ప్రపంచంతోనే పోటీ పడతాం..పక్క రాష్ట్రాలతో కాదు.. సీఎం రేవంత్ ..టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ !!!..మంచిర్యాలలో మానవ అవయవాల అక్రమ రవాణా..వైసీపీని విలీనం చేస్తానంటే స్వాగతిస్తాం..సూపర్ సిక్స్ పధకాల అమలు ఎప్పుడు: షర్మిల.. అయోధ్యలో యాభై లక్షల చోరీ

👉ఎర్రకోట పై జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ..న్యూ ఢిల్లీ:..ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసారు.అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నాం. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే ఇప్పుడు 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

👉విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..👉 గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విద్యా, ఐటీశాఖ మంత్రి లోకేష్..👉గుంటూరు పెరేడ్ గ్రౌండ్లో డ్రోన్ కలకలం..!  హై సెక్రెటరీ జోన్లో ఉన్న పోలీస్ పేరేట్ గ్రౌండ్ లో ప్రైవేట్ డోన్ ఎగరటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… గుంటూరు పోలీస్ పేరేట్ గ్రౌండ్లో ముఖ్య అతిథిగా నారా లోకేష్… పొలీసుల అదుపులో డ్రోన్ ఆపరేటర్లు…డ్రోన్ ను సీజ్ చేసిన  పోలీసులు…

 👉ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.కార్యక్రమానికి హాజరైనందుకు వచ్చిన అశోక్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు.  కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ శానేషా వలి మరియు పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.*…👉కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో CLR డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ *సయ్యద్ భాష,* CLR జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, CLR కళాశాలల ప్రిన్సిపాల్స్ భూపనీ నారాయణ, గుండాల ముక్తేశ్వరరావులు, అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, షేఖ్ షరీఫ్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి, వి వనజ, పివి ఆంజనేయులు, పాలిశెట్టి నవీన్ పాల్గొన్నారు.

👉టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ …!!!తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలలుగా సోదాలు చేస్తున్న అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధులను కేటాయించాయి. అయితే ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముడిసరుకుల కొనుగోలు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఏపీ ప్రభుత్వానికి, సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

👉మంచిర్యాలలో మానవ అవయవాల అక్రమ రవాణా..!!!బ్రెయిన్ డెడ్ పేషంట్ అవయవాలు అమ్ముకున్న డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్‌పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) ఆక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్‌కి గురవ్వగా కరీంనగర్ ఆస్పత్రిలో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు.ఆ ఆస్పత్రిలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కామినేనిలో తక్కువ ఖర్చు అవుతాయని తీసుకెళ్లి.. ఎన్ని రోజులు ఉన్నా డబ్బులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు.. అతని అవయవాలు దానం చేస్తే పుణ్యం వస్తుందని శ్రీకాంత్ భార్యను ఒప్పించాడు.అలాగే ఇన్ని రోజుల హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పని లేదు. పైగా అవయవాలు ఇస్తే రూ. 3 లక్షలు ఇస్తామని శ్రీకాంత్ భార్యకు చెప్పి.. అతని అవయవాలు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, ఆ అంబులెన్స్ డ్రైవర్ లక్షల్లో అమ్ముకున్నారు.విషయం తెలుసుకున్న శ్రీకాంత్ భార్య మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా లక్షల్లో చేతులు మారాయని ప్రాథమిక విచారణలో తేలింది.

👉వైసీపీని విలీనం చేస్తానంటే స్వాగతిస్తాం: షర్మిల రెడ్డి_ఆంధ్ర ప్రదేశ్ :వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసీపీతో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని అన్నారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సెటైర్ వేశారు._

*సీఐ వైవి ఎల్ నాయుడు నాన్ బెయిలబుల్ వారెంట్*..కోర్టు హాజరు కాకుండా ఉండటంతో.. జగ్గయ్యపేట కోర్టు తీర్పు… గతంలోనూ పిటిషన్ వేసిన నూకల సాంబ..కైకలూరులో సిఐ గా చేసిన సమయంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ..ఒక మహిళ అయితే నన్ను వివాహం చేసుకొని దాన్ని గతంలో ఫిర్యాదుటిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన సీఐమరి ఇలాంటి వ్యక్తులను సిఐ గా మళ్లీ ఎలా పోస్టింగ్ ఇచ్చారని పలువురు ఆరోపణ..

**ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో నామినేటెడ్‌ పదవుల ప్రకటన_టీటీడీ చైర్మన్‌ గా టీవీ-5 అధినేత బిఆర్‌ నాయుడు / సుప్రీం కోర్టు మాజీ సిజె జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఖరారు_ _మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డికి ఖరారయ్యే అవకాశాలు_ _ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమా__ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌గా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి__ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత_

👉విజయవాడ ..వైఎస్ షర్మిల రెడ్డి…APCC చీఫ్… ఆరోగ్య శ్రీ ఇక నడపలేం అని ఆసుపత్రులు చెప్తున్నాయి.. సూదికి, దూదికి డబ్బుల్లేవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…ఆసుపత్రులకు 3వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి..పెండింగ్ బిల్లులు చెల్లించక ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చారు.ఆరోగ్య శ్రీ పథకం YSR ప్రవేశ పెట్టిన పథకం ఆరోగ్య శ్రీ పథకం వైద్య విధానంలో ఈ దేశానికి ఆదర్శం ఎన్నో రాష్ట్రాలు ఆరోగ్య శ్రీ పథకాన్ని కాపీ కొట్టాయి .. ఆసుపత్రులకు 3 వేల కోట్ల వరకు చెల్లింపులు జరపాల్సి ఉంది..గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు చెల్లింపులు నిలిచి పోయాయి..జగన్ హయంలో దాదాపు 16 వందల కోట్లు పెండింగ్ లో పెట్టారు…దాదాపు 11 నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు.. ఆరోగ్య శ్రీ సీఈఓ దగ్గరకు వెళ్లి గోడు వెళ్ళబోసుకున్నా నిధులు విడుదల చేయడం లేదు..ఆరోగ్య శ్రీ నిలిపి వేయడం పై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి ..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు అన్నారు ..బాబు భవిష్యత్ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు ..40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పారు..ఇవ్వాళ రాష్ట్రం ఆరోగ్య శ్రీ కి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి లో ఉంటే ఎలా ? ఆరోగ్య శ్రీ పథకాన్ని పథకం గానే చూడండి..ఎవరు ప్రవేశ పెట్టారు అని చూడకండి..ఆరోగ్య శ్రీ తో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ కి నిధులు కొరత ఉంది..ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ సైతం నిర్వీర్యం చేశారు.. ఇప్పుడు కూటమి సర్కార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రక్షించండి .ఆసుపత్రులు యాజమాన్యాలను చర్చలకు పిలవండి- ఎంతో కొంతో తక్షణం పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయండి- లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉదృతం చేస్తుంది .రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోతే 25 మంది ఎంపీలు బిజెపి కి ఎందుకు ఊడిగం చేస్తున్నట్లు ? మీ మద్దతుతోనే కదా మోడీ గద్దెను ఎక్కింది ?..నిధులు కావాలని వెంటనే డిమాండ్ చేయండి…చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఊదర గొట్టారురెండు నెల్లు దాటినా ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదు ..వెంటనే అమలు చేయండి అని మేము ఏమి అడగడం లేదు ..కానీ కనీసం కొన్ని పథకాలు అయినా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది ..అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చారు ..ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలు అంటే అన్ని 15 వెలు ఇస్తామని చెప్పారు- జూన్,జూలై లోనే తల్లులకు నిధులు ఇవ్వాలి ..కానీ అసలు ఈ పథకం ఇప్పుడు అమలు అవుతుందా లేదా అనే అనుమానం ఉంది ..లెక్కలు లేవు అని సాకులు చెప్తున్నారు- లోకేష్ ఈ ఏడాది అమలు చేయడం కష్టం అంటున్నారు.తల్లికి వందనం పై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి ..ఉచిత ప్రయాణం కల్పించడం పై మీకున్న అభ్యంతరం ఏంటి ? ..జీరో టిక్కెట్ కొట్టడానికి మీకు చేతులు రావడం లేదా ? ..రైతులకు 20 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పారు- ఖరీఫ్ సీజన్ దాటిపోతుంది ..ఇంకా ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో చెప్పడం లేదు- రాష్ట్రంలో కనీసం పంట నష్టం జరిగితే పరిహారం లేదు- ఇచ్చిన 3 వేలు ఏ మూలకు చాలదు ఈ మధ్య చంద్రబాబు మాటకు ముందు డబ్బులు లేవు అంటున్నారు ..గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు- బాబుకి అప్పుల గురించి తెలుసు* జగన్ కాంగ్రెస్ తో చర్చలు అనేది అబద్ధం- ఇందులో వాస్తవం లేదు- కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం- పిల్ల కాలువలు అని ఎప్పటికైనా సముద్రంలో కలవాలి..జగన్ వస్తె బాగుండు అని చెప్పుకుంటున్నారు- జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలి- మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా ? పోలవరం తో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా ?- మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా ?- ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే రిపేర్లు లేవు…ఇందుకే జగన్ మళ్ళీ రావాలా ? – ధర స్థిరీకరణ నిది అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలా ? – జగన్ మళ్ళీ అధికారంలో రాడు- వైసిపి ఎన్నటికీ అధికారంలో రాదు విశాఖ mlc ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు ? .. భారీ మెజారిటీ తో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు ?- బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మ ను అవమానించాడు- 11 సీట్లకు పరిమితం అయ్యారు…ఇప్పుడు ఒక్క సీట్ తో పండుగ చేసుకోండి

👉 ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు* పదేండ్లలో 1ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ* ప్రపంచంతోనే పోటీ పడతాం.. పక్క రాష్ట్రాలతో కాదు..కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా తెలంగాణ ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని చెప్పారు.రాబోయే పదేండ్లలో తెలంగాణను 1ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ‘ప్యూచర్ స్టేట్ తెలంగాణ’ నినాదంతో ప్రజాప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతుంది కానీ పక్క రాష్ట్రాలతో కాదని సీఎం అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచ అవసరాలు తీర్చగలిగేలా ‘చైనా వన్ ప్లస్ కంట్రీ’ స్థాయిలో ఉంటుందని చెప్పారు.దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కోకాపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కాగ్నిజెంట్ సంస్థకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా మారిందని, ప్రస్తుతం సుమారు 65వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఎదగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో అంగీకారం కుదిరితే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కాగ్నిజెంట్ వారు హైదరాబాద్ లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయడం రికార్డు అని సీఎం అభినందించారు.శతాబ్దాల మనగడలో హైదరాబాద్ నేడు విశ్వనగరంగా ఎదిగిందని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి మద్దతుతో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి గారు ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన నేపథ్యమే హైదరాబాద్ ను ఐటీలో మేటిగా నిలబెట్టిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాతగానీ పాలకులు హైదరాబాద్ విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టారని , ప్రస్తుత ప్రపంచ అవసరాల దృష్ట్యా తాము నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అభివృద్దిని మరో స్థాయికి తీసుకెళుతుందని సీఎం తెలిపారు.పెట్టుబడుల సాధన కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతం అయ్యాయని, ఒక్క అమెరికాలోనే సుమారు 31వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని, తద్వారా దాదాపు 30వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెట్టుబడులు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతుందని సీఎం అన్నారు. తెలంగాణకు మొత్తం మూడు వలయాలు ఉంటాయని, కోర్ అర్బన్ హైదరాబాద్ మొదటి వలయమైతే, రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే రెండోదైన సెమీ అర్బన్ వలయంలో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫ్యూచర్ సిటీ ఉంటాయని, ఇక మూడో వలయమైన రూరల్ తెలంగాణలోని గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అన్నింటితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి  భావిస్తున్నారని ఐటీ మంత్రి తెలిపారు. తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం సరికొత్తగా ఏఐ సిటీని నిర్మిస్తోందని, సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఏఐ గ్లోబల్ సదస్సును కూడా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు…

👉: కోల్‌కతాలో ‘వైద్యురాలిపై’ హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను జూనియర్‌ డాక్టర్లు నిలిపివేశారుకోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పీజీ వైద్యులు విధులు బహిష్కరించారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు

👉 అయ్యో..రామ.. ఎంతకు తెగించార్రా..అయోధ్యలో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన..!!!అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంతో వేడుకగా జరిగింది. ఐదువందల ఏళ్లనాటి కల దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది.ఈ వేడుకకు మనదేశంనుంచి సామాన్యులతో పాటు, అన్నిరంగాలకలు చెందిన ప్రముఖులు హజరయ్యారు. అందరికి రామజన్మభూమి ఆలయం ట్రస్ట్ ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఆలయం పరిసర ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఇదిలా ఉండగా.. అయోధ్యలో ప్రస్తుతం జరిగిన చోరీ అందరిని షాకింగ్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా.. ఉత్తర ప్రదేశ్ లోని.. అయోధ్యలో సర్వాంగ సుందరగా, కాంతులు వెదజల్లే ప్రత్యేకమైన లైట్లను ఏర్పాటు చేశారు. రామమందిరంకు దగ్గరలో ఉన్న.. భక్తిపథ్, రామ్‌ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు పోలీసులు గుర్తించారు.వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని సమాచారం. మరోవైపు.. నిరంతరం భద్రత, హై సెక్యురిటీ ఉండే ప్రాంతంలో ఈ చోరీ జరగడంతో.. అధికారులు సైతం షాక్ కు గురౌతున్నారు. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని సమాచారం. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లోప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 9వ తేదీన కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.👉లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న కాంట్రాక్ట్‌ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రామ్‌‌పథ్‌లో దాదాపు 6,400 బ్యాంబూ లైట్లు, భక్తి పథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్స్ సెట్లను అమర్చారు. మార్చి 19వ తేదీ వరకూ ఉన్న ఇవి.. తర్వాత కనిపించకుండా పోయాయి. మే 9న అక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఈ లైట్లు కనిపించలేదు. మొత్తం 3,800 బిగ్ లైట్స్‌, 36 ప్రొజెక్టర్ లైట్స్‌ని దొంగిలించారు. మూడు నెలల కిందటే చోరీని గుర్తించినప్పటికీ ఆగస్టు 9వ తేదీన FIR నమోదుచేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది

👉ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ..14 ఆగస్ట్ బుధవారం.. హోటల్ రీగల్ హ్యాబిట్స్ హైదరాబాద్ లో అతిరథ మహారధుల సమక్షంలో” నేషనల్ అచీవర్స్ అవార్డ్స్ ” ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నోథిరపిస్ట్ డాక్టర్ పద్మ కమలాకర్  కొప్పుల విజయ్ కుమార్ నేషనల్ చైర్మన్ చేతుల మీదుగా  క్యాటగిరి ఆఫ్ బెస్ట్ హైదరాబాద్ చైర్మన్ సోషల్ యాక్టివేట్ అవార్డు బషీరుద్దీన్ కి ఇవ్వడం జరిగింది అలాగే క్యాటగిరి ఆఫ్ బెస్ట్ శేర్లింగంపల్లి సోషల్ యాక్టివేట్ అవార్డు మహమ్మద్ గౌస్ ఉద్దీన్ ఇవ్వడం జరిగింది.

*రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు…రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేస్తారు. ఈ మీటర్ కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాలి, అందులో బ్యాలెన్స్ ఉన్నత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది తరువాత కట్ అయిపోతుంది (మొబైల్ రీచార్జ్ మరియు డిస్ టీవీ లాగా)విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది.

👉ఒంగోలులో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది. నగర మేయర్‌ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఈరోజు రాజీనామా చేశారు.నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలో వారంతా టీడీపీ లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం