకలం నాటుతుపాకి తో కాల్చుకొని వ్యకి మృతి.. రాయచోటి: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివాండ్ల పల్లె వద్ద నాటు తుపాకీ కలకలం.. నాటు తుపాకీతో కాల్చుకున్న చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్  ..తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ మృతి ..ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న రాజగోపాల్ ..అప్పుల బాధే కారణం అంటున్న స్థానికులు.. సంఘటనా స్థలంలోనే నాటు తుపాకీ

👉నేడు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్*.. విశాఖపట్నం :రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ మళ్లీ మొదలైంది. విశాఖ ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఇక ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

👉*వైసిపికి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు?*పిఠాపురం :2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం అయ్యారు. రేపు వైసిపికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయనున్నారట. దీనిపై ఆయన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. త్వరలో ఆయన జనసేనలో చేరనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదనివంగా గీతకు వైసిపి టికెట్ ఇచ్చారు జగన్.అప్పటి నుంచి దొరబాబు వైసీపీ పార్టీ పై అసంతృప్తిగానే ఉన్నారట.

👉ఏపీలో ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..అమరావతీ ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈమేరకు ఐఎంఎంఎస్ యాప్లో ఈ ఆప్షన్ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..