ఏపీలోనూ ఫ్రీ బ‌స్…చంద్ర‌బాబు కీల‌క మీటింగ్..రైతులకు ధాన్యం బకాయిలు విడుదల..నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ మాగుంట.. జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల.. రికార్డ్స్ తనిఖీ చేసిన ఐసీడిఎస్ జిల్లా కోఆర్డినేటర్.. వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా..ఆన్లైన్ మోసాలకు యువకుడు బలి

👉 ఏపీలోనూ ఫ్రీ బ‌స్… చంద్ర‌బాబు కీల‌క మీటింగ్..
ఓవైపు ఆర్థిక భారం, మ‌రోవైపు బ్రాండ్ ఏపీ దెబ్బ‌తిన‌కుండా చ‌ర్య‌లు, ఇంకోవైపు సంక్షేమ ప‌థ‌కాలు… అన్నింటిని స‌మ‌న్వ‌యంగా ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్నారు సీఎం చంద్ర‌బాబు. ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్న కూట‌మి స‌ర్కార్, తాజాగా ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ హామీపై ఫోక‌స్ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించే మ‌హిళ‌లంద‌రికీ ఉచితంగా అవ‌కాశం ఇవ్వ‌బోతున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించ‌బోతున్నారు.

క‌ర్నాట‌క రాష్ట్రంలో ఫ్రీబ‌స్ తో ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బ‌స్ అమ‌ల‌వుతున్న తీరుపై ర‌వాణా శాఖ అధికారులు ఇప్ప‌టికే నివేదిక‌లు సిద్ధం చేశారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ఫ్రీ బ‌స్ పై సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జ‌రిగిన మీటింగ్ లో వాక‌బు చేశారు. అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బ‌స్ పై రివ్యూ త‌ర్వాత కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నారు. ఆర్టీసీలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌యాణిస్తున్న వారు ఎంద‌రు? ఫ్రీ బ‌స్ పెడితే స‌ర్కార్ పై ప‌డే భారం ఎంత‌? ఆర్టీసీని కాపాడుకుంటూ ప‌థ‌కం అమ‌లు కావాలంటే ప్ర‌తి నెల ఎంత ఖ‌ర్చు రావొచ్చు వంటి అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆగ‌స్టు 15 నుండి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది స‌ర్కార్. ఫ్రీ బ‌స్ ప‌థ‌కాన్ని కూడా అదే రోజు నుండి ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న మార్గ‌ద‌ర్శ‌కాల్లోనే స్వ‌ల్ప మార్పులు చేర్పుల‌తో ప‌థ‌కం ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

👉 రైతులకు ధాన్యం బకాయిలు విడుదల*
అమరావతీ :ఆంధ్రప్రదేశ్ లో గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.ఏలూరులో జరిగే కార్యక్రమం లో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు మంత్రిఅందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు ఉండగా ఎన్డీఏసర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది.
👉త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ*
అమరావతీ :ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’అని ఆయన పేర్కొన్నారు.
👉అమరావతి*..
*15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా*
*45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం..*వైసీపీ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు…*ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ…*ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ…*ఎవరెవరు పాల్గొంటారు గ్రామ సదస్సులో…”*1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.*
*సున్నితమైన భూసమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున కార్యక్రమం పూర్తయ్యేవరకు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు.*
జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్రజల వద్దకే పాలన’ తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగువర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారుచేసి వారికి నరకం చూపించారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే దిక్కులేదు. ఉద్దేశపూర్వకంగా వెబ్‌ల్యాండ్‌లో చిన్న, చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. జగన్‌, ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని, పేదల నోటికాడి ముద్దను తీసేసినట్లవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం…ఇదే ప్రస్తుత టార్గెట్‌. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు.
జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎ్‌సను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్‌లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.
*సదస్సుల్లో ఏం చేస్తారంటే..*
గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, అటవీ, దేవదాయ, వక్ఫ్‌ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వేనెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్‌, చుక్కల భూముల పరాధీనం వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు. అడంగల్‌, పహనీ, ఆర్‌ఓఆర్‌, 1బీ రిజిస్టర్‌, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు. వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్‌ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు జగన్‌ బొమ్మలున్న పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సిసోడి యా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామంలో జగన్‌ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని నిర్దేశించారు….*ఐదు కేటగిరీలుగా..*ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఐదు రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1.మ్యుటేషన్‌, 2.కౌలు రైతు కార్డులు(ఎల్‌ఈసీ), 3.భూమి వివాదాలు, 4.భూ ఆక్రమణ, 5.నిషేధ జాబితా 22(ఏ) గోల్‌మాల్‌ రిజిస్టర్లను నిర్వహిస్తారు. వీటిలో నమోదుచేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వీటిని ఆర్‌టీజీఎస్‌ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రశీదు ఇస్తారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది ప్రభుత్వం చేపట్టిన పెద్ద టార్గెట్‌. దాన్ని విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. అందుకే ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, భూ సమస్యలపై పనిచేస్తోన్న ఎన్‌జీవోలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని, ఈ సదస్సులకు విస్త్రత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామంవారీగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వాటి లక్ష్యాలు తెలిపేలా ప్రచారం చేయాలని నిర్దేశించింది.*90 రోజుల టార్గెట్‌: ఆర్పీ సిసోడియా*ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారం 90 రోజుల్లోనే పూర్తిచేయాలనేది లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారంపై రోజువారీగా సమీక్ష చేయనున్నారు. అర్జీదారుకు ఫోన్‌చేసి పరిష్కారంపై వివరించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.👉..*ప్రజల వద్దకే అధికారులు..*రెవెన్యూ సదస్సుల పేరిట ఐదేళ్ల తర్వాత కీలక ప్రభుత్వ శాఖలు ప్రజల వద్దకు వెళ్లనున్నాయి. ఇది ప్రజల వద్దకు పాలనే అని సీనియర్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు అధికారుల వద్దకు ప్రజలు వెళ్లి గోడు చెప్పుకొనేవారు. దీంతో అధికారి స్వీకరించే పరిస్థితిని బట్టి పరిష్కారం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజల భూ వివాదాలు వినడానికే ఐదారుశాఖల అధికారులతో కూడిన బృందాలు రోజంతా గ్రామంలో మకాం వేయబోతున్నాయి. ఇందు లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటోంది.

👉 నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ మాగుంట.. గుంటూరు లోని

మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో శ్రీ కన్వెన్షన్ లో టొబాకో జీపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ జితేంద్ర కుమార్ ల కుమారుడు మనీష్ రెడ్డి మరియు జాన్వీ రెడ్డి ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి  యువనాయకులు దామచర్ల సత్య .

👉ప్రకాశం భవనంలో ‘ మీ కోసం ‘ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

అర్జీ తీసుకొచ్చిన ఓ దివ్యాంగుని కోసం వేదికపై నుంచి కిందకు దిగివచ్చి అతని వివరాలను తెలుసుకున్న కలెక్టర్.’ మీకోసం ‘ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేసిన కలెక్టర్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ. విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు..

👉రికార్డ్స్ తనిఖీ చేసిన ఐసీడిఎస్ జిల్లా కోఆర్డినేటర్*.. తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా ఐసిడిఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు సోమవారం అకస్మిక రికార్డ్ తనిఖీ నిర్వహించి అటెండెన్స్ రిజిస్టర్ మరియు బాలామృతం అన్ని పోషకాహాలు సమృద్ధిగా అందుతున్నాయా లేవా అని రికార్డుల పరిశీలించారు, అంగన్వాడి టీచర్స్ ఆయాలకు ప్రీ స్కూల్ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిరోజు ఏర్పాటు చేస్తూ, సమయపాలన పాటిస్తూ తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ గాలి శివ, లలిత,పద్మావతి,సత్యనారాయణమ్మ ఆయాలు సావిత్రి పేరమ్మ తదితరులు పాల్గొన్నారు

👉 అన్నమయ్య జిల్లా మదనపల్లె
*ఆన్ లైన్ బెట్టింగ్ లకు బలైన యువకుడు*..
*రైలు కిందపడి యువకుడు ఆత్మ హత్య*
*మృతుడు మదనపల్లె పట్టణవాసిగా గుర్తించిన కదిరి రైల్వే పోలీసులు*

👉ఆన్ లైన్ బెట్టింగులకు ఓయువకుడు బలైన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మదనపల్లె మండలంలో తీవ్రకలకలంరేపింది. కదిరి రైల్వే ఎస్ఐ రహీం, హెడ్ కానిస్టేబుల్ బాష తెలిపిన వివరాలమేరకు.. మదనపల్లె పట్టణం, అమ్మినేనివీధికి చెందిన ఆర్యవైశ్య హోటల్ నిర్వాహకులు వెంకటరాజు, సరస్వతిల ఒక్కగా నొక్కకొడుకు అమర్ తేజ(30) ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.25లక్షలు పోగొట్టుకొని అప్పులపాలై కాశిరావుపేట వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు
👉భోగసముద్రం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమనవ్య కర్త “అన్నా రాంబాబు” ఆదివారం రాత్రి మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో భోగసముద్రం విజయ భాస్కర్ రెడ్డి, వెంకట రత్నం ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన శ్రావణి, నిఖిల్ రెడ్డి లను ఆశీర్వదించినారు.
👉జిల్లా ఎస్పీని కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే..

*ప్రకాశం జిల్లా, నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన A R దామోదర్ ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పుష్పగుచ్చం అందచేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గానికి సంబందించిన పలు అంశాల పై చర్చించారు.*

👉అన్నమయ్య జిల్లా రాజంపేట…
విద్యార్థి ఆత్మహత్య..రాజంపేట మండలం హస్తవరం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న పవన్ కళ్యాణ్.
మృతుడు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు గా గుర్తింపు.పవన్ కళ్యాణ్ స్వస్థలం పోరుమామిళ్లగా గుర్తించిన పోలీసులు …

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త