👉ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం..
*పార్టీ ని ప్రజలోకి తీసుకెళ్లాలని నేతలకి బాబు ఆదేశాలు..*కార్యకర్తలతో భేటీ కానున్న చంద్రబాబు .*పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు..కమిటీలన్నీ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు* ప్రభుత్వంపై తక్షణమే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని నాయకులకు దశా నిర్దేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు *జిల్లాల వారీగా అడహక్ కమిటీలు వేసుకోవాలని ఆదేశాలు ..తక్షణమే పార్టీ సభ్యత్వలు నమోదు చేయాలనీ నిర్ణయం..*అధ్యక్షుడు నియామకంపై అవకాశం ఉన్నంత త్వరగా నిర్ణయిస్తానని తెలిపిన చంద్రబాబు..
👉హైడ్రా కూల్చివేతలను మేము స్వాగతిస్తున్నాము… “సిపిఐ రాష్ట్ర నాయకులు కె నారాయణ” కామెంట్స్…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలు కాలువలనుబడా బాబులు కబ్జా చేసి కట్టడాలు నిర్వహించారు..
పోరంబోకు భూములు, చెరువులు ట్యాంకులు ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణాలు చేపట్టారు..
గతంలో మేము ఎన్నో పోరాటాలు చేసాము అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది..చెరువులు, కుంటలు నాళాలు ఖాళీ చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు..
ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున.. బిగ్ బాస్ కే బాస్…నాగార్జున సినిమా యాక్టర్ కావచ్చు…
సినిమాల నటించడంతోపాటు బిగ్ బాస్ లోనే వందల కోట్ల వస్తాయి..నాగార్జునకు ఎందుకు అంత కక్కుర్తి ..చెరువు ఎఫ్ టి ఎల్ లో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి..
చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ లో సంపాదించిన డబ్బును కక్కించాలి..నష్టపరహారం కూడా కట్టించాలి..అలా వచ్చిన డబ్బులతో పేదవారికి ఇల్లు కట్టించాలి..మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కబ్జాకోరు ఆయనతో పాటు మరి కొంతమంది కబ్జా కొరులు ఉన్నారు..పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల కబ్జాలకు పాల్పడుతున్నారు..హైదరాబాదులో నాళాలు చెరువుల కుంటలు, కబ్జాలు కావడంతో పదినిమిషాలు వర్షం పడితే నగరం నరకంగామారుతుంది.. మధ్యతరగతి పేదవారు నోటరీ భూముల్లో
ఇల్లు కట్టుకున్నారు..అలాంటి వారికి రెగ్యులర్ చేయండి..కానీ అలాంటి వారి పొట్ట కొట్టమాకండి..
సి.ఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దు..పారదర్శకంగా వ్యవహారించాలి..ఏ పార్టీ వారైన అక్రమ నిర్మాణం చేపట్టిన కూల్చి
మేము కూడా హైడ్రా కట్టడాలను కూల్చివేతను పరిశీలిస్తాము..కబ్జా కొరులు ఎం.ఐ.ఎం పార్టీ నేతలు ముందు అలాంటి వాళ్ళ అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయండి..కోర్టులు కూడా అక్రమ నిర్మాణాల స్టే వ్యవహారంలో ఆచితూచి వివరించాలి..
👉భార్య విపరీతంగా ఖర్చు చేస్తోందని చంపించాడు!
భార్య విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తోందన్న కోపంతో ఆమెను హత్య చేయించాడో భర్త. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని తెలిసిన వాళ్లకు రూ.2.50 లక్షలు సుపారీ ఇచ్చి చంపించాడు. AUG 13న తన భార్య దుర్గావతి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని భర్త హేమంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే CCTV కెమెరాలో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కూపీ లాగి నిందితులను అరెస్టు చేశారు. MPలోని గ్వాలియర్లో ఈ ఘటన జరిగింది.
👉ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసిన కేసులో వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్…అనురాధ, మహేశ్వరి అనే ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం కేసులో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.పెళ్లి పేరుతో మోసం చేశాడని జనవరిలో ఫిర్యాదు చేసిన అనురాధ, మహేశ్వరి. తమపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న అనురాధ, మహేశ్వరి.
ప్రభాకర్ రెడ్డిపై 417, 420, 354A కింద కేసులు నమోదు.గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రభాకర్ రెడ్డి.
👉విజయవాడలో ‘మంకీ పాక్స్’ కలకలం
విజయవాడలో మంకీ పాక్స్ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు.
👉ఏపీలో 100 ఎకరాల్లో స్టూడియో నిర్మాణం?*
ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్రప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి పూనుకుంది. టాలీవుడ్ హీరో, డిప్యూటీ సిఎం కె.పవన్ కళ్యాణ్‌ను ఇటీవల సినిమా పెద్దలు కలిసి వెళ్లారు. వారంతా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణకు అవకాశాలపై చర్చించారు. దీని నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నందిగామాకంచికచర్ల ప్రాంతాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనుందనేది సమాచారం. హైదరాబాద్‌కు నాలుగు గంటల ప్రయాణం, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్, రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం. త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్‌కళ్యాణ్ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తారని తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించిన నామమాత్రపు రుసుంతో స్టూడియో అద్దెకిస్తున్నాయి. ఇదే విధంగా రాష్ట్రంలో స్టూడియో నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
👉***అంబానీ, ఆదానిలకు వందల కోట్లు మాఫీ.. రైతులకు రుణమాఫీ ఏది…!!
ఆర్మూర్.. అదాని, అంబానీ టాటా బిర్లాలకు వందల కోట్ల మాఫీ మరి రైతన్నలకు రుణమాఫీ ఏది అంటూ శనివారం పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ స్కూల్ దగ్గర రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించినారు.
ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు ప్రభాకర్, పి తిరుపతిరెడ్డి ,,లింగారెడ్డి,, దే గం యాదగౌడ్, నూతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏ లాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇప్పటికే జిల్లాల్లో కొద్దిమంది రైతులకు మూడు విడతలలో రుణం మాఫీ అయిందని,, అనేక మందికి రేషన్ కార్డులలో పేరు లేకపోవడం, రుణం బకాయి ఎక్కువగా ఉందని ,ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు వేరువేరుగా ఉన్నాయని కొర్రీలు పెడుతూ రైతన్నలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు ..ఏ పంట అయినా సరే 500 బోనస్ ,,15 వేల రైతు భరోసా సాధించుకోవాలని తెలంగాణ రైతాంగం ఏకమై ఐదు రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు. జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన ఓ రైతు ధరణి సమస్యతో అప్పులతో సతమతమై ఉరివేసుకొని చనిపోయినాడు అని ప్రతి పంటకు రెండు లక్షల రుణమాఫీ రైతు బీమా ప్రభుత్వమే చెల్లించాలని,, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను మోసం చేయడం సరికాదని, రైతన్నలను రోడ్డుమీదికి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రైతన్నలు నష్టపోయారని అన్నారు. రైతన్నలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ లు మాట్లాడుతూ డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 9వ తేదీన అందరికీ రుణమాఫీ చేస్తానని అని రైతులను మోసం చేసినారని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు, ఎద్దు ఏడ్చిన యవసం బాగుపడలేద నీ, ఒక్కరోజు అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అని అంటామని అలాంటి బువ్వ పెట్టే రైతులను ఏడిపిస్తే పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు.
రైతుల కోసం రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని వాన కోసం మొగులుకు మొఖం పెట్టి చూసిండ్రు… కాలమాటే పోయింది రుణమాఫీ అటే అయిపోయింది అని , ఉద్యమ గడ్డ ఏ ఉద్యమం చేసిన ఆర్మూర్ నుంచి మొదలవుతుందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల మీద ఓట్లు వేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది అని అన్నారు. డిసెంబర్లో చెప్పింది రూ. 49 వేల కోట్లు, జనవరి వచ్చేసరికి రూ. 40 వేల కోట్లు, జూలై నాటికి రూ. 31 వేల కోట్లు, చివరికి బడ్జెట్లో ఇచ్చింది రూ. 26 వేల కోట్లు చివరకు చెప్పింది రూ . 17 వేల కోట్లు తీరా రుణమాఫీ అయింది 7500 కోట్లు అని అన్నారు .41.78 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మందికి రుణమాఫీ అయింది అని ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసి అంతే రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తెలిపారు. దేవుళ్లను కూడా వదలకుండా ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నార నీ, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ శరతులు లేకుండా రుణమాఫీ చేయాలి లేకుంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ….. భారీగా పోలీస్ బలగాల మోహరింపు…. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు రుణమాఫీ కోసం రైతుల నిరసన దీక్షకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి ఇంచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ బస్వారెడ్డి ,,స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో ,రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దేవారం నవీన్ రెడ్డి , జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగరి విట్టల్ రావు,బిజెపి నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, పాలెపు రాజు, ఆర్మూర్, బాల్కొండ ,నిజామాబాద్ రూరల్ లకు చెందిన రెండు వేలకు పైన రైతులు పాల్గొన్నారు.
👉హైదరాబాద్ ఉప్పల్ మండలంలో 1589 అక్రమ నిర్మాణాలు..!
హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.ఉప్పల్ మండలం పరిధిలో ఏకంగా 1589 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.*
మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
👉నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.*
డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ పై వైద్యురాలి దాష్టికం
డెలివరీ కోసం వచ్చిన మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత
బలవంతంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి..గురువారం రాత్రి కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణీ ఘటనలో వైద్యురాలిలో రాని మార్పు.
ఘటన పై ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర ..ఉన్నతాధికారుల మందలింపుతో నిన్నటి నుండి పట్టించుకోని వైద్య సిబ్బంది.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి పోతుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని నమ్మబలికిన వైనం.కోపంతో భయపడినట్టే ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితుల ఆరోపణలు.
🩺తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు..*
నల్గొండలో ఆస్పత్రులకు రోగుల తాకిడి..
ఖమ్మంలో పది రోజుల వ్యవధిలో ఐదుగురు మృతి..
కొమురం భీం జిల్లా కౌటాలలో ఇద్దరు మృతి
👉 తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న కొడుకు..
నల్గొండ జిల్లాలో నిడమనూరు మందల కేంద్రంలో దారుణం జరిగింది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సాయమ్మను కుమారుడు శివ(36) కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే తల్లిని చంపి కుమారుడు చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఆగ్రహం*
అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు, మహిళలను వేధించాడు.
మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడు.
అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడు.
అనంతబాబు ఇలాంటి వాడని, ఏజెన్సీలో అందరికీ తెలుసు.ఎంతో మంది మహిళలని లైంగికంగా వేధించాడు.అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపాడు. జగన్ మోహన్ రెడ్డి..ఇదేనా నీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ?
👉 కోల్‌కతా ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ సోదాలు..
కోల్‌కతా ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ సోదాలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆదివారం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరియు అతని బంధువులకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపింది. ఏకకాలంలో మొత్తం 15 ప్రదేశాలలో సీబీఐ బృందాలు సోదాలు చేపట్టాయి. ఘోష్ ఆర్జీ కర్ ఆస్పత్రి ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీబీఐ ఈ తనిఖీలు చేపట్టింది. ఇటీవల ఈ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు అత్యాచారం-హత్యకు గురైన విషయం తెలిసిందే.
👉ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహ్మాని, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం రాత్రి జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వారు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ భేటీలో TMRIES ఛైర్మన్ ఫహీం ఖురేషి కూడా ఉన్నారు…
👉 హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం.. పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు.. ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు.. హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు.. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చలు.. ఉన్నతాధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం…
👉ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు…బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. మేడ్చల్, మల్కాజ్ గిరిలోని, వెంకటాపూర్ నడం చేరవు పరిధి బఫర్ జోన్లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మించారని పోచారం ఐటీసీ, మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
👉 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవర్ని వదలం : సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి…
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామన్న ఆయన.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరామని చెప్పారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని తెలిపారు. సీబీఐ డైరెక్టర్ ను తానే స్వయంగా కలిసి కేసు స్వరూపాన్ని వివరించానని తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సీపీ.. ఈ కేసుతో సంబంధం ఎవరని వదలమని.. ప్రతి ఒక్కరిని విచారిస్తామని తేల్చి చెప్పారు. కాగా బీఆర్ఎస్ హాయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాపింగ్ అయ్యాయంటూ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉 లంచంఇవ్వకండి… సమాచారం ఇవ్వండి – అంటున్న ACB డీజీ CV ఆనంద్*
*ప్రజలకు కీలక సూచన చేశారు ఆనంద్ గారు* *ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్ను ఆనంద్ ఆవిష్కరించారు*.
*అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా* *dgacb@telangana.gov.in కి మెయిల్ చేయాలన్నారు*…
👉బండలాగుడు పోటీలను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…*గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో పీర్ల పండుగను పురష్కరించుకొని సైదుమియా స్వామి వార్ల 40 రోజుల జార్తుల సందర్బంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు గ్రామంలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని గ్రామస్థులు మేళా తాళాలతో పూలమాల శాలువాలు వేసి ఘణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్, స్థానిక సర్పంచ్ కడియం శేషగిరి, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు…
👉 కంభం సబ్ ఇన్స్పెక్టర్ ని కలిసిన టిడిపి నాయకులు.. కంభం స్థానిక పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సై నర్సింహా రావును ఆదివారం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్ షేక్ హుస్సేన్ (దాదా) ఈ కార్యక్రమంలో పఠాన్ నాగూర్ ఖాన్,సయ్యద్ ఖాసీం భాషా,షేక్ శుకూర్, షేక్ హిదా తుల్లా, షాకీర్ తదితరులు పాల్గొన్నారు
👉 ఘోర రోడ్డు ప్రమాదం. తండ్రి, కొడుకు మృతి
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బీరు పరిశ్రమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తండ్రి, కొడుకు మృతి
మోటార్ సైకిల్ ను ఢీ కొన్న లారీ
విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా సంభవించిన ప్రమాదం.అక్కడిక్కడే మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు
మృతులు రేగిడి ఆమదాలవలస మండలం ఉప్పాడ నాయుడు వలసకి చెందిన తండ్రీకొడుకులు గా గుర్తింపు
👉నలుగురు పేకాట రాయుళ్లు అరెస్టు..
ప్రకాశం జిల్లా:-కొమరోలు సబ్ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మరియు వారి సిబ్బంది మండలం లోని
ఇడమకళ్ళు గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న 4 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 9500/-
రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులు పోలీసులకు ఎస్సై రవీంద్రారెడ్డి సహకరించాలన్నారు.
👉కంభం లో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై..
ప్రకాశం జిల్లా కంభం మండలంలో ఆటో డైవర్స్ యూనియన్ వారికి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నరసింహారావు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది
ఎస్ఐ నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డైవర్స్ ప్రతి ఒక్కరికి లైసెన్సు ఉండాలని వాహనముకు సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని
వాహనములో ప్రయాణికులను ఎక్కించుకొని మితిమీరిన వేగంతో లౌడ్ స్పీకర్లు పెద్ద శబ్దాలతోఆటో నడపకూడదని ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ను ధరించాలని ప్రయాణికులను ఎక్కువమందిని ఎక్కించుకొని ఆటోను నడపకూడదని
ప్రతి ఒక్కరూ యూనియన్ల సభ్యత్వం తీసుకోవాలని
మద్యం సేవించి ఆటో నడపకూడదని హెచ్చరించారు.
👉 ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి విజయ్ పై అనుమానం పెంచుకున్న ప్రియురాలు ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. దీంతో ప్రియుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రియుడిని వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.