👉 నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉంటే మీరే కూల్చేయండి *కేటీఆర్, హరీశ్ లకు* *మంత్రి పొంగులేటి సవాల్!!👍 తన ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉన్నట్టు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు చేసిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. హిమయత్ సాగర్ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉందని బీజేపీ నేతలు కూడా అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాను హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నానని, తనది అక్రమ నిర్మాణం అయితే తక్షణం కూల్చివేయాలని ఆదేశిస్తున్నానని చెప్పారు. తాను కేటీఆర్, హరీశ్ తో పాటు బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్నానని, వారు కూడా హైడ్రా అధికారులతో వెళ్లి తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమో..కాదో నిర్ధారించాలని ఆయన పేర్కొన్కారు.
👉కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ..కల్యాణ లక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,225.43కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,175కోట్లు కేటాయించింది*అందులో నుంచి 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లకు నిధులు రిలీజ్ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు*.
👉 ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ కాలనీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ రోడ్ల,భవనాల& సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , దేవాదాయ ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ కాలనీ జాయింట్ సెక్రెటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
👉తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రజా ప్రభుత్వం*» జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం, గోధుమల పంపిణీ.» సబ్సిడీ గోధుమలు, బియ్యాన్ని నల్ల బజారులో అమ్మే రేషన్ డీలర్ల లైసెన్స్ రద్దు మరియు భారీ జరిమానా విధింపు.» రేషన్ దుకాణాల్లో ఉన్న1629 ఖాళీల భర్తీకిఆమోదం..
👉షాద్ నగర్ ఇలాఖాలో గుట్టుగా వ్యభిచారం..!?.. *కొన్ని లాడ్జిల్లో ప్రత్యేక వెసులు బాట్లు..*…వ్యభిచారం నేపథ్యంలోనే ఆ మర్డరా..?*..ఆమె జాబితాలో షాద్ నగర్ ప్రముఖులు..?*…షాద్ నగర్ – శంషాబాద్ కేంద్రాల్లో అడ్డాలు..* మినీ ఇండియాగా పేరు గాంచిన షాద్ నగర్ ఇలాకాలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగుతుందని సమాచారం. ఈ మధ్యకాలంలో పట్టణంలో ఓ మహిళ హత్యకు గురైన విషయం విధితమే. సదరు మహిళ కూడా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపేదని పట్టణంలో పుకార్లు షికారులు చేస్తున్నాయి. షాద్ నగర్, శంషాబాద్ కేంద్రాలను అడ్డాలుగా మార్చుకొని సదరు మహిళ వ్యభిచారం నడిపినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు షాద్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు ఈమె లిస్టులో ఉన్నట్టు విశ్వసియంగా తెలుస్తోంది. స్థానికంగా ఎంతో కాలంగా ఈ వ్యభిచారం నేపథ్యంలో ఈమెపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. సదరు మహిళ వద్దకు బడా బడా నేతలతో పాటు యువకులు పెద్ద ఎత్తున వచ్చేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. చాలాకాలంగా గుడ్డు చప్పుడు కాకుండా ఈ తతంగం నడుస్తున్నప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ అప్పట్లో పట్టించుకోలేదని సదరు మహిళ హత్యకు గురికావడం, ఈ నేపథ్యంలో హత్య ఎందుకు జరిగింది? ఏమిటా కథ? దాని వెనుక ఉన్న కారణాలు కూడా ఇప్పటివరకు పోలీసులు గుట్టు విప్పలేదు. అయితే సదరు మహిళా కేసులో ఒకరిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు సమాచారం. మీడియాకు కూడా ఆ సమాచారం ఇవ్వలేదు. నియోజకవర్గంలోని పేరు మోసిన నాయకులు ఈమె జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఆమె హత్య వెనుక ఏం జరిగింది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఫలానా మనిషి చనిపోయింది అంటే ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసి ఆమెపై అనేక సార్లు సమాచారం ఇచ్చామని ఎవరు పట్టించుకోలేదని ఇప్పుడు చెబుతున్నారు. స్థానికంగా ఈ దందా నడపడంతో పాటు శంషాబాద్ లో కూడా ఒక అడ్డాను మెయింటెన్ చేసినట్టు చెబుతున్నారు. సదరు మహిళ మృతి సమాచారం తర్వాత చాలామంది బడా నేతలు నెత్తి పట్టుకున్నట్టు సమాచారం. ఆమెతోపాటు ఆమె భర్త ఫోన్లలో ప్రముఖుల నంబర్లు పెద్ద ఎత్తున ఉండడం వారితో సంభాషణలు ఇతర చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. భార్యాభర్తలకు తెలిసే ఈ వ్యాపారం కొనసాగించినట్లు పక్కా సమాచారం. చుట్టుపక్కల వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినా కూడా వారిని ఏం చేయలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే మినీ ఇండియాగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇలాగే అనేక చోట్ల గుర్తుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుస్తున్నట్టు సమాచారం. అనేక ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ జీవిస్తున్నారు బతుకుతెరువు కోసం ఇక్కడ ఎంతోమంది యువకులు యువకులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాచిలర్స్ ఇలాంటి అవసరాల కోసం వేశ్య గృహాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తతంగాన్ని పలు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని పలువురు అంటున్నారు. స్థానికంగా ఇలాంటి కార్యకలాపాలకు ఓ లాడ్జి అడ్డాగా చెబుతున్నారు. యువతీ యువకులకు మహిళలకు ప్రత్యేకంగా ఇలాంటి వాటికి వసతి కల్పిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వ్యభిచార కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా వేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఓ మసాజ్ సెంటర్లో ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ అప్పటి ఏసిపి కుషాల్కర్ మసాజ్ పార్లర్ ను షాద్ నగర్ లో సీజ్ చేసిన దాఖలాలు లేకపోలేదు.
👉వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు..ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ వాదనకు కౌంటర్.. ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు..కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు..ప్రజలు ఇస్తే హోదా.. గెలిపిస్తే పదవి వస్తాయి..నేరాలు, బెదిరింపులతో హోదా, పదవులు రావు.
👉 నంద్యాల జిల్లా డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇండియన్ పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి వాచ్మెన్ పై దాడి
👉 అనిల్ అంబానీపై సెబీ వేటు…రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కఠిన చర్యలు..*ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం… కుప్పకూలిన రిలయన్స్ గ్రూప్ షేర్లు..మరో 24 సంస్థలపైనా చర్యలు రూ.25 కోట్ల జరిమానా.. పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు మరో 24 మందికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆయనపై ఏకంగా రూ.25 కోట్ల జరిమానా విధించింది. దీనికి తోడు ఆయన ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ కాలంలో అనిల్ ఏ లిస్టెడ్ కంపెనీలో గానీ, సెబీ వద్ద నమోదైన సంస్థల్లో గానీ ఎటువంటి డైరెక్టర్ లేదా కీలక మేనేజ్‌మెంట్ పదవులు (కేఎంపీ) చేపట్టకూడదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం కథ ముగిసినట్టేనని భావిస్తున్నారు. భారత కార్పొరేట్ చరిత్రలో సెబీ ఒక పారిశ్రామికవేత్తపై ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే మొదటిసారి. కాగా ఈ విషయంపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఇంతవరకు స్పందించలేదు
👉మార్కాపురం గిద్దలూరు కంభం, మండలాలలోని బిఈడి ,డి ఈ డి కళాశాలలో జోరుగా కొనసాగుతున్న విద్యా వ్యాపారం .. విద్యార్థులు కేవలం పరీక్షలకు హాజరైతే చాలు.. లక్షలకు లక్షలు దోచుకుంటున్నా యాజమాన్యాలు స్థానిక విద్యార్థులకు దొరకని సీట్లు.. ఒరిస్సా బీహార్ యూపీ తదితర ప్రాంతాల నుండి వలస వస్తున్న విద్యార్థులు .. కన్నెత్తి చూడని అధికారులు..
👉 కులం టార్గెట్ కాకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు* ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు జరిగిన ప్రతీ అవమానం, బెదిరింపు వ్యాఖ్యలు ఆ వర్గాలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ పీబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఒక కేసులో ఈ చట్టానికి సంబంధించి వ్యాఖ్యానం చేసింది. మరునాదన్ మలయాళీ యూట్యూబ్ చానెల్ ఎడిటర్ షాజన్ షకీరాపై ఇదే చట్టం కింద నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కేరళ ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోను అప్‌లోడ్ చేశారన్నది షాజన్ షకీరా మీద అభియోగం.బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అన్న ఒకే ఒక కారణంతో అవమానించిన వాడి మీద సదరు చట్టం వాడటం కుదరదని జస్టిస్ పార్థీవాలా స్పష్టం చేశారు.
👉 ఆధిపత్య పోరే ముంచిందా? ఎసెన్షియా భాగస్వాముల మధ్య విభేదాలు..74% వాటా కొన్న డెక్కన్ కెమికల్స్‌కు నో ఎంట్రీ..ట్రైబ్యునల్ తీర్పునూ ఖాతరు చేయని నిర్వాహకులు.. అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగడానికి సంస్థ భాగస్వాముల మధ్య విభేదాలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రుడే ఈ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన పేరు పెండ్రి యాదగిరిరెడ్డి. తానే సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కోరాడ శ్రీనివాసరావు సీఎ్‌ఫఓగా ఉన్నారు. పెండ్రి కిరణ్‌రెడ్డి, దండు చక్రధర్, అజిత్ అలెగ్జాండర్, వివేక్ వసంత్ డైరెక్టర్లు. ఈ కంపెనీలో 74 శాతం వాటాను డెక్కన్ కెమికల్స్ సంస్థ ఇటీవల కొనుగోలు చేసింది. అయితే వారిని సంస్థ ఆవరణలోకి కూడా రానీయడం లేదు. దీనిపై డెక్కన్ ప్రతినిధులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ ఆదేశాలను కూడా ఎసెన్షియా యాజమాన్యం పక్కన పెట్టేసింది. తమకు కంపెనీలో ఉన్న వాటా ప్రకారం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను నియమించుకునే హక్కుందని, కానీ అసలు పరిశ్రమ ఆవరణలోకే రానీయడం లేదని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డెక్కన్ కెమికల్స్ ప్రతినిధులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కంపెనీలో ఏమి జరుగుతున్నదో తమకు తెలియదని, నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడం లేదని వారు ఆరోపించారు. అంటే తాజాగా జరిగిన ప్రమాదానికి, తమకు ఎటువంటి సంబంధం లేదని వారు పరోక్షంగా తెలియజేశారు
👉 జియో యూజర్లకు బిగ్ అలర్ట్..!!!జియో యూజర్లకు బిగ్ అలర్ట్ ప్రేమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న మెసేజ్‌లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్‌లు వచ్చినా వాటిని క్లిక్ చేయొద్దని పేర్కొంది. థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవొద్దని సూచించింది. అలాగే సిమ్ కార్డు వెనుక ఉండే 20 డిజిట్స్ నంబర్ ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది.
👉హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం.. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న అధికారులు.. 👉తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు.మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు..
👉మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు..మచిలీపట్నం లో వెలుగులోకి వచ్చిన కామాంధుడి ఘటన.. మైనర్ ఆడ పిల్లలే ఇతని టార్గెట్..కామాంధుడి పిచ్చి చేష్టలు, పైసాచికత్వంతో భయపడుతున్న మైనర్ బాలిక ..పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఇంటి వద్దనే ఉంటున్న బాలిక….ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్న సూర్యదేవర కన్నా జాషువా (50)… వేధింపులు తట్టుకోలేక మీడియాను ఆశ్రయించిన మైనర్ బాలిక..మైనర్ బాలికకు తండ్రి లేడు తల్లి దివ్యంగురాలు.. తొమ్మిదో తరగతి నుంచి ప్రేమ,పెళ్లి అంటూ వేధిస్తున్న కన్న జాషువా.. హైనీ స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూర్యదేవర కన్న జాషువా స్కూల్ లో అనేక మంది ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణమీడియా ముందుకు రావడానికి భయపడుతున్న బాలికలుగతంలో గుడివాడకు చెందిన బాలిక ఇతని వేధింపులు తట్టుకోలేక మచిలీపట్నం హాస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన వైనంకామాంధుడు నుండి రక్షణ కావాలంటూ కన్నీటి పర్యంతమైన మైనర్ బాలిక……కామాంధుడి పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.
👉కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో *విలువైన వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలికి వజ్రం దొరికింది. అదే పనిగా వజ్రాల వేటలో ఉన్నవారికి కూడా దొరకని విలువైన వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి 12 లక్షల రూపాయల నగదు.. 5 తులాల బంగారం ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.
👉 నారాయణగూడ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ సోదాలు.రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అడిట్ ఆఫీసర్ వసంత ఇందిరా.