మాజీ సీఎం కేసీఆర్‌కు సెషన్స్ కోర్ట్ నోటీసులు?..ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు హర్షణీయం..పొన్నూరు తహసీల్దారు ఆఫీస్ లో కీలక దస్త్రాలు మాయం.బైకుల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు..పేరు పేద‌ల‌ది..భూ క‌బ్జా వైసీపీ పెద్ద‌ల‌ది-బాలాజీ ఆరోపణ.. …టెలిఫోన్ రంగ ఉత్పత్తుల పెంపుపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న..మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ.. సచివాలయ కార్యదర్శి పై దాడి!!!.

♦👉బాంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళన లో భారీ హింస చెలరేగింది. ఒక హోటల్ కు అల్లరి మూకలు నిప్పు పెట్టటం తో 30 మంది సజీవ దహనం అయ్యారు. నిన్న ఒక్కరోజే బంగ్లాదేశ్ లో జరిగిన ఘర్షణ లలో 300 మంది చనిపోయారు*
👉మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి సెషన్స్ కోర్ట్ నోటీసులు?..హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న విచా రణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్‌ దాఖలు చేయటంతో కేసీఆర్‌కు నోటీసులు ఇష్యూ చేసింది.
కేసీఆర్, హరీష్‌రావుతో పాటు మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది,సెషన్స్ కోర్ట్. ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్,తో పాటు
కాలేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరి రామ్, శ్రీధర్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టి కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్‌కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది…
👉ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హర్షణీయం..*జే.శ్రీనివాసరావు,రాష్ట్ర అధ్యక్షుడు,*
*ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్*
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన కలెక్టర్, ఎస్పీల సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… అధికారం ఉందని పెత్తందారులుగా ప్రవర్తించకుండా.. సహ ఉద్యోగులతో పని చేయించుకోవాలని, వారిని అవమానించేలా మాట్లాడొద్దనీ సమస్యలను కేవలం రూల్ పొజిషన్లో మాత్రమే చూడకుండా మానవతా దృక్పథం కోణంలో ఆలోచించి సమస్యను పరిష్కరించాలనే వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ,ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి క్రింది స్థాయి ఉద్యోగుల ఆత్మాభిమానం పట్ల వారికున్న గౌరవాన్ని సూచిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జే.శ్రీనివాసరావు,
తెలిపారు.
👉పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం…!!!   గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి(డీవీసీ) పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆరా కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు.
ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సీఐడీ విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు. దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్చార్జి తహసీల్దారు ఐ.ప్రశాంతిని వివరణ కోరగా.. డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ అనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు.
👉అమరావతి….*హత్యాయత్నం సెక్షన్ చేర్చడం సరైనదే..తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు స్పష్టీకరణ..నలుగురు నిందితులకు షరతులతో బెయిలు..మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూక దాడి కేసులో దర్యాప్తు అధికారి(ఐఓ) ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకర ఆయుధాలతో తీవ్రంగా గాయపరచడం)లను చేర్చడాన్ని హైకోర్టు సమర్థించింది. ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఎఫ్ఎఆర్లోనే ఉన్నాయని, 307, 326 సెక్షన్లను చేర్చకపోవడం అప్పటి ఐఓ అసమర్థత అని ఆక్షేపించింది. కేసు ప్రాథమిక దశలో అప్పటి ఐఓ విస్మరించిన వివరాలను తర్వాత దశలో సరిచేయడాన్ని తప్పుపట్టలేమంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అదనపు సెక్షన్లు చేర్చవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 307, 326 సెక్షన్లను చేరుస్తూ ఐఓ దాఖలు చేసిన మెమోను తిరస్కరించాలన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. మరోవైపు పిటిషనర్లు జులై 3 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ సమయంలో దర్యాప్తులో పురోగతి ఉందని గుర్తుచేసింది. పిటిషనర్లకు బెయిలిస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని అభిప్రాయపడింది. షరతులతో బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. 2021లో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరుకు చెందిన ఎ.వెంకటరెడ్డి, బత్తుల దేవానంద్, షేక్ ఖాజా మోహియుద్దీన్, షేక్ మస్తాన్ వలీలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. తమకు బెయిలు మంజూరు చేయాలని వారు చేసిన అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని ప్రకటించారు. పిటిషనర్లకు షరతులతో బెయిలు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.
👉బైకుల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు*
గిద్దలూరు పట్టణంలో జల్సాలకు అలవాటు పడి బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.గిద్దలూరు పట్టణానికి చెందిన ఆవుల నవీన్ కుమార్ ఆవుల రాధాకృష్ణ మరియు గొల్లపల్లి రంగ ప్రసాద్( బైక్ మెకానిక్) లను పట్టుకొని వారిని విచారించి వారి వద్ద నుంచి ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలను గిద్దలూరు కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు
గిద్దలూరు అర్బన్ సీఐ వైవి సోమయ్య వారి సిబ్బంది ఏఎస్ఐ జిలాని సాహెబ్ హెచ్ సి శివారెడ్డి PC నాయబ్ రసూల్ అబ్దుల్ సాహెబ్, రామయ్య మరియు సుధారావులను ,ప్రకాశం జిల్లా ఎస్పీ అభినందించారు అని గిద్దలూరు అర్బన్ సీఐ వైవి సోమయ్య తెలిపారు.
👉 పల్నాడు జిల్లా
మాచర్ల :- బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య… సూసైడ్ కి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది..*
తను ఉంటున్న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్ల మండలంలో న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని… స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్…
విద్యార్థిని మృతి పై విచారిస్తున్న మాచర్ల పోలీసులు…
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది
** టెలిఫోన్ రంగ ఉత్పత్తుల పెంపుపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న..
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టెలిఫోన్ రంగంలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI Scheme) పధకం క్రింద టెలిఫోన్ మరియు నెట్ వర్క్ ఉత్పాదక సామర్ధ్యత పెంపు కొరకు రాయితీలు పొందుటకు దరఖాస్తు చేసిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు సంఖ్య, ఆమోదం పొందినవి, విడుదలచేసిన నిధులు, ఉత్పత్తులు, తయారీ, మరియు ఎగుమతుల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార & గ్రామీణాభివృద్ధి శాఖ సహాయక మంత్రి, డా.పెమ్మసాని చంద్ర శేఖర్ సమాదానమిస్తూ దేశంలో టెలిఫోన్ రంగంలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పధకం క్రింద టెలిఫోన్ మరియు నెట్ వర్క్ ఉత్పాదక సామర్ధ్యత పెంపు కొరకు రాయితీలు పొందుటకు 28 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు రాయితీలు పొందాయని, అందులో డిల్లీలో 14, కర్నాటకలో 4, హర్యానాలో 2, మహారాష్ట్రలో 2, గోవాలో 1, గుజరాత్ లో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 1, తెలంగాణలో 1 మరియు వెస్ట్ బెంగాల్ లో 1 రిజిస్టర్డ్ ఆఫీసులు వున్నాయని, దేశం మొత్తంలో మరి 42 దరఖాస్తులు ఆమోదించబడగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమీ లేవని తెలిపారు. ఈ పధకం క్రింద రూ.11,244 కోట్లు నిధులు కేటాయించబడగా, రూ. 332 కోట్లు నిధులు విడుదలచేయడం జరిగిందని మరియు 31-05-2024 నాటికి రూ.304 కోట్లు పెత్తుబడితో రూ.3,469 కోట్లు అమ్మకాలు జరిగాయని తెలిపారు.
ఈ పధక లబ్దిదారులకు పోటీతత్త్వం మరియు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు డిజైన్ తయారీ క్రింద ఒక శాతం అధిక ప్రోత్సాహంతో పాటు అదనపు ఉత్పత్తులకు అనుమతి కూడా కల్పించబడిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. 👉 నేడు దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి ఏర్పాటు చేసిన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యం లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలలకు నేడు కుట్టు మెషిన్ పంపిణి కార్యక్రమం జరిగింది.మహిళా సాధికారత లో భాగంగా ఈ విడత లో 24 ఉచిత కుట్టు మెషిన్ సెంటర్లు ను ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసినారు. అందులోని తాళ్లూరు శిక్షణ కేంద్రం లో కుట్టు మెషిన్ పంపిణి కార్యక్రమం లో 21 మంది శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలలకు కుట్టు మెషిన్ లు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడగం సుబ్బా రెడ్డి,ఎడమకంటి శ్రీనివాస రెడ్డి , తూము శివా రెడ్డి,అనపర్తి సుబ్బారావు పలువురు నాయకులు మహిళలు పాల్గొన్నారు.

👉పేరు పేద‌ల‌ది… భూ క‌బ్జా వైసీపీ పెద్ద‌ల‌ది ..వైసీపీ నాయ‌కుల‌ కబ్జా కుంభకోణాల నిగ్గు తేల్చాలి..భాద్యులైన వారి నుంచి భూములు స్వాధీనం చేసుకొని అర్హులైన పేద‌ల‌కు అందించాలి..జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేలబాలాజి…చిల‌క‌లూరిపేట‌: ♦వైసీపీ పాల‌న‌లో కొన‌సాగిన భూక‌బ్జాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి, ప్ర‌భుత్వం భాద్యులైన వారి నుంచి భూములు స్వాధీనం చేసుకొని అర్హులైన పేద‌ల‌కు అందించాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి కోరారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ ‘గత వైకాపా పాలనలో మండలానికో భూకుంభకోణం జరిగింది. వైకాపా నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై ఆన్‌లైన్లో పేర్లు మార్చేయడం, రికార్డులను తారుమారు చేయడం వంటి అక్రమాలు చేశారు. గ్రీవెన్స్‌లో ఈ తరహా సమస్యలే 90 శాతం వచ్చాయి’ అని సీఎం చంద్ర‌బాబునాయుడు సైతం భూక‌బ్జాల‌పై స్పందించార‌ని గుర్తు చేశారు. ఐదేళ్ల‌ వైసీపీ పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి లేకున్నా.. నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా కబ్జాలతో కాలం గడిపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయ‌కుల‌ కబ్జా కుంభకోణాల నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు…గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భూకబ్జాలు, విలువైన స్థలాల అన్యాక్రాంతం, అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం విడుద‌ల చేసిన శ్వేతపత్రంలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు వెల్ల‌డ‌య్యాయ‌ని వివ‌రించారు. గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారని. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అక్రమాలు, ఆక్రమణలకు కొదవే లేదని, అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించారని వెల్ల‌డించారు. . జలవనరులు, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ.. ఇలా అన్ని శాఖల భూములను కబ్జా చేశారని మండి ప‌డ్డారు. అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా నాటి ప్రభుత్వం చేసిన చట్టంతో వైసీపీ పెద్ద‌లు గ‌ద్ద‌ల్లా పేద‌ల భూములు స్వాహ చేశార‌ని వెల్ల‌డించారు.సాగు భూముల్లో అక్రమ లేఔట్​లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాలు, వ్యవసాయ భూముల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికలోనూ, వైసీపీ నాయకులు జోక్యం చేసుకునేవారని అధికారులే స్ప‌ష్టం చేశార‌ని పేర్కొన్నారు. వర్షాలకు నీటమునిగే ఆవ భూములను సేకరించారని, ఇళ్ల పట్టాలకు అనుకూలం కాని వీటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లించారని ,ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా మధ్యవర్తులు వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూక‌బ్జాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ నిర్వ‌హించాల‌ని కోరారు.

👉లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు అరెస్ట్. కృష్ణాజిల్లా: పామర్రు మండలం నిమ్మకూరు గ్రామం జడ్పీ హైస్కూల్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు అరెస్ట్*హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న బాలిక..ఈనెల 1వ తారీఖున వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు దాసరి వెంకట నాగేశ్వరరావు (58)రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులుఈరోజు కోర్టుకు హాజరు పరచనునట్లు తెలిపిన ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి..

👉పతీ పత్నీ ఔర్ దోకా కహానీ..భార్య మోసాలకు భర్త ప్రోత్సాహం..సైనికోద్యోగి అయిన భర్తతో కలిసి మోసాలకు పాల్పడుతున్న మహిళ..ఏపీలో మోసపూరిత నేరాలు చేస్తూ హైదరాబాద్ లో మకాం..కిడ్నీల అమ్మకం, చిన్నారుల అమ్మకం, మెట్రిమోని మోసాలు, అవయవాలు, వీర్యకణాల అమ్మకాల దందాలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళ..సహజీవనం పేరుతో పురుషులను టార్గెట్ చేసి లక్షల్లో దోచుకున్న కిలాడీ…ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని పేద, ఒంటరి మహిళలే టార్గెట్ గా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ రాకెట్ ..మోసపోయామని గ్రహించి పరువు పోతుందని మిన్నకుండిపోతున్న భాదితులు..
👉సచివాలయ ఫెన్సింగ్ ధ్వంసం చేసిప్రశ్నించిన సెక్రటరీ పై దాడి..ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభంలో నలుగురు వ్యక్తులు సోమవారం సచివాలయ ఫెన్సింగ్ ధ్వంసం చేసిప్రశ్నించిన సెక్రటరీ పై దాడి చేయగా కంభం పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం కంభం పోలీసులు ఫిర్యాదు స్వీకరించినట్లు చిన్న కంభం సర్పంచ్ రసూల్ తెలిపారు .

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం