👉అమెరికాలోని టెక్సాస్ లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మహాత్ముడికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
మరియు సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి టెక్సాస్ నగరంలోని,ఇర్వింగ్ లోని *“మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా”* లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
👉నటి శోభితాతో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్. అధికారికంగా ప్రకటించిన అక్కినేని నాగార్జున.. ఉదయం 9.42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రకటన.. ఈ జంట కలకాలం కలిసిమెలిసి జీవించాలని నాగార్జున ట్వీట్ చేసారు*…..👉 సీఎం రేవంతన్న సోదరుడు కొడంగల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి అన్న ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యువ నాయకులు ఏపి మిథున్ రెడ్డి
👉దక్షిణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి* *చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ* *పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా* *ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే* *పేదరికం లేని మంగళగిరి కోసం నా నిరంతర కృషి* *పద్మశాలీయ బహూత్తమ సంఘం సామాజిక సేవలు భేష్..మంగళగిరిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన లోకేష్..
మంగళగిరి: పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనని అన్నారు. మంగళగిరి చేనేతకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలూ చేపడతానని చెప్పారు.చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలెట్ ప్రాజెక్టుగా వీవర్స్ శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. చేనేత లో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం, త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామని అన్నారు, దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటు కు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు.
👉 దళపతి విజయ్ కీలక ప్రకటన! ..తమిళనాట 2026లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త పార్టీ భారీగా ఎత్తున రంగంలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఎంతోకాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ విజయ్.. రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కార్యక్రమాలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆయన ఓ కీలక ప్రకటన చేశారు.ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కార్యక్రమాలు నడుస్తున్నాయని అంటున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే… 2026లో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనుంది. ఇప్పటికే విజయ్ మక్కల్ ఇయక్కం (విజయ్ ప్రజా సంస్థ) పేరుతో కొన్నేళ్లుగా ఆయన అభిమాన సంఘాలు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ కచ్చితంగా పెను ప్రభావమే చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన కూడా 2026 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా… వచ్చే నెల 25న టీవీకే పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ భారీ బహిరంగ సభలోనే పార్టీ గుర్తు, విధివిధానాలను ప్రకటించనున్నారు! దీంతో… విజయ్ మొదలుపెట్టేసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ బహిరంగ సభ అనంతరం జిల్లాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు.. అనంతరం వరుసగా సభలు, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా సాగనున్నాయని అంటున్నారు. కాగా… ఇటీవల పార్టీ పేరు నమోదు చేసిన అనంతరం స్పందించిన విజయ్… 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. పారదర్శకమైన జాతి, మత భేదాలకు తావులేని, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం, రాజకీయ మార్పు కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆ లోటు తీర్చడానికే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
*ఏలూరు జిల్లా..కొయ్యలగూడెం మండలం రామానుజపురం లో ‘వివాహిత హత్య’. సాయి లక్ష్మి (35).భార్య భర్తల గొడవల నేపథ్యంలో, రాజనాల సూర్యచంద్రం భార్యను ఇంట్లో నుండి బయటకు వస్తుండగా మెడపై కత్తితో నరికి చంపిన భర్త.నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
👉 ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు ..కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్ ను చికిత్స కోసం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు..
👉ఎన్టీఆర్ జిల్లా *ఇబ్రహీంపట్నంలో గంజాయి పట్టివేత*తూర్పు ఇబ్రహీంపట్నంలోని ఒక అపార్టుమెంట్ ఎదుట పెంట్ హౌస్ లో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులు**పక్కా సమాచారంతో దాడులు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు**సుమారు కిలోన్నర గంజాయి స్వాధీనం**ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… దర్యాప్తు ప్రారంభం*
👉నల్గొండ : ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు….కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ , ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా…. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం…నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్…
👉ప్రకాశం జిల్లా..ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు!..ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మాక్ పోలింగ్ చేపట్టనున్నారు. అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని తనకు ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు.*ఇందుకుగాను ఆయన ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ జరపాలని ఎన్నికల సంఘానికి డబ్బులు చెల్లించారు.**ఈ క్రమంలోనే అధికారులు ఇందుకోసం సన్నద్ధమవుతున్నారు.*ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయ ఢంకా మోగించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు.అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు.*మొత్తం 12 కేంద్రాల్లో:* పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.ఇందుకోసం ఈ నెల 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి త్వరలోనే తేదీ ఖరారు చేయనున్నారు. దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారులు సమాచారం అందించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులను కూడా వారు ఆహ్వానించనున్నారు.
👉ఏలూరు జిల్లా…కొయ్యలగూడెం మండలం రామానుజపురం లో వివాహిత హత్య. సాయి లక్ష్మి (35).భార్య భర్తల గొడవల నేపథ్యంలో, రాజనాల సూర్యచంద్రం భార్యను ఇంట్లో నుండి బయటకు వస్తుండగా మెడపై కత్తితో నరికి చంపిన భర్త.నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
👉 ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు..కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్ ను చికిత్స కోసం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు..
👉ఎన్టీఆర్ జిల్లా *ఇబ్రహీంపట్నంలో గంజాయి పట్టివేత*తూర్పు ఇబ్రహీంపట్నంలోని ఒక అపార్టుమెంట్ ఎదుట పెంట్ హౌస్ లో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులు**పక్కా సమాచారంతో దాడులు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు**సుమారు కిలోన్నర గంజాయి స్వాధీనం**ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… దర్యాప్తు ప్రారంభం*
👉నల్గొండ : ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు….కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ , ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా….పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం…నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్…