👉 హోం మంత్రి అనిత కు తప్పిన ప్రమాదం.. ఉంగుటూరు మండలం కైకరం జాతీయ రహదారి వద్ద ఆదివారం హోం మంత్రి అనిత కు ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ వాహనాన్ని అనిత కారు వెనక నుండి ఢీ కొట్టింది దీంతో ఆమె కారు స్వల్పంగా దెబ్బతింది, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళుతుండగా ఈ ఘటన జరిగింది.అనంతరం హోంమంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు ఊపిరి
పీల్చుకున్నారు.
👉 శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..!!!శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 13వందలా 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారుల అంచనా.
👉ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ… ఈడీ, సీబీఐ కేసులతో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.ఇప్పటికే కింది కోర్టుల్లో తన బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో, కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.కవిత పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య బెంచ్ విచారణ జరపనుంది. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పిటిషన్ ను విచారించనుంది.17నెలల పాటు ఇదే కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇదే బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ సందర్భంగా… ఇంకా ఎంత కాలం ఓ వ్యక్తిని జైల్లో పెడతారు, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది… విచారణ త్వరగా పూర్తి చేయాల్సిందేనంటూ కామెంట్ కూడా చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇదే బెంచ్ మీదకు కవిత పిటిషన్ విచారణకు వస్తుండటంతో బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు.పైగా, కేటీఆర్ కూడా వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుంది అని నమ్మకంగా చెప్పారు. ఇప్పటికే సీనియర్ లాయర్లతో కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరిపారు. కేసును విచారించే ధర్మాసనం కూడా సిసోడియా కేసులో విచారణ జరిపి ఉన్న నేపథ్యంలో అదే రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా సోమవారం బీఆర్ఎస్ కు బిగ్ డేగా మారనుంది.
👉 దువ్వాడ శ్రీనును పెళ్లి చేసుకుంటానని చెప్పిన దివ్వెల మాధురి కారుకు ప్రమాదం..శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాధురి..పలాస ఆసుపత్రిలో చికిత్స..టెక్కలి నుండి పలాస వెళ్తుండగా ఘటన ..👉 నేనే ఆత్మహత్య చేసుకోవటానికి కారును గుద్దేశాను.నాకు బతకాలని లేదు అంటూ స్టేట్మెంట్ ఇస్తున్న వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాలుకా మాధురి ఈ మాధురి తోనే దువ్వాడ శ్రీనివాస్ కల్సి ఉంటోంది. మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాలూక మహిళ ఈ మాధురినే..
👉 పలాస ఆసుపత్రిలో వైద్యానికి నిరాకరించిన మాధురి…నేను చనిపోవాలనుకున్నా. వాణి చేస్తున్న వేధింపులతోనే చనిపోవాలనుకుంటున్నా. నాకు ట్రీట్‌మెంట్ అక్కర్లేదు, నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్‌మెంట్ అక్కర్లేదు. నన్ను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నామీద ఆరోపణలు చేస్తే తీసుకోగలను, కానీ నా పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేను… -మాధురి
👉కడప జిల్లా ..పోరుమామిళ్లలో సింగం ఫ్యాషన్స్ ఓపెనింగ్ సందర్భంగా సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి..పోరుమామిళ్లలో ఆదివారం నూతనంగా ప్రారంభించిన సింగం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ స్వాగతం పలికిన సింగం ఫ్యాషన్స్ యాజమాన్యం హీరోయిన్ చూసేందుకు భారీగా యువత తరలివచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు మహిళల సైతం హీరోయిన్ చూడ్డానికి వచ్చారు తదుపరి హీరోయిన్ సింగం షాపింగ్ మాల్ను ఓపెనింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉 అల్లూరి జిల్లా అన్నవరంలో గంజాయి పెట్టివేత..ఐదు లక్షల రూపాయలు విలువచేసే 100 కేజీలు గంజాయి పట్టివేత .. ఐదుగురు అరెస్ట్ ఒక ఆటో మరియు ద్విచక్రం వాహనo రెండు సెల్ ఫోన్లు సీజ్ ..ఒరిస్సా నుండి కాకినాడకు తరలింపు.. అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడింది అల్లూరి జిల్లా రంపచోడవరం ఎ ఎస్పి చింతపల్లి ఇంచార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ అదాని ఐపీఎస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు…
👉సినిమా తరహాలో గంజాయి తరలింపు..! తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. చింతూరు నుంచి ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి.. పైన ఇసుకను కప్పి తరలిస్తుండగా భద్రాచలం గోదావరి వంతెనవద్ద పోలీసులు పట్టుకున్నారు. భారీమొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
👉 రైలులో తొక్కిసలాట.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు!..హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
👉భూమా వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుందూరు..మార్కాపురం పట్టణంలోని బచ్చు వారి కళ్యాణ మండపం నందు జరిగిన ప్రముఖ డాక్టర్ భూమా నరసింహరెడ్డి (బ్రహ్మారెడ్డి) కుమారుడు అరుణ్ సింహ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి…వారి వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,ఏ వన్ గ్లోబల్ కాలేజీ అధినేత షంషీర్ అలి బేగ్ మరియు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.
👉అమరావతీ :*ఏపీలో ఈ నెల 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు*ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి బీఎల్ఓ లు ఇంటింటి సర్వేను నిర్వహించ నున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.
👉ఒద్దుల,భూమా వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..మార్కాపురం టౌన్ బచ్చు వారి కళ్యాణమండపం నందు వెంకట రవి శేఖర్ రెడ్డి ఈశ్వరి కుమార్తె,భూమా బాల నరసింహ రెడ్డి అరుణల కుమారుడు నూతన వధూవరులు అయిన మాధుర్య,అరుణ్ సింహలను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు 👉 వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాజీ ఎమ్యెల్యే’అన్నా’ పరామర్శ… కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కీలక కార్యకర్త బొరిగర్ల బాలయ్య ఒంగోలు లోని కిమ్స్ హాస్పిటల్ లో హార్ట్ స్టోక్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. *బాలయ్య ఆరోగ్య పరిస్థితిని సమాచారం అందుకున్న మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబువారినిపరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
👉తిరుపతి జిల్లా గూడూరు…చిల్లకూరు తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన గ్రావెల్ మాఫియా..👉చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెంలో కొందరు రైతుల అవసరం కోసం అంటూ ఎమ్మార్వో కు ఇచ్చిన అర్జీ నే గ్రావెల్ పర్మిషన్ పేపర్ అంటూ గ్రావెల్ తరలింపు,👉గ్రావెల్ మాఫియాని అడ్డుకున్న గ్రామస్తులుకు ఫోర్జరీ సంతకంతో కూడుకున్న పేపర్ చూపించి ఎమ్మార్వో పర్మిషన్ ఇచ్చారు అంటూ బకాయింపు..👉గ్రావెల్ మాఫియాకు గ్రామ తలారి ఏం.పరంధామయ్య అండదండలు*…👉ఆదివారంఅధికారులకు సెలవుదినం,గ్రావెల్ మాఫియాకు పండగ దినం.ఇప్పటికే నెల్లూరు నగర కమిషనర్ సంతకం ఫోర్జరీ,నెల్లూరు డిఎం అండ్ హెచ్ ఓ సంతకం ఫోర్జరీ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చిల్లకూరు తాసిల్దార్ సంతకం ఫోర్జరీ వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది..*ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంతకాల ఫోర్జరీ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేషన్ లో బిల్డింగుల మార్టిగెజ్ లకు సంబంధించి నిధుల విడుదలకోసం నగర కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని కేసులు నమోదయి ఉన్నాయి, ఇదే సమయంలో రీసెంట్ గా నెల్లూరు జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి డి ఎం అండ్ హెచ్ ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితులు నిరుద్యోగులు వద్ద నుండి లక్షల రూపాయల దోచుకున్నారు, దీనిపై నెల్లూరు మూడవ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది, ఈ వ్యవహారాలు నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం వద్ద ఈ ఉదయం నుండే గ్రావెల్ మాఫియా భారీ ఎత్తున వాహనాలతో గ్రావెల్ ను తరలిస్తున్నారు,ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రావెల్ మాఫియాను అద్దుకోగా అక్కడే వున్న గ్రామ తలారి ఏం.పరంధామయ్య తమకు చిల్లకూరు ఎమ్మార్వో,గ్రామ వీఆర్వో పర్మిషన్లు ఇచ్చారంటూ గ్రామస్థులు ఎమ్మార్వో కు రాసుకున్న ఒక పిటిషన్ పై చిల్లకూరు ఎమ్మార్వో సంతకం చేసినట్టుగా ఉన్న అర్జీనే పర్మిషన్ పేపర్ అంటూ చూపిస్తూ గ్రావెల్ ను తరలించే ప్రయత్నం చేశారు, అనుమానం కలిగిన తిప్పగుంట గ్రామం గ్రామస్తులు రెవిన్యూ అధికారులను సంప్రదిస్తామని చెప్పగానే గ్రావెల్ మాఫియా అక్కడ నుంచి పరారు అయింది, ఈ విషయం 99tv ప్రతినిధికి తెలియగా ఈ ఫోర్జరీ సంతకం చేసి ఉన్న లెటర్ గురించి రెవెన్యూ అధికారులను విచారించగా ఇది ఫేక్ లెటర్ అని తేల్చేశారు దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘరానా మోసగాళ్లు సంతకాల ఫోర్జరీలతో ఇంకా ఏమేమి చేస్తున్నారు అనేది సంఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే తెలుస్తున్నాయి…అన్నీ ఆధారాలు వున్నాయి కనుక ఇప్పటికైనా ఈ ఫోర్జరీ కేటుగాళ్లపై పోలీసులు,రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు….
👉 అల్లూరి సీతారామరాజు జిల్లా..గంగవరంలో భారీగా ఎర్రచందనం పట్టివేత.అక్రమంగా తరలిస్తున్న 81 ఎర్రచందనం దుంగలు సీజ్.నిందితులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్. వాటి విలువ 50 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా
👉పేకాట ఆడుతున్న పదిమంది అరెస్ట్..ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం సమీపంలో పేకాట స్థావరంపై గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి 10,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని గిద్దలూరు పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ చెప్పారు. 👉పేకాటస్థావరంపై పోలీసులు దాడులు..ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల గ్రామ సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదు మందిని కొమరోలు ఎస్సై మధుసూదన్ రావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుండి 3,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని ఈ సందర్భంగా ఎస్ఐ మధుసూదన్ రావు ప్రజలను హెచ్చరించారు.