అదానీకి వ్యతిరేకంగా నేడు టీపీసీసీ నిరసన..ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశం..కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్..నారాయణ కళాశాలలో విద్యార్థి అదృశ్యం.. సీఎంని కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..*ఎల్ కోటలో ఈ పంట నమోదు..*భవిత కేంద్రానికి కుర్చీల బహుకరణ.

👉 అదానీకి వ్యతిరేకంగా నేడు టీపీసీసీ నిరసన..
అదానీకి వ్యతిరేకంగా నేడు టీపీసీసీ నిరసన
అధిష్ఠానం పిలుపు మేరకు ఇవాళ ఉదయం10 గంటలకు అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ వ్యవహారల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
👉అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ఆకాశాన్నంటుతున్న కార్మికుల ఆర్తనాదాలు..
*రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటికే 18కి చేరిన మృతుల సంఖ్య.. ప్రమాద సమయంలో షిఫ్ట్‌లో దాదాపు 380 మంది కార్మికులు ఉన్నట్లు చెప్తున్న అధికారులు..
*రియాక్టర్‌ పేలుడుతో కూలిన మొదటి అంతస్తు శ్లాబు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు..
👉 ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశం.. బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించి  వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చి చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను, సిఎం చంద్రబాబు ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉 18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్
18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్
అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 18 మంది మృతి తనను కలచివేసిందని అన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.

👉 కడపలో  విద్యుదాఘాతం ఘటనపై స్పందించిన – మంత్రి నారా లోకేష్ ..విద్యుదాఘాతంతో చిన్నారి మృతి ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది.గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలి.మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
👉ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల నేపథ్యం లో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షను APPSC వాయిదా వేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

👉సుప్రీం సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు..కోల్‌కతా ఘటనపై 11 రోజులుగా వైద్యుల ఆందోళన..సీజేఐ సూచనతో ఆందోళన విరమించిన ఎయిమ్స్ వైద్యులు..వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలుతీసుకుంటుంది-సుప్రీం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాం-సుప్రీం
👉ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 వద్ద నవోదయ స్కూలుకు వెళ్ళు నీటి పైపు లైన్ శంకుస్తాపన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , నగర మేయర్ గంగాఢ సుజాత, అయినాబత్తిన ఘనశ్యామ్ తాతా ప్రసాద్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, యాజమాన్యం మరియు తదితర నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉 సినీ హీరో పద్మవిభూషన్ డా.మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా ఒంగోలులో క్రొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా నున్న రెడ్ క్రాస్ సొసైటీలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత నిర్వహించిన ఉచిత రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , నగర మేయర్ గంగాఢ సుజాత , మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీ మంత్రి శ్రీనివాస రావు, అయినాబత్తిన ఘనశ్యామ్ తాతా ప్రసాద్ , కార్పొరేటర్ రమేష్, ఉమ్మడి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన నాయకులు, ఆడుసుమల్లి వెంకట్రావు, జడ బాల నాగేంద్రం, కరిముల్లా తదితర నాయకులు చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉 ఒంగోలులో ప్రకాశం భవనంలో జాయింటు కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుపై జరిగిన సమావేశం లో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాల కృష్ణ , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , నగర మేయర్ గంగాఢ సుజాత , మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస రావు , అయినాబత్తిన ఘనశ్యామ్,తాతా ప్రసాద్ మరియు తదితర అధికారులు, నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


👉కోల్కతా సీబీఐ టీంలో ఒక్కరు కాదు.. ఇద్దరు లేడీ సింగంలు..
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన విచారించే సీబీఐ బృందంలో ఇద్దరు కీలక మహిళా అధికారులకు అప్పగించారు. హత్రాస్, ఉన్నావో వంటి సంచలనాత్మక కేసుల్లో దర్యాప్తు సాధించిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు.. ఈ కేసు విచారణ చేపట్టనున్నారు. జార్ఖండ్ కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంపత్ మీనాతోపాటు హక్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా అహుజా కూడా ఈ కేసులో భాగం కానున్నారు. సంపత్ మీనా సీబీఐ అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె 25 మంది అధికారులు బృందానికి బాధ్యత వహిస్తారు. సంపత్ మీనా 2007 నుంచి పలు కేసుల్లో విచారణ చేపట్టి రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. కాగా, మరో అధికారి సీమా అహుజా కోల్ కతా ఘటనలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు.
👉 నారాయణ కాలేజీ విద్యార్థి అదృశ్యం.. లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి కుమారుడు హరినాథ్ రెడ్డి వయసు 17 సంవత్సరాలు హిందూపురం నందు గల నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అయితే నిన్నటిదినం ఉదయం కాలేజీకి వెళ్తానని చెప్పి కల్లూరు నుండి ఆటోలో వెళ్లి హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద దిగి కాలేజీకి వెళ్లకుండా, తిరిగి ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ విషయమై ఈ దినం సాయంత్రం తండ్రి శంకర్ రెడ్డి ఫిర్యాదు మీదకు మిస్సింగ్ కేసు నమోదు చేయడమైనది.

👉కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్..*వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం..*ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి..*సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..*రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని సూచన*
*అమరావతి:* కడపలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని వివరించాలని మంత్రి కోరగా… స్పందించిన అధికారులు ఈ ఘటనకు స్థానిక కేబులు ఆపరేటర్ కారణం అని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్ లాగడానికి ప్రయత్నించిన తరుణంలో  విద్యుత్ తీగ కిందపడినట్లు వివరించారు. కేబుల్ ఆపరేటర్ ముందస్తు సమాచారం అందించి ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. అయితే తీగ తెగిపడిన సమయంలోనే దురదృష్టవశాత్తు పిల్లలు అదే దారి వెంబడి రావడంతో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి కోరారు. ముఖ్యంగా తీగలు వేలాడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి వాటికి మరమత్తులు చేయాలని చెప్పారు. కడప ఘటన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి… ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం తనను కలిచి వేసిందని అన్నారు. ప్రమాదం జరిగాక పరిహారం ఇవ్వడం కంటే.. ఘటనలు జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
👉ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
శ్రీశైలం ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర రెడ్డి  బుధవారం సచివాలయంలోని సీఎంవో కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ని కలిసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు.
ఆత్మకూరు పురపాలికలో ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు రూ.116 కోట్లతో చేపట్టిన నాన్ అమృత్ పథకం పనుల వేగవంతం, సున్నిపెంట గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కారం మరియు ఇతర నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు విన్నవించారు. తక్షణమే స్పందించిన  ముఖ్యమంత్రి  త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

* ఎల్ కోట లో ఈ పంట నమోదు..మండలంలోని ఎల్ కోట గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి డి స్వరూప ఈ పంట నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. దీనిలో భాగంగా వరి మొక్కజొన్న కంది మిరప మొదలైన పంటల్లో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు 60 ఎకరాలు బరి క్రింది 50 ఎకరాలు మిరప 30 ఎకరాలు మొక్కజొన్న 30 ఎకరాలు సాగు చేస్తున్నట్టుగా సమాచారం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఎల్కోట గ్రామ ప్రజలకు పంట నమోదు గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. ఈ పంట నమోదు సెప్టెంబర్ నెల 15వ తారీకు లోపు ముగియనున్నది కాబట్టి రైతులందరూ త్వరగా తామవేసిన పంటను వాటి వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేసి సత్వరమే ఈ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ నమోదు వలన ప్రభుత్వ పథకాలకు సంబంధించి వ్యవసాయ శాఖ పరిధిలో అన్నింటిలోనూ అర్హత కల్పించడం జరుగుతుందన్నారు. కాబట్టి కంభం మండలంలోని వివిధ గ్రామాలలోని రైతు సోదరులు అందరూ త్వరితగతిలో ఈ నమోదు కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరారు.

*భవిత కేంద్రానికి కుర్చీలు బహుకరణ..కంభం  :స్థానిక బోర్డు స్కూల్లోని భవిత కేంద్రానికి సదరు పాఠశాల విద్యార్థి తల్లి షేక్.ఫర్జానా కుర్చీలను బహుకరించారు.ఈ సందర్భంగా ఎంఈఓ-2 కె.శర్వాణి మాట్లాడుతూ భవిత కేంద్రానికి అవసరమైన కుర్చీలను బహుకరించడం అభినందనీయమని,దివ్యాంగ చిన్నారులు దైవంతో సమానమనీ వారిపట్ల ఆప్యాయత అనురాగాలను కలిగివుండాలని అన్నారు. అనంతరం దివ్యాంగ చిన్నారి సయ్యద్.చోటా మస్తాన్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు.బోర్డు స్కూల్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను,చతుర్విధ ప్రక్రియలపై వారి అవగాహనను పరిశీలించారు. పాఠ్య పుస్తకాలు,రాత పుస్తకాలను చినిగిపోకుండా జాగ్రత్తగావుంచుకోవాలనీ ,వర్క్ బుక్స్ తప్పులు లేకుండా వ్రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు మురళీమోహన్,రవీంద్ర నాయక్,అకౌంటెంట్ రామచంద్రుడు, ప్రధానోపాధ్యాయుడు.వి.వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఈశ్వరి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం