టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీఅయిన సిఎం.. ఒంగోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి డోలా..జూడాల తీవ్ర నిరసన.. పోస్ట్ ఆఫీస్ లో భారీ కుంభకోణం..చెడ్డి గ్యాంగ్ హల్చల్.. కంభంలో యువతి ఆత్మహత్య?.ఆన్లైన్లో గంజాయి విక్రయాలు…

👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ ..• సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చ
• రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చ
• పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
• దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఏర్పాటు కానున్న టాస్క్ ఫోర్స్
• సిఎం చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
• 2047 నాటికి ఎపిని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై పనిచేయనున్న టాస్క్ ఫోర్స్• అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం..• ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామికానున్న టాటా గ్రూప్..• విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించిన ముఖ్యమంత్రి • రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ తో తో చర్చించిన సిఎం.

👉ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి : డాక్టర్‌ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ..
ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి : డాక్టర్‌ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ
కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు. “మా కోల్‌కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు” అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా శుక్రవారం టిఎంసి చీఫ్ నిరసనకు నాయకత్వం వహించనున్నారు.
👉 విశాఖ బీచ్ రోడ్డులో కదంతొక్కిన జూనియర్ డాక్టర్లు.
వెస్ట్ బెంగాల్ లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటనపై ఆందోళన.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్.
👉 పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టనున్న టీ వెంకటేశ్వర్లు……ఈయన గతంలో ఒంగోలు వన్ టౌన్ లో పనిచేసే మంచి పేరు పొందిన వ్యక్తిగా  సమాచారం..

*పంటబోరు బావుల కేబుల్ వైర్ల దొంగతనం..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామం లోని పంట పొలాల్లో ఉన్న బోరుబావుల నుండి కేబుల్ వైర్లను కత్తిరించి దోచుకెళ్ళారని వాపోతున్న రైతులు. నిన్నరాత్రి దాదాపు 8 బోరుబావులనుండి కేబుల్ వైర్ల దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్ లో ఉన్న రాగి కోసం ఈ దొంగతనాలు జరుగు తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు. ముందే వర్షాభావం తో పంటలు పండించే అన్నదాతల పొలాల్లో జరుగుతున్న ఈ దొంగతనాలను నివారించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు..
👉 ఒంగోలు పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బి.ఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా. అనంతరం పేదలకు అన్నం వడ్డించిన మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్.
👉 పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం రాష్ట్ర మంత్రి డాక్టర్ డిబివి స్వామి ఒంగోలులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి..

రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడం నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం అన్న క్యాంటీన్ల లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధులు ,సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు .ఒంగోలు నగరంలోని స్థానిక కర్నూలు రోడ్డు పవర్ ఆఫీస్ వద్ద అన్న క్యాంటీన్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ,కలెక్టర్ తమీం అన్సా రియా ,సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎం విజయ్ కుమార్ తో కలిసి మంత్రి డిబివి స్వామి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు .అనంతరం పాత్రికేయులతో మంత్రి డిబివి స్వామి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ల ప్రారంభించారన్నారు.అయితే గత వైసిపి ప్రభుత్వం కాలంలో అన్న క్యాంటీన్లను మూత వేసి ఆ భవనాల్లో సచివాలయ ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. 2024 ఎన్నికల్లో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారన్నారు. ఒంగోలు నగరంలో గత రెండు నెలల కాలంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో పేదలకు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం అందజేశారన్నారు . ప్రస్తుతం ఒంగోలు నగరంలో 4 అన్న క్యాంటీన్లు , చీమకుర్తిలో ఒక అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నామన్నారు. నెలాఖరులో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ పునరుద్ధరిస్తామని మంత్రి డిబివి స్వామి తెలిపారు .అన్న క్యాంటీన్లను పేదలు వినియోగించుకోవాలని ఆయన కోరారు .కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్. టిడిపి నాయకులు మంత్రి శ్రీనివాసరావు ,నాగేశ్వరరావు , బండారు మదన్ ,బిజెపి నాయకులు వై చిన్న యోగయ్య యాదవ్ ,బి ఆంజనేయులు ,టిడిపి, జనసేన ,బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
👉 మార్కాపురం కాలేజీ రోడ్డు లో ” వైసిపి నేత” నూతనంగా నిర్మించిన బిల్డింగ్ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ బిల్డింగ్ వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు…మాపై కక్షపూరితంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ పై వాగ్వాదానికి దిగిన బిల్డింగ్ యజమాని,మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి అన్నా రాంబాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైసీపీ నాయకులు..,.
పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తే మా కట్టడాన్ని మేమే తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైసిపి నేతలు…బిల్డింగ్ వద్దకు వైసీపీ ముఖ్య నేతలు రావడంతో భారీగా మోహరించిన పోలీసులు… 

👉ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్ ..ఇండియా   మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్న సంస్థలు..పక్కా ఆధారాలతో ఆపరేషన్ డెకాయి నిర్వహించిన టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం👉ఇండియా మార్ట్‌లో ఈ గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టిన సందీప్ శాండిల్యా బృందం.. ఆ చాక్లెట్లను పక్కగా టెస్ట్ చేసి రాజస్థాన్, యూపీలో ఉన్న 8 కంపెనీలను గుర్తించిన పోలీసులు ..ఈ విషయాన్ని టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్లతో కలిసి యూపీకి వెళ్లి గంజాయి చాక్లెట్లను అమ్మే ఇద్దరు కంపనీ యజమానులను అరెస్ట్ చేశారు.రాజస్థాన్‌లో 7 కంపెనీలను గుర్తించి, అక్కడి నుండి నమూనాలు తీసుకొని ఫోరెన్సిక్ నివేదికలో వచ్చాక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

👉 ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని నిన్న రాత్రి గుర్తు తెలియని 20 మంది దుండగులు వాచ్ మెన్ బంధించి జెసిబి తో కూల్చివేత…*
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ రాచర్ల మండల ఫారెస్ట్ అధికారి కి వచ్చే జీతాలు సరిపోక వచ్చే మాములు సరిపోక ఇల్లీగల్ బిజినెస్ కు తెర లేపడం లో వెలుగులోకి వచ్చింది..గిద్దలూరు మండలం దిగువమెట్ట కు చెందిన చల్లా హరికృష్ణ (34) నాటుసారా తరలిస్తుండగా అదుపు లోకి తీసుకొన్న గిద్దలూరు పోలీసులు….హరికృష్ణ ను విచారించగా షైక్ జమల్ అటవీశాఖ లో సెక్షన్ ఆఫీసర్ పాత్ర ఉన్నట్లు తేల్చిన పోలీసులు…చల్లా హరికృష్ణ, షేక్ జమాల్ ఇద్దరి పై పలు సెక్షన్లలో కేసు నమోదు….జమాల్ రాచర్ల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నడు…వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు..
👉  అమరావతి : ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో మంత్రి సత్యకుమార్‌ సమావేశం. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్‌ అంశంపై చర్చ. ప్రభుత్వం వచ్చిన 2 నెలల కాలంలోనే ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లుల నిమిత్తం రూ.350 కోట్ల చెల్లింపులు. ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లుల నిమిత్తం త్వరలోనే మరో రూ.200 కోట్ల విడుదలకు నిర్ణయం. ఇంత మేర చెల్లింపులు జరిపినా మరింత నిధులు విడుదలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల డిమాండ్‌. ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయవద్దంటూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను కోరిన మంత్రి సత్యకుమార్‌. :

👉పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం..ఖాతాదారులు డిపాజిట్ చేసిన పొదుపు నగదులో భారీ ఎత్తున అవకతవకలు…వైరా మండల పరిధిలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం జరిగింది. ఖాతాదారులు డిపాజిట్ చేసిన పొదుపు నగదు (ఆర్డీ)లో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఖాతాదారులు చెల్లించిన పొదుపు నగదు రూ.10 లక్షల రూపాయలకు ఓ ఉద్యోగి శఠగోపం పెట్టారు.పోస్ట్‌మెన్ మేడూరి శ్రీనివాసరావు విధులను నిర్వహించకుండా తన స్థానంలో ప్రైవేటు వ్యక్తి వరికూటి ప్రవీణ్ కుమార్‌ను అనధికారికంగా నియమించుకుని పోస్టల్ కార్యకలాపాలను చేపడుతున్నారు. గ్రామంలోని సెంటర్‌లో తనకున్న ఎరువులు దుకాణం పక్కనే ఓ షెటర్‌లో పోస్ట్‌మెన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.ఆ కార్యాలయం కేంద్రంగా ప్రైవేటు వ్యక్తి సుమారు సంవత్సర కాలంగా ఖాతాదారుల నుంచి రోజువారీ, నెలవారీగా వసూలు చేసిన పొదుపు సొమ్ము రూ.10 లక్షలను అప్పనంగా కాజేశాడు.వాస్తవానకి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సదరు పోస్ట్‌మెన్ పోస్టల్ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారుల నుంచి ప్రైవేటు వ్యక్తి నగదు వసూలు చేసి వారి పాసు పుస్తకాల్లో నగదు వసూలు చేసినట్లుగా స్టాంప్ వేసి ఇచ్చాడు. ఖాతాదారుల్లో 30 శాతం మందికే పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన 70 శాతం మందికి పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండానే నగదు వసూలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే వసూలు చేసిన నగదును మెయిన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాదారుల అకౌంట్లలో కూడా జమ చేయలేదు.సుమారు 50 మంది ఖాతాదారుల నుంచి అలా వసూలు చేసిన రూ.10 లక్షల నగదును పోస్ట్‌మెన్ అనధికారికంగా ఉద్యోగంలో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తి కాజేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.విషయం తెలుసుకున్న పోస్టల్ జిల్లా ఉన్నతాధికారులు మధిర పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, కలకోట బ్రాంచ్ పోస్టుమెన్లను విచారణకు ఆదేశించారు. దీంతో గత మూడు రోజులుగా వారు గొల్లపూడి గ్రామంలో విచారణ చేపడుతున్నారు.

👉 రంగారెడ్డి జిల్లా:*షాద్‌నగర్‌ దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీపై కేసు..ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులపై కేసులు..ఇప్పటికే డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కినిస్టేబుళ్ల సస్పెండ్‌

👉తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌*తిరుపతి జిల్లాలో గురు వారం రాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేగింది. కొత్తపాళెం లేఅవుట్‌లోని ఓ ఇంటి ప్రహారీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని నగలు, నగదుతో పరారయ్యారు.బనియన్లు, డ్రాయర్లు ధరించి, ఒంటికి ఆయిల్‌ రాసుకొని మారణాయు ధాలతో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్త మైంది. పరారీలో ఉన్న దొంగల ముఠా కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

👉రేపు శనివారం ట్రీస్ కటింగ్ డే సందర్భంగా కంభం లో కరెంట్ కటింగ్*.…ప్రకాశం జిల్లా కంభం మరియు పరిసర ప్రాంతాలలో రేపు శనివారం ట్రీస్ కటింగ్ డే సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని వివిధ రకాల వ్యాపార సంస్థలు, ప్రజలు సహకరించాలని విద్యుత్ ఎఈ వెంకట నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు…_

👉కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద కొనసాగుతున్న జూడలా ఆందోళన..కడప రిమ్స్ ఆసుపత్రిలోవిధులను బహిష్కరించిన జూడలు..కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ లో ఉన్న లేడి డాక్టర్ కు అత్యాచారం చేసి మర్డర్ చేసిన వారిని వెంటనే శిక్షించాలని, సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్…

👉విశాఖ ఉమ్మడి స్ధానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ*బొత్సా కు ఎమ్మెల్సీ గా ధృవీకరణ పత్రం అందచేసిన అధికారులుఇవాళ బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అధికారులు.

👉చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలిపేందుకే వెళ్లా..నేను ఎలాంటి దాడికి యత్నించలేదు-జోగి రమేష్‌
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకే..
అనుచరులతో చంద్రబాబు ఇంటికి వెళ్లా-జోగి రమేష్
అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో..నేను, నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు-జోగి రమేష్..
👉 విశాఖ బీచ్ రోడ్డులో కదంతొక్కిన జూనియర్ డాక్టర్లు.
వెస్ట్ బెంగాల్ లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటనపై ఆందోళన.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్.

*ప్రకాశం జిల్లా కంభం లో నేపాల్ కు చెందిన డింగిరి కమల అనే (24 సం) మహిళ తన ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి.


👉 పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టనున్న టీ వెంకటేశ్వర్లు……
ఈయన గతంలో ఒంగోలు వన్ టౌన్ లో పనిచేసే మంచి పేరు పొందిన వ్యక్తిగా పలువురు సమాచారం..
పొదిలి సర్కిల్లోని సమస్యలు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా చూస్తారో వేచి చూడాల్సిందే….
*పంటబోరు బావుల కేబుల్ వైర్ల దొంగతనం..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామం లోని పంట పొలాల్లో ఉన్న బోరుబావుల నుండి కేబుల్ వైర్లను కత్తిరించి దోచుకెళ్ళారని వాపోతున్న రైతులు. నిన్నరాత్రి దాదాపు 8 బోరుబావులనుండి కేబుల్ వైర్ల దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్ లో ఉన్న రాగి కోసం ఈ దొంగతనాలు జరుగు తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు. ముందే వర్షాభావం తో పంటలు పండించే అన్నదాతల పొలాల్లో జరుగుతున్న ఈ దొంగతనాలను నివారించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు..
👉 ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్..
ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్న సంస్థలు పక్కా ఆధారాలతో ఆపరేషన్ డెకాయి నిర్వహించిన టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం..ఇండియా మార్ట్‌లో ఈ గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టిన సందీప్ శాండిల్యా బృందం.. ఆ చాక్లెట్లను పక్కగా టెస్ట్ చేసి రాజస్థాన్, యూపీలో ఉన్న 8 కంపెనీలను గుర్తించిన పోలీసులు..ఈ విషయాన్ని టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్లతో కలిసి యూపీకి వెళ్లి గంజాయి చాక్లెట్లను అమ్మే ఇద్దరు కంపనీ యజమానులను అరెస్ట్ చేశారు.
రాజస్థాన్‌లో 7 కంపెనీలను గుర్తించి, అక్కడి నుండి నమూనాలు తీసుకొని ఫోరెన్సిక్ నివేదికలో వచ్చాక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
👉 *ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యాడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని నిన్న రాత్రి గుర్తు తెలియని 20 మంది దుండగులు వాచ్ మెన్ బంధించి జెసిబి తో కూల్చివేత…*
👉ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ రాచర్ల మండల ఫారెస్ట్ అధికారి కి వచ్చే జీతాలు సరిపోక వచ్చే మాములు సరిపోక ఇల్లీగల్ బిజినెస్ కు తెర లేపడం లో వెలుగులోకి వచ్చింది…గిద్దలూరు మండలం దిగువమెట్ట కు చెందిన చల్లా హరికృష్ణ (34) నాటుసారా తరలిస్తుండగా అదుపు లోకి తీసుకొన్న గిద్దలూరు పోలీసులు….హరికృష్ణ ను విచారించగా షైక్ జమల్ అటవీశాఖ లో సెక్షన్ ఆఫీసర్ పాత్ర ఉన్నట్లు తేల్చిన పోలీసులు…చల్లా హరికృష్ణ, షేక్ జమాల్ ఇద్దరి పై పలు సెక్షన్లలో కేసు నమోదు….జమాల్ రాచర్ల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నడు…వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు..
**వైరా మండల పరిధిలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో “భారీ కుంభకోణం” జరిగింది. ఖాతాదారులు డిపాజిట్ చేసిన పొదుపు నగదు (ఆర్డీ)లో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఖాతాదారులు చెల్లించిన పొదుపు నగదు రూ.10 లక్షల రూపాయలకు ఓ ఉద్యోగి శఠగోపం పెట్టారు.పోస్ట్‌మెన్ మేడూరి శ్రీనివాసరావు విధులను నిర్వహించకుండా తన స్థానంలో ప్రైవేటు వ్యక్తి వరికూటి ప్రవీణ్ కుమార్‌ను అనధికారికంగా నియమించుకుని పోస్టల్ కార్యకలాపాలను చేపడుతున్నారు. గ్రామంలోని సెంటర్‌లో తనకున్న ఎరువులు దుకాణం పక్కనే ఓ షెటర్‌లో పోస్ట్‌మెన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.
ఆ కార్యాలయం కేంద్రంగా ప్రైవేటు వ్యక్తి సుమారు సంవత్సర కాలంగా ఖాతాదారుల నుంచి రోజువారీ, నెలవారీగా వసూలు చేసిన పొదుపు సొమ్ము రూ.10 లక్షలను అప్పనంగా కాజేశాడు.
వాస్తవానకి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సదరు పోస్ట్‌మెన్ పోస్టల్ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారుల నుంచి ప్రైవేటు వ్యక్తి నగదు వసూలు చేసి వారి పాసు పుస్తకాల్లో నగదు వసూలు చేసినట్లుగా స్టాంప్ వేసి ఇచ్చాడు. ఖాతాదారుల్లో 30 శాతం మందికే పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన 70 శాతం మందికి పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండానే నగదు వసూలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే వసూలు చేసిన నగదును మెయిన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాదారుల అకౌంట్లలో కూడా జమ చేయలేదు.సుమారు 50 మంది ఖాతాదారుల నుంచి అలా వసూలు చేసిన రూ.10 లక్షల నగదును పోస్ట్‌మెన్ అనధికారికంగా ఉద్యోగంలో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తి కాజేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.విషయం తెలుసుకున్న పోస్టల్ జిల్లా ఉన్నతాధికారులు మధిర పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, కలకోట బ్రాంచ్ పోస్టుమెన్లను విచారణకు ఆదేశించారు. దీంతో గత మూడు రోజులుగా వారు గొల్లపూడి గ్రామంలో విచారణ చేపడుతున్నారు.
👉తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్ ..
తిరుపతి జిల్లాలో గురు వారం రాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేగింది. కొత్తపాళెం లేఅవుట్‌లోని ఓ ఇంటి ప్రహారీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని నగలు, నగదుతో పరారయ్యారు.బనియన్లు, డ్రాయర్లు ధరించి, ఒంటికి ఆయిల్‌ రాసుకొని మారణాయు ధాలతో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్త మైంది. పరారీలో ఉన్న దొంగల ముఠా కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
👉రేపు శనివారం ట్రీస్ కటింగ్ డే సందర్భంగా కంభం లో కరెంట్ కటింగ్ .._ప్రకాశం జిల్లా కంభం మరియు పరిసర ప్రాంతాలలో రేపు శనివారం ట్రీస్ కటింగ్ డే సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని వివిధ రకాల వ్యాపార సంస్థలు, ప్రజలు సహకరించాలని విద్యుత్ ఎఈ వెంకట నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు…_
👉కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద కొనసాగుతున్న జూడలా ఆందోళన..కడప రిమ్స్ ఆసుపత్రిలోవిధులను బహిష్కరించిన జూడలు..కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ లో ఉన్న లేడి డాక్టర్ కు అత్యాచారం చేసి మర్డర్ చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్…
సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్…

👉 ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ భర్తనే తన పాలిట యముడు అయ్యాడు…!!!
పెళ్లి అనే బంధంతో ఎన్నో జంటలు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. మరికొందరు ప్రేమించి మరీ.. పెళ్లి చేసుకుంటారు. అలానే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళ జీవితం మాత్రం విషాదంగా మారింది.భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది. అలానే దంపతుల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. అయితే కొందరు ఇలాంటి వాగ్వాదాలకు సర్థుకుపోతుంటారు. మరికొందరు మాత్రం చిన్న ఇష్యూను పెద్దదిగా చేసుకుని చివరకు విషాదంగా కూడా మార్చుకుంటారు. మరికొన్ని కుటుంబాల విషయంలో కొన్ని చెడు వ్యసనాలు చిచ్చుపెడుతుంటాయి. అలానే తాజాగా ఓ మహిళ..తాను ప్రేమించి ఓ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అతడే తన జీవితం అనుకుంది. కానీ చివరకు ప్రేమించిన వ్యక్తే.. యముడై ఆమె ప్రాణాలను తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దాసోజు బ్రహ్మచారి, సరిత(31) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరు కొద్ది రోజులుగా సూర్యాపేటలోని శ్రీరాంనగర్ లో నివాసం ఉంటున్నారు. బ్రహ్మాచారి డోర్ పాలీష్ పనులు చేస్తుండేవారు. అలానే సరితా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిద్దరు 2014లో ప్రేమించుకుని కులాంతార వివాహం చేసుకున్నారు.పెళ్లైన చాలా కాలం వీరి సంసారం హాయిగా సాగింది. అయితే ఇటీవల కొద్ది రోజుల నుంచి సరితా, బ్రహ్మచారి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. అంతేకాక ఇటీవల బ్రహ్మచారి మద్యానికి అలవాటుపడ్డాడు. రోజు తాగి వచ్చి భార్య సరితతో ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సరితాతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనై.. ఇంట్లోని వైర్ ను సరిత మెడకు చుట్టి..బలంగా లాగాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరితా కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహం చూసి బోరున విలపించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.ఇలా ఇటీవల కాలంలో అక్రమసంబంధాలు, ఆర్థిక సంబంధాలు, చెడు వ్యసనాల వంటి వాటి కారణంగా పచ్చని సంసారాలు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. కొందరు భార్యాభర్తలు అయితే పంతాలకు పోయి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పూర్వం దంపతుల మధ్య ప్రేమానురాగాలు, సర్థుకుపోయే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. వాళ్లు సంసారాన్ని హాయిగా సాగించారు. కానీ నేటికాలంలో అలాంటి పరిస్థితులు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తున్నాయి. మద్యానికి బానిసై కొందరు కుటుంబాన్ని నాశనం చేస్తుంటే..గొడవలు పడి మరీ..ఇంకొందరు తమ జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం