👉 రు.2వేల కోట్లు ఇవ్వండి…ప్రధాని మోడీకి సీఎం విజయన్ విజ్ఞప్తి– వాయనాడ్‌ను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించని ప్రధాని– బాధితులతో మాట్లాడిన మోడీ– పునరావాసానికి తోడ్పడుతామని హామీ..విధ్వంస ప్రాంతాల్లో కాలినడకన తిరిగి సందర్శన
తిరువనంతపురం: ప్రకృతి ప్రకోపానికి గురైన వాయనాడ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు.దాదాపు 300మందికి పైగా మరణానికి కారణమైన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. అక్కడ జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షించారు. ఈ ఆపత్కాలంలో బాధితుల వెనువెంట కేంద్రంతో పాటు యావత్ దేశం వురటుందని మోడీ చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనడానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కేరళకు హామీ ఇచారు. జులై 30న వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి చూర్మాలాల, ముండక్కై, అత్తమాలా ప్రాంతాలు నేలమట్టమైన విషాద ఘటనను ప్రకృతి వైపరీత్యంగా కేంద్రం ప్రకటించాలని కేరళలోని పాలక వామపక్ష సంఘటన, ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పునరావాస చర్యలకు ఎలాంటి నిధుల కొరత వుండదని ప్రకటించిన ప్రధాని ప్రకృతి వైపరీత్యంగా దీన్ని ప్రకటించలేదు.భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌లో ప్రధాని మోడీ శనివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కన్నూర్ చేరుకున్నారు. కన్నూర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రభృతులు ప్రధానికి స్వాగతం పలికారు. అంతకు ముందు దాదాపు ఐదు గంటల పాటు కొండచరియలు విరిగిపడి న వాయనాడ్‌లో మోడీ గడిపారు. అక్కడ బాధితులను కలిసి మాట్లాడారు. జరిగిన విధ్వంసాన్ని, నష్టాన్ని కళ్లారా చూసేందుకు ఆ ప్రాంతాల్లో తిరిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన అనుభవా లను బాధితులు ఈ సందర్భంగా ప్రధానితో పంచుకున్నారు. ఐనవారినందరినీ కోల్పోయిన వారిని మోడీ ఓదార్చారు.గ్రౌండ్ జీరో వద్ద 50నిమిషాలు గడిపిన మోడీ పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి మూడు ప్రాంతాలు నేలమట్టమైన గ్రౌండ్ జీరో వద్ద ప్రధాని 50 నిమిషాలు గడిపారు. ప్రకృతి విలయతాండవంలో జరిగిన విధ్వంసాన్ని వీక్షించారు. కేరళ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రధాని వెంటే వున్నారు. కన్నూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వాయనాడ్ చేరుకున్న మోడీ చూర్మాలాలా ఏరియాకు వెళ్ళి స్వయంగా అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రకృతి విలయం సంభవించిన నేపథ్యంలో సైన్యం ఇక్కడ 190 అడుగుల బెయిలీ బ్రిడ్జిని నిర్మించింది. ఆ వంతెన పైనుండి మోడీ నడుచుకుంటూ వెళ్లి ఆ ప్రాంతంలోపర్యటించారు. చూర్మాలాలాకు చేరిన తర్వాత వాహనం నుంచి కిందకు దిగిన మోడీ అక్కడి సహాయక సిబ్బందితో మాట్లాడారు. శిధిలాల కుప్పలతో నిండిన ఆ ప్రాంతంలో కాలినడకన తిరిగారు.పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కాల్‌పేట్‌లో వాయనాడ్ కలెక్టరేట్ వద్ద సమీక్షా సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. బాధితులకు అండదండగా నిలవడం ప్రస్తుతావసరమని, పునరావాస కార్యక్రమాలకు నిధులనేవి అడ్డంకి కాబోవని అన్నారు. బాధితులకు భవిష్యత్తులో మంచి జీవితాన్ని అందించడం ఈ సమాజం బాధ్యత అని వ్యాఖ్యానించారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*ఏరియల్ సర్వే….. .చూర్మాలాలా, ముండక్కై, పంచిరిమట్టమ్ ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే జరిపారు. హెలికాప్టర్‌లో ఆయనతో పాటు ముఖ్యమంత్రి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇతర అధికారులు వున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా వారితో పాటే వున్నారు. *సమగ్ర మెమోరాండం ఇవ్వండి…కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి సమగ్ర మెమోరాండాన్ని కేంద్రానికి అందజేయాలని ప్రధాని, రాష్ట్రాన్ని కోరారు. బాధితుల కోసం చేపడుతున్న పునరావాస ప్రాజెక్టుల గురించి రాష్ట్రానికి గల ఆలోచనలు, ప్రణాళికలు ఏమిటో తెలియజేయాలని కోరారు. అంతేకానీ కేంద్రం వైపు నుంచి చేయాల్సిన వాటి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధించినట్టుగా కనీసం ఈ ఘటనను ప్రకృతి వైపరీత్యంగా కూడా ప్రకటించలేదు.*రూ.2వేల కోట్ల సాయం కోరిన కేరళ..ప్రకృతి ఆగ్రహానికి గురైన వాయనాడ్ జిల్లాలోని బాధిత ప్రాంతాల్లో సహాయ పునరా వాస చర్యల కోసం రూ.2 వేల కోట్లు అవసరమని కేరళ ప్రభుత్వం కోరింది. ఈ ప్రమాదంలో 226 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు. ఇంకా అనేకమంది గల్లంతయ్యారు.
👉 తిరిగి బాంగ్లాదేశ్ కు హసీనా!!!..సహజంగా తిరుగుబాటు కారణంగా పదవులు కోల్పోయి.. దేశం విడిచి వెళ్లిపోయి ప్రవాసంలో ఉండే నాయకులు తిరిగి స్వదేశం చేరుకోవడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా కొన్ని సంవత్సరాల తర్వాతనే. ఉదాహరణకు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ దుబాయ్, లండన్ లో పదేళ్లుపైగా కాలం గడిపారు. రెండేళ్ల కిందట శ్రీలంక నుంచి పరారైన గొటబాయ రాజపక్స ఇంకా తిరిగొచ్చారో లేదో తెలియదు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది ఉంటారు. కానీ, నాలుగు రోజుల కిందట తిరుగుబాటుతో బంగ్లాదేశ్ ను వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించనున్నారు.
👉10 నెలల్లోపే రెండోసారి ఎన్నికలు? బంగ్లాదేశ్ లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) పాల్గొనలేదు. దీంతో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ 85 శాతం పైగా ఓట్లతో గెలుపొందింది. హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు. కానీ.. రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో ఆరు నెలల్లోపే తీవ్ర ఆగ్రహం మూటగట్టుకున్నారు. ఆందోళనలు అల్లర్లుగా మారి విధ్వంసం చోటుచేసుకుంది. ఆఖరికి హసీనా కట్టుబట్టలతో దేశం విడిచారు. యూకే వెళ్లేందుకు ప్రయత్నించినా.. అనుమతి రాకపోవడంతో భారత్ లో ఆగిపోయారు. నాలుగు రోజులుగా చెల్లెలు రెహానాతో కలిసి ఢిల్లీ సమీపంలోని రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. కాగా, హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.👉అమ్మ వెళ్తుంది…. విదేశాల్లో ఉంటున్న హసీనా కుమారుడు సజీబ్ వాజెజ్ జాయ్ తన తల్లి భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో గురువారం బంగ్లాలో ఆపధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో పలువురు సలహాదారులూ ఉన్నారు. దేశంలో సైనిక పాలనకు అవకాశం లేనట్లేనని దీంతో స్పష్టమైంది. కాగా, యూనుస్ త్వరలోనే ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎన్నికల ప్రకటన రాగానే.. హసీనా స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తన తల్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హసీనా కుమారుడు సజీబ్ చెప్పారు…*హసీనా పార్టీ లేకుండానే..?….బంగ్లాలో ఎన్నికలు నిర్వహించినా హసీనా పార్టీ అవామీ లీగ్ పాల్గొనే చాన్స్ ఉంటుందా? అనేది సందేహమే. బద్ధశత్రువైన బీఎన్పీని ఇన్నాళ్లు తొక్కిపెట్టారు హసీనా. ఇప్పుడు ఆ పార్టీకి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట జరిగిన ఢాకా బీఎన్పీ ర్యాలీలో లక్షలాది జనం పాల్గొన్నారు. ఇక ఆపద్ధర్మ ప్రభుత్వంలో హసీనా పార్టీకి చోటు దక్కలేదు. ఇక సాధారణ ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు లేకున్నా.. మొన్నటి బీఎన్పీ ర్యాలీ పరోక్షంగా హసీనా పార్టీపై ఉన్న తీవ్ర ప్రజాగ్రహాన్ని చాటుతోంది. అంటే.. గెలవడం అసాధ్యం. **బంగ్లాదేశ్ లో లభించే అత్యంత చౌక శ్రామిక వర్గం తోపాటు , అక్కడ సముద్రంలో సహజంగా లభించే గాస్ నిల్వలు , దాని నుండి వచ్చే పవర్ ను , ఆ పవర్ ను తయారు చెయ్యటానికి అవసరమయ్యే మొత్తం GAS TURBINES , కంపెనీ లు కూడా ఎక్కువగా అమెరికా వే .అక్కడ లభించే సహజ వనరు అయిన గాస్ ను కూడా అత్యంత తక్కువ రేటుకు కొల్లగొడుతున్నారు .అందువల్లే అది ప్రపంచంలో చైనా , వియత్నాం దేశాల సరస న చేరి ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తి లో రెండు,మూడు స్థానాల మద్య ఉంటుంది ..ఆస్ట్రేలియా లో ఒక వస్త్రం అమ్మితే 100 రూపాయలు వస్థే ,దాన్ని తయారు చేసిన బంగ్లాదేశ్ కార్మికుడు కి 2 నుండి 3 రూపాయలు వస్తుంది అంతే ..
👉 ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, వెంగలరెడ్డి పల్లె గ్రామ పొలాల్లో బోర్ల కేబుల్ వైర్లను దొంగలిస్తున్న దొంగను పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన రైతులు.
👉 మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని మృతదేహం కలకల రేపింది.. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.. మృతి చెందిన వ్యక్తి ఎవరు మృతికి కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
👉 ఒంగోలు లోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షం లో టీడీపిలో చేరిన బండ్లమిట్ట కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ వారి భర్త బేతంశెట్టి హరిబాబు మధు తదితర నాయకులు.
👉ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్ నందు దక్షిణ అశ్వాద్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ,జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ నాయకులు.
👉నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి.. నీట్ యు జి పరీక్షను తిరిగి నిర్వహించాలి.. కనిగిరి టీచర్స్ అకాడమీలో జరిగిన ఉద్యోగార్థుల సదస్సులో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పీవీ శేషయ్య మాట్లాడుతూ 2018లో యు పి ఎస్ సి ని రద్దు చేసి, దాని స్థానంలో ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని, నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలలో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్న, కోట్లాది పోస్టులు కొత్తగా ఏర్పాటుకు అవకాశం ఉన్న, రిక్రూట్మెంట్ అధ్వాన స్థితిలో వుందన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా 1100 పిటిషన్ లు సుప్రీంకోర్టులోను వివిధ హైకోర్టులలోను దాఖలయ్యాయన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యవస్థ గత కారణాలు, లాభాలే పరమావధిగా ఉన్న నేరస్తులతో కుమ్మక్కైన పాలన యంత్రాంగమే కారణం అన్నారు. నోటిఫికేషన్ అనంతరం పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆరు నెలల లోపల నియామకాలు పూర్తి చేయాలన్నారు.ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న పాలకులు మాట తప్పారన్నారు. స్టడీ సెంటర్స్ ను కోచింగ్ సెంటర్స్ ను ప్రభుత్వమే నాణ్యమైన సిబ్బందితో నిర్వహించాలన్నారు. 2011లో ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 2018లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారన్నారు. ఏడు సంవత్సరాల విలువైన నిరుద్యోగుల జీవిత కాలాన్ని కాజేసారన్నారు. 2003 డీఎస్సీ వాళ్లకు 2005లో, 2006 డీఎస్సీ వాళ్లకు 2009లో ,2018 డిఎస్సీ వాళ్లకు 2021 లో పోస్ట్ లు ఇచ్చారన్నారు. ప్రతి డీఎస్సీ కి మధ్య మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని నిరుద్యోగులు కోల్పోయారన్నారు. నేడు ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీలను పూర్తిస్థాయిలో ప్రకటించకుండా నామమాత్రంగా డి ఎస్ సి నిర్వహించడం నిరుద్యోగులను మోసగించడమే అన్నారు. టెట్టు డీఎస్సీలకు ఒకేసారి తేదీలను ఇవ్వకపోవడం వాస్తవ ఖాళీ పోస్టుల సంఖ్యను ప్రకటించి భర్తీ చేయకపోవడం కోర్టులకు వెళ్లే అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించడం ఇవన్నీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. 2024 డిసెంబర్ లోపే నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని పీవీ శేషయ్యఅన్నారు. 👉ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపిన విద్యా కమిటీ చైర్మన్లు..
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షేక్ సుభాని వైస్ చైర్మన్ కొమరోలు లక్ష్మి మరియు రెడ్డిచెర్ల గ్రామ పాఠశాల విద్యాకమీటి చైర్మన్ షేక్ రఫీ మరియు మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘణంగా సన్మానించారు.విద్యా కమిటీ చైర్మన్లుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు ముత్తుముల సంజీవరెడ్డి, వీరంరెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి, ముత్తుముల మల్లిఖార్జున రెడ్డి, శివరామి రెడ్డి, అక్కలరెడ్డి మోహన్ రెడ్డి హుస్సేన్ బేగ్, సుబ్బారాయుడు, పాల్గోన్నారు.
👉 మ్యాట్రిమోనీ సైట్ల పేరుతో మోసాలు !!! సాధారణంగా మ్యాట్రిమోని సైట్లలో అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపిస్తే “ఇంట్రస్ట్” ఆప్షన్ పై వెంటనే క్లిక్ చేసేస్తుంటారు! తర్వాత టెస్ట్ మెసేజ్ ల దగ్గర మొదలై, నెంబర్స్ షేర్ చేసుకుని వాట్సప్ మెసేజ్ ల వరకూ వ్యవహారం వెళ్తుంటుంది. ఈ సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఏడు అడుగులు… ఒక్కోసారి తేడా వస్తే ఎవరో ఒకరికి ఏడు ఊచలు! ఇటీవల కాలంలో మ్యాట్రీమోని సైట్లలో జరుగుతున్న మోసాలు అలానే ఉన్నాయి! అవును… తాజాగా ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన అమ్మాయి ఫోటోలు చూసి సంబంధం కలిపే ప్రయత్నం చేశాడు. ఈ లోపు అవతలివైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మాటా మాటా కలవడమే కాదు.. నోటు వరకూ వెళ్లింది వ్యవహారం! కట్ చేస్తే… అవతల ఉన్నది అమ్మాయి కాదు.. అమ్మాయిల ఫోటోలతో కేటుగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లలో మాటు వేశారని తెలుసుకున్నాడు. దీంతో.. రివేంజ్ డ్రామా ఒకటి ప్లాన్ చేశాడు! వివరాళ్లోకి వెళ్తే… కాకినాడకు చెందిన ఓ వ్యక్తి.. షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాడు. ఈ సమయంలో పెళ్లి చేసుకుని ఫిక్సై మ్యాట్రిమోని సైట్లో యువతుల కోసం వెతికాడు. ఈ సమయంలో ఓ అమ్మాయి ప్రొఫైల్ చూసి మనసుపడ్డాడు.. అనుకున్నదే తడవుగా అన్నట్లుగా పెళ్లి చేసుకొవాలని భావించి సంబంధం కలుపుకున్నాడు. ఈ సమయంలో ఆ యువతి పేరుతో కేటుగాళ్లు సూర్యప్రకాశ్ నుంచి లక్షలు దండుకుని నిండా ముంచారు. అయితే… తాను మోసపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, తనలా మరొకరు మోసపోవద్దని నలుగురికి జాగ్రత్తలు చెబితే ఏమి వస్తుంది.. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని భావించాడో ఏమో కానీ… ఇతడు కూడా తను మోసపోయిన తరహాలోనే అమ్మాయిల ఫోటోలు పెట్టి మ్యాట్రిమొనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు చేయడం మొదలుపెట్టాడు. సమయంలో తనతో ఓ స్నేహితుడు సతీష్ ని కలుపుకున్నాడు! ఈ సమయంలో లేడీ వాయిస్ వచ్చేలా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని.. అబ్బాయిలను కవ్వించే మాటలతో ట్రాప్ లోకి లాగడం మొదలుపెట్టారట. ఈ సమయంలో అవతలి వ్యక్తి పూర్తిగా ప్రేమలో ముంగిపోయాడు, మనం ఏమి చెబితే అది వింటాడు అని ఓ క్లారిటీకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలుపెడతారంట. ఇందులో భాగంగా.. అమ్మ, నాన్నల అనారోగ్యం పేరుచెప్పో.. ఓ స్టార్టప్ బిజినెస్ పెడితే లాస్ వచ్చిందనో ఏదో ఓ కథ చెప్పి ఆ సదరు యువకుడిని డబ్బులు అడుగుతారట. ఎలాగో కాబోయే భార్యే కదా అనే పెద్ద మనసుతో ఆ యువకుడు డబ్బులు ట్రాన్స్ ఫర్ ఛేస్తున్నారట. తీరా డబ్బులు అందిన తర్వాత కేటుగాళ్ల నుంచి రెస్పాన్స్ ఉండదు.. మ్యాట్రిమోనీలో ఉన్న అడ్రస్ తప్పని తెలియడానికి ఆ యువకులకూ పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టదు. ఈ సమయంలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కేటుగళ్ల ఆటకట్టించారు. పలు ప్రాంతాల్లో బాధితులు ఈ కేటుగాళ్ల మోసానికి బలైనట్లు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే కాకినాడకు చెందిన వ్యక్తిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో నిందితులపై 406, 420, 66సీ, 66 డీ యాక్ట్ ల కింద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు.