*జీడీసీసీ బ్యాంక్ లో ఆరు కోట్లు కుంభకోణం …!!!పల్నాడు జిల్లా గురజాల జీడీసీసీ బ్యాంక్ లో ఆరు కోట్లు కుంభకోణం అయినట్లు సమాచారం !!కుంభ కోణంపై రికార్డుల తనిఖీలు ??గురజాలలోని జీడీసీసీ బ్యాంక్లో రెండు రోజులుగా ఆప్కాబ్, సహకార సంఘ అధికారులు సంయుక్తంగా రికార్డుల పరిశీలన ??సుమారు 70 మంది రైతుల పేర్లతో రూ.6కోట్ల రుణాలు పొందిన గురజాల కోల్డ్ స్టోరేజ్ కి చెందిన ఓ వ్యక్తి ..? పులిపాడు – గంగారం గ్రామాల మధ్యలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ గా అనుమాన వ్యక్తం …?కోల్డ్ స్టోరేజ్ లో మేజర్ వాటా లో కోల్డ్ స్టోరేజ్ యజమాని… !?ఈ వ్యవహారంపై అన్ని కోణాలలో పరిశీలించిన బ్యాంక్ అధికారులు !!మిర్చి నిల్వవుంచిన కోల్డ్ స్టోరేజ్ ను పరిశీలించిన ఆప్కాబ్, సహకార సంఘ అధికారులు.. !?పరిశీలనలో మిర్చి నిల్వలు లేకుండానే ఆరు కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు గుర్తింపు ….!?ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం.. !?ఇంత కుంభకోణం జరిగినా స్పందించని బ్యాంక్ సిబ్బంది ??ఎమీ తెలియదు అంటున్న బ్యాంక్ సిబ్బంది…!?వివరాలు తెలిపేందుకు సిద్ధగా లేని బ్యాంక్ సిబ్బంది.. !?
*కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?
కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు (45) బుధ వారం తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లగా దుండగులు దాడిచేసి హత్య చేశారు.ఆయన కళ్లలో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపా రు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఇది రాజకీయ హత్యా?.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.శ్రీనివాసులు హత్యతో స్థాని కంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పా టు చేశారు. శ్రీనివాసులు హత్యతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.శ్రీనివాసులు దారుణ హత్య విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తి కొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం ద్వారా కేసును కొలిక్కి తెస్తామని అన్నారు.తలవెనుక భాగంలో మార ణాయుధాలతో బలంగా దాడిచేసి చంపారని డీఎస్పీ వివరించారు.హత్య జరిగిన ప్రదేశానికి కిలో మీటరు దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు…
👉బ్రాహ్మణీ వర్సెస్ సుహాసిని.. పగ్గాలెవరికో!*
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ పుట్టుక.. గెలుపు ఓటములను ఎన్నో చూసిన ఈ గడ్డను వదలకూడదని ఏదో ఒకటి చేసి బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్నది అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్లాన్. అందుకే వారంలో ఒకట్రెండు రోజులు అయినా సరే తెలంగాణ కోసం కేటాయిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రెండు సార్లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చి పార్టీ బలోపేతంతో పాటు పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి..?
ఎవరైతే సెట్ అవుతారు..? అని లోతుగా చర్చలు జరిపారు. ఆఖరికి మొన్న కోడలు నారా బ్రాహ్మణి లేదా నారా లోకేష్‌కు పగ్గాలు ఇచ్చేయాల్సిందేనని క్యాడర్ పట్టుబట్టింది. సీబీఎన్ మనసులో ఏముందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా తెరపైకి నందమూరి ఆడపడుచు సుహాసిని పేరు వచ్చింది..ఇక్కడ్నుంచే మొదలు..! టీడీపీ సామాన్య కార్యకర్తను సైతం సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. ముఖ్యమంత్రి.. పార్టీ అధ్యక్షుడు ఇలా చేసుకుంటూ వచ్చింది. ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి. ఆయన జీవితం సాధారణ కార్యకర్తగా మొదలై ముఖ్యమంత్రి వరకూ చేరింది. ఎల్. రమణ కూడా అంతే అధ్యక్షుడు అయ్యారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను సైతం అధ్యక్షుడిని చేయగా.. పార్టీని సర్వనాశనం చేసి ఇద్దరూ వెళ్లి బీఆర్ఎస్‌లో చేరిపోయారనే అపవాదు ఉండనే ఉంది. ఇక అవన్నీ అటుంచితే.. ఇప్పుడు పార్టీ బలపడాలి.. రానున్న పంచాయతీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది హైకమాండ్. ఇందుకు చేయాల్సిన వ్యూహ రచన అంతా బ్యాకెండ్‌లో చంద్రబాబు చేస్తూనే ఉన్నారట. ఈ ఎన్నికల్లోపే పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలన్నది తేల్చడానికి సన్నాహాలు చేస్తున్నారట సీబీఎన్…ఫైనల్‌గా ఎవరికో..!ఎప్పుడైతే నారా బ్రాహ్మణి పేరు తెరపైకి వచ్చిందో.. సుహాసినీ కూడా తాను కూడా టీడీపీ కోసం పనిచేయాలని కాంక్షను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్‌లతో పంచుకున్నారట. దీనిపై ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. సుహాసినికి పగ్గాలు ఇస్తే.. బ్రాహ్మణిని పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. లేని పక్షంలో ఒకరికి అధ్యక్ష పదవి.. మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇదే సందేశం క్యాడర్‌కు వెళ్లగా ఓకే అని కూడా చెప్పేశారట. ఇదే నిజమైతే గనుక.. నారా, నందమూరి కుటుంబాల ఆడపడుచులే పార్టీని ముందుకు నడిపించబోతున్నారన్న మాట. మరోవైపు.. గోనె ప్రకాశరావు, పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నర్సింహులు, సామ భూపాల్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్సల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి.. ఇంతమంది ఊహావహులు, ఆశావహులు ఉన్నారు.. ఫైనల్‌గా చంద్రబాబు మనసులో ఏముందో.. ఎవరు అధ్యక్షుడు అవుతారో.. లేదా అధ్యక్షురాలు అవుతారో వేచి చూడాలి మరి.
**ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు*. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజనసమయంలో కేటాయించిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది.
👉ప్రకాశం జిల్లా…78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు వేదిక అయిన పోలీసు పరేడ్ గ్రౌండ్ ను మంగళవారం ఆమె సందర్శించి ఈ దిశగా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించారు.
👉 ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా ను పూర్తిగా అరికట్టేల చర్యలు తీసుకోవాలి.* కలెక్టర్ తమీమ్ అన్సారియా…జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా ను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా,అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన ఇసుక జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా ను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవడం తో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఇసుక రీచులను సంబందిత అధికారులు తరచుగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వనరులను సమరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శి, కానిస్టేబుల్ లేదా మహిళా పోలీస్ ఉంటారని, వారి సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ ల వద్ద అవసరం మేరకు సిసి టి వి లను ఏర్పాటు చేయాలని కలెక్టర్, మైనింగ్ అధికారులను ఆదేశించారు. డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి.. ఎన్ఫోర్స్మెంట్ చర్యలను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి ఎలాంటి అవసరం వున్నా తెలియజేయాలన్నారు.
జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాకు ఏ మాత్రం అవకాశం లేకుండా.. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని స్టాకు పాయింట్లు, ఇసుక రీచుల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిఘా పర్యవేక్షణను అమలు చేయాలన్నారు.
👉 రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు చేస్తాం..6ఏ కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశాం..రేషన్ మాఫియాలో జరిగిన అవినీతిపై సీఐడీతో విచారణ చేయిస్తాం: *మంత్రి నాదెండ్ల…త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాకినాడను అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని వెల్లడించారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్ట్ నడిచిందని ఆరోపించారు. అక్రమ సరఫరా ఆగాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం అయితే మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రితో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీని ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటామంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ నుంచి 400 ఎకరాలకు ప్రభుత్వానికి రూ. 40 కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందన్నారు. చెక్ పోస్ట్‌ల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోర్టు ఏ ఒక్క కుటుంబానిది కాదన్నారు. లారీలు వెయిట్ చేయకుండా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. చెక్ పోస్ట్‌లలో మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు ఉంటారన్నారు. కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని ఆగ్రహించారు. త్వరలోనే అరెస్టులు ఉంటాయని ఆయన చెప్పారు. చట్ట ప్రకారం ప్రొసెస్ జరుగుతుందని.. సీఎం, క్యాబినెట్‌లో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీ విచారణ చేస్తామన్నారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ మాఫియా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోర్టులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడమే మా బాధ్యత అని మంత్రి వెల్లడించారు.
👉ఫ్రీ హోల్డ్ స్కాంలో వెలుగులోకి మరో బాగోతం*
ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు
మంత్రి అనగాని సంచలన ప్రకటన.
ఫ్రీ హోల్డ్ స్కాంలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సంచలన ప్రకటన చేశారు.
ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించారు.
ఫ్రీ హోల్డులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై రెవెన్యూ శాఖ లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ బాగోతాలన్నీ బయటకు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు.
కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని.. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని మంత్రి వెల్లడించారు. నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే మూడు నెలల పాటు ఫ్రీ-హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశామన్నారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేస్తామన్నారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒరిజనల్ అసైనీలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే మా లక్ష్యమని ఆయన తెలిపారు.
👉గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని మంత్రి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మంత్రి చెప్పారు. 20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముందన్నారు.
👉శ్రీశైలంలో చిరుత పులి సంచారం*
• శ్రీశైలం: పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత సంచారం• ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత
👉 అదానీపై పోరాటంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు: కేటీఆర్!!!..అదానీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దిల్లీలో పోరాటమంటూ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అదానీకి అప్పగిస్తున్న రేవంత్‌ను ఆపే శక్తి రాహుల్‌గాంధీకి ఉందా? అని నిలదీశారు.
👉వేధింపులు తట్టుకోలేక మా తమ్ముడు ప్రదీప్ మృతి చెందాడు…..*ప్రదీప్ అన్న ఆవేదన*
*నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో బి డి ఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదవ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన ప్రదీప్ సోదరుడు మీడియా ముందు మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు వేధింపులు తాళలేక ప్రదీప్ చనిపోయారని వాపోయారు. గత రెండేళ్లుగా ఎంబీబీఎస్ చదివే రాహుల్ అనే విద్యార్థి అతని స్నేహితులతో కలిసి లైంగికంగా వేధించడంతోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. తనకు తన తమ్ముడు ప్రదీప్ రాహుల్ చేస్తున్న వేధింపులపై మెసేజ్ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు..👉ప్రభుత్వం జ్యూడిషల్ విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేయాలి..ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ..నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ లో డెంటల్ రెండవ సంవత్సరం విద్యార్ధి ఆత్మహత్య ఘటన పై జుడిషల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ చేసారు.సాటి విద్యార్థులే మా బిడ్డ మృతికి కారణంమని మానసికంగా శారీరకంగా లైంగికంగా వేధించారని అరగంట వరకు అంబులెన్స్ రాలేదని,కాలేజీ యాజమాన్యం మా బిడ్డ మృతి వివరాలు తెలపలేదని గోప్యంగా ఉంచారని మృతి చెందిన విద్యార్థి అన్న ఆరోపణ చేస్తున్న నేపద్యంలో మరియు విద్యార్థుల బాగోగులు,మానసిక పరిస్థితుల అధ్యయనం నిరంతర పర్యవేక్షణ చేయవలసిన యాజమాన్యం ర్యాగింగ్ వంటి ఈ భూతాన్ని కట్టడి చేయవలసిన కళాశాల కమిటీలు, యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి గోన్న తరుణంలో వాస్తవాలను వెలుగులో తీసుకురావాలని ప్రభుత్వానికి. విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
పదిమందికి ప్రాణం పోసే వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం వీరు చదివే విద్యకి మాయని మచ్చ గా భావిస్తున్నామన్నారు.
ఘటన కారణాలు కళాశాల యాజమాన్య బాధ్యతలు మృతి అనంతరం తదుపరి జరిగిన అన్ని అంశాలపై.ప్రభుత్వం జ్యూడిషల్ విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులుగా డిమాండ్ చేస్తున్నామన్నారు..👉రాష్ట్రంలో ర్యాగింగ్ మహమ్మారిని అంతం చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.