👉కూటమికి తొలి సెగ : కదం తొక్కుతామంటున్న వాలంటీర్లు టీడీపీ ప్రభుత్వం పాలన అక్షరాలా రెండున్నర నెలలు మాత్రమే పూర్తి చేసుకుంది. వాలంటీరే అని కరివేపాకులా తీసిపారేస్తే వారే ఉద్యమిస్తారు లక్షలుగా మారి పోరాటం చేస్తారని ఉరుముతున్నారు. జస్ట్ అయిదు వేల రూపాయలు గౌరవ వేతనానికి పనిచేసే వాలంటీర్లు ఇపుడు ఎంతో బలమైన తీర్పుతో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మీద సమర శంఖం పూరిస్తున్నారు.టీడీపీ ప్రభుత్వం పాలన అక్షరాలా రెండున్నర నెలలు మాత్రమే పూర్తి చేసుకుంది.అంటే హానీమూన్ పీరియడ్ సాగుతోంది అన్న మాట. అయితే వాలంటీర్లు ఆ సమయం కూడా ఇవ్వడం లేదు.ఉద్యమిస్తామని కచ్చితంగా చెప్పేస్తున్నారు. మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆగస్టు నెలాఖరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలకమైన నిర్ణయాలే తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.ఏపీలో వాలంటీర్లు రెండున్నర లక్షల మంది ఉన్నారు. వీరిలో రాజీనామా చేసిన వారు కూడా ఉన్నారు.అయితే అంతా ఇపుడు ఒక్కటి అవుతున్నారు. రెండున్నర లక్షల మంది అంటే వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే పది లక్షల మంది దాకా అవుతారు.ఎన్నికల రాజకీయాలు ఓట్ల వేటలో ఇది అత్యంత బిగ్ నంబర్ గానే చూడాలి.ఇంతకీ వాలంటీర్ల బాధేమిటి ఆవేదన ఏమిటి అన్నది చూస్తే కనుక వారికి నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి కూటమి పెద్దలు ఎన్నికల్లో ప్రచారం చేశారు.చెప్పకేమి కానీ వైసీపీ నియమించిన వాలంటీర్లు అంతా ఆ మాటలకు టర్న్ అయి కూటమి గెలుపుకే పనిచేశారు.అలా తమకు బతుకులు ఇచ్చి ఈ వ్యవస్థను సృష్టించిన వైసీపీ ఓటమికి బాటలు వేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ కూటమి సర్కార్ వాలంటీర్ల ఊసే తలవడం లేదు. వారి అవసరం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీరుని నియమించించి గత వైసీపీ ప్రభుత్వం. అయితే వాలంటీర్లు అందించే పౌర సేవలలో వృద్ధులకు పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చే కార్యక్రమం హైలెట్ గా నిలిచింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పనులను సచివాలయం పర్మనెంట్ సిబ్బంది తో చేయిస్తోంది.జూలై ఆగస్టు నెలలలో ఇలాగే చేసింది. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ సాగుతోంది. వారికి ఏ సంగతీ చెప్పకుండా పక్కన పెట్టేశారు అని అంటున్నారు.అంతే కాదు జూన్, జూలై ఆగస్టు నెల జీతాలు కూడా ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా వీరావేశంతో కదం తొక్కుతున్నారు. మాకు ఇచ్చిన హామీ మేరకు పాత బకాయిలు చెల్లిస్తూ నెలకు పదివేల వంతుజ గౌరవ వేతనం చెల్లించాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 28న మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతున్నారు.ఒక వేళ అలా తీసుకోకపోతే మాత్రం ఆగస్ట్ 31న రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని ఆ మీదట తమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మరి బాబు సర్కార్ ఏమి చేస్తుందో అని అంతా చూస్తున్నారు. వాలంటీర్లే కదా అని లైట్ తీసుకుంటే మేమేంటో చూపిస్తామని అంటున్నారు. వారి విషయంలో కూటమి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
👉 ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తుది విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
👉 ఢిల్లీలో సీఎం రేవంత్.. అధిష్టానంతో
కీలక భేటీ!..సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకొనసాగుతోంది.
ఈరోజు కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ,
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రి. వర్గ విస్తరణ,నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో
చర్చించనున్నారు.
👉మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను వదలడం పై ప్రభుత్వం సీరియస్*
*పశువులు,పెంపుడు కుక్కల వలన వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు..పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి..రోడ్లపై సంచరించే పశువులు,పెంపుడు కుక్కలను మున్సిపాలిటీకి తరలించి యజమానులకు జరిమానా వేస్తాం..పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ…*
👉పోలీస్ శాఖకు రావలసిన బకాయిలు పెండింగ్…!
గత ప్రభుత్వంలో పోలీస్ శాఖకు మొండి చేయి చూపించారు…నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ శాఖ పై దృష్టి పెట్టారు…నేటికీ రెండు సరెండర్లు, టి.ఏ లు, జిపిఎఫ్ లు, డి.ఎ ఎరియర్స్ గురించి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది…దీనిపై పోలీస్ శాఖ వారు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తునట్లు సమాచారం.
పోలీస్ శాఖలకు సంబదించిన నిధులు విడుదల చేస్తే వారి కాళ్ళలో ఆనందం చూడవచ్చు.
👉డీజీపీ జితేందర్ ని కలిసిన జర్నలిస్టులు*
డీజీపీ జితేందర్‌ను మహిళా జర్నలిస్టులు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కలిశారు. నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్ లపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు.దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందేశారు.కాగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది..
👉ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురు అరెస్ట్..హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురిని మల్కాజ్‌గిరి SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసిన నిందితులు. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముఠా ను చివరగా పోలీసులు అరెస్ట్ చేసారు.
👉గంజాయి మత్తులో బాలిక గొంతు కోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి మహబూబ్ నగర్ – శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక పార్కులో ఆడుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు.రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.గంజాయి మత్తులో చెవి కమ్మల కోసం గొంతు కోసినట్లుగా సమాచారం.
👉 యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేసిన స్నేహితులు..బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన స్నేహితులు.హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించిన తల్లి..
👉 గిద్దలూరు పట్టణంలో రాచర్ల గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి సంబంధించి రైల్వే గతి శక్తి, రెవిన్యూ, విధ్యుత్, మునిసిపాలిటి, రోడ్డు భవనాల శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్స్పెక్షన్ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ నోయెల్, అసిస్టెంట్ ఇంజనీర్ గోపాల్ రెడ్డి, ఆర్ &బి ఎస్. సి , తహసీల్దార్ ,మునిసిపల్ కమిషనర్, ఎలక్ట్రికల్ ఎ. డి లు పలువురు అధికారులు.
అనంతరం గిద్దలూరు లోని SS ఫంక్షన్ హాల్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
👉తమ్మిశెట్టి వారి వివాహ మహోత్సవానికి హాజరైన మాజి ఎమ్మెల్యే అన్నా..
మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో తమ్మిశెట్టి శ్రీనివాసులు,లక్ష్మీదేవి గార్ల కుమారుడి వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులను ఆశీర్వదించినారు.👉 పిమ్మట మార్కాపురం టౌన్ తిరుమశెట్టి వీరయ్య, ఆదిలక్ష్మి ల కుమారుడి వివాహానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన మధులక్ష్మన్,నాగ శేషాంద్రిణి లను ఆశీర్వదించినారు. అనంతరం👉కొమ్మతోటి వారి వివాహ మహోత్సవానికి హాజరు అయిన మాజి ఎమ్మెల్యే అన్నా* .. బిరుదుల నరవ గ్రామంలో కొమ్మతోటి వెంకటయ్య, వెంకటమ్మల కుమారుడి వివాహానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన మల్లికార్జున,భూలక్ష్మి లను ఆశీర్వదించినారు .
👉ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం*
*బెస్తవారిపేట గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి రూ.15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని, గ్రామాలను అన్నీ రంగాలలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే, గ్రామాలను అభివృద్ధి చేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని ఎన్డీయే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.. బేస్తవారిపేట పంచాయతీలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి తెలియచేయగా వాటిని వెంటనే పరిష్కారం చేయాలని, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట పంచాయతీ గ్రామ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజలు పాల్గోన్నారు.*
👉 కంభం గ్రామపంచాయతీలో గందరగోళం.. కందులాపురం పంచాయతీలో గుట్టుచప్పుడు కాకుండా సభలో నిర్వహిస్తున్నారని ఆరోపణ..
చప్పుడు కాకుండా గ్రామసభలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు..మన పంచాయతీ మన సాధికారత పేరుతో కంభం మండలం కంభం కందులాపురం గ్రామ పంచాయతీలలో శుక్రవారం జరిగిన గ్రామసభలలో ప్రజలు పలు విషయాలపై అధికారులను నిలదీశారు . గ్రామంలో ఎటువంటి అనౌన్స్మెంట్ గాని టాం టాం చేయడం గానీ చేయకుండా ప్రజలకు, వార్డు మెంబర్లకు సైతం గ్రామసభల గురించిన వివరాలు తెలియకుండా సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.. రోడ్లు డ్రైనేజీల సమస్యలపై కంభం గ్రామపంచాయతీలో టిడిపి నాయకులు అధికారులను నిలదీశారు.. మూడేళ్ల క్రితం వేసిన రోడ్లమీద తిరిగి రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పెట్టడంపై సభలో రసాభాస జరిగింది. కంభం,కందులా పురం గ్రామపంచాయతీలలో పంట కాలువలను ఆక్రమించి ప్లాట్లు వేసినా అధికారులు పట్టీపట్టకుండా వ్యవహరిస్తున్నారని టిడిపి నాయకులు కేతం శ్రీనివాసులు ఆరోపించారు.. దీంతో డ్రైనేజీలలోని మురికి నీరు పలు వీధులలోని ఇళ్ల వద్ద నిలిచిపోయి దుర్గంద భరితంగా మారుతున్నాయని,దోమలు తీవ్రంగా వ్యాపించడం ద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో కుక్క ల దాడులతో ప్రజలు హడలిపోతున్నారని ఆరోపించారు.సభలలో కేవలం ప్రజా ప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్త్ వర్కర్లు తప్ప ఎక్కువ మంది ప్రజలు కాన రాలేదు.
👉గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి – నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా పనిచేస్తా : ఎరిక్షన్ బాబు..
*యర్రగొండపాలెం పట్టణంలోని మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదికారులు ఉపాధి హామీ పనుల కల్పన ఆవశ్యకత గురించి గ్రామస్తులకు తెలియజేశారు…
ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులలో ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై తన సాయశక్తుల పనిచేసే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు…
👉అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలోని వైద్య సదుపాయాలు, వైద్యశాల లోని వివిధ విభాగలను పరిశీలించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు*.