బంగ్లాదేశ్ ప్రధానిగా మహమ్మద్ యూనిస్.. హోం శాఖ మంత్రిని కలిసిన వైయస్ సునీత..ప్రభాస్ రెండు కోట్ల సాయం…జగన్ కు సుప్రీం బిగ్ షాక్.. వివాదంలో యాంకర్ సుమ.. కంభం అర్ధవీడులో తల్లిపాల వారోత్సవాలు…

👉బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా మహమ్మద్ యూనస్*

ఢాకా :బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి, నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించారు, ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆకస్మికంగా రాజీనామా చేసి, కొన్ని వారాల హింసాత్మక నిరసనల తరువాత దేశం విడిచి పారిపోయారు.

👉తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత అంధుల క్రికెట్ టీం..జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.అమెరికా పర్యటనలో ఉన్న సిఎం న్యూయార్క్‌ నగరం లో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను నిన్న సాయంత్రంకలుసుకున్నారు.వారిని కలుసుకున్న సంద ర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు.జీవితంలో ఎలాంటి సవాళ్ల యినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చు కోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభా కాంక్షలు తెలియజేశారు…

👉ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్ షాక్!!!.. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు..వీలైనంత త్వరగా విచారణ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు*ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం..తదుపరి విచారణ నవంబర్‍కు వాయిదా*

👉ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్.* జనధన్, పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ప్రసంగించారు. మరోవైపు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని అకౌంట్ల నుంచి రూ.8,500 కోట్ల ఫైన్ వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. ఇందులో 2023-24 ఏడాదిలోనే రూ.2,331 కోట్ల జరిమానా వసూలు చేశామన్నారు.

👉వినేశ్ పై వేటు.. రంగంలోకి మోదీ వినేశ్ 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు.. కాదు కాదు. .2 కేజీలని భిన్నంగా చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు అత్యంత చేదు అనుభవం.. 150 కోట్ల మంది గుండెలు పగిలే వార్త. ఒక్క రోజుల్లో ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ చేరి.. తొలి మ్యాచ్ లోనే జపాన్ కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ ను ఓడించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ అత్యంత బాధాకర పరిస్థితుల్లో డిస్ క్వాలిఫై అయ్యారు. బుధవారం జరిగే ఫైనల్లో పసిడి పతకం సాధిస్తుందన్న అందరి ఆశలు కల్లలయ్యాయి. మంగళవారం ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో వినేశ్‌ ఫైనల్‌ కు చేరింద. బుధవారం రాత్రి ఫైనల్స్ ఉంది. అమెరికా క్రీడాకారిణితో పట్టు పట్టాల్సి ఉంది. అయితే, ఉదయం వినేశ్ బరువును పరీక్షించారు. కొన్ని గ్రాముల అదనపు బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో పతకం చేజారింది. ఇప్పుడు వినేశ్ కు రజతమూ దక్కదు. అసలు ఈ ఫార్మాట్ లో రజతాన్ని ఎవరికీ కేటాయించడం లేదు. నిన్న వినేశ్ చేతిలో సెమీస్ లో ఓడిన రెజ్లర్ కు కాంస్యం.. వినేశ్ డిస్ క్వాలిఫై తో అమెరికా రెజ్లర్ కు స్వర్ణం అందనున్నాయి. మరోవైపు పారిస్‌ ఒలింపిక్స్‌ లో అనర్హత వేటు కారణంతో వ్యథ చెందిందో ఏమో కానీ.. వినేశ్ అస్వస్థతకు గురైంది. డీ హైడ్రేషన్‌ తో పారిస్‌ లోని ఆసుపత్రిలో చేరింది.

👉 హోం శాఖ మంత్రి అనితను కలసిన వైఎస్ సునీత.సచివాలయంలోని రెండో బ్లాక్ మంత్రి వంగలపూడి అనిత ఛాంబర్ లో కలసిన దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత.

👉భూ అక్రమాలు వెలికి తీయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం :రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 22-A చట్టం పెట్టి భూ అక్రమాలు చేసిందని, వాటిని వెలికి తీయటానికి జిల్లాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించాలని సీఎం ఆదేశం ఇచ్చారు. 22 -ఏ ఫిర్యాదులపై మూడు నెలల్లో పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.అప్పటివరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అల్టిమేటం జారీ చేశారు.ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్ల పై సమగ్ర విచారణ జరిపించాలని తెలిపారు.

👉టీవీ యాంకర్ బిత్తిరి సత్తి పై కేసు నమోదు?*తెలంగాణలోని న్యూస్ ఛానల్ లో కనిపించి అందరినీ ఆలరించిన చేవెళ్ల రవి (అలియాస్) బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, టీవీ యాంకర్ ప్రముఖ నటుడు బిత్తిరి సత్తికి ఊహించని శాక్ తగిలింది. బిత్తిరి సత్తి పైన తాజాగా కేసు నమోదు అయింది.టాలీవుడ్ నటుడు టీవీ యాంకర్ బిత్తిరి సత్తి పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీసు కేసు నమోదు చేశారు.భగవద్గీత ను కించపరిచేలా వీడియోని చేశారని… ఆరోపణలు చేస్తూ బిత్తిరి సత్తి పైన వానర సేన అనే సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పాలని హిందూ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

👉 విజయవాడ -విశాఖ హౌర ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. వాష్‌రూమ్‌కి వెళ్లివస్తున్న యువతి పట్ల అసభ్యకంరగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమై ఆకతాయిని అడ్డుకుని యువతిని కాపాడారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించి.. పోలీసులకు అప్పగించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా.అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబుకు టికెట్‌ ఇవ్వని వైసీపీ. ఏ పార్టీలో ఉన్నా..ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశా. -దొరబాబు

👉ఐదు రోజుల పాపను విక్రయించిన తండ్రి!!..ములుగు జిల్లాలో ఘటన..ఐదు రోజుల పాపను తండ్రే విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురంలో చోటు చేసుకుంది. నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మీ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి నవజాత శిశువును విక్రయించేందుకు కన్న తండ్రే బేరం పెట్టాడు. భార్యకు తెలియకుండా పాపను తీసుకెళ్లి రూ.15వేలు, పాత ద్విచక్రవాహనం తీసుకుని చిన్నారిని అమ్మేశాడు.అయితే పాప చనిపోయిందని, తానే స్వయంగా ఖననం చేశానని చెప్పి భార్య, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా నిలదీశారు. దీంతో పాపను అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నివ్వేరపోయిన బంధువులు ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించారు.

👉ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్ షాక్!!!.. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు..వీలైనంత త్వరగా విచారణ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు*ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం..తదుపరి విచారణ నవంబర్‍కు వాయిదా*

👉👉👉సుమక్క చెప్తేనే భూములు కొన్నాం.. మొత్తుకుంటున్న బాధితులు…*
రాజమండ్రి :
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రాజమండ్రి లో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్యతరగతి కుటుంబాలకు 26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టారు.
ఆ సంస్థకు యాంకర్ సుమ కనకాల ప్రచారం చేశారు. దాంతో ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. అలా అందరి నుండి దాదాపు రూ.88 కోట్లు వసూలు చేసిన తరువాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది సంస్థ. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్ ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొంతమందేమో కేవలం సుమ కనకాల ఆ సంస్థకు ప్రచారం చేయడం వల్ల ప్లాట్స్ కొన్నామని, ఇప్పుడు వాళ్ళు బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి.. సుమ కూడా తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

👉 హోం మంత్రి వంగలపూడి అనిత ఇంటి వద్ద కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి..
హోం మంత్రి వంగలపూడి అనిత ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసి రెడ్డి  కలిశారు. ఈ సందర్భంగా హోం మంత్రి గారు ఈ మధ్యకాలంలో నంద్యాల లో జరిగిన సంఘటనలు, మరియు శాంతి భద్రతల విషయాలు పైన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసి రెడ్డి  దృష్టికి పలు విషయాలు తెలియజేశారు.

👉 ముగిసిన ఏపీ కేబినెట్..👉స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిలల్లుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్*👉వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..👉ఎన్నికల్లో ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ*👉గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ అవకతవకలపై కేబినెట్ భేటీలో చర్చ*
👉2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చ*👉గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు అభిప్రాయపడ్డ ఏపీ కేబినెట్*
👉ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్*
👉ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ నిర్ణయం*
👉మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేసిన కేబినెట్*
👉మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం*సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ..సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి కేబినెట్ ఆమోదం*
👉వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం..*
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తున్నట్లు వెల్లడి..
ఇప్పటికే విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్..వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి..
👉ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు*
ఏపీలో ఐదేళ్ల వ్యవధిలో 35,54,193 గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినట్లు కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాస్వాన్ తెలిపారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 4.43 కోట్ల కార్డులు తొలగించినట్లు పేర్కొన్నారు. కార్డుల తనిఖీలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతాయన్నారు. డూప్లికెట్ కార్డులు, ఉపాధి హామీ పని చేసేందుకు ఆసక్తి లేకపోవడం, గ్రామపంచాయతీల నుంచి వెళ్లి పోవడం, మరణాలు వంటి కారణాలతో రద్దు చేసి ఉంటారని చెప్పారు.
👉రైలులో యువతిపై లైంగిక వేధింపులు*
విశాఖపట్నం ..
హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో యువతిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో యువతి గాఢ నిద్రలో ఉండగా యువకుడు అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న యువతి తోటి ప్రయాణికుల సాయంతో అతడిని పట్టుకుని నిర్బంధించారు. విశాఖ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

*కురిచేడు మండలంలో NAP ఫిల్టర్ బెడ్ లను మరియు మండలంలోని గ్రామాలకు నీటి సరఫరా విధానాన్ని అడిగి తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కడియాల లలిత సాగర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మరదల్ అలీ  మండల తెదేపా నాయకులు ఉన్నారు
👉 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ,ఉప సభాపతి(డిప్యూటీ స్పీకర్)గా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ ని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
*ఎన్నికలు జరిగి మూడు నెలలు అవుతున్న వేతనాలు అందక వీడియో గ్రాఫర్ల ఆవేదన కలెక్టర్ కి వినతిపత్రం*
2024 జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు లో పనిచేసిన అన్ని  నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులకు వీడియో తీసిన  వీడియో గ్రాఫర్లకు   రావలసిన వేతనాన్ని ఇంకా ప్రభుత్వం నుండి పూర్తిగా అందలేదని జిల్లాలోని అన్ని మండలాల ఫోటోగ్రఫీ నాయకులు, గిద్దలూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, ఎన్నికల విధులు నిర్వహించిన ఫోటోగ్రాఫర్లు అందరూ గౌరవనీయులు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ని కలసి తమకు రావలసిన వేతనానికి సంబంధించిన బకాయిలు త్వరగా ఇప్పించవలసిందిగా  కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు మరియు వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు భాను ప్రభాకర్, మళ్లీ ,మస్తాన్, ప్రతాప్, యవాన్ తదితర ఫోటోగ్రాఫర్లు మరియు ఎన్నికల విధులకు వీడియో తీసిన వీడియో గ్రాఫర్లు హాజరయ్యారు.
👉 మోక్షగుండం గ్రామంలోని సెరికల్చర్ ఫారం ను సందర్శించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ . ఏ. తమీమ్ అన్సారియా.
👉మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దహనం కేసు ..సీఐడీకి అప్పగింత..ఉత్తర్వులు జారీ …
డీజీపీ ద్వారకా తిరుమలరావు…అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఉత్తర్వులు….రెండు రోజుల్లో కేసు ఫైల్‌ మొత్తాన్ని సీఐడీకి అప్పగించనున్న పోలీసులు….
👉 ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం.. చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..
వేంపల్లి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం..బాత్రూంలో వాటర్ లైన్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్య
మృతదేహం వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
👉ఫేక్ ఐడీలతో ఇండియాలోకి ఎంటరైన బంగ్లాదేశ్ జంట..!!..నకిలీ గుర్తింపు కార్డులతో భారత్‌లోకి ప్రవేశించింది ఓ బంగ్లా జంట. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. కూచ్‌బెహార్‌ జిల్లా చంగ్రబంధ చెక్‌పోస్టు వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. నకిలీ పాన్‌, ఆధార్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు జవాన్లు. ఇనాముల్ హక్ సోహైల్, అతని భార్య సంజిదా జినా ఎలాహితోపాటు ఓ చిన్నారి కూడా ఉంది.బంగ్లాదేశ్ నుండి 7 రోజుల మెడికల్ వీసాతో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన జంటను బీఎస్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.
👉 మైనారిటీ బాలుడిని చిత్ర హింసలు పెట్టిన వైనం
వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినపరిమి గ్రామంలో మద్యం మత్తులో బాలుడిపై దాడి
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు
👉ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం.. చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..వేంపల్లి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం..
బాత్రూంలో వాటర్ లైన్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్య..
మృతదేహం వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
👉మోక్షగుండం గ్రామంలోని సెరికల్చర్ ఫారం ను సందర్శించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ . ఏ. తమీమ్ అన్సారియా.
👉 మైదుకూరు మండలం లింగాల దీన్నే లో ప్రమాదవశాత్తు కరెంటు తగిలి ధనికెల చిన్నక్క 28 సంవత్సరాల మహిళ మృతి
👉గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా*
👉 *అంతరాలను పూరించి తల్లిపాల సంస్కృతిని పోతయుద్దాం..ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు*
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం సెక్టార్ గన్నేపల్లి గ్రామంలో కురిచేడు మండలంలో NAP ఫిల్టర్ బెడ్ లను మరియు మండలంలోని గ్రామాలకు నీటి సరఫరా విధానాన్ని అడిగి తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కడియాల లలిత సాగర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మరదల్ అలీ మరియు మండల తెదేపా నాయకులు ఉన్నారు
👉ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అంగన్వాడి 68వ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో  గర్భవతులకి బాలింతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు తల్లిపాలు తాగడం వలన వచ్చే లాభాల గురించి మురిపాలల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తల్లికి బిడ్డకు అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. డబ్బా పాలు వల్ల కలిగే నష్టాలను గుర్తించి వివరించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

👉ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు..ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం సెక్టార్ గన్నేపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లలిత కుమారి మాట్లాడుతూ గర్భవతులకి బాలింతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు తల్లిపాలు తాగడం వలన వచ్చే లాభాల గురించి మురిపాలల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తల్లికి బిడ్డకు అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. డబ్బా పాలు వల్ల కలిగే నష్టాలను గుర్తించి వివరించి ర్యాలీ నిర్వహించారు.

👉వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా.అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబుకు టికెట్‌ ఇవ్వని వైసీపీ. ఏ పార్టీలో ఉన్నా..ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశా. -దొరబాబు

👉ఐదు రోజుల పాపను విక్రయించిన తండ్రి..!!
*ములుగు జిల్లాలో ఘటన*
ఐదు రోజుల పాపను తండ్రే విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురంలో చోటు చేసుకుంది. నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మీ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి నవజాత శిశువును విక్రయించేందుకు కన్న తండ్రే బేరం పెట్టాడు. భార్యకు తెలియకుండా పాపను తీసుకెళ్లి రూ.15వేలు, పాత ద్విచక్రవాహనం తీసుకుని చిన్నారిని అమ్మేశాడు.
అయితే పాప చనిపోయిందని, తానే స్వయంగా ఖననం చేశానని చెప్పి భార్య, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా నిలదీశారు. దీంతో పాపను అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నివ్వేరపోయిన బంధువులు ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించారు.

*నకిలీ వైద్యులు అరెస్ట్….!!
వరంగల్,నర్సంపేట: ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు నర్సంపేటలో ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు. తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణానికి చెందిన కె. విజయేందర్ రెడ్డి, ఎన్. శ్యామ్ రాజ్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎలాంటి అర్హత లేకుండా వచ్చి రాని వైద్యం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ నరేశ్ హెచ్చరించారు.
👉అనంతపురం జిల్లా వైసిపి అధ్యక్ష పదవికి పైలా నర్సింహయ్య రాజీనామా*
*జిల్లా అధ్యక్ష పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు పైలా నరసింహాయ్య వెల్లడించారు*

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం