ఎన్నో కష్టాలకు ఓర్చింది ..ఒలింపిక్స్ లో పతకం సాధించింది.. జైల్లోనే ఉంటా!! కవిత..గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి..హైదరాబాద్‌లో విలేకరిపై కత్తులతో దాడి..కారుకు సైడ్ ఇవ్వలేదని చంపేశారు.వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచుకునేందుకు కుట్ర..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యేలు కుందూరు , అన్నా. మరికొన్ని విశేషాలతో

👉 *ప్యారిస్ ఒలింపిక్స్.. గురు చూసి దెబ్బ కొట్టింది.. పతకం రికార్డుతో పంచు…*వినీష్ ఫోగట్:ఏడాది క్రితం ఆమెను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళారు. పోలీసులతో దెబ్బలు తింది.న్యాయం కోసం రోడ్ల మీద ధర్నా చేసింది. అరెస్ట్ అయింది..వేధింపులకు గురయింది. దీంతో కెరీర్ ఖతం అయిపోయింది అనుకున్నారు అందరూ. విద్వేషకారులు విషం చిమ్ముతునా తన పోరాటం ఆపలేదు. వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాను ఎదురిస్తూనే..తన పంచ్‌లకు పదును పెట్టుకుంది.తప్పు చేసిన వారి తలలు దించుకునేలా పట్టుదలతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకుంది వినేశ్ ఫోగట్.

పోరాటంలో..* మహిళా రెజర్ల మీద లైగింకవేధింపులు ఆరోపణలతో ఒకప్పటి బీజేపీ ఎంపీ , రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మీద వినేశ్ ఫోగట్ అలుపెరుగని పోరాటం చేసింది. ఆ సమయంలో ఆమెకు చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు. ప్రభుత్వం అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డను వెనక్కు తిరిగి ఇచ్చేసింది. సాధించిన పతకాలన్నీ గంగానదిలో విసిరేస్తానని చెప్పింది. అయినా కూడా ఇసుమంత అయినా కూడా రెజర్లకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు వినేశ్ కెరీర్ ఖతం అయిపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. అన్యాయం చేసినవాళ్ళు కాలరెగరేసుకుని దర్జాగా తిరుగుతుంటే ఆవేశంతో రగలిపోయింది. తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో… జూనియర్‌ చేతిలో ఓడితే.. ఇక నీట కట్టు అంటూ అవహేళన చేశారు. కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ తనలోనే ఆవేశాన్ని మాత్రం చంపుకోలేదు….*పారిస్ ఒలింపిక్స్…* అసలు ఇప్పటివరకు మూడుసార్లు ఏ రెజ్లర్ ఒలింపిక్స్‌కు ఎంపిక అవ్వలేదు. మొట్టమొదటిసారి వినేశ్ ఆ ఘనత సాధించిన మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్ మీద పెద్దగ అంచనాలు ఏమీ లేవు. ఇదే ఆమెకు బాగా అనుకూలంగా మారింది. దాంతో మొదటి నుంచి అన్ని పోరాటాల్లోనే విజయం సాధించుకుంటూ వచ్చింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్ వరకు పెద్దగా చెపపుకోవడానికి ఏమీ లేదు. కానీ ప్రీ వార్టర్స్‌లో మాత్రం ఆమెకు గట్టి పోటీనే ఎదురయింది. జపాన్‌ రెజ్లర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌, టోక్యో స్వర్ణ పతక విజేత యీ సుసాకీ రూపంలో. ఈ పోరాటంలో వినేశ్ 3-2త సుసాకీని ఓడించింది. ఆ తర్వాత మరీ గట్టి పోటీ ఎదురయింది.ఉక్రెయిన్‌కు చెందిన, ప్రపంచ నంబర్ వన ఒక్సానా లివాచ్‌తో వరల్డ్‌ నంబర్‌ 65 వినేశ్‌ ఫొగట్‌ తలపడింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో లివాచ్‌ను7-5 తేడాతో వినేశ్ లివాచ్ పని పట్టింది. పరంచ నంబర్ వన్‌ను మట్టికరిపించి మరీ సెమీస్‌కు అర్హత సాధించింది. దాంతో ఈ ఘనత సాధించినతొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్రకెక్కింది.ఇప్పుడు ఈరోజ జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలో క్యూబా క్రీడాకారిణి గజ్‌మ్యాన్ లోపేజ్ మీద 5-0 తేడాతో వినేశ్ విజయం ఆధించింది. దీని ద్వారా మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన క్రీడాకారిణిగా వినేశ్ చరిత్ర సృష్టించింది. బుధవారం ఫైనల్‌ జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో కూడా ఇదే తొలి పతకం కానుంది.*ప్రశంసల వర్షం…*వినేశ్ ఫోగట్ మీద ప్రశంసల వర్షం కురుతోంది. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వినేశ్‌ను కొనియాడారు. ఆమె పోరాటం అద్బుతం అంటూ పొగిడారు. అసాధారణ విజయం. వరల్డ్‌నంబర్‌ వన్‌ సుసాకీని వినేశ్‌ ఓడించడం నమ్మశక్యంకాని విషయం. ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతుంది. ఎన్నో కష్టాలు చవిచూసింది. తను పతకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ నీరజ్‌ చోప్రా వినేశ్‌ ఆట తీరును ఆకాశానికెత్తాడు.

👉బెయిల్ వద్దు జైల్లోనే ఉంటా!!..డీల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.*ఈ కేసులో తనకు బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) విచారణకు వచ్చింది. అయితే కవిత తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు కవిత బెయిలు పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈ లోగా తన బెయిలు పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు.కవిత బెయిలు పిటిషన్ ఉపసంహరణ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు కారణాలు చూపుతూ కవిత పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి.

ఒక దశలో పదే పదే బెయిలు పిటిషన్లు దాఖలు చేస్తున్నందున న్యాయమూర్తి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ చార్జిషీట్ దాఖలు చేశాయి..దీంతో కవిత డిఫాల్ట్ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం (ఆగస్టు 7) విచారణకు రానుండగా కవిత మంగళవారం (ఆగస్టు 6) తన బెయిలు పిటిషన్ ను ఉపసం హరించుకున్నారు. కవిత తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ న ఉపసంహరించుకోవడం సంచల నంగా మారింది. బెయిలు పిటిషన్ ఉపసంహరణ వెనుక ఉద్దేశమేమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

👉*వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయడానికే వక్ఫ్ బోర్డు సవరణ- న్యాయవాది ముక్తార్ అలీ*

బోర్డు ఆస్తులను కాజేయడానికే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారని ముక్తార్ అలీ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో సాయిధబలగాలు రైల్వే ఆస్తులు తర్వాత సుమారు 9 లక్షల ఎకరాలు ఉన్న మూడో అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డు అని, అప్పట్లో రాజులు మతపరమైనటువంటి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయుట కొరకు ఇనాములుగా భూములు ఇచ్చారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింల ఆస్తులను కాపాడటం కోసం 1954 వక్ఫ్ చట్టం తీసుకొచ్చారని, అప్పట్లో సర్వే చేసి గెజిట్ లో నమోదు చేసి ఎవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయో వారికి టైటిల్ ఇవ్వటం జరిగిందని, ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని దానిని కాపాడటానికి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సింది పోయి వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే విధంగా బిల్లు ప్రవేశ పెట్టడం వక్ఫ్ ఆస్తులను కాజెయాలనే దురుద్దేశంతోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువస్తున్నారని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిల్లుకు మద్దతును నిరాకరించాలని కోరారు.

👉సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌  ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్‌ అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.బంగారంతో పాటు, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
👉మాజీ మంత్రి రజిని పేటను దోచుకుంది!!! : తోటరాజ రమేష్…గడిచిన ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో మాజీ మంత్రి విడుదల రజిని చిలకలూరిపేట ను అన్ని విధాలుగా దోచుకుందని చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంకు చెందిన దళిత రైతులు రాజా రమేష్ ను కలసి మాకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. 46 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ కి సంబంధించిన పొలాలను భూ సేకరణ పేరుతో గత వైసిపి ప్రభుత్వం మాజీ మంత్రి విడుదల రజిని మమ్మలను మోసం చేసి అక్రమంగా మా పొలాలను లాక్కున్నారని తెలియజేశారు.మా గ్రామంలోని కొంతమంది నాయకులు ఇందుకు సహకరించారని తెలిపారు . ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా తోటా రాజా రమేష్ మాట్లాడుతూ ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తానని ఎడవల్లి దళిత రైతులకు హామీ ఇచ్చారు.
👉 బాపట్ల జిల్లా, చీరాల పట్టణములో ముఖ్యమంత్రి సభా స్థలాన్ని చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురిలో పరిశీలిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్, జె వెంకట మురళి, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. సుబ్బారావు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తదితర అధికారులు…ఏడాది మధ్యలో పోలీసుల బదిలీలా…!!!👉విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించేలా చర్యలా…ఆందోళనలో పోలీస్ కుటుంబాలు…👉ఊరు కాని ఊరు బదిలీ చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావితం చూపవా ..😔 *ఆంధ్రప్రదేశ్:జూన్ నెలలో స్కూళ్లు కాలేజీలు ప్రారంభిస్తారు, విద్యార్థులు చదువుకు నేందుకు వీలుగా జూన్ నెలలోనే కాలేజీలు స్కూల్లో చేరుతుంటారు, అయితే పోలీసులకు ఏడాది మధ్యలో బదిలీ చేస్తే చదువుకి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పోలీస్ బదిలీలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులైనా పోలీసుల బదిలీలు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. అధికారుల స్థాయి అయితే పరవాలేదు క్రింది స్థాయి పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఏడాది మధ్యలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చలేని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వారి కుటుంబాల నుండి వ్యక్తం అవుతోంది. జూన్ నెలలో బదిలీలు జరిగినట్టయితే అదే సందర్భంలో స్కూళ్లు కాలేజీల కు వాళ్ల పిల్లలు వెళ్లడంతో విద్యకు ఎటు వంటి ఆటకం కలగకుండా ఉండే అవ కాశం ఉండేది, కానీ ఇప్పుడు ఏడాది మధ్య లో ఊరు కాని ఊరు బదిలీ చేస్తే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తమ పిల్లలతో స్కూళ్లు కాలేజీలు మార్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది కర పరిస్థితి నెలకొంటుందని వారి కుటుంబాల నుంచి వినవస్తున్న ఆవేదనంగా ఉంది. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టి సారించి విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వారు భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టి త్వరగా బదిలీలు చేయబడితే బాగుంటుందని పోలీస్ కుటుంబాల నుంచి వినిపిస్తుంది._

👉 హైదరాబాద్‌లో విలేకరిపై కత్తులతో దాడి చేసిన రౌడీ షీటర్లు !!!..

మైలార్ దేవ్ పల్లిలో రెచ్చిపోయిన రౌడీ షీటర్ సోహెల్ గ్యాంగ్..సోహెల్ అరాచకాలు తన‌ యూట్యూబ్‌లో టెలిక్యాస్ట్ చేసిన రిపోర్టర్ మూబీన్ దీంతో కక్ష్య పెంచుకొని అర్ధరాత్రి మూబీన్‌పై కత్తులతో దాడి చేసిన సోహెల్ గ్యాంగ్.అడ్డుకున్న వారిపై కూడా దాడి చేసి.. ఇప్పుడు నా చేతి నుండి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి పారిపోయిన సోహెల్ గ్యాంగ్.అర్ధరాత్రి ముబీన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న కుటుంబీకులు.

👉పలువురికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఉదయం పలువురికి నివాళులు అర్పించారు. కంభం మండలం కందులాపురం గ్రామంలో స్వర్గస్తులైన పెద్దిరెడ్డి అల్లూరిరెడ్డి భౌతికకాయానికి, బెస్తవారిట మండలం, గొట్టంమిల్లు గ్రామంలో స్వర్గస్తులైన గొట్టం కాశయ్య మరియు గొట్టం నాగరాజు భౌతికకాయాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారితో పాటు స్థానిక నాయకులు నివాళులు అర్పించారు.
👉అందరికీ రేషన్ అందాలి..ఇన్ఫోసిమెంట్ డిటి అనిల్ కుమార్…రేషన్ సరుకులు అందరికీ అందాలని ఎన్ఫోర్స్మెంట్మెంట్ డిటి అనిల్ కుమార్ రేషన్ డీలర్లకు మరియు యండుల కు సూచించారు👉 గిద్దలూరు లోని పలు రేషన్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు వినియోదారులకు అందుబాటులో దుకాణాలను నిత్యం తేరిచి ఉంచాలని తూకంలో తేడాలు లేకుండా సరుకులు ఇవ్వాలని సూచించారు.బియ్యం పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే చేది లేదని తెలిపారు ఎంఎల్ఎస్ పాయింట్ నందు డీలర్ వెళ్లి తూకం వేసుకొని సరుకులు తెచ్చుకోవాలని కోరారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
*మానవత్వం చాటుకున్న పోలీసులు..*
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో పోలీసులు మానవత్వం చాటుకున్నారు.ఓ వృద్ధుడు చెత్త కుప్పలో పడి ఉన్న విషయాన్ని గుర్తించి గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్యకు సమాచారం అందించారు. దీంతో సిఐ సోమయ్య ఆదేశాల మేరకు వృదుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడు ఉన్న పరిస్థితిని చూసి చలించి పోయారు.వృద్ధుడు మూగవాడు కావడంతో అతను ఎక్కడ నుంచి వచ్చాడో ఎందుకు ఇక్కడ ఉన్నాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించారు.
వృద్ధుడిని స్థానికంగా ఉన్నా సంజీవిని వృద్ధాశ్రమానికి తరలించి ఆశ్రయం కల్పించారు.వృద్ధుడి బంధువులు కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు సీఐ సోమయ్య ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. వృద్ధుడు తన కుటుంబ సభ్యులు పట్టించుకోరని ఇక్కడే అనాధాశ్రమంలో ఉంటానని సైగలు చేస్తూ పోలీసులకు తెలిపాడు. దిక్కు తోచని స్థితిలో పడి ఉన్న వృద్ధుడిని సీఐ సోమయ్య పోలీసు సిబ్బంది అనాధాశ్రమంలో ఆశ్రయం కల్పించడంపై స్థానిక ప్రజలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
👉 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్దపెన్షనర్ల  ధర్నా ..
👉 వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెడుతున్న ఎన్డీఏ కూటమి –
వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచుకునేందుకు మోడీ అమిత్ షా ద్వయం కుట్ర….
ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా ధ్వజం….
పొదిలి. (ఆగస్టు 5 ). బిజెపి ,ఎన్ డి ఏ కూటమి మోడీ ,అమిత్ షా ద్వయం 1995. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేస్తూ వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందాని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా నేడు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
మైనార్టీ హక్కులకు భంగం కలిగితే ఉపేక్షించమని కోతలు కోసిన చంద్రబాబు, లోకేష్ ,జగన్, పవన్ లు వక్ఫ్ నల్ల బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో, రాజ్యసభలో వ్యతిరేకించాలని,దేశంలో లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములను బిజెపి ప్రభుత్వం తన మిత్రులకు దోచి పెట్టేందుకు కుట్రలు పన్నుతుందని షేక్ సైదా అన్నారు.
1954 వక్ఫ్ చట్టం ద్వారా మసీదులు, దర్గాలు, ఇనాం భూములను , దేవుని ఆస్తులను కాపాడుతూ వస్తున్న గత ప్రభుత్వాలు .దేశంలో దాదా 9.4 లక్షల ఎకరాల భూములు కలిగిన అతిపెద్ద సంస్థ వక్ఫ్ బోర్డ్ అని,దేశంలో వక్ఫ్ ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్లు మరియు వార్షిక రాబడి 12,000 కోట్లు రూపాయలని సైదా అన్నారు.దేశంలోని ముస్లిం మైనార్టీలు, వక్ఫ్ బోర్డు చట్టాల మీద కొంతమంది కోహ నా మేధావులు విషం చిమ్ముతున్నరని,మిడిమిడి జ్ఞానంతో , విద్వేషంతో దేశంలోని మైనార్టీల మీద అబద్దాలను సంఘ పరివార్
ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించకుండా ఇండియా కూటమి ,ఎన్ డి ఏ కూటమి మిత్రపక్షాలు వ్యతిరేకించాలని వక్ఫ్ ఆస్తులపై గొడ్డలి ప్రయోగించిన తర్వాత సిక్కులు, క్రైస్తవులు, దేవాదాయ శాఖ భూములను బిజెపి కాజేస్తుందని విమర్శించారు.
ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో 8,54,509 ఆస్తులు ఉన్నాయని, 2024 ఎన్నికల తర్వాత అయినా బిజెపిలో మార్పు వస్తుంది అని దేశ ప్రజల ఆశించారని, కానీ మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల మధ్య ఆనైక్యతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తూనే! ఉందని సైదా నిషితంగా విమర్శించారు.*బిజెపి తన స్వీయ హిడెన్ ఎజెండాతో ముందుకెళ్లటం దుర్మార్గమని,బిజెపి ఎన్డీఏ కూటమి అవలంబిస్తున్న విధానాల వల్ల దేశ లౌకిక వ్యవస్థకు బీటల బారుతున్నాయిని సైదా తీవ్రంగా విమర్శించారు.వెంటనే బిజెపి ఎన్డీఏ కూటమి మైనార్టీ హక్కులను కాలరాసే నల్ల చట్టలను పార్లమెంట్లో ప్రవేశ పెట్టవద్దని, అలాగే ఆంధ్ర ప్రదేశ్ చెందిన తెలుగుదేశం, జనసేన,వైసిపి పార్టీలు పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ నల్ల చట్టాలను వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా కోరారు.
**జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు
అక్రిడిటేషన్‌ రూల్స్‌లో కొంతభాగాన్ని కొట్టిసిన హైకోర్టు చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్‌ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్‌ రూల్స్‌ – 2016లోని షెడ్యూల్‌ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. చిన్న వార్తాపత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్‌ చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘చిన్నపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు. తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతావారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇ్వకపోవడం చెల్లదు. రెండు నెలల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని ఆదేశించింది.

👉గిద్దలూరు ఎంపీపీ  తండ్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యేలు కుందూరు, అన్నా.

గిద్దలూరు మండలం పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన, గిద్దలూరు మండల ఎంపీపీ కడప లక్ష్మి తండ్రి అయిన చెరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గుండెపోటుతో సోమవారం సాయంత్రం స్వర్గస్తులయ్యారు.విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మంగళవారం పొదలకుంటపల్లె లోని వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎంపిపి లక్ష్మీ వంశీధర్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.*

👉గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి… అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు..వార్డుల వారిగా నివేదికలు ఇవ్వాలని ఆదేశం…రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో గ్రామపంచాయతీ ఎన్నికలు తప్పవని తెలుస్తుంది..ఓటర్ లిస్ట్ జాబితా,వార్డుల విభజన త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలందాయి. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధికారుల్లో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది.
👉 కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడిని చంపేశారు.
ఈపూరుపాలెంలో కిరాతకం..చీరాల:కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచిచంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం-ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్
తెలిపిన వివరాల మేరకు.మనోజ్,సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ స్నేహితులు.మనోజ్ బైక్ పై,ఆరిఫ్ సైకిల్ పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వస్తున్నారు.వెనుక నుంచి వస్తున్న ఓ పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వెళ్తుంది.అందులో ఐదుగురు
యువకులున్నారు.వాళ్ల కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరిఫ్ ఘర్షణకు దిగారు.వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్పై విచక్షణారహితం గా పొట్ట,మెడ, గుండెలపై పొడిచారు.తీవ్రంగాగాయపడ్డ ఆరిఫ్ ను చీరాల ఏరియా వైద్యశాలకుతరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు.మృతుడి తండ్రి చీరాలలో వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.సైడ్ ఇవ్వలేదని చంపారా,లేక పక్కా ప్లాన్ తో చంపారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.సం
ఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ సోమశేఖర్
పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో హత్య జరగడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.ఎది ఏమైనా బాపట్ల జిల్లా చీరాల కేంద్రాల నేరాలకు కేరాఫ్ గా మారిందని చెప్పవచ్చు.ఇప్పటికే వరుస హత్యాలతో చీరాల-ఈపురుపాలెం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం