బిజెపిలో బిఆర్ఎస్ విలీనం?..ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకే స్కిల్ సెన్సెస్*…వక్ఫ్ సవరణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును బహిర్గతం చేయాలి-MHPS.. ఫోన్ ద్వారా మెసేజ్ లు రూ 1.10 పది కోట్లు గల్లంతు..మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని యువతకు జిల్లా జడ్జి పిలుపు..పెళ్లి పేరిట మోసం

👉 బిజెపి కుట్ర..తెలంగాణ  రాజకీయాల్లో ఇక తెరాస అనే మాట వినపడదా…? కెసిఆర్ ను బిజెపిలో కలుపుకోవడానికి రంగం సిద్దం చేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.*తాజాగా ఒక టీవీ ఛానల్ బయట పెట్టిన ఒక్క కథనం తెలంగాణాలోనే కాదు దేశ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని కలిపేస్తున్నారు..కవితను, తనను కాపాడుకోవడానికి కెసిఆర్ చేస్తున్న రాజకీయమే ఇది అంటూ ఒక టీవీ ఛానల్ స్పష్టంగా చెప్పింది. *లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కెసిఆర్ ఒకరకంగా నరకం చూస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వడమే జీర్ణించుకోలేని కెసిఆర్ కు కవిత అరెస్ట్ తో పాటుగా తనను కూడా అరెస్ట్ చేయవచ్చు అనే వార్తలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు తనను కాపాడుకోవాలి… అలాగే కవితను బయటకు తీసుకు రావాలి అంటే బీజేపి తో మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే కెసిఆర్ నానా కష్టాలు పడుతున్నారు. ఏకంగా బిజెపితో విలీనం అనే మాట మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేంద్రంలో బిజెపితో సఖ్యతగా ఉన్న పార్టీల కోసం కెసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఏకంగా బిజెపి తో వెళ్తే కేటిఆర్ కూడా సీఎం కావొచ్చు అనే భావనలోనే కెసిఆర్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ తన దూకుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని కాంగ్రెస్ లో చేర్చుకుని అసలు సభలో బలం లేకుండా చేసే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే బీఆర్ఎస్ ను బిజెపిలో కలిపేసి తాను రాజ్యసభ తీసుకుంటే… రాష్ట్రంలో రేవంత్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టవచ్చు అని కెసిఆర్ భావిస్తున్నారు. నలుగురు రాజ్యసభ ఎంపీ పదవులు తనకు ఇవ్వాలని కెసిఆర్ అడిగినట్టు సమాచారం. ఇదే సమయంలో కవిత కోవర్ట్ గా మారి…*కేజ్రివాల్ నే ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవర్ గా మారితే బెయిల్ రావడమే కాకుండా… రాష్ట్రంలో తన తండ్రికి, సోదరుడుకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని బిజెపి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి కవిత అంగీకరించకపోవడం తో కేటిఆర్, హరీష్ రంగంలోకి దిగి నేడు రాత్రి ఆమెతో సమావేశం అయ్యే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఏం జరగబోతుంది ఏంటీ అనేది త్వరలో స్పష్టత రానుంది. బీఆర్ఎస్ విలీనం జరిగితే మాత్రం కేటిఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి కానున్నారనీ ప్రచారం జరుగుతుంది. 👉ఏదేమైనా బిజెపి అవలంబిస్తున్న ఇటువంటి కుట్రల ను చూసి ప్రజలు బహిరంగంగా ఏవగించుకుంటున్నారనీ.. ఐకమత్యంతో జీవిస్తున్న ప్రజల మధ్య మతం అనే చిచ్చు పెట్టి అనేక అవినీతి కి అక్రమాలకు పాల్పడుతూ కార్పొరేట్ శక్తులకు మాత్రమే చేయూతనిస్తూ… ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు రంగ సంస్థలకు విక్రయిస్తూ ప్రభుత్వ రంగాన్ని దివాలా తీస్తూ తనకు అడ్డు వచ్చిన నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తీరును ప్రజలు  గమనిస్తున్నారని బిజెపి మాయమాటలను ఇకముందు నమ్మే రోజులు పోయాయని దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపికి మెజారిటీ తీవ్రస్థాయిలో తగ్గిపోవడమేనని వామపక్ష నాయకులు మేధావులు ఖండిస్తున్నారు.

👉యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకే స్కిల్ సెన్సెస్**దేశంలోనే తొలిసారిగా చేపడుతున్నాం… ప్రతిష్టాత్మకంగా తీసుకోండి**నైపుణ్య గణన ఏర్పాట్లు చేయండి**స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష*
అమరావతి: యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్కిల్ సెన్సెస్ పూర్తిచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆన్ లైన్ విధానంలో స్కిల్ సెన్సస్ వివరాలు సేకరిస్తారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా వివరాలను సేకరించి, వారిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని తెలిపారు. తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను కూడా ఉపయోగించాలని అన్నారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా ఆయారంగాల్లో ఆసక్తి ఉన్న యువతను గుర్తించి శిక్షణ ఇచ్చాక, వారికి ప్రఖ్యాత సంస్థలతో సర్టిఫికేట్ ను కూడా అందజేస్తారు. రాష్ట్రంలోని పరిశ్రమలతోపాటు నౌక్రీ డాట్.కామ్, లిన్క్ డిన్ వంటి పోర్టల్స్ ద్వారా మెరుగైన అవకాశాలను పొందడానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు కూడా ఆన్ లైన్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను డిజిటలైజ్ చేసి అవకాశాలను మెరుగుపర్చడమే స్కిల్ సెన్సెస్ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. సర్వే అంశాలు సాధ్యమైనంత సులభంగా ఉండేలా చూడాలని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి సౌరబ్ గౌర్, స్కిల్ డెవలప్ మెంట్ ఎండి జి.గణేష్ కుమార్, న్యాక్ ఎడిజి దినేష్ కుమార్, సీడాప్ సిఇఓ శ్రీనివాసులు, ఓం క్యాప్ ఎండి క్రాంతి పాల్గొన్నారు.

👉వక్ఫ్ సవరణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును బహిర్గతం చేయాలి : యం. హెచ్.పి.యస్.

విజయవాడ : దేశంలో అతిపెద్ద స్థాయిలో సంపద ఉన్న వక్ఫ్ సంస్థకు సంభంధించిన వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేస్తోందని గత కొన్ని రోజులుగా సామాజిక మధ్యమాలలో వార్తలు వస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసేందుకు వక్ఫ్ సంబంధిత వర్గాన్ని ఎవరిని సప్రదించకుండా ఎటువంటి సవరణలు చేపట్టబోతోందో, అలాగే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లులో ఏముందో ఎవరికి ఎటువంటి సమాచారం తెలియదు కాబట్టి సవరణ చట్టానికి సంబంధికిన డ్రాఫ్ట్ బిల్లును అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, అలాగే వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు జాతీయ సంస్థలైనా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియత్ ఉలేమా ఏ హింద్, జమాత్ ఇస్లామీ హింద్, ఉలేమా కౌన్సిల్, సున్ని జమాత్, షియా జమాత్ తదితర ముస్లిం సంఘాలతో పాటు ప్రతి రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు డ్రాఫ్ట్ బిల్లును పంపి అనుభవజ్ఞులైన కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించిన తరువాతనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూకు షుబ్లీ, మైనారిటీ మంత్రివర్యులు యన్. యండి. ఫరూక్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందుకు మైనారిటీ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్ళి రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశం, పోలిట్ బ్యూరో సమావేశం నందు చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మైనారిటీ మంత్రి ఫరూక్ కు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ధన్యవాదాలు తెలిపారు.

👉 వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందించిన ముస్లిం మైనారిటీ సంఘాలు.

ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ, సీఎం గారికి వినతి పత్రాన్ని అందిస్తూ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా * సీఎం సానుకూలంగా స్పందిస్తూ ముస్లింలకు అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అదే విధంగా గౌరవ మైనారిటీ మంత్రివర్యులు NMD ఫరూక్ కి కూడా వినతి పత్రాన్ని అందించారు.ఈ భేటీలో ఉలేమా కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు ముఫ్తీ ఫారూఖ్, జామియత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర కన్వీనర్ మౌలానా హుస్సేన్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్ వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్ , టీడీ జనార్ధన్ , శ్రీనివాస్ రెడ్డి , టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్  పాల్గొన్నారు .

👉పెళ్లి పేరిట మహిళల మోసం*వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి నగదు, నగ కాజేత* ..

కాకినాడ: పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరుగురిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివ రాల ప్రకారం.. పెదమార్కెట్కు చెందిన టి. కృష్ణమోహనక్కు పెళ్లి సంబంధం చూస్తానని శిరీష అనే మహిళ కలిశారు. ఆమె ఈ ఏడాది జూన్ 23న సత్య వేణి, దుర్గ అనే ఇద్దరిని మధ్యవర్తులుగా పరిచయం చేశారు. అదే రోజు ఆయనను వారు రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకెళ్లి నీరజ అనే మహిళను పెండ్లి కుమార్తెగా చూపించారు. ఆమెకు తల్లిగా సత్యదేవి, అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసు కోవాలని నిర్ణయించి అతడు ఖర్చుల నిమిత్తం రూ.2.80 లక్షలు, ఓ చర వాణి, బంగారు గొలుసు సత్యదేవి, ప్రియాదేవికి అందజేశాడు. కొద్దిరోజులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. వారంతా మోసగత్తెలని తేలింది. నీర జకు అప్పటికే పెళ్లయి సంతానం ఉన్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు. మేరకు పోలీసులు ఆర మోరు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉*విద్యా కమిటీ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం వైసీపీ నాయకుడు పై టిడిపి నాయకుల దాడి*గుంటూరు జిల్లా. ప్రత్తిపాడు నియోజకవర్గం.ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యా కమిటీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ తలపిస్తు న్నట్లున్నాయివిద్యా కమిటీలో వైసీపీ నాయకులకు చైర్మన్ పదవి వరించగా దాన్ని క్యాన్సిల్ చేయించిన టిడిపి నాయకులు వైసిపి నాయకుడు నిమ్మగడ్డ శ్రీకాంత్ పై దాడి చేసిన టిడిపి నాయకులు..

👉పల్నాడు జిల్లా..కారంపూడి మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాద్యాయుడుపాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన .. తల్లితండ్రులుపోలీసుల సమక్షంలోనే ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులుపాఠశాలకు చేరుకొని విచారణ జరుపుతున్న మండల విద్యశాఖ అధికారి

👉*విజయనగరం జిల్లా..*మాదకద్రవ్యాల అలవాటుపడ వద్దు –  ర్యాగింగుకు పాల్పడవద్దు.. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి…*మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని యువతకు జిల్లా జడ్జి పిలుపు…*మాదక ద్రవ్యాలు కలిగిఉన్న, సేవించిన, అక్రమ రవాణాకు పాల్పడిన చట్ట ప్రకారం చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ*రహదారి భద్రత పాటించాలని యువతకు సంయుక్తంగా పిలుపునిచ్చిన జిల్లా జడ్జి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…*విజయనగరం జిల్లాలోని మహారాజా ఇంజనీరింగ్ (ఎం వి జి ఆర్ ) కళాశాలలో ఆగష్టు 8న  జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ వారి ఆధ్యర్యంలో న్యాయశాఖ జిల్లా పోలీసుశాఖ సంయుక్తంగా ర్యాగింగ్, మాదకద్రవ్యాలు వినియోగంవలన కలిగే అనర్థాలు, హెల్మెట్ ధారణపై న్యాయ మరియు చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హాజరై, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు
**వంగపాడు గ్రామంలో విషాదం: తేలుకాటుతో యువకుడు మృతి** ప్రకాశం జిల్లా: బేస్త వార పేట మండలం వంగపాడు గ్రామంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది,అడవిలో చెట్టు నరుకుతుండగా రంగస్వామి (25) అనే తేలు కాటు కు గురై మరణించాడు.
రంగస్వామికి, ఇటీవలే పెళ్ళి అయింది . ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రంగస్వామి మరణించాడు.
👉హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు ఈ నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది.బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి *‘‘1930’’* కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ *1930* నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం