ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం-దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు….ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు..కర్ణాటకలో కమలం బిజీ..బిజెపిపై నమ్మకం సన్నగిల్లుతుందా..జనసేన డాక్టర్ కార్తికేయ పై దాడి..కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. పెనమలూరులో జోరుగా జూద క్రీడ..

♦👉కర్ణాటకంలో కమలం బిజీ…ఇమేజ్ ని పందెం కట్టి ! ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.* బీజేపీ అంటే తేడా పార్టీ అంటారు.ఆ తేడా కి అర్ధం ఏంటి అంటే మిగిలిన పార్టీల కంటే సిద్ధాంతపరంగా తేడా అని. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి నీతిగా నిజాయితీగా ఉండే పార్టీ అని.*అయితే ఇదంతా ఒకప్పటి మాట. నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ఇపుడు నయా పాలిటిక్స్ కి తెర తీసింది.తాము అధికారంలో లేని చోట రాజకీయంగా చేయాల్సినవన్నీ చేస్తూ పోతోంది.* 2018 లో కర్నాటకం స్టార్ట్ చేసి చాలా మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.*ఆ తరువాత మధ్యప్రదేశ్ లో అదే గేం ఆడింది.*మహారాష్ట్రలో ఒకే ఫిలాసఫీ తో నడిచే చిరకాల మిత్రపక్షం అయిన శివసేనను సైతం రెండుగా చీల్చి మరీ అక్కడ అధికార పంట పండించుకుంది. *జార్ఖండ్ లో సీఎం గా ఉన్న హేమంత్ సోరెన్ కి జైలు దారి చూపించి అక్కడ పాగా వేద్దామని ప్రయత్నం చేసింది అని కూడా విమర్శలు ఉన్నాయి. *ఇపుడు తిప్పి తిప్పి మళ్ళీ కర్నాటకం స్టార్ట్ చేసింది అనుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.ఏమీ లేని చోట ఏదో అయినట్లుగా భ్రాంతికి కలిగించి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి అందులో రాజకీయ లాభం చూసుకునే కమలం తీరు పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఏణ్ణర్థం క్రితం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారు. కాంగ్రెస్ ని తెచ్చి పెట్టారు.*అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీయూతో పొత్తు పెట్టుకుని బీజేపీ మళ్ళీ ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకోవడం ద్వారా తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకుంది.కాంగ్రెస్ సర్కార్ కొనసాగితే ఆ ప్రభుత్వం పట్ల జనాలకు విసుగు పుడితే బీజేపీకి చాన్స్ ఉండొచ్చు. అలా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు అయిన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎందుకు తాపత్రయం అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.ఆ రాజకీయ అలజడిలో చలి కాచుకోవాలని ఎందుకు ఆరాటం అని కూడా నిలదీస్తున్న వారు ఉన్నారు. *ఏది ఏమైనా సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీగా కర్ణాటక రాజకీయం సాగుతోంది. గవర్నర్ చేసింది ఒప్పు అని బీజేపీ నేతలు సమర్ధించుకుంటూంటే కాదు గవర్నర్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి ఎలా కధ కంచికి చేరుతుంది ఎవరికి లాభం ఎవరికి బూమరాంగ్ అన్నది ఇపుడే తెలియదు కానీ బీజేపీ మాత్రం కర్నాటకంలో చేయి పెట్టడం పట్ల విమర్శలు అయితే వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం రాజకీయంలో బీజేపీ ఇమేజ్ సైతం దెబ్బతింటోందని అనే వారూ ఉన్నారు. అంతలా తన అస్థిత్వాన్నే ఫణంగా పెట్టి పందెం కట్టి రాజకీయ జూదం ఆడాలా అన్న చర్చ కూడా పార్టీ లోపలా బయటా ఉంది మరి.
👉ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈసందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకుప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.
👉జనసేన బీసీ నాయకుడు డాక్టర్ కార్తికేయ పై దాడి ..కృష్ణాజిల్లా..ఉయ్యూరు.ఈ కుట్ర వెనక గంజాయి బ్యాచ్ ఉందని అనుమానిస్తున్న డాక్టర్..నిస్పక్షపాతంగా విచారణ జరుగుతుందా అని అనుమానాలు…

👉ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్..*
రాఖీ పండగకు వనపర్తికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన గర్భిణి..మార్గమధ్యలో పురిటి నొప్పులు..
బస్సులో ఉన్న నర్సు సహాయంతో పురుడు పోసిన కండక్టర్ భారతీని అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
👉సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి..!!!
మహబూబాబాద్ – నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో ఆస్పత్రిలో చేర్పించారు.. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
👉 గుర్తుతెలియని మృతదేహం లభ్యం  పల్నాడు జిల్లా.. మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని కృష్ణవేణి పుష్కర్ ఘాట్ వద్ద గుర్తుతెలియని కాలిబూడిదైన వ్యక్తి మృతదేహం లభ్యం..మృతదేహం వద్ద పెట్రోల్ డబ్బా తో పాటు వాటర్ బాటిల్స్ గుర్తింపుసంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉కడప రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం తో ఓ నిండు ప్రాణం బలి.*విషద్రావం తాగి సీరియస్ గా ఉన్న ఈశ్వరయ్యను కడప రిమ్స్ కు తరలింపు.*ఆసుపత్రికి వెళ్లిన అరగంట అయినా పట్టించుకోని రిమ్స్ వైద్యులు. *రిమ్స్ డాక్టర్ల నిండు నిర్లక్ష్యానికి ఈశ్వరయ్య మృతి.*ఎమర్జెన్సీ కేసుకు కూడా ఓపి తెచ్చుకోవాల్సిందే అంటూ డాక్టర్ల హుకుం.*బోరున విలపిస్తున్న మృతుడి భార్య, బంధువులు.*మృతుడు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం సాదువారి పల్లె కు చెందిన వాడు
👉కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య?*
*గొంతు కోసి హత్య చేసిన దుండగులు*

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. పెద్దహరివాణంలో బీజేపీ నేత శేఖన్న (50)ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు.ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను కొందరు దుండ గులు గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 తిరుపతి జిల్లా శ్రీసిటీ నందు పలు భూమిపూజలు మరియు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ రేణిగుంట విమానాశ్రయం నందు పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
👉కృష్ణా జిల్లా, పెనమలూరు* నియోజకవర్గం లో గతంలో ఎన్నడూ లేని విధంగా జోరుగా కొనసాగుతున్న *జూద క్రీడ..గత ప్రభుత్వం లో జిల్లాలో జూదానికి *గన్నవరం* అడ్డాగా ఉండేది..ఇప్పుడు జూదం ఆడే పేకాట రాయుళ్లకు *పెనమలూరు* అడ్డాగా మారుతుంది..*గోదావరి* జూదగాళ్లను సైతం ఆకర్షిస్తున్న *పెనమలూరు..*పెనమలూరు స్టేషన్ పరిధిలో సీఐ *వెంకటరమణ* బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దాడుల్లో వందల సంఖ్యలో పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న వైనం..*పలు దాడుల్లో పట్టుబడ్డ రాజకీయ నాయకులు, ప్రముఖులు.*పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించి ఇలాంటి జూద క్రీడలను అదుపులోకి తేవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు..
👉 అనకాపల్లి జిల్లా లో ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు విద్యార్థులు మృతి ..*అనకాపల్లి జిల్లా కోటవురట్ల లో కైలాసపట్నం అనాద పాఠశాల లో కలిసిత ఆహారం తిని 27 మంది తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ నలుగురు విద్యార్థులు చనిపోయారు. మెరుగు అయిన చికిత్స కోసం విద్యార్థుల ను KGH కు తరలించారు. విద్యార్థుల మృతి పై తీవ్ర విచారణ వ్యక్తం చేసిన చంద్రబాబు . విచారణ కు ఆదేశించిన సిఎం

👉కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కాచిన నూనే పోసి తోడికోడల పై దాడి.!*
కాచిన నూనె పోసి సొంత తోడికోడలపై దాడి చేసిన సంఘటన కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది.
ఆదివారం కోడూరు (ఆర్యవైశ్య) మినుముల కొనుగోలు వ్యాపారి భార్యపై అతని తమ్ముడు భార్య కాచిన నూనె మొహం మీద పోసి దాడికి పాల్పడినట్లు సమాచారం.?
ఈ దాడిలో వ్యాపారి భార్య తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పాత గొడవల కారణంగానే తోడికోడలపై దాడికి పాల్పడినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం..
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలలుగా ప్రేమ పేరు తో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువ కుడికి మరో ఇద్దరు యువ కులు సహకరించినట్లు సమాచారం.
ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు …
👉జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 19: కుటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సంగతి విధితమే రెండో పేజీలో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, కిర్లంపూడి మండలాలకు అన్నా క్యాంటీన్లు శాంక్షన్ అవటంతో సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ పబ్లిక్ అండ్ హెల్త్ బ్రహ్మ తేజ తో కలిసి గోకవరం రోడ్ లో గల పంచాయతీరాజ్ అతిథి గృహం సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల సరిపోతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పంచాయతీ సెక్రెటరీ చిరంజీవి రాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం