డీకే ఎందుకు సైలెన్స్ గా ఉన్నారు..సీఎం గ్రీన్ సిగ్నల్..నాగబాబుకు కీ పోస్ట్?..ఎన్టీవీ విలేఖరిపై దాడి చేసిన టిడిపి కార్యకర్త..ఒంగోలులో నిలిచిపోయిన ఈవిఎం చెక్ అండ్ వేరిఫికేషన్..21న భారత్ బంద్..సద్దుమనగని దువ్వాడ ఫ్యామిలీ గొడవ..వేణుస్వామి ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టిచంపండి:జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి..y పాలెంలో క్రికెట్ లీగ్..

👉 డీకే నిశ్శబ్దం వెనక ఆంతర్యం ఏమిటి???తెలంగాణ ఎన్నికల ముందు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. చేరికల నుంచి టికెట్ల వరకు తన చుట్టే రాజకీయాన్ని తిప్పుకున్నారు. పక్క రాష్ట్రమైనా తెలంగాణ నేతలకన్నా చాలా పవర్ ఫుల్ గా మారారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా మంత్రి పదవులు ఇతర ముఖ్య విషయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు.ఉన్నట్లుండి ఆ లీడర్ సైడ్ అవడంతో పాటు సైలెంట్ కూడా అయ్యారు.*ఆ లీడర్ సైడ్ తనకు తానే సైడ్ అయ్యారా లేకుంటే ఎవరైనా సైడ్ చేశారా..డీకే శివ కుమార్ తెలంగాణ రాజకీయాలకు పరిచయం అవసరం లేని పేరు. కర్ణాటకలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ పొలిటిషియన్. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత ఆప్తుడు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకీ ఆర్థికంగా అండదండగా ఉంటూ వచ్చారు*. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డీకే అక్కడ వాలిపోయిన పరిస్థితి ఉండేది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టీకీ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా మోదీ, బీజేపీ హవా కొనసాగుతుంది. ఇదే సమయంలో కర్ణాటకలో ఎన్నికలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అంత వరకూ కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల్లో కూడా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ మాత్రం శక్తివంచన లేకుండా ఎన్నికల్లో పోరాడడానికి సిద్దమైంది. అయితే కర్ణాటక ఎన్నికల భారాన్ని మొత్తం మోసింది డీకే శివకుమార్ అని చెప్పకతప్పదు. డీకే అండతో పాటు సిద్దిరామయ్య రాజకీయ ఛరిష్మాతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో డీకే శివకుమార్ పేరు మరింత మారు మోగింది. డీకే ఎంటరైతే వార్ వన్ సైడే అన్నట్లుగా పాలిటిక్స్ మారుతాయని రుజువు చేసుకున్నారు.అలాంటి డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ఎన్నికల తర్వాత మరో పెద్ద టాస్క్ ను అప్పగించింది. తెలంగాణ ఎన్నికల్లో డీకే కు కీ రోల్ ఇచ్చింది. ఒక వైపు అప్పటికే అధికార బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుతో పాటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇదే సమయంలో ఇక్కడకు డీకే ఎంటరయ్యారు. డీకే ఎంటరవుతూనే ఎన్నికల ప్రచారంతో పాటు టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖర్చుల విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఐనా ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలన్నీ డీకే చుట్టే తిరిగాయి. టికెట్ల కేటాయింపులో డీకేదే కీలక పాత్ర. టికెట్లు దక్కని వారిని కూడా డీకే ఏదో ఒక రకంగా మేనేజ్ చేశారు. ఒక దశలో డీకే బెంగళూరులో ఉన్నా అక్కడికి వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలు కలవడం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముఖ్య నేతలు అంతా కూడా బెంగళూరులో డీకే అనుమతితోనే జరిగింది అని చెప్పవచ్చు.

👉యర్రగొండపాలెం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్ఘ స్థాయి PCL -ప్రకాశం క్రికెట్ లీగ్ ను నిర్వహించడం జరిగింది. ఈ లీగ్ సంబంధించి యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 31 టీమ్స్ పాల్గొన్నాయి.నేడు యర్రగొండపాలెం లో క్రికెట్ లీగ్ లో పాల్గొన్న 31 టీములకి 31 క్రికెట్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, రాష్ట్ర ఎస్. సి సెల్ డైరెక్టర్ చేవుల అంజయ్య,మాజీ మండల కన్వీనర్ సంఘ నారాయణ రెడ్డి , మంత్రు నాయక్, కాశీ కొండా , సర్పంచ్ రెంటపల్లి సుబ్బారెడ్డి, చిట్యాల వెంగల్ రెడ్డి, సత్యనారాయణ పోక వెంకట సుబ్బయ్య పఠాన్ రసూల్ ఖాన్ ,మస్తాన్ వలి షేక్ , కె.భాస్కర్ రావు తదితర నాయకులు , 31 క్రికెట్ టీముల సభ్యులు పాల్గొన్నారు.

. 👉*21న భారత్ బంద్**… ఎస్సీ,ఎస్టీ విభజన, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విబేధాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.దేశంలో వివిధ సమస్యలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్‌ అల్లర్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్‌ హత్యాచార సంఘటనతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి.ఇక రైతులు కూడా తమ డిమాండ్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్‌ బంద్‌కు ఆ సంఘం పిలుపునిచ్చింది.

👉 కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం ఎన్టీవీ విలేఖరి పై దాడి చేసిన టిడిపి కార్యకర్త.. పెద్ద మద్దాలి శివారు కొండాయపాలెం లో ఎన్నో ఏళ్లుగా రైతులు వాడుకునే డొంకదారిని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేసిన టిడిపి సానుభూతిపరుడు ఈ విషయమై ప్రశ్నించగా ఈరోజు విచక్షణారహితంగా ఎన్ టీవీ విలేకరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన మెండ వెంకటేశ్వరరావు, మెండ పిచ్చి శ్వరరావు, పీనమాల వీర మల్లేశ్వరరావు స్థానిక విలేఖరి కార్యాలయంలో ఉండగా అక్కడికి వచ్చి కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి విలేకరిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ మెండ వెంకటేశ్వరరావు, రైల్వే ఉద్యోగి మెండా పిచ్చేశ్వరావు,పినమాల వీరమల్లేశ్వ రావు గాయపడిన విలేఖరి వెంకట్ ను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిక తరలింపు. స్థానిక పామరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు ..

👉 మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు.. లైవ్‌ లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత..మూడా కుంభకోణం వివాదంలో సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్.సంఘటన స్థలంలోనే లైవ్‌లో ప్రాణాలు విడిచిన సీకే రవిచంద్రన్.

👉 ప్రకాశం జిల్లా : ఒంగోలులో నిలిచిపోయిన ఈవిఎం చెక్ అండ్ వేరిఫికేషన్ ..వేరిఫికేషన్ ప్రక్రియ పై అసంతృప్తి వ్యక్తం చేసి వేరిఫికేషన్ ను బాయ్ కాట్ చేసిన వైస్సార్సీపీ అబ్యర్ధి బాలినేని తరుపు ప్రతినిధులు ..బాలినేని తరుపు ప్రతినిధి లోకేష్ రెడ్డి కామెంట్స్* ఎన్నికల అధికారులు చెప్పిన వేరిఫికేషన్ ప్రక్రియ సరైనది కాదు..ఈవిఎం లలో పాత డేటా డిలీట్ చేసి ,డమ్మీ ఏవిఎం లతో మాక్ పోలింగ్ చేసి చూపిస్తామన్నారు..ఆ ప్రక్రియ ను మేము వ్యతిరేకించి బాయ్ కాట్ చేసాము .. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పాత లోడెడ్ ఈవిఎం లనే వేరిఫికేషన్ చేసి ,వివిఫ్యాట్ లను లెక్కింపు జరపమ న్నాము దానికి జిల్లా ఎన్నికల అధికారులు ఒప్పుకోలేదు అందుకే వేరిఫికేషన్ ప్రక్రియ ను బాయ్ కాట్ చేసాముఈ అంశంపై హైకోర్టు లో రిట్ ఉంది..న్యాయపోరాటం చేస్తాం.

👉 వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ ఇంకా సద్దుమణగలేదు. టెక్కలి: ఆయన భార్య, జడ్పీటీసీ దువ్వాడ వాణి ఇంకా దువ్వాడ ఇంటి వద్దే నిరసన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కూతుళ్లకు మేలు జరగడం కోసమే పోరాటం చేస్తున్నానని ఆమె అంటున్నారు. దివ్వెల మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని భార్య వాణి సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఇళ్లు కావాలని, డబ్బులు ఏమీ అవసరం లేదని.. భర్త దువ్వాడతో కలిసి ఉండాలన్నదే తన నిర్ణయం అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో తిరిగినా తాను పట్టించుకోనని, ఇకే ఇంట్లో ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని ఆకాంక్షించారు. తన వల్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రాణాలకు ముప్పు ఉందన్న దువ్వాడ వాణి చేసిన ఆరోపలపై వైసీపీ మహిళా నేత దివ్వెల మాధురి ఘాటుగా స్పందించారు. తాను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను, బై అంటూ పోస్ట్ చేసిన మాధురి మళ్లీ యాక్టివ్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు, వాణికి తన వల్ల ప్రాణహాని ఉందన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. గత రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా చూసుకుంటున్నది తానేనని చెప్పారు. ‘ఈ ఇంట్లో శ్రీనివాస్ తో మాధురి గత రెండేళ్లుగా ఉందని వాణి ఆరోపించారు. నా నుంచి వాళ్ల ప్రాణాలకు ముప్పు నిజం అయితే గత రెండేళ్లుగా దువ్వాడ ఆలనాపాలనా చూసుకున్నప్పుడు ఎందుకు ఏ చిన్నహాని జరగలేదు.మనుషుల్ని తీసుకొచ్చి, బలవంతంగా ఇంటి డోర్లు పగలగొట్టి రచ్చ రచ్చ చేసింది ఎవరు. మాధురి ఇక్కడ ఉంటే ఒప్పుకోనని వాణి అంటున్నారు. ఇంట్లో ఉండవద్దని నా మీద కామెంట్స్ చేసినందుకు స్పందిస్తున్నాను. ఇంటి స్థలం ఓనర్ కు దువ్వాడ శ్రీనివాస్ రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దువ్వాడ సోదరుడు కూడా సాయం చేశారని చెప్పారు. నేను కూడా దువ్వాడకు రూ.2 కోట్ల వరకు ఇచ్చాను. నాకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లు దువ్వాడ వాణి ఇచ్చి ఆమె ఇంటిని తీసుకోవాలి. ఆ ఇల్లు ఖాళీ చేసి రూ.6 కోట్లతో శ్రీనివాస్ ఇల్లు కట్టించి, ఆ ఇంట్లో సకల భోగాలు కల్పించి ఆయన రోడ్డునపడ్డారు. ఆ ఇంటికి ఆమె వెళ్లిపోయి, లీగల్ ప్రొసిడింగ్స్ చేస్తే ఏ సమస్యా లేదు

👉సీఎం గ్రీన్ సిగ్నల్.. నాగబాబుకు కీ పోస్ట్???..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడిక ఆయనకంటూ ఓ పదవి ఉండాలని భావించిన తమ్ముడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టబోతున్నారట. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన నుంచే ఉన్నారు.. ఇక ఈ కార్పొరేషన్ కూడా ఇదే పార్టీ నుంచి ఉంటే బాగుంటుందని. పైగా సినిమా ఇండస్ట్రీకి దగ్గర మనిషి, కావాల్సిన మనిషి కావడంతో నాగబాబుకు ఇవ్వాలని సీఎంను కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో మెగా బ్రదర్స్ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతున్నారట. వాస్తవానికి టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకే దక్కబోతోందని అప్పట్లో పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే అదంతా అబద్ధమే అని తేలింది. ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ అని కూడా వార్తలు రాగా అబ్బే అదీ అవాస్తవమే కొట్టి పారేసింది జనసేన. తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే. నామినేటెడ్ పదవుల పంపకం వరకూ వేచి చూడాల్సిందే మరి.

👉 మంకీపాక్స్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌. మంకీపాక్స్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు. తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదన్న అధికారులు. మంకీపాక్స్‌ నివారణ చర్యల్లో మెడికల్‌ కిట్స్‌, మందులు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచాలన్న మంత్రి. మంకీపాక్స్‌ వల్ల ప్రజలు భయపడాల్సినవసరం లేదన్న మంత్రి దామోదర.

👉వేణుస్వామి ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టిచంపండి:* జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి*తాను వేణుస్వామిని రూ.5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని జర్నలిస్ట్ మూర్తి సవాల్ విసిరారు.ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టి చంపండి. సాక్ష్యం లేకపోతే వేణుస్వామిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. నా 30 ఏళ్ల జర్నలిజంలో ఏ ఒక్కరినీ రూపాయి అడగలేదు.ఉమ్మడి ఏపీలో గవర్నర్ ND తివారీ స్టోరీని బయటపెట్టింది నేనే. అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా?’ అని ఫైరయ్యారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం