గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి:నారా లోకేష్ కీలక నిర్ణయాలు.. వైకాపా ప్రతిష్ఠను దిగజారుస్తున్న నేతలు..GHMC ని వదలని సైబర్ నేరగాళ్ళు.. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు ఛేదించిన ప్రకాశం పోలీస్.. ఒంగోలులో బీటెక్ విద్యార్థిని ప్రియ మృతి మిస్టరీ?

*గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి: 100మందికిపైగా మృతి?*గాజాలో ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతిచెంది నట్లు స్థానిక మీడియా తెలిపింది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం.. ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంలోని ఆల్ సహాబా ప్రాంతంలో ఆల్ తబాయీన్ పాఠశాలపై బాంబు దాడికి పాల్పడిందని, ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఈ ఘటనను భయంకరమై న ఊచకోతగాఅభివర్ణిం చాడు. కొందరు శరీరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయని తెలిపాడు. మరోవైపు ఇజ్రా యెల్ మిలిటరీ మాత్రం.. హమాస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు చెప్పింది..

👉 తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఏపీని పునర్‌నిర్మాంచాలి, ఇక్కడి మనోభావాలు గౌరవించాలి. తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టింది. ఇద్దరు ముఖ్యమంత్రులం ఇచ్చిపుచ్చుకునే విధంగా ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం. టీడీపీ తెలుగువాళ్ల కోసం పెట్టిన పార్టీ. మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. తెలంగాణలో టీడీపీ అగ్రస్థానానికి వెళ్లాలి. -చంద్రబాబు

👉నారా లోకేష్ కీలక నిర్ణయాలు..అమరావతీ :
నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలి!*ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి..అన్ని స్కూళ్ళలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయండి..

*సిఎంతో సహా అందరం మోడల్ పిటిఎం సమావేశాల కు హాజరవుతాం*గత ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షలమంది విద్యార్థులు ఎలా తగ్గారు?*బాల్యం నుంచే మహిళల ను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు..*“సాల్ట్” ప్రాజెక్టుపై పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష* కొత్త రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం: మంత్రి నాదెండ్ల*రాష్ట్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నూతన రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది.ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని.. డిజైన్ పూర్తికాగానే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తామన్నారు.

👉 వైకాపా ప్రతిష్టను దిగజారుస్తున్న నేతలు.. ఎపిలో వైఎస్ఆర్ పార్టీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది.తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది.వైసీపీలో ప్రముఖ నేతల వ్యక్తిగత విషయాలు ఇలా హైలెట్ అవుతూండటం ఆ పార్టీకి సమస్యగా మారుతోంది.అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా ఉంటున్నారు.ఈ కారణంగా ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగత వ్యవహారాల్లో వివాదాస్పదమవుతున్నారు.పైగా వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని ఇప్పుడు బయట పడ్డాయని ఆయన ఎందుకు పట్టించుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయిన దువ్వాడ ఫ్యామిలీ సర్కస్..వైఎస్ జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేది. సీనియర్ నేత అచ్చెన్నాయుడును టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ ది ప్రత్యేక శైలి. అది జగన్మోహన్ రెడ్డిని మెప్పించిందని చెబుతారు. స్థానిక ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామంలో చేసిన రాజకీయం కూడా.. దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్‌లో నమ్మకం పెంచిందని చెబుతారు. అందుకే ముగ్గురు నేతలు పోటీ పడుతున్నా.. సరే దువ్వాడకే జగన్ టిక్కెట్ ప్రకటించారు. కానీ ఈ మధ్యలో ఆయన మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నారని అది వారి కుటుబంంలో చిచ్చుకు కారణం అయిందని తెలిసింది. ఈ విషయం జగన్ వద్దకూ వెళ్లింది. చివరికి ఆయనకు కాదని.. ఆయన భార్య దువ్వాడ వాణికే టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇంచార్జ్ గా ప్రకటించారు కూడా . కానీ చివరికి దువ్వాడ శ్రీనివాస్ కే టిక్కెట్ ప్రకటించారు. దువ్వాడ వాణిని బుజ్జగించారు. కానీ ఫలితం మాత్రం నిరాశను కలిగించింది. అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారు.. టిక్కెట్ ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు అది వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారుతోంది…..*విజయసాయిరెడ్డిపైనా విమర్శలు..ఇక ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం రెండు, మూడు వారాల పాటు హైలెట్ అయింది. ఆయన పై నేరుగా ఓ దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్తనే ఆరోపణలు చేశారు. తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం ఆయనేనని డీఎన్‌ఏ టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు. ఈ అంశంలో ఆ అధికారణి పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది. ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వచ్చాయి. అన్నింటికీ డీఎన్‌ఏ టెస్టు ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ.. విజయసాయిరెడ్డి అంగీకరించలేదు. అయితే ఆ ఆధికారిణి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఓ వివరణ ఇచ్చారు. ఆ అధికారికి చేసిన అన్ని రకాల సాయాలు కూతురిగానే భావించి చేశానని… తాను వారింటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించానని.. తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని చెప్పారు . అంతే తప్ప మరేమీ లేదన్నారు. కానీ వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదని తెలిసినా .. వారిని ప్రోత్సహించడం వల్లనే సమస్యలా ?వైసీపీ అధినేత జగన్ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. ఇంకా బయటపడని అనేక మంది లీడర్ల వ్యవహారాల గురించి కు పూర్తిగా తెలుసని.. అయితే ఆ లీడర్ల వ్యక్తిగత ప్రవర్తన కారణంగా పార్టీకి దూరం చేసుకోలేమని ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు. కానీ వారే పార్టీకి పెద్ద సమస్యగా మారుతున్నారని క్యాడర్ అసంతృప్తికి గురవుతున్నారు. మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్. హైదరాబాద్‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి చెందిన వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తి. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన చామకూరి లక్ష్మణ్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు. పోస్ట్‌లు వైరల్‌ చేయించిన ప్రధాన నిందితుల కోసం పోలీసుల గాలింపు.

👉గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత..మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు అరెస్ట్. 230 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదు సీజ్.మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసుల అంచనా.

👉 *పోలీసులకు, GHMCకి సవాల్ విసురుతున్న అక్రమ పార్కింగ్ దారుడు* అక్రమ పార్కింగ్ పై పలుమార్లు కేసులు నమోదైన మారని బుద్ది…*
*ఏకంగా మార్కెట్కు సంబంధం లేని దొంగ సొసైటీ సృష్టించి… నకిలీ అగ్రిమెంట్ తో పోలీసులకు, GHMCకి చుక్కలు చూపిస్తున్న పాత నేరస్తుడు…*
*పోలీసులకు దొంగ సొసైటీ, నకిలీ అగ్రిమెంట్ న్నీ తెలిసిన కోర్టును ఆశ్రయించకపోవడం పై పలు అనుమానాలు..*టోకెన్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్న వ్యక్తి పై GHMC, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుంది….*అక్రమదారుల నుండి సామాన్య ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై, పోలీసుల పై ఉన్నది…కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఏమి పట్టించుకోరు… అక్రమాలను అరికట్టడానికి కదా ప్రభుత్వ ఫ్లీడర్లనే ఏర్పాటు చేసింది….*మాదన్నపెట్ పోలీసు స్టేషన్లో ఘటన….*మాదన్నపేట్ కూరగాయల మార్కెట్కు రైతులు కూరగాయలు పండించుకొని ఆటోలు, డిసిఎంలో తీసుకువస్తుంటారు. కానీ పరమేష్ అనే వ్యక్తి GHMC నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా టోకెన్లు ఇవ్వకుండా అక్రమంగా పార్కింగ్ పేరుతో భారీ ఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఈ అక్రమ పార్కింగ్ పై పలుమార్లు కేసులు కూడా నమోదైయ్యాయి. కానీ అతని బుద్ది మారలేదు. ఏకంగా మార్కెట్ కు సంబంధం లేని దొంగ సొసైటీ ఏర్పాటు చేసి నకిలీ అగ్రిమెంట్ సృష్టించి న్యాయస్థానంను మోసం చేసి ఓ ఆర్డర్ ను తీసుకువచ్చాడు. ఈ విషయం పోలీసులకు, ghmc కి తెలిసిన పట్టించుకోరు. ఆ సొసైటీని హైకోర్టు రద్దు చేసిందని తెలిసిన ప్రభుత్వ ఫ్లీడర్ లతో సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయరు. రైతులు, వ్యాపారస్తుల భయబ్రాంతులకు గురి చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వల్ని జులుం చేస్తున్నాడని మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఎంతో కష్టపడి కూరగాయలు పండించుకొని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నామని… వచ్చిన లాభం ఈ అక్రమ.పార్కింగ్ ఇవ్వాల్సి వస్తుందనే రైతులు వాపోతున్నారు.. ఇప్పటికైనా పోలీసులు, ghmc ఆ నకిలీ సొసైటి బండారం బయట పెట్టి కోర్టును మోసం చేస్తున్న ఘనుడిని ఆరికడుతారో చూడాలి మరి..
👉 ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం పలు శుభ కార్యక్రమాలలో తొలుత ఒంగోలు లోని మంగమూర్ రోడ్ లోని , శంకర నారాయణ కల్యాణ మండపంలో వల్లపు వెంకట రవీంద్ర , శివకుమారిల కుమారుడు చి. జితేంద్ర సాయి, చి.ల. సౌ పద్మావతి ల వివాహ మహోత్సవానికి ,
ఒంగోలు,కర్నూల్ రోడ్ వద్ద హరిప్రియ ఫంక్షన్ హాల్ లో వివరం గోవిందయ్య ,అనురాధ ల కుమార్తె చి. ల. సౌ సౌమ్య , చి. గంగాధర్ ల వివాహ మహోత్సవానికి ,
దర్శి లోని PTS కన్వెన్షన్ నందు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుమర్రెడి శ్రీనివాస రెడ్డి , రమాదేవి కుమార్తె చి. ల. సౌ రచన, చి. ఫణింద్ర ల వివాహ మహోత్సవానికి హాజరైయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించినారు.

👉 దర్శి పట్టణంలోని PTS కన్వెన్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు , ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి , చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు , మాజీ మంత్రి జవహర్ , గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి , దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి,మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు.

👉 గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత..
మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.
230 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదు సీజ్.మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసుల అంచనా.
👉 నల్లమల అటవీ ప్రాంతంలో గల సర్వ నరసింహ స్వామి ఆలయ సమీపంలో రంగురాళ్ల కోసం స్థానికులు పెద్ద ఎత్తున వెతుకులాడుతున్నారు. రంగురాళ్లతోపాటు వజ్రాలు దొరుకుతాయని నమ్మి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి వెతుకుతున్నారు
👉 మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలోని
తర్లుపాడు రోడ్లో ఉన్న పురాతన మిల్లులో గుప్త నిధుల కోసం పూజలు…పెద్ద గుంటను తవ్వి సొరంగం వేసిన దుండగులు… సమాచారంతో అక్కడికి చేరుకొని 10 మంది గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు…..
👉సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ..టీడీపీ రాష్ట్ర ఎస్ సి సెల్ జనరల్ సెక్రటరి
గోన చెన్నకేశవులు ఇచ్చిన ఫిర్యాదు వివరాల మేరకు.. గిద్దలూరు నియోజకవర్గం ఫేస్ బుక్ పేజీ లో ఈనెల ఏడవ వ తేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత ఫోటోలు పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందగా, కంభం పోలీస్ వారు Cr.No.124/2024 u/s 196 BNS Sec 67 of IT Act క్రింద కేసు నమోదు చేసి సదరు అనుచిత ఫోటోలు పోస్ట్ చేసిన వారిని గుర్తించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం SDPO S. బాలసుందరరావు మరియు ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ పర్యవేక్షణలో కంభం సీఐ జె రామకోటయ్య మరియు కంభం ఎస్సై పి. రాజేష్ లు రెండు బృందాలు గా ఏర్పడి ఐటి కోర్ టీం యొక్క సాంకేతికత ఆధారంగా అనుచిత పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి వారికి వాట్సప్ ద్వారా నోటీసు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసిన 24 గంటలలో ముద్దాయిని గుర్తించి నోటీసు సర్వ్ చేసినందుకు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన విషయాల ద్వారా రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని జిల్లా ఎస్పీ అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను గుర్తించలేమని అనుకుంటే పొరపాటు పడినట్లేనని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మారుపేర్లతో ఉన్న అకౌంట్ లు ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటని, ఫేక్ అకౌంట్స్ ను పట్టుకోలేమని అనుకోవద్దని, ఫేక్ అకౌంట్స్ ను నడిపే వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వాటిని నడిపే వారితో పాటు ప్రోత్సహించే వారిపైనా చర్యలు తప్పవన్నారు.సోషల్ మీడియా వేదికగా సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని తప్పుడు రెచ్చగొట్టే ఆరోపణలు, పోస్ట్ లు చేసినా.. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాట్సాప్ , ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ లో పోస్ట్ చేసినా, వాటిని షేర్ చేసినా తగిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత సోషల్ మీడియాను పాజిటివ్ గా ఉపయోగించుకోవాలన్నారు.
*👉టెలిగ్రామ్ వేదికగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త*…టెలిగ్రామ్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.టెలిగ్రామ్ లో ఓ గ్రూప్ ఏర్పాటు చేసి అధిక లాభాలను ఆశ చూపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఒక గ్రూపుగా ఏర్పడి టెలిగ్రామ్ లో ఓ గ్రూపును క్రియేట్ చేస్తున్నారు. అందులో షేర్స్ పెట్టుబడులు అంటూ ఆశ చూపిస్తున్నారు. మీరు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు కేవలం 6 గంటల్లోనే ఆదాయం ఇస్తామంటూ మోసగిస్తున్నారు. వారు పెట్టిన గ్రూపులో కొంతమంది సైబర్ నేరగాళ్ల ఆ గ్రూపుకు చెందినవారే తమకు లాభాలు వచ్చాయంటూ స్క్రీన్ షాట్లు పెట్టి మిగతా జనాలను ఆశ కలిగించేలా చేస్తారు.ఇది నమ్మి మోసపోతున్న కొంతమంది ఆ సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు.కేవలం 3,500 రూపాయలు పెట్టుబడి పెట్టి కేవలం 6 గంటల్లోనే 70 వేల రూపాయలు లాభాలు పొందామని సైబర్ నేరగాలు ఆశ చూపిస్తున్నారు. గ్రూపులో కూడా అలాంటి స్క్రీన్ షాట్లు కొంతమంది లాభం పొందినట్లుగా పెడుతుంటారు. ఇది తెలియని కొంతమంది ప్రజలు నిజమని నమ్మి ముక్కు మొహం తెలియని షేర్స్ పేరుతో మోసగించే కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. తర్వాత ఆ గ్రూప్ పూర్తిగా కనుమరుగైపోవడం జరిగిపోతుంది.ఇలా మోసపోతున్న కొంతమంది ప్రజలు..పరువు పోతుందని బయటికి చెప్పుకోవటం లేదు.కొసమెరుపు ఏమిటంటే కొంతమంది సైబర్ నేరగాళ్లు తెలుగులో చాట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసగిస్తున్నారు. వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా కానీ వారి పేర్లన్నీ నార్త్ ఇండియాలో ఉన్న వారిలా ఉంటాయి.తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చన్న ఆశతో చాలామంది ప్రజలు కష్టపడి సంపాదించుకున్న తమ విలువైన నగదును కోల్పోతున్నారు.టెలిగ్రామ్ లో వస్తున్న ఇటువంటి ఫేక్ షేర్స్ యాప్లను నమ్మి మోసపోవద్దు వారందరూ సైబర్ నేరగాళ్లు అని గుర్తించాలని అధికారుల హెచ్చరిస్తున్నారు.
👉 ఒంగోలులో బీటెక్‌ విద్యార్థిని ప్రియ మృతి మిస్టరీ..
రిమ్స్‌కు ప్రియను తీసుకొచ్చిన ఐదుగురు యువకులు..
ఆస్పత్రిలో చేర్పించి పరారైన యువకులు..
ఒంగోలు రిమ్స్‌లో మృతి చెందిన విద్యార్థిని ప్రియ..
తిరుపతి ఎస్వీ వర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ప్రియ..
ప్రియ ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్టు గుర్తింపు..
ప్రియ నోటి వెంట నురగ రావడంతో..
అబార్షన్‌ కోసం మందులు వాడినట్టు అనుమానం..

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం