రేవంత్ పై సోనియా సీరియస్..రష్యాలో 9/11 తరహా అటాక్..గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత-సీఎం రేవంత్.. వైసీపీని వీడనున్న ఏలూరు నగర మేయర్‌ నూర్జహాన్?.చిత్తూరు..అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్?..పెద్దారెడ్డి పై నియోజ‌క‌వ‌ర్గ‌ బ‌హిష్క‌ర‌ణ వేటు!..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై 53 కేసులు.. పెద్దారెడ్డి పై నియోజకవర్గ బహిష్కరణ వేటు..బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. వైజాగ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం..ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన..

👉రేవంత్ పై సోనియా సీరియస్….!!!* తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు హైడ్రాను తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.అలాగే నాళాల పైన నిర్మించిన ఇండ్లను కూడా కూల్చేస్తోంది. ఇప్పటికే 50 మంది ప్రముఖుల… ఫామ్ హౌస్ లను అలాగే ఇండ్లను కూడా ధ్వంసం చేసింది హైడ్రా. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా.. కుప్ప కూలింది. అయితే తాజాగా… కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు కు సంబంధించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదట. దీంతో నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీకి పల్లం రాజు ఫిర్యాదు చేశారట. కాంగ్రెస్ పార్టీలో.. నమ్మిన బంటుగా ఉన్న తన ప్రాపర్టీ పైన.. రేవంత్ రెడ్డి చెయ్యి వేయడంపై ఫిర్యాదు చేశారట పల్లంరాజు. దీంతో సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరో తెలియదా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే బాగుండదని కూడా సోనియాగాంధీ హెచ్చరించారట…ఇకపై హైడ్రా చేసే విధ్వంసాన్ని… కంట్రోల్ చేయాలని కూడా సోనియా గాంధీ…రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారట. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ప్రాపర్టీ ముట్టుకోకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారట సోనియాగాంధీ.

👉అడవిలోకి చొరబడుతున్న 19మంది స్మగ్లర్లు అరెస్టు.. తిరుపతి సమీపంలోని నాగపట్ల అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్న 19 మందిని టాస్క్ ఫోర్సు పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేసి, వారి నుంచి మూడు కార్లు, 4పిడిలేని ఇనుప గొడ్డళ్లు, 4 ఇనుప రంపాలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్ఎ సురేష్ కుమారర్ రెడ్డికి చెందిన ఎస్ కే లింగాధర్ టీమ్ ఆదివారం కూంబింగ్ చేపట్టింది.

👉రష్యాలో 9/11 తరహా అటాక్*..రష్యాలోని సరాటోవ్లో ఉన్న భారీ భవంతిపై డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ మిలిటరీ పనే అని రష్యా ఏజెన్సీస్ అనుమానిస్తున్నాయి. ఈ దాడి అమెరికా 9/11 అటాక్ను తలపిస్తోందని నెటిజన్లు దాడి వీడియోను షేర్ చేస్తున్నారు. డ్రోన్ వచ్చి ఎత్తైన భవనాన్ని ఢీ కొట్టడంతో భారీ శబ్దంతో పొగలు వెలువడ్డాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు.

👉శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత..

చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారు.. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు.. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చు.. వారెవరిని పట్టించుకోను.. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం..హైదరాబాద్ లేక్ సిటీ.. గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి.. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్ లు కట్టుకున్నారు.. ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారు.. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం.. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం- సీఎం రేవంత్

👉ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడారు. తాజాగా మరికొందరు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఏలూరు నగర మేయర్‌ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు దంపతులు వైఎస్సార్‌సీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో.. ఈ నెల 27న ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఏలూరు నగర పాలక సంస్థకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 30 మంది కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు మేయర్ నూర్జహాన్‌ దంపతులతో కలిసి వెళ్లి చేరుతారా.. ఆ తర్వాత అనేది క్లారిటీ రావల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే చంటితో సంప్రదింపులు జరిపారు. మరోవైపు మేయర్‌తో పాటు కార్పొరేటర్లు చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ కైవసం అవుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమర్థత కలిగిన నాయకులని.. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మేయర్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు. వాస్తవానికి మేయర్ నూర్జహాన్, పెదబాబు‌ దంపతుల రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీలోనే మొదలైంది. 2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బడేటి బుజ్జి.. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో ఎస్‌ఎంఆర్‌ పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్‌ను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె గెలిచి ఏలూరు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. మేయర్ దంపతులు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. మరోసారి నూర్జహాన్‌కు మేయర్ పదవి దక్కింది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో రావాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇటీవలే మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా మేయర్ దంపతులు కూడా అదే బాటలో నడుస్తున్నారు.

👉రష్యాలో 9/11 తరహా అటాక్*..రష్యాలోని సరాటోవ్లో ఉన్న భారీ భవంతిపై డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ మిలిటరీ పనే అని రష్యా ఏజెన్సీస్ అనుమానిస్తున్నాయి. ఈ దాడి అమెరికా 9/11 అటాక్ను తలపిస్తోందని నెటిజన్లు దాడి వీడియోను షేర్ చేస్తున్నారు. డ్రోన్ వచ్చి ఎత్తైన భవనాన్ని ఢీ కొట్టడంతో భారీ శబ్దంతో పొగలు వెలువడ్డాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు.

👉*ప్రకాశం జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..*కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వం … అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం ..జిల్లా ఎస్పీ ఎ ఆర్ దామోదర్ ..

ప్రకాశం జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు జిల్లా ఎస్పీశ్రీ. ఎ ఆర్ దామోదర్ , ” శ్రీకృష్ణ జన్మాష్టమి” శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వమని… ఇది అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయమన్నారు. జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

👉హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం – రూ.8.50 కోట్ల విలువైన సరకు స్వాధీనం*హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..రూ.8.5 కోట్ల విలువచేసే 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్‌ స్వాధీనం..ముగ్గురు అరెస్టు; కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం

👉బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై 53 కేసులు.. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. బంగ్లాదేశ్‌లో రైఫిల్స్‌లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అబ్దుల్‌ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్‌ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రహీం.. అదే ఏడాది జులై 29న జైల్లో మరణించాడు. దీనిపై రహీం కుమారుడు అబ్దుల్‌ అజీజ్‌ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌పై మాజీ ప్రధాని హసీనాపై అభియోగాలు మోపారు. జులై 18న చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హసీనాతోపాటు మరో 48 మందిపై హత్యకేసు నమోదైంది. ట్రేడింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన వ్యక్తితోపాటు ఆటోరిక్షా డ్రైవర్‌ మరణం కేసుల్లో హసీనాతోపాటు పలువురిపై హత్యకేసు నమోదైంది. మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణహోమానికి సంబంధించి ఏడు, ఒకటి అపహరణతో పాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపు సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలో మాజీ ప్రధాని హసీనాపై దాడి కేసు నమోదయ్యింది.

👉వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం.. తీరంలో బయటపడ్డ రాళ్లపై టూరిస్టుల సందడి*బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేదతీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

👉 లిఫ్ట్ ఉందనుకుని.. నాలుగో ఫ్లోర్ నుంచి పడి వ్యక్తి మృతి..HYDలోని ఆసిఫ్ నగర్ PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ అపార్ట్ మెంట్ లో 4వ అంతస్తులో పాతకాలపు లిఫ్ట్ డోర్ ను సమీల్ల బైగ్ అనే వ్యక్తి ఓపెన్ చేశాడు. సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండిపోయింది. లిఫ్ట్ ఉందనుకుని ప్రమాదవశాత్తూ అడుగు పెట్టి 4వ అంతస్తు నుంచి పడిపోయి సమీల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Note: లిఫ్ట్ ఎక్కేముందు కాస్త చూసి ఎక్కండి.

👉 ఆ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 50 వేల పింఛన్.. !!! ఆ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 50 వేల పింఛన్  మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఆదివారం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యేల సమాఖ్య 22వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్షన్‌ను పెంచుతున్నట్లు సీఎం

👉పెద్దారెడ్డి పై నియోజ‌క‌వ‌ర్గ‌ బ‌హిష్క‌ర‌ణ.. వేటు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై జిల్లా ఎస్పీ.. నియోజ‌క‌వ‌ర్గ బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. తాము అనుమ‌తి ఇచ్చే వర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్ట‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో పెద్దారెడ్డిపై అన‌ధికార వేటు కొన‌సాగుతోంది.ఆయ‌న‌ను న‌గ‌రంలోకి ఒక‌ర‌కంగా చెప్పాలంటే జిల్లాలోకి కూడా పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. అయితే.. ఏదో ఒక కార‌ణంగా పెద్దారెడ్డి మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, పెద్దారెడ్డి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల నాలుగు రోజుల కింద‌ట కూడా.. పెద్దారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీతో తీవ్ర దుమారం రేగింది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చాడ‌ని తెలుసుకున్న‌ టీడీపీ నాయ‌కులు.. ఆయ‌న‌ను ప్ర‌శ్నించేందుకు ఇంటికి చేరుకున్నారు.దీంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పోగై.. ఇరు ప‌క్షాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. వ్య‌క్తుల‌కు పెద్ద‌గా గాయాలు కాలేదుకానీ.. ఇరు ప‌క్షాల‌కు చెందిన వాహ‌నాలు త‌గుల‌బెట్టుకున్నారు. పెద్దారెడ్డి ఇంటి అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే పోలీసులు.. పెద్దారెడ్డిని అక్క‌డి నుంచి అనంత‌పురం ప‌ట్ట‌ణానికి పంపించేశారు. కాగా… ఎన్నిక‌ల త‌ర్వాత చెలరేగిన హింస‌.. అనంత‌ర ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే కేసులు న‌మోదై.. విచార‌ణ ప‌రిధిలో ఉన్నాయి.ఇక‌, ఇటీవ‌ల చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి డీజీపీ నివేదిక స‌మ‌ర్పించారు. తాడిప‌త్రిలో ఇరు ప‌క్షాలు.. అంటే.. టీడీపీ, వైసీపీ కీల‌క నాయ‌కులు ఉంటే ఇలాంటి ఘ‌ర్ష‌ణ‌లే ఉంటాయ‌ని తేల్చి చెప్పారు. దీంతో గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబాన్ని అలానే ఉంచి.. వివాదాల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసీపీ నాయ‌కుడు, పెద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌హిష్క‌రిస్తూ.. ఎస్పీ ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

👉 కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్..కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్ కర్ణాటకలో ఓ వ్యాపారి తనను పోలి ఉన్న వ్యక్తిని భార్య, ట్రక్ డ్రైవర్ సాయంతో చంపి, బీమా సొమ్ము కాజేయాలనుకున్నాడు. అయితే చివరకు వీరు వ్యాపారి బంధువైన ఓ పోలీసును సాయం కోరి అరెస్టు అయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, వీరు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వ్యాపారి భార్య ఆ వ్యక్తికి అంత్యక్రియలు కూడా జరిపించింది. క్లెయిమ్ ప్రక్రియ అంతా సాఫీగా సాగేలా చూడాలని బంధువైన ఓ పోలీసును వ్యాపారి కోరడంతో విషయం తెలిసింది.

👉విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో పనిచేసే మండవ వెంకట శ్రీనివాస్‌ గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

👉 8 మంది ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్..

ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రొహిబిషన్ పీరియడ్‌లో ఫేజ్-2 పూర్తి చేసుకున్న ట్రైనీ అధికారులకు సబ్ కలెక్టర్లుగా నియమించింది. మార్కాపురం సబ్ కలెక్టర్‌గా సహదిత్ వెంకట్, పాలకొండ-యశ్వంత్ కుమార్, నర్నీపట్నం-కల్పశ్రీ, పెనుకొండ-భరద్వాజ్, గూడురు-రాఘవేంద్ర మీనా, పాడేరు-శౌర్యమాన్ పటేల్, కందుకూరు-శ్రీపూజ, తెనాలి-సంజనా సింహా నియమితులయ్యారు.

👉 నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడిన మహిళ..

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో శుక్రవారం ఓ నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్‌ కోట్ ఎక్స్‌ ప్రెస్ ట్రైన్‌ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉  అపోలో*చిత్తూరు:▪️అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సుమారు 200 మంది విద్యార్థులు కాదు 700 మంది కి ఫుడ్ పాయిజన్ ..▪️అత్యంత రహస్యంగా వైద్యం … విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న యాజమాన్యం..22 ఆగష్టు నా ఒక విద్యార్థి ఆత్మ హత్య చేసుకుంటే మరుసటి రోజు నుండి 26తేదీ వరుకు సెలవు ప్రకటించింది అపోలో హాస్పిటల్ యాజమాన్యం.▪️చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్తో 70 దాకా మంది విద్యార్థులకు అస్వస్థత..విషయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించిన యాజమాన్యం.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..