👉ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు*ప్రస్తుతం సీఐడీ అదుపులో ఉన్న వాసుదేవరెడ్డి..
👉రామోజీ ఆర్థిక నేరగాడే…..ఆర్బీఐ నివేదికను బట్టి సుస్పష్టం*మార్గదర్శి’ సేకరించిన రూ.2.600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే..**45 ఎస్ నిబంధన ఉల్లంఘన.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తేల్చిన ఆర్బీఐ..*కేసులు విచారణలో ఉండగానే రూ.2 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు..*ఉమ్మడి హైకోర్టు చివరి రోజు ‘మార్గదర్శి’పై కేసు కొట్టివేత…*సుప్రీంలో అప్పీల్ చేయని నాటి చంద్రబాబు ప్రభుత్వం..*ఉండవల్లి పిటిషన్ ఇంప్లీడ్ అయిన గత ప్రభుత్వం.. *చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు రెట్టింపు జరిమానా, జైలు..*
👉ఎమ్మెల్యే అయినా.. సామాన్యుడిలానే ప్రజాసేవ* మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీరే వేరప్పా.. *ఉదయం కాగానే సామాన్యుడిలా టీ దుకాణం వద్ద పత్రిక చదువుతూ ప్రత్యక్షమౌతుండటంతో అవాక్కవుతున్న ప్రజలు..*ఎమ్మెల్యేలా కాకుండా ప్రజలతో సమన్యుడిగా ఉంటేనే సమస్యలు తెలుస్తాయని తాను సమన్యుడిలా ప్రజలతో మమేకం అవుతూ పాలన*..ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన మడకశిర ఎమ్మెల్యే..*
👉హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిలా కాలనీల చుట్టూ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు..👉సమస్యల సత్వర పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు…… 👉 మడకశిర పట్టణంలో ఆదివారం పొద్దు పొద్దున్నే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కాలనీల్లో కలియతిరిగారు. 👉ఒకటవ వార్డు శివాపురంలో స్మశాన వాటికకు దారి, వీధి దీపాలు, తాగునీటికి బోరు తవ్వించాలని ప్రజలు కోరగా వెంటనే పరిష్కరిస్తామని హామీ..👉 4వ వార్డులో తాగునీటి సమస్య పై కౌన్సిలర్, ప్రజలతో చర్చించిన ఎమ్మెల్యే. పరిష్కరించాలని మునిసిపల్ ఏఈ మురళీధరకు ఆదేశాలు..* సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులకు ఎమ్మెల్యే సూచన..
👉వివాహితపై సామూహిక అత్యాచారం**భర్తతో కలిసి మద్యం తాగి.. అతడిని కొట్టి అఘాయిత్యం..‼️..ఏలూరు జిల్లా : ఏలూరు 1 టౌన్.. :భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు.. తర్వాత అతన్ని కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని రెండోభార్య ఏలూరు వన్టైన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. 15రోజుల క్రితం నగరానికొచ్చిన వీరు పగలు హోటల్లో పనిచేస్తుంటారు. రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తారు. అద్దె ఇల్లు దొరి కితే వెళదామని అనుకుంటున్నారు. నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు. వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, విజయరాయి వ్యక్తి కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తు ఎక్కాక . ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేశారు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకోలేని భర్త కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు. ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వస్తుండగా నిందితులు ముగ్గురూ పరారయ్యారు.*100కు కాల్ చేసినా స్పందించలేదు*డయల్ 100కు కాల్ చేసినా సరిగా స్పందించలేదని అక్కడికొచ్చిన యువకుడు చెబుతున్నారు. 100కు కాల్ చేసి చెప్పగా చూస్తాం.. ఎక్కడ అంటూ ముభా వంగా మాట్లాడారని, సరిగా స్పందించలేదన్నారు. తర్వాత సమీపంలోని వన్లైన్ పోలీసుస్టేషన్కు వెళ్లి విషయం చెప్పగా పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు చెప్పారు.*నిందితుల అరెస్టు… 14 రోజుల రిమాండ్* అత్యాచారం ఘటనలో నిందితులు ముగ్గురినీ ఏలూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్కుమార్ అలి యాస్ నానిలను వన్డేన్ ఎస్సై లక్ష్మణ్బాబు, సిబ్బంది అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
👉 మీకు నచ్చినట్టు తిరగండి… కానీ మాతో ఉంటే చాలు: దువ్వాడ వాణి*ఇటీవల రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం*దివ్వెల మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్న శ్రీనివాస్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తె*
ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… దివ్వెల మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్న వ్యవహారం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి రచ్చకీడ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె కూడా తండ్రి వ్యవహారంపై బహిరంగంగా గళం విప్పారు. తాజాగా ఈ అంశంలో దువ్వాడ వాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందు రకరకాల కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శ్రీను గారి తల్లి, అతడి సోదరుడు ఎలాంటి కథలైనా క్రియేట్ చేయొచ్చు… కానీ శ్రీను గారే ఇలాంటి అవాస్తవాలను సృష్టిస్తుండడం బాధాకరమని వాణి పేర్కొన్నారు. “నా పట్ల, పిల్లల పట్ల తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. నా పిల్లలు కారం పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని వచ్చారంట. ఏ తండ్రయినా అలా చెప్పుకుంటారా అండీ! ఆ రోజు మీడియా అంతా రోడ్డుపైనే ఉంది కదా… నా పిల్లలపై ఎందుకు అలా అభాండాలు వేస్తున్నారు? పిల్లల మీద చెప్పినవాడు భార్య మీద చెప్పడా? ఎన్నయినా చెబుతాడు. ఒక తప్పుడు సందేశం అనేది ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశానని అంటున్నాడు. రాజకీయపరంగా శ్రీను గారు ముందుకు వెళతారులే అనే ఉద్దేశంతో నా కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని త్యాగం చేశాను. కానీ ఈ రోజు శ్రీను దాన్ని దుర్వినియోగం చేశారు. తన పదవిని చూసుకుని, ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బును చూసుకుని అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు… కానీ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. కానీ కొంతకాలంగా ఏదో జరుగుతోందన్న విషయం ఇటీవల నాకు అర్థమైంది. ఆయనకో చెడు అలవాటు ఉంది. తన సమస్యలను ఆయన ఎవరితోనూ పంచుకోరు. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకునే మనస్తత్వం ఆయనది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకమ్మాయి పెళ్లీడుకు వచ్చింది. ఇక ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లల పేరు మీద, నా పేరు మీద ఆస్తులు రాయాలని నేను కోరుకోవడంలేదు. నేను, మీరు, పిల్లలు ఒకే ఇంట్లోనే కలిసి ఉందాం… మీరు బయటికి వెళ్లి మీ వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైనా చేసుకోండి… మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు… మీరు మాతోనే ఉండండి… ఆ మేరకు ఒప్పంద పత్రం రాసుకుందాం అని శ్రీను కి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ దువ్వాడ వాణి స్పష్టం చేశారు.
👉టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం* తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైళ్లు దగ్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజినీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సెక్షన్ ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు.
👉అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య ..పల్నాడు జిల్లా.గురజాల నియోజకవర్గం.. తేలుకుట్ల గ్రామంలో అప్పుల బాధలు భరించలేక యువ కౌలురైతు బావిలో దూకి మృతి..రైతులదగ్గర 6, ఎకరాలను కౌలుకు తీసుకుని గతేడాది పత్తి, మిరప పంటలు సాగుచేసిన గుండాల ఆంజనేయులు (24)పంటపెట్టుబడికింద 9లక్షలు ఖర్చు పెట్టిన యువ కౌలు రైతు..పంట సాగు దెబ్బతినడంతో అప్పులు దాదాపు 10 లక్షలు అప్పులు అయిన రైతు..చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో శనివారం ఉదయం ఎవరూలేని సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువ కౌలు రైతు.. గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపుఅప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు పోలీసులు కేసు నమోదు ..మృతునికి భార్య ఒక కుమారుడు
👉 *రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం గా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారం గా వారిని 7 ఏళ్ల జైలు* శిక్ష కు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు… ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వారు కూడా ఈ శిక్షనే వేస్తారు. హైకోర్టు సుప్రీంకోర్టు, GO, తీర్పులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అవినీతి అధికారులు నాయకులు, మరి ఈ అవినీతి అధికారులు పైన అవినీతి నాయకుల పైన ఆదాయ పన్ను శాఖ వారు మరియు, ED, IT, CB,CiD కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నాయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ కళ్ళు ఉండి గుడ్డివాడిలా నటిస్తున్నారా, కేంద్రా రాష్ట్ర నిజాయితీ గల అధికారులు ఎక్కడ 🇮🇳 మేధావుల్లారా మౌనం వేడండి ఇకనైనా ఈ అవినీతిపరులను విజ్ఞానవంతులైన మేధావులు నిరుద్యోగ యువ యువతీ యువకులు ప్రజలు ప్రజా ఆస్తులను కాపాడుకోవాలి రండి చేయి చేయి కలపండి🫱🏾🫲🏼 భావితరాల భవిష్యత్తు కోసం దేశం కోసం మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కి పని చెప్పండి గూగుల్లో సెట్ చేసి మెయిల్ ద్వారా చరవాణి ద్వారా టెస్ట్ మెసేజ్ఆన్లైన్లో కంప్లైంట్ లు చెయ్యవచ్చు ప్రజలు మేల్కోండి.,…………👉నగరాల్లో వృక్ష సంపదను పెంచాలి..నగరాలు, పట్టణాల్లో చెట్ల సంఖ్యను పెంచాలి. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక..చెట్లు ఉష్ణోగ్రతను 2-8 డిగ్రీల మేర చల్లబరుస్తాయి. కాలుష్య కారకాలను, సూక్ష్మ ధూళికణాలను అరికడతాయి. ఒక్కో చెట్టు ఏడాదికి సగటున 150 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని నిల్వ ఉంచుకుంటుంది. తద్వారా వాతావరణ మార్పులను నివారించడంలో వృక్షాలు దోహదపడతాయి. పక్షులకు ఆవాసంగా మారి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. చెట్ల దగ్గర సేదతీరితే ఒత్తిడి తగ్గి నూతనోత్తేజం కలుగుతుంది. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
*కర్ణాటకలో మరో గవర్నర్ గిరీ…!!!**ముడా స్కాంలో సిద్ధరామయ్యపై* *విచారణకు* *గవర్నర్ ఆదేశం రాజ్యాంగ విరుద్ధం,* *చట్ట వ్యతిరేకమన్న *సిఎం…. బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బిజెపి తీరు మారలేదు. ప్రతిపక్ష పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రికి ముడా భూ కుంభ కోణంలో ప్రమేయం ఉందున్న ఆరోపణలు రావడమే ఆలస్యం ఆ రాష్ట్ర గవర్నరు థావర్‌చంద్👉బంగ్లాదేశ్ లోని నిరసనల్లో మృతులపై ఐరాస సంచలన విషయాలు వెల్లడి! అవును… గతకొన్ని రోజులుగా కుతకుత ఉడికిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కాస్త శాంతించినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల ఫలితంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించడంతో పాటు ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్న పరిస్థితులు తలెత్తాయి. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు కాస్త ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో నిరసనలు, హింసపై ప్రాథమిక విశ్లేషణ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. అవును… గతకొన్ని రోజులుగా కుతకుత ఉడికిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కాస్త శాంతించినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాలోని 13 జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వరుసగా కర్ఫ్యూలు విధించడం.. ఒకానొక దశలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లైన ఫేస్ బుక్, వాట్సప్, మెసెంజర్, ఇన్ స్టా గ్రామ్ లను మూసేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి కాస్త కూల్ అయ్యినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో జూలై 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ 400 మంది మృతిచెందినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో… ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన హింసాకాండలో సుమారు 250 మంది మరణించారని తెలిపింది. గెహ్లాట్ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. గవర్నరు చర్య రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజలకు ఎలాంటి జవాబుదారీ లేని గవర్నరు పెత్తనమేమిటని ప్రశ్నించింది. తాను ఏ తప్పు చేయలేదని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే తలెత్తదని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తెలిపారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమేయం ఉందని ఒక కార్యకర్త ఫిర్యాదు చేస్తే, దానిపై గవర్నరు విచారణకు ఆదేశించడం పెను దుమారం రేపింది. ఈ స్కామ్‌లోనే నిందితులుగా వున్న బిజెపి, దాని మిత్రపక్షం జెడిఎస్ నేతల విచారణకు ఎటువంటి అనుమతి ఇవ్వని గవర్నరు, ఈ విషయంలో వ్యవహరించిన తీరు ముమ్మాటికీ పక్షపాతంతో కూడిన చర్య అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి భూములకు ఎక్కువ పరిహారం లభించిందనే ఆరోపణలపై గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ నోటీసును వాపసు తీసుకోవాలని గవర్నర్‌ను కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన గవర్నర్ సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు. ఈ కేసును న్యాయపరం గా కోర్టులో ఎదుర్కొంటానని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి, జెడి(ఎస్) వంటి పార్టీలు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్‌భవన్‌ను బిజెపి దుర్విని యోగం చేస్తోందని అన్నారు. ఈ కేసులో విచారణ కోసం పెండింగ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రసుత్త కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి, మాజీ మంత్రులు, బిజెపి నాయకులు శశికళ జోలె, మురగేష్ నిరానీలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడాన్ని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
👉కోల్కతా హత్యాచార ఘటన.. పరిహారం వద్దన్న తండ్రి*కోల్కతాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించారు. ‘నా కుమార్తె మరణానికి పరిహారంగా డబ్బు తీసుకుంటే అది ఆమెను బాధిస్తుంది. అందుకే వద్దని చెప్పా. నా కూతురికోసం లక్షలాది మంది పోరాటం చేస్తున్నారు. వారంతా నా కూతుళ్లు, కొడుకులే. కేసు విచారణలో ఉన్నందున CBIకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.’ అని తెలిపారు.
👉 బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ😱😱😱
హైదరాబాద్ లో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ‘ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ’ కంపెనీ ఏర్పాటు చేసింది. దాదాపు 600 నిరుద్యోగుల నుంచి రూ.1,50,000 వసూలు చేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. కార్యాలయానికి తాళం వేయడంతో గ్రహించిన బాధితులు మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై మాదాపూర్ PSలో ఫిర్యాదు చేశారు.
: *క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్*సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్* ఏపీలో మురుగునీటి సమస్యపై ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు మెసేజ్ పంపినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. డిపార్ట్మెంట్ తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు. త్వరలోనే తన టీమ్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వేగంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
👉పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం😱😱😱*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమవడం కలకలం సృష్టిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. కార్యాలయం లోని అధికారులే కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేస్తున్నారు.
*మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఏసోబు రాజీనామా*మాచర్ల పురపాలక సంఘ చైర్మన్ మాచర్ల ఏసోబు శనివారం రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను టౌన్ ప్లానింగ్ అధికారికి అందజేశారు.
👉 కృష్ణా జిల్లా..పెనమలూరు నియోజకవర్గం..కంకిపాడు..ఆర్టీసీ ఉద్యోగి పై మందుబాబు హల్చల్..*ఆర్టీసీ మహిళ కండక్టర్ పై దుర్భాషలాడిన యువకుడు.*కంకిపాడు ఊరి చివర మద్యం తాగి రన్నింగ్ బస్ ఎక్కిన యువకుడు.*ప్రశ్నించినందుకు మహిళ కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన యువకుడు.*పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళా కండక్టర్ శ్రీలత.*
👉 డాక్టర్ హత్యాచారం అనంతరం బెంగాల్‌లో నైట్ షిఫ్ట్‌లో మహిళల కోసం భద్రతా కార్యక్రమం..
డాక్టర్ హత్యాచారం అనంతరం బెంగాల్‌లో నైట్ షిఫ్ట్‌లో మహిళల కోసం భద్రతా కార్యక్రమం కోల్‌కతాలో డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళల భద్రత కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘రత్తిరేర్ శాతి’ పేరుతో ఒక ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిర్దేశిత రెస్ట్‌రూమ్‌లు, CCTV పర్యవేక్షణ, జంటగా పని చేయడం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఒక ప్రత్యేక ఫోన్ యాప్‌ని అభివృద్ధి చేసి, మహిళల ఫోన్‌లలో తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేస్తారు. ఈ యాప్ పోలీసులకు లింక్ చేయబడుతుంది.
👉 సీబీఐకి కేసు ఇచ్చాక మమత ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది: బీజేపీ..సీబీఐకి కేసు ఇచ్చాక మమత ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది: బీజేపీకోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన విధ్వంసం గురించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. నిరసనకారులపై టీఎంసీ గూండాలు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.
👉అన్న క్యాంటీన్ కు లక్ష నూట పదహార్లు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగి*
*గిద్దలూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ కు దాతలు విరాళాలు అందచేస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని రాచర్ల మండలం, గుడిమెట్ట పంచాయతీలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామాంజనేయ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గిద్దలూరు పట్టణంలో పేదల ఆకలి తీర్చేందుకు ఆగష్టు 31 వ తేదీన పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ అభివృద్ధి కోసం తన వంతు సహకారంగా రూ. 100116-00 లు (అక్షరాల ఒక లక్ష నూట పదహారు రూపాయలు) చెక్కును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అందచేశారు. అన్న క్యాంటీన్ అభివృద్ధికి సహకారం అందించిన రిటైర్డ్ ఉద్యోగికి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల బెస్తవారిపేట మండల అధ్యక్షులు కటికే యోగానంద్, సొరెడ్డి మోహన్ రెడ్డి, గోపిరెడ్డి జీవన్ రెడ్డి, దూదేకుల సైదులు తదితరులు పాల్గోన్నారు.*
👉 ఏపీ సీఎం పై పేస్ బుక్ లో అనుచిత పోస్టు పెట్టిన మహిళ అరెస్ట్*ప్రకాశం జిల్లా కంభంలో ఆగస్టు 7వ తేదీన పేస్ బుక్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అవమానిస్తూ అనుచిత పోస్టు పెట్టిన ఓ మహిళను కంభం పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.టిడిపి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పేస్ బుక్ లో పోస్టు పెట్టిన వారిని గుర్తించారు. బేస్తవారిపేట కు చెందిన ఓ మహిళ పోస్ట్ పెట్టినట్లుగా గుర్తించి మహిళకు ముందుగా నోటీసు ఇచ్చి తర్వాత మహిళను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.మహిళ ఉపయోగించిన మొబైల్ ఫోనును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
👉 ఏలూరు జిల్లా,చింతలపూడి మండలం*రేచర్ల గ్రామములో విషాదం.*వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో దుక్కుదున్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి రెబ్బ సునీల్ (23) అనువ్యక్తి మృతి