వినేష్ ఫోగట్కు ఊరట..అడోబి సీఈవో శంతను నారాయణ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..జ‌గ‌న్ నిర్ణ‌యానికి…చంద్ర‌బాబు నో..చంద్రబాబుకు ఎలాంటి విలువలూ లేవు: వైఎస్ జగన్.. వాళ్ల నాని రాజీనామా.. గనుల వెంకటరెడ్డి కోసం గాలింపు. రాజన్న జిల్లాల్లో వీధి కుక్కల హల్ చల్..

👉వినేష్ ఫోగట్కు ఊరట…100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పారిస్ స్పోర్ట్స్ కోర్టులో వినేశ్ సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వినేశ్ తరుఫున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

*ఇదిలా ఉంటే.. వినేశ్ ఫోగాట్‌కు సిల్వర్ పతకం ఇవ్వాలని ప్రముఖ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ బరోస్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆమె సిల్వర్ మెడల్‌కు అర్హురాలని అన్నారు. జోర్డాన్ బరోస్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ గెలిచారు. 2012లో లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించాడు. అంతేకాకుండా.. వినేశ్ ఫోగట్కు చాలా మంది అండగా నిలుస్తున్నారు. మరోవైపు.. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమెపై అనర్హత వేటు వేసినందుకు.. ఆమె రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా.. ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.*మరోవైపు.. రెజ్లర్ వినేష్ ఫోగట్ కి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటిచింది. ఆమెకు 4 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. వినేష్ ను ఛాంపియన్ గా పరిగణిస్తూ.. నజరానా ఇస్తున్నట్లు తెలిపింది. తమ రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే 6 కోట్లు, సిల్వర్ గెలిస్తే 4 కోట్లు, కాంస్యం గెలిస్తే 2.5 కోట్లు ఇస్తామని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. వినేష్ ను సిల్వర్ మెడల్ విన్నర్ గా భావిస్తూ… 4 కోట్లు నజరానా ఇస్తున్నామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

👉అడోబి సీఈవో శంతను నారాయణ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ*

ప్రఖ్యాత అడోబి సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి  ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లలో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబీ సీఈవోతో సమావేశంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శంతను నారాయణ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారు.
స్ఫూర్తిదాయకమై వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో అత్యంత  టెక్ విజనరీ శంతను నారాయణ్ని కలవడం భావోద్వేగమైన అనుభూతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంతను నారాయణ  అని సీఎం పేర్కొన్నారు…
👉 కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుంది.. కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుంది.. కవిత హెల్త్ సిక్ అయింది.. 11 కేజీల బరువు తగ్గారు- కేటీఆర్

👉జ‌గ‌న్ నిర్ణ‌యానికి నో… చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!భూముల అంశంలో, రెవెన్యూ నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఉంది కూట‌మి స‌ర్కార్. ఇప్ప‌టికే కొత్త ప‌ట్టాదారు పాస్ పుస‌క్తాల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌గా… తాజాగా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ స‌చివాల‌యాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్లు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెట్ట‌బోతున్నారు. గ్రామ స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోగా… అవినీతికి ఆస్కారం ఉండ‌టంతో పాటు అతి త‌క్కువ రెస్పాన్స్ ఉన్నందున పాత విధానంలోనే రిజిస్ట్రేష‌న్లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే 10కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక‌, ఏపీలో బ‌హిరంగ మార్కెట్ కు… ప్ర‌భుత్వ నిర్దేశిత భూ విలువ‌కు భారీగా వ్య‌త్యాసం ఉన్న నేప‌థ్యంలో మార్కెట్ విలువ‌ను పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్రాంతాల వారీగా శాస్త్రీయంగా అంచ‌నా వేసి… ఏ ప్రాంతాల్లో ఎంత పెంచాలి, ఎక్క‌డ ఎంత మేర ఉంది అన్న వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక ఇవ్వ‌నుంది. దానికి అనుగుణంగా ప్ర‌భుత్వం 10-20శాతం రిజిస్ట్రేష‌న్ విలువ‌ల‌ను పెంచే అవ‌కాశం ఉంది

👉చంద్రబాబుకు ఎలాంటి విలువలూ లేవు: వైఎస్ జగన్**న్యాయం, ధర్మం పాటించని వ్యక్తి అందుకే మెజార్టీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ*నర్సీపట్నం, పెందుర్తి పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్*తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.. అలాంటి దుర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం.*మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు.*మనం చేయగలిగిందే చెప్పాం.. చేసి చూపించాం*మన బలం ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతే*బొత్సను గెలిపించి మన పార్టీ ప్రతిప్పును మరింత పెంచేందుకు సహకరించండి.*ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ వ్యక్తికి ధర్మం, న్యాయం అనే పదాలకు అర్ధం తెలిసి ఉండాలి. ఆ స్థాయి వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. కానీ చంద్రబాబునాయుడికి న్యాయం, ధర్మం ఏవీ లేవు. దురదృష్టవశాత్తు మనం ఈ దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం. తన స్వార్ధం కోసం ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.అధికార, ధనబలంతో చంద్రబాబు చేస్తున్న ప్రతి పనీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సినది కాదు. నాయకుడు అనేవాడు ఇంత అధ్వానంగా ఉంటాడా.. అన్న స్థాయిలో ఆయన పని చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం.👉కష్టకాలంలో తోడుగా నిలబడ్డ ప్రతికార్యకర్తకు కచ్చితమైన గుర్తింపు వస్తుంది. నేను కోరేది ఒక్కటే. ప్రజలకు మనం దగ్గరగా, తోడుగా ఉంటే వారే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రజలే దండలు వేసి మనల్ని పిలిచే రోజు వస్తుంది.

👉ఒలంపిక్ క్రీడలకు అడ్డొచ్చిన అమ్మాయి అందం*
హైదరాబాద్: ఆగస్టు 09
పారిస్‌ ఒలింపిక్స్‌లో భాగంగా ఓ క్రీడాకారిణి అందం వివాదాస్పదమైంది. అందంగా ఉందన్న కారణం తో ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపేశారు.తన అందం వల్ల తోటి క్రీడాకారులు తమ ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నా మని ఫిర్యాదు చేయడంతో ఆ దేశ అధికారులు.. ఒలింపిక్స్‌ గ్రామం నుంచి ఆమెను స్వదేశానికి పంపించారు.పరాగ్వేకు చెందిన లువానా అలోన్సో (20) జులై 27న జరిగిన 100 మీటర్ల ఉమె న్స్‌ బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని ఓడి పోయింది.అయితే పోటీలు ముగి సేవరకు ఆమె పారిస్‌లోనే ఉండాలని నిర్ణయించు కుంది. ఈ క్రమంలో ఆమె అందం అక్కడున్న తోటి క్రీడాకారులను ఆకర్షించింది.అయితే పరాగ్వే పురుష క్రీడాకారులు లువానా అందం వల్ల తమ ఆటపై శ్రద్ధ పెట్టలేకపోతున్నా మంటూ ఫిర్యాదు చేయ డంతో పరాగ్వే బృందం ఆమెను స్వదేశానికి పంపించింది.పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న లువానా.. మరుసటి రోజే స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేసింది. అయి తే, ఒలింపిక్స్‌లో చోటుచేసు కున్న వివాదంపై మాత్రం ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం…

😲 *రాజన్న జిల్లాల్లో వీధి కుక్కల హల్ చల్*😱
*నలుగురు చిన్నారులపై దాడి*రాజన్న జిల్లా :ఆగస్టు 09
రాష్ట్రంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తు న్నాయి.గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరి చాయి,వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పి టల్‌లో చేర్పించారు. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.అధికారులు, ప్రజాప్రతి నిధులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడ‌ద నుంచి తమను ర‌క్షించాల‌ని కోరుతున్నారు…

👉     సోషల్ మీడియా లో మరియు ఫేస్బుక్ లల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అలాగే రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి పై అనుచిత పోస్ట్లు పెట్టడంతో రాష్ట్ర ఐటీడీపి కార్యదర్శి దూదేకుల దస్తగిరి, గిద్దలూరు నియోజకవర్గం టి యన్ ఎస్ ఫ్ అధ్యక్షులు బొర్రా రాఘవేంద్ర యాదవ్, ఎం వి సాయి, పట్టణ అధ్యక్షులు షానీషా వలి, టీడీపీ నాయకులు షేక్ బద్రి బాషా, షేక్ మహబూబ్ బాషా, మహమ్మద్ జాని, షాజీడ్ వెళ్లి గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య కి ఫిర్యాదు చేశారు

👉వైసీపీ పార్టీకి ఆళ్ల నాని రాజీనామా.?*
అమరావతి :వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీకి శుక్రవారం రాజీనామా చేశారు.ఏలూరు వైసీపీ నియోజక వర్గ ఇంఛార్జ్ బాధ్యతలకు కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా.. మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌కు లేఖ పంపారు ఆళ్ల నాని.
👉వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా..శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబం వివాదం వీధికెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్దరాత్రి హైడ్రామా నెలకొన్నది.శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు. అక్కవ రంలోని నూతన గృహం ముందు నిన్న సాయంత్రం ఏడు గంటల నుండి అర్ద రాత్రి వరకు నిరీక్షించింది. ఎన్నికల ముందు జరిగిన ఘటనలతో శ్రీనివాస్ భార్యా, బిడ్డలను విడిచి ఉంటున్నారు.
తాజాగా ఆయన కుమా ర్తెలు తండ్రి దగ్గరే ఉండేం దుకు సిద్దం అయ్యారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్ తలుపులు తీయకపో వడంతో ఇంటి బయట కారులోనే నిరీక్షించారు.తన తండ్రితో కలిసి ఉంటా మని.. ఇదే విషయాన్ని తన తండ్రికి చెబుతామని మెసే జ్‌లు పెట్టారు. అయినా స్పందించలేదు. తన తండ్రి నుంచి సమాచారం వచ్చి నంత వరకు ఇక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు
కుమార్తెలు. ఇదే సమయం లో ఎప్పుడు లైట్లు వెలిగి ఉండే వైసీపీ కార్యాల యంలో చీకటిగా ఉన్నాయి. దువ్వాడ ఇంట్లో ఆయనతో పాటు మరికొందరు ఉన్నట్టు తెలుస్తుంది.ఇంటి తలుపులు తీయక పోవడంపై పలు అనుమా నాలకు దారి తీస్తుంది..

👉 లాలాపేట సీఐ గా అడుసుమల్లి శివప్రసాద్..
గుంటూరు నగరం లాలాపేట సీఐ గా అడుసుమల్లి వెంకట శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు గుంటూరు ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ శాఖలో శివమణి గా పిలుచుకునే ఈయన విధి నిర్వహణలో నిక్కచ్చిగా పని చేస్తారనే పేరుంది….
శుక్రవారం ఉదయం 9 గంటలకు లాలాపేట సీఐ గా బాధ్యతలు స్వీకరించారు.

👉‘గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు..కడప జిల్లాలో సొంతింటికి వెళ్లి సీఐడీ ఆరా..హైదరాబాద్‌ నివాసంలోనూ కానరాని మాజీ డైరెక్టర్‌
ఇళ్లకు నోటీసులు అతికించిన అధికారులు..తిరుపతిలో నోటీసు తీసుకునేందుకు పెద్దకుమార్తె నిరాకరణ..ఓ వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో రెండో కుమార్తె వద్దకు వెళ్లని వైనం..ఏపీలో డిప్యుటేషన్‌ ముగించుకుని వెనక్కి రాలేదన్న కోస్ట్‌గార్డ్‌..ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది
👉నా దగ్గర తుపాకీ ఉంది… దానికి లైసెన్స్ ఇవ్వండి….!!*తుపాకీ లైసెన్స్ కు దువ్వాడ దరఖాస్తు…!!*ఇలా కూడా దరఖాస్తు చేసుకోవచ్చా…?? అంటే… లైసెన్స్ లేకుండా *గన్* కలిగి ఉండటం… *The Arms Act 1959* ప్రకారం నేరం కాదా….?? మొన్న ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా….?? అయినా *కూటమి ప్రభుత్వానికి* ఇవన్నీ ఎందుకండీ… అంటరా…?? అయితే వాకే…!!వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి తాజాగా *ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు…*తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.*👉తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు…* ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు….
👉రాజన్న జిల్లాల్లో వీధి కుక్కల హల్ చల్*
*నలుగురు చిన్నారులపై దాడి…
రాజన్న జిల్లా :ఆగస్టు 09
రాష్ట్రంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తు న్నాయి.
గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరి చాయి,
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పి టల్‌లో చేర్పించారు. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.అధికారులు, ప్రజాప్రతి నిధులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడ‌ద నుంచి తమను ర‌క్షించాల‌ని కోరుతున్నారు…

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం