ధర్నాకు దిగిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌(..ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల హెచ్చరిక.. కవితకు సోమవారం బెయిల్!..మారని జగన్ నైజంతోనే రాజకీయాలకు దూరం ఆళ్ల నాని..’మహేష్ బాబు’ గొప్పదనం గురించి చిన్నా..’ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి,పిల్లల పై ఆగ్రహం.టెక్కలిలో అర్ధరాత్రి ఉద్రిక్త.ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు..కంది పంటపై అవగాహన

👉ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాం. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తాం” అని పవన్ కల్యాణ్ వివరించారు.

👉 ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల హెచ్చరిక..*బెల్లంపల్లి: ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్సా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులు భూ కబ్జాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. రౌడీలను, భూ కబ్జాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రోత్సహిస్తున్నాడని, తీవ్రస్థాయిలో స్పందించడం సంచలనాన్ని రేపుతుంది. ఇంటి నెంబర్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారని ధ్వజమెత్తారు.ఇళ్ల పట్టాల విషయంలో గత ప్రభుత్వం విధివిధానాలు లేకుండా చేసిన మోసాలపై, అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మండిపడ్డారు. ప్రజల సమస్యలు, కష్టాలకంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంత్రి పదవి పైనే ధ్యాస ఉందన్నారు. జల్సాల కోసం తరచూ విదేశాల్లో పర్యటించడం ప్రజలను విస్మరించడం క్షమించరాని తప్పిదమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ మేరకు మీడియాకు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది…”మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి ఆదేశంతో ఎన్నికల లబ్ధి కోసం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా రెవెన్యూకు అప్పగించిన సింగరేణి క్వాటర్లకు పట్టాలు ఇచ్చే పేరిట లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి ఇంతవరకు ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం లేదు.సింగరేణి అధికారులు బి.ఆర్.ఎస్ పాలకుల మెప్పుల కోసం క్వార్టర్స్ వదిలిపెట్టి ప్రస్తుతం మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్ సింగరేణి కరెంట్ కట్ చేసే చర్యలకు పాల్పడడంతో పట్టణంలోని వివిధ బస్తీలకు చెందిన కార్మికులు, రిటైర్ కార్మికులు గత నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు. దోమల బెడద, విషజ్వరాలు, చీకటి అంధకారంతో బస్తీ లోని ప్రజలు అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏ.ఐ.టి.యు. సి ఎమ్మెల్యే వినోద్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బి.ఆర్. ఎస్. పై ఉన్న అసంతృప్తి దుర్గం చిన్నయ్య అరాచకలతో విసిగి పోయి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వినోద్ మాయమాటలు నమ్మి గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు.బెల్లంపల్లి ప్రజల పట్ల నిర్లక్ష్యం తో సింగరేణి యాజమాన్యం విద్యుత్ కోతలు కరెంట్ కనెక్షన్లు తొలగింపులు, మంచినీటి సరఫరాను నిలిపివేస్తుంటే ఎమ్మెల్యే వినోద్ ‘రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన ఫాసిస్టు నియంత ఊరు లాగా ఢిల్లీ, బెంగళూరు, అమెరికా అంటూ జల్సాలతో మంత్రి పదవి వేటలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా పట్టించుకోకపోవడం క్షమించరాని తప్పిదం. ప్రజల సమస్యలను గాలికి వదిలి అనుచరులు, భూకబ్జా కోరులను, రౌడీలను, గుండాలను ఎమ్మెల్యే ప్రోత్సహించడం జరుగుతుంది. అనుచర వర్గం రెచ్చిపోతూ భూ కబ్జాలకు పాల్పపడుతూ ఇంటి నంబర్లు ఇప్పించే పేరిట లక్షల రూపాయల వసూళ్ళకు పాల్పడుతున్నారు.నియోజక వర్గానికి చెందిన వేమనపల్లి మండల, గ్రామాల ప్రజలు వర్షం ప్రభావంతో వరదలతో ముంపునకు గురైన పంటపొలాలు కొట్టుకుపోయి, ఇండ్లు కూలిపోయి బురద మట్టి తిప్పలు పేరుకుపోయి గత పది రోజులుగా ప్రభుత్వ సహాయం కొరకు ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యే విందులు, వినోదాలు, షికార్లతో ఆయిల్ మసాజ్ లతో, పబ్లు, క్లబ్లు, నీలి చిత్రాలకు పరిమితమై ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఎమ్మెల్యే వినోద్ తన పద్ధతులు మార్చుకొని ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి బెల్లంపల్లి క్వార్టర్లకు పట్టాలు, ఇంటి నెంబర్లు ఇవ్వాలని అంతవరకు సింగరేణి అధికారుల కంపెనీ కరెంటు తొలగిస్తే మందమర్రి జనరల్ మేనేజర్ మనోహర్, ఎమ్మెల్యే వినోద్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని ప్రభాత్ పేర్కొన్నారు.” తక్షణం సింగరేణి అధికారులు తొలగించిన కంపెనీ కరెంటును పునరుద్దరించాలన్నారు.

👉అర్థరాత్రి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పై కోపంతో చిందులు తొక్కారు*..టెక్కలి:

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి,పిల్లల పై ఆగ్రహం. టెక్కలిలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను కలిసేందుకు వచ్చిన భార్య వాణి, కుమార్తె హైందవిలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన వారిద్దరినీ దూషించి, తన ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ
వాతవరణం నెలకొంది. టెక్కలి పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను సమన్వయ పరిచారు.
👉వైసిపి MLC దువ్వాడ శ్రీనివాస్ తో కల్సి ఉంటున్న మహిళ . . నిన్న అర్ధరాత్రి వరకు వైసీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నా కు దిగిన ఆయన కూతుళ్లు. కాని దువ్వాడ శ్రీనివాస్ తన కూతుళ్ళను ఇంట్లోకి రానివ్వలేదు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి వుంటాను అని తేల్చి చెప్తున్న మహిళ..

👉కవితకు సోమవారం బెయిల్…..!!! ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది.వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్ లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం..సాయంత్రానికి కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా బయటకు వచ్చింది. కవిత పదకొండు కేజీల బరువు తగ్గారని .. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే.. కోర్టు సంతృప్తి పడితే.. మరో కేసులో అంటే ఈడీ కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్లే. అందుకే ఈ కోణంలో ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. వచ్చే వారంలోనే కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సైజుకు.. నేతల్ని జైల్లో పెట్టిన సమయానికి పొంతన లేదన్న వాదన ఉంది. వేల కోట్ల అవినీతి చేసిన వాళ్లు కూడా అంత కాలం జైల్లో ఉండలేదన్న భావన ప్రజల్లో వస్తోంది. కవిత కూడా మార్చి పదిహేనో తేదీన అరెస్టయ్యారు. మిగిలిన వారు అప్రూవర్లుగా మారితే బెయిల్ ఇచ్చేశారు. కవిత మాత్రమే జైల్లో ఉన్నారు.

👉మారని జగన్ నైజంతో – 54 ఏళ్ల వయసుకే రాజకీయ వృత్తిని వదులుకొన్న ఆళ్ల నాని !!!
20 ఏళ్ల్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుండి డెప్యూటీ సిఎం వరకు ఎదిగాడు ఆళ్ల నాని. ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. కానీ దేశంలోనే ఘోరాతి ఘోరంగా వైకాపాను జనం సమాధి చేశారు. పార్టీకి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు.

పార్టీ ఏ స్థాయిలో వుందో దానికి తగ్గట్లుగా కాకుండా.. మళ్లీ తన పాలనలో జరిగిన దౌర్జన్యాలు, హత్యల లెక్కనే ప్రస్తుతం వుందని, నెలకే ఆగలేక రాష్ట్రపతి పాలన పెట్టమంటూ.. ఆ పథకం అమలు చెయ్యలేదు ఈ పథకంలో మోసం దగా అంటూ.. వైకాపాను బతకకుండా జగనే ఇంకా ఇంకా నాశనం చేస్తున్నాడు.దుర్మార్గ పార్టీ వైకాపా అని ప్రజలు ఇంకా ఇకా ఛీకొట్టేలా జగన్, సాక్షి కలిసి చేస్తుంటే.. మింగుడుపడని పార్టీ నాయకులు,పార్టీ కార్యకర్తలు పార్టీ మార్తుతున్నారు. రాజకీయాల నుండే తప్పుకొంటున్నా అంటూ 54 ఏళ్లకే  ఆ వృత్తి నుండి తప్పుకొంటున్నా అని ఆళ్ల నాని రాజీనామా చెయ్యడం ఆశ్చర్యానికి గురిచెయ్యడం లేదు?

👉 తిరుపతి:*ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్.. ధర్నాకు దిగిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌(SPO,S)*
*ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్.. ధర్నాకు దిగిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ *రెండేళ్లు వెట్టిచాకిరి చేయించుకుని ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ (SPO)ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్యాయం చేశారని, వెంటనే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ ధర్నాకు దిగారు. జోరున వర్షం వస్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్లకార్డులను ప్రదర్శిస్తూ గేటు ఎదుట రహదారిపై బైఠాయించారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయమే ఈ ప్రభుత్వం చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ రాష్ట్ర నాయకుడు ధర్మ చంద్, చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు.* 2020 జనవరి 2న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక జీవోను జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2156 మందిని ఎస్పీఓలుగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారని తెలిపారు. వీరిని బార్డర్ చెక్ పోస్టులు, నార్కోటిక్, ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాల్లో నియమించి విధులు అప్పగించారని తెలిపారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టామని గుర్తు చేశారు. కానీ 2022 మార్చి31 ఎలాంటి నోటీసు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీఓలను ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు. మళ్లీ మమ్ముల్నీ విధుల్లోకి తీసుకోవాలని గత ప్రభుత్వంలోని సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టు తిరిగినా న్యాయం చేయలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమకు అండగా ఉంటామని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.*
*కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి ప్రభుత్వ అధికారులను, మంత్రులను కలిసి సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్పీఓలు విధుల్లో లేకపోవడం వల్ల రాష్ట్రంలో గల్లీగల్లీకి గంజాయి దొరుకుతుందని, ఎర్ర చందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేయవద్దని సూచించారు. వెంటనే ఎస్పీఓలను విధుల్లోకి తీసుకోని రాష్ట్రంలో చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాలను అరికట్టాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 👉ఆందోళనలు ఉధృతం చేస్తామని ధర్మ చంద్, చిట్టిబాబు హెచ్చరించారు*.
👉రూ.100 కోట్ల విలువ చేసే భూదాన్ భూములకు ఎసరు* వెలుగులోకి మేడ్చల్ ఎమ్మార్వో శైలజ నిర్వాకం*
*నిషేధిత జాబితాలో ఉన్న 5.04 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చే కుట్ర* భూదాన్ యజ్ఞబోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్కు సిఫారసు చేసిన వైనం* ఎమ్మార్వో తీరుపై అనుమానంతో హోల్డ్లో పెట్టిన కలెక్టర్* అంతర్గత విచారణలో భూదాన్ భూమిగా తేలడంతో నివ్వెరపోయిన కలెక్టర్* ఓ వైపు ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి అధికారుల కారణంగా ఇప్పటికే అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి..*
*నగర శివరులో రూ.100 కోట్ల విలువైన భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఆ ఎమ్మార్వో ఏకంగా ఆర్డీవోను బురిడీ కొట్టించి జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్వోసీ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ కలెక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తహసీల్దార్ సిఫారసులను హోల్డ్ చేయడంతో విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు చేరకుండా ఆగింది. వంద కోట్ల విలువైన భూదాన్ భూమిని ధారాదత్తం చేసేందుకు మేడ్చల్ ఎమ్మార్వో శైలజ చేసిన కుట్రలపై మేడ్చల్ రెవెన్యూ అధికారులలో జోరుగా చర్చ జరుగుతోంది.*
*రాష్ట్రంలో అమలులో ఉన్న ఆర్ఓఆర్ యాక్ట్ – 2020 ప్రకారం తహసీల్దార్ కోర్టులు రద్దు కావడంతో 2022 నవంబర్ 25న వచ్చిన ఈ ఆర్డర్ పై గతంలో మేడ్చల్ తహసీల్దార్లుగా పనిచేసిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే రెవెన్యూ రికార్డులలో సర్వే నంబర్ 185లో 5.04 ఎకరాల భూమి భూదాన్ భూమిగా నమోదై ఉండడంతో తహసీల్దార్లు ఆ భూమి జోలికి వెళ్లలేదు. కానీ మొన్నటి ఎన్నికల తరువాత మేడ్చల్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శైలజ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసే బాధ్యతను తీసుకున్నారు.*
👉మహేష్ బాబు విశాల హృదయం గురించి చిన్నా..
మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మురారి సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమాని, సాంగ్స్ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి క్లాసిక్ హిట్ మురారి ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున రీ రిలీజ్ చేస్తున్నారు.   ఈ క్రమంలో దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. మురారి సినిమాకి పనిచేసిన వాళ్లలో కొంతమందిని ఇంటర్వ్యూలు చేసి అప్పటి జ్ఞాపకాలని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు చిన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో మురారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపారు.సీనియర్ నటుడు చిన్నా మాట్లాడుతూ.. మురారి సినిమా 50 రోజులు అవుట్ డోర్ రామచంద్రపురంలో షూటింగ్ జరిగింది.షూట్ లో అందరికి ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది. అయితే నాకు ప్రొడక్షన్ ఫుడ్ పడదు. షూట్ లో ఉంటే నాకు ఇంటి నుంచి బాక్స్ వచ్చేది. అవుట్ డోర్ లో ఉండటంతో కుదరదు.ఒక రెండు రోజులు ఏదో అడ్జస్ట్ అయ్యాను కానీ నా వల్ల కాలేదు. అప్పటికే నాకు కృష్ణ గారి ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. మురారి షూటింగ్ లో మహేష్ గారికి నిర్మాత చెల్లెలి వాళ్ళు అక్కడే రామచంద్రాపురంలో ఉండటంతో అక్కడి నుంచి ఫుడ్ ఇంటి భోజనం వచ్చేది. దాంతో నేను ఒకరోజు మహేష్ దగ్గరికి వెళ్లి నేను బయటి ఫుడ్ తినలేనని నా సమస్య చెప్పి ఏమనుకోకపోతే మీ ఫుడ్ పెడతారా అని సిగ్గు లేకుండా అడిగాను. దానికి ఆయన దానికేముంది వచ్చి తినండి అన్నారు. నాతో పాటు శివాజీరాజా కూడా వచ్చేవాడు. అలా రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో మహేష్ దగ్గరికి వెళ్లి తినేవాళ్ళం. కొన్ని రోజులకు మాకు లంచ్ బ్రేక్ ఇచ్చినా మహేష్ కి ఇంకా ఇవ్వకపోవడంతో లేట్ అయ్యేది. ఒకరోజు ఆయనే మీరు తినేయండి నేను వస్తాను అన్నారు. అప్పట్నుంచి మేము ముందు వెళ్లి మహేష్ కోసం తెచ్చిన ఫుడ్ ని తినేసి మిగిలింది అక్కడే పెట్టేస్తే ఆయన తినేవాళ్లు. 50 రోజులు అలాగే తిన్నాం. మహేష్ అంత బాగా చూసుకున్నాడు అని తెలిపారు. దీంతో మహేష్ మంచితనాన్ని మరోసారి పొగుడుతున్నారు అభిమానులు.

👉ఎంజీఎంలో ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు..*వరంగల్​ *జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతి న్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకు వెళ్లారు.అయితే, అప్పటికే కుక్కలు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. అత్యవసర విభాగానికి కొద్ది దూరంలోనే పిల్లల వార్డు కూడా ఉండడంతో అనుమా నాలు కలుగుతున్నాయి. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి.శిశువు మృతదేహమును ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. ఘటనపై ఎంజీఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, తమ హాస్పిటల్​కు సంబంధించిన శిశువు కాదని, కుక్కలు బయటి నుంచి తీసుకువచ్చి ఉండవచ్చని సూపరిం టెండెంట్​ ఒక ప్రకటనలో తెలిపారు..

👉 ఆంధ్ర మిర్రర్.. ప్రకాశం జిల్లా కంభం.. మండలంలోని ఎర్రబాలెం సచివాలయం పరిధిలోని లింగాపురం గ్రామంలో ‘ పొలంబడి’ కార్యక్రమము కంది పంటలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి డి స్వరూప మాట్లాడుతూ కందిపంటలో ప్రధానంగా వెర్రి తెగులు స్టెరిలిటీ మజాక్ వైరస్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి తెగులు ఈ తెగులు సోకినప్పుడు లేదా ఈ వైరస్ సోకినప్పుడు మొక్క లేత ఆకుపచ్చ రంగులో మారుతుంది ఆకులు విపరీతంగా కనబడతాయి పూత ఉండదు దీనికి ఎటువంటి మందులు లేవు నివారణకు అయితే ఈ తెగులుని వ్యాప్తి చెందించే యూరియోఫిట్ నల్లి మైండ్స్ ని నివారించుకోవడం ద్వారా తెగులుని వ్యాప్తి చెందకుండా చేయవచ్చు దీని నివారణకు మొక్క మొదటి దశలో అనగా నెల రోజులలోపు పైరు పై వేప గింజలు నూనె గాని వేప గింజల కషాయాన్ని గాని పిచికారి చేసుకోవాలి ఈ విధముగా నెల రోజుల్లో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి వేప నూనెను 1500 ppm అయితే లీటర్ నీటికి 5 ml కలిపి పిచికారి చేయడం వలన ఈ నల్లి పంటపై వాలకుండా సహాయపడుతుంది ఒకవేళ వాలిన గుడ్డు పెట్టనీయదు ఒకవేళ పెట్టిన దాన్ని పిగలనీకుండా చేస్తుంది. రెండవదిగా పంట 30 నుండి 40 రోజులు వయసులో ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున నీటిలో కరిగే గంధకాన్ని కలిపి పిచికారి చేసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా రసాయనిక కూడా పిచికారి చేయాల్సి ఉంటుంది 60 నుండి 70 రోజుల వయసు అనగా రెండు నెలల తర్వాత ఈ రసాయన మందులను పిచికారి చేయాలి వీటిలో ప్రధానంగా ప్రాపర్ గైడ్ రెండు ఎంఎల్ లేదా ఫెనాక్సాక్విన్ 1.5 ml లేదా ఫెన్ పైరసీమెట్ ఒకటి పాయింట్ ఐదు ఎమ్మెల్  చేయాలి. అలాగే తెగుల్ని తట్టుకోగల కందిరకాలను ఉదాహరణకు బిఎస్ఎన్ఆర్ 853, 736 అనే రకాలను పంట వేసుకున్నట్లయితే ఈ తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. రెండు మూడు సంవత్సరాల నుండి ఈ వైరస్ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది గరిష్టంగా దిగుబడులు తగ్గుదల కనబడతా ఉంది కాబట్టి రైతు సోదరులు ఇప్పటినుంచే  జాగ్రత్తలు తీసుకొని  పంటనుకాపాడుకోవాల్సిందిగా  పొలంబడి సందర్భంగా తెలిపారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం