అంబానీ ప్యాలెస్ యాంటిలియాను కాపాడేందుకే మోదీ వక్ఫ్ బోర్డు చట్టం..త్వరలో అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్ మంత్రి సీతక్క.. ఒంగోలులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం..విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం..

👉 బిగ్ బ్రేకింగ్ .. షాకింగ్ న్యూస్..వీడియో వైరల్..

**అంబానీ ప్యాలెస్ యాంటిలియాను కాపాడేందుకు మోదీ వక్ఫ్ బోర్డు చట్టం తెస్తున్నారన్న వీడియో ప్రస్తుతం  నెట్టింట్లో వైరల్ అవుతుంది..*అంబానీ ప్యాలెస్ యాంటిలియా నిర్మించిన స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినది, అందులో అనాథ శరణాలయాన్ని నిర్మించాలి, కానీ అంబానీ మోసపూరితంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.**భూమిని కొనుగోలు చేయడంలో అంబానీ వక్ఫ్ బోర్డులోని సెక్షన్ 32(2)ని ఉల్లంఘించారని హైకోర్టు కూడా అంగీకరించింది మరియు యాంటిలియాను ఎప్పుడైనా కూల్చివేయాలని కోర్టు ఆదేశించవచ్చు!*తమ యజమానిని కాపాడేందుకు దేశంలోని లక్షలాది మంది పౌరులను లక్ష్యంగా చేసుకోవడం గర్హనీయం మరియు సిగ్గుచేటు.*

👉రిజిస్ట్రేషన్ల శాఖపై సీఎం కీలక నిర్ణయం*అమరావతి :ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ల శాఖ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించారు. వచ్చే 3 నెలల పాటు రిజిస్ట్రేషన్ల విలువ సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 👉 *త్వరలోనే జన్మభూమి-2 ప్రారంభం* టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో త్వరలోనే జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టడంతో పాటు త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ నిర్వహిచారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్‌ పదవుల భర్తీకి నిర్ణయం. నామినేటెడ్ పోస్టులు దశలవారీగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

👉విజయవాడ:ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన గిరిజనులు..గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ పరిశీలించిన సీఎం..

👉 మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ .. ముట్టడి యత్నం.. అడ్డుకున్న పోలీసులు..హైదరాబాద్, న్యూస్‌టుడే: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ మహిళా కాంగ్రెస్‌ పిలుపులో భాగంగా బుధవారం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కార్యకర్తలు హైదరాబాద్‌ గాంధీభవన్‌ మెట్లపై కూర్చొని నిరసన చేపట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని మోదీకి, భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భాజపా కార్యాలయం ముట్టడికి బయలుదేరగాపోలీసులు గాంధీభవన్‌ గేట్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ నారీ న్యాయ్‌ హక్కు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు…

👉ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని ఢిల్లీలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ .

👉 OLYMPICS లో భారత్ కు రజతం సాధించిన నీరజ్ చోప్రా ..పారీస్ OLYMPICS లో భారత జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పైనల్లో 89.45 మీటర్లు బల్లెం విసిరి రెండో స్థానం లో నిలిచి రజతం సాధించాడు..ఈ OLAMPICS లో భారత్ కు తొలి రజతం సాధించిన నీరజ్ చోప్రా. భారత్ కు మొత్తం 5 పథకాలు వచ్చాయి*

👉హైదరాబాద్ లో పాతబస్తీ రౌడీ షీటర్ రియాజ్ ను ప్రత్యర్థులు కాల్చిచంపారు. బాలాపూర్ లో బైక్ లో వెళ్తున్న రియాజ్ ను మొదట కారుతో ఢీ కొట్టి కిందపడిన రియాజ్ ను చుట్టుముట్టిన ప్రత్యర్థులు కాల్చిచంపారు*

          👉 తెలంగాణ .. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనులకు శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమి పుత్రులుగా, కల్మశంలేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు తెలిపారు.

👉ఒంగోలు పట్టణం.ప్రపంచ ఆదివాసి దినోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి..
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో  ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియతో కలసి ప్రపంచ ఆదివాస వేడుకలు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ప్రకాశం భవన్లో ప్రారంభించారు.తదనంతరం మార్కాపురం నియోజకవర్గ ప్రజా సమస్యలపై కలెక్టర్ కి వివరించారు….

   👉విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి..విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయం త్రం వాకింగ్ చేసుకునే వారి పై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిం ది. గవర్నర్ పేట డిపో బస్సుగా స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు అక్కడక్కడే మృతిచెందారు. మృతులు వంగర అప్పారావు, కోల సత్యబాబుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

👉త్వరలో అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్ మంత్రి సీతక్క* హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు.ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్‌ వాడీల్లో ప్లే స్కూల్స్‌ను అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్‌ను కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో ఉపయోగించేందుకు సానుకూలంగా ఉన్నాయన్నారు.

👉తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ  *ఇక నుండి ATM లో రేషన్ బియ్యం..!హైదరాబాద్: ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసిఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.? ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభ మైంది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకో వచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఒడిశా ప్రభుత్వం భువ నేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీరన్ పై నమోదు చేయాలి. ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు.ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనే శ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచన లో ప్రభుత్వం ఉంది. ప్రస్తు తం ఈ మోడల్ విజయ వంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది…

👉ముగ్గురు సస్పెండ్ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారులు..పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి.. తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు కలిసి గురువారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ప్రిన్సిపల్ నయోమి ఆ ఉపాధ్యాయుడిని రక్షించి, తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చి, పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఆర్జేడీ, డీఈఓలకు తెలిపారు. అధికారులు విచారిస్తుండగా మరోసారి ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడికి దిగడంతో పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించారు. ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్ పైనా దాడిచేశారు. ఎస్సై అమీర్ బాధిత విద్యార్థినుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. సాయంత్రం ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓ ఏసుబాబు పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు. ఉపాధ్యాయుడు రవికుమార్, ప్రిన్సిపల్ నయోమి, వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, బాలికల వసతిగృహ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

👉 రాజకీయ పార్టీలకు విద్యార్థి తల్లిదండ్రుల మనవి…* పాఠశాల తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం అవసరమా..??ప్రార్థన మందిరాలు, బడులు అందరిదవీ….??సమాజంలోనే అందరం… ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏకంగా కాపాడు కోవాలి…ఏ రోజు విద్యా వ్యవస్థలో విద్యార్థి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, పరిష్కారం కోసం .. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం…ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థి తల్లిదండ్రుల కమిటీలే ఉండకపోతే నోరు మెదపని వీరు…ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ,ప్రభుత్వ ఉత్తర్వులు ,నియమనిబంధనలు అమలు కాకున్నా , పసి పిల్లలపై చదువు పేరుతో జరుగుతున్న మానసిక ఒత్తిడి , దాడులు , ఒత్తిడితో పిల్లల ఆత్మహత్యల నివారణకు ….. ఈ అకృత్యాలను చోద్యంగా చూసే రాజకీయ పార్టీలు..**బావి భారత పౌరులుగా ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రాధాన్యం…* *చైతన్యం కోసం* … విద్యాసంస్థల్లో” విద్యార్థి ఎన్నికలను” వద్దన్న వీళ్లే…* రాజకీయాలకతీతంగా జరగాల్సిన….పాఠశాల అభివృద్ధి కమిటీల, (తల్లిదండ్రుల కమిటీ)రాజకీయ పార్టీల జోక్యాన్ని…రాబోయే కాలంలో అయినా రాజకీయాల కతీతంగా జరగాలని ఆశిద్దాం.. డిమాండ్ చేద్దాం…

👉బాపట్ల మండల న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ పురం లోని నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. జడ్జి వాణి గారు ఈ క్యాంపును ప్రారంభించారు న్యాయవాదులు , వెదుళ్ళపల్లి ఆరోగ్య కేంద్రం డాక్టర్లు మరియు వారి సిబ్బంది స్టువర్ట్పురం పంచాయతీ సెక్రటరీ, లైబ్రరీ స్టాప్, పోలీస్ వారు, గ్రామ ప్రజలు పేరా లీగల్ వాలంటీర్లు పి  ప్రసాద్ రావు, కంచర్ల రాజు, N.శామ్యూల్ జాన్సన్ మహమ్మద్ ఖాన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం