ఎట్టకేలకు వినేష్ ఫొగట్‌కు పతకం..ముందు హైడ్రా ఆఫీస్‌ను కూల్చేయండి: బీఆర్ఎస్.. సీఎం మమత తీరుపై కేంద్రం ఆగ్రహం..ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు..మధుర మీనాక్షి ఆలయంలో మరో వివాదం..లైంగిక దాడి కేసులో ఆరు లక్షలు తీసుకొని సెటిల్మెంట్ చేసిన ఇన్స్పెక్టర్..ఆక్రమణలపై నిలదీస్తే తనను చంపుతామని బెదిరించారని ఆరోపణ..

👉ఎట్టకేలకు వినేష్ ఫొగట్‌కు పతకం 👍💐💐💐

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆమెకు బంగారు పతకం లభించింది. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని హర్యానాలోని సర్వ్ ఖాప్ పంచాయత్ గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేసింది. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్‌ ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు. నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.ఈ పరిస్థితుల్లో భారత్‌కు తిరిగి వచ్చిన వినేష్ ఫొగట్‌కు హర్యానా ఖాప్ పంచాయత్ బంగారు పతకంతో గౌరవించింది. 30వ పుట్టినరోజు నాడు ఆమెకు ఈ మెడల్‌ను అందజేసింది. ఖాప్ పంచాయత్ తన సొంత నిధులతో దీన్ని తయారు చేయించింది. ఈ పతకంపై ఒలింపిక్స్ సింబల్, 2024 అనే అక్షరాలను ముద్రించింది. దీనిపై వినేష్ ఫొగట్ స్పందించారు. తన సొంత ఊరిలో, సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. అంతకుమించి హర్యానా ఖాప్ పంచాయత్ తనకు బంగారు పతకాన్ని బహూకరించడం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

👉ఏపీలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు..అమరావతి :సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటన చేసిన మంత్రి రాంప్రసాద్.రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఆర్వోల నుంచి కలెక్టర్ల వరకు అధికారులందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారు.

👉ముందు హైడ్రా ఆఫీస్‌ను కూల్చేయండి: బీఆర్ఎస్ హైదరాబాద్ లో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. దీంతో అక్రమ కట్డడాలు చేపట్టిన వారిలో భయం మొదలైంది. అయితే, హైడ్రా కూల్చివేతలపై పెద్ద చర్చే జరుగుతోంది.సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా.. చెరువులను కబ్జా చేసి పలువురు రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని.. ముందు వాటిని కూల్చాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.నాలాలపై ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయని.. వాటిని కూడా కూలుస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా ఆఫీస్ కూడా హుస్సేన్ సాగర్ నాలాపై కట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ఫోటోలను షేర్ చేస్తున్నారు.లిబర్టీ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానిది కూడా ఇదే పరిస్థితని ఉందని.. ముందు ఈ రెండు ప్రభుత్వ భవనాలను కూల్చేయండని.. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎక్స్ లో గూగుల్ మ్యాప్‌ను అటాచ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు…*** ఏది ఏమైనప్పటికీ ఆక్రమణలను తొలగించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

👉కవిత బెయిల్ పై ఉత్కంఠ…ఈరోజు సుప్రీమ్ కోర్ట్ లో కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు. కోర్ట్ నిర్ణయం పాజిటివ్ గా వస్తుందనే హోప్ తో కెసిఆర్, కేటీఆర్.కవిత అరెస్ట్ అయ్యి 164 రోజులు ఇప్పటికి..

👉 పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్‌/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.అది కూడా గత ఏడాదే అందుబాటులోకి తెచ్చారని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఘాటుగా ఆమెకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 90 రేప్‌ కేసులు నమోదవుతున్నాయని.. దోషులకు 15 రోజుల్లోనే కఠిన శిక్షలు విధించేలా పార్లమెంటులో చట్టం చేయాలని మమత ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాశారు.దీనిపై అన్నపూర్ణాదేవి తీవ్రంగా స్పందించారు. బెంగాల్లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి కేంద్రం.. 181, 112, 1098, 1930 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులోకి తెస్తే.. ఎన్ని సార్లు గుర్తుచేసినా మమత సర్కారు వీటిని అమలు చేయలేదన్నారు

👉రాజాంలోని ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. *రాజాం :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. పెనుబాక గ్రామ సమీపంలో ఉన్న సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలోని ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

👉మదుర మీనాక్షి ఆలయంలో మరో వివాదం*..ఆలయ అధికారులపై దేవదాయశాఖకు సినీనటి నమిత ఫిర్యాదు..హిందువులకే ఆలయ దర్శనమంటూ ఆలయ అధికారులు అవమానించారని నమిత ఆరోపణ.అన్య మతస్థులకు దర్శనంలో నిబంధనలు ఉన్నాయని వాటిని మాత్రమే ఫాలో అయ్యామన్న ఆలయ అధికారులు.నేను తిరుమలలో పెళ్లి చేసుకున్నా, నేను కూడా హిందువునే.. నా పిల్లలు కూడా హిందువులే అని సినీనటి నమిత ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు. మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు.ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్‌ తగలబెట్టడు. మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసు విచారణలో ఉంది. ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదు. ఫైల్స్‌ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా.? రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులు ఉన్నారా? రాష్ట్రంలో అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

👉ప్రొద్దుటూరు డిపో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు హాజరవుతున్న ఉద్యోగులు….డిమాండ్లు:- *జిల్లా లోని అన్ని డిపో లలో N/O Allowances చెల్లించాలి*. .*1/2019 సర్కులర్ ను అమలు చేయాలి.*  *పెండింగ్ లో ఉన్న కడప,బద్వేలు, మైదుకూరు డిపోలలో నూతన కండక్టర్ డ్రైవర్ల ఫిక్సుడు చార్టులు వేయాలి.   *అవగాహన లేమి తో అనవసమైన రికవరీలు పెట్టి ఏకపక్ష నిర్ణయాల తో పక్షపాత వైఖరి తో ఉద్యోగులు ను వేధిస్తున్న జమ్మలమడుగు డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి.  *లిటరసి టెస్ట్ వ్రాసిన డ్రైవర్ సోదరులకు ఫలితాలు వెలువరించి త్వరగా 12,18,24,30 సం”ల AAS ఇంక్రిమెంట్లు కలిపే ఏర్పాటు చేయాలి.*సర్కులర్ నిబంధనల ప్రకారం స్పేర్ నందు ఉన్న సిబ్బందికి బలవంతంగా లీవులు వేసే విధానానికి స్వస్థి చెప్పి Muster ఇచ్చే ఏర్పాటు చేయాలి.   *అవసర నిమిత్తం అర్హత మేరకు మహిళలకు CHILD CARE LEEVE ఇవ్వాలి*.   *అక్రమ చార్జిషీట్ లకు రద్దు చేయాలి. *హయ్యర్ క్వాలిఫికేషన్ లేదని గ్యారేజి సిబ్బందికి 12,18,24 సం”ల ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. వాటిని కలిపే ఏర్పాటు చేయాలి.   *రీజియన్ వ్యాప్తంగా అన్ని డిపోలలో సీనియారిటీ ప్రకారం 281 చార్ట్ బుక్ చేయాలి.   *గ్యారేజి సిబ్బందికి సరైన టూల్స్ మెటీరియల్ సప్లై చేయాలి*.  *జిల్లాలోని అన్ని డిపోలకి క్రొత్త టిమ్ పౌచస్ చార్జెర్లు తెప్పించాలి*.

👉హైదరాబాద్‌:  దుండిగల్‌లో దారుణం ఛార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు..చార్జర్‌ ఇవ్వలేదని శాంత అనే మహిళను..కొట్టి చంపిన కమల్‌ కుమార్‌ ..సీసీ కెమెరాలో రికార్డయిన హత్య దృశ్యాలు

👉 ఎన్నికలకు ముందు మదనపల్లెలో తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆక్రమించి, అక్రమంగా ఇల్లు కూడా కట్టారని చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మజరా సుద్దగుంట గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ జి. మురళి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి మురళి వినతి పత్రం ఇచ్చారు. ఆక్రమణలపై నిలదీస్తే తనను చంపుతామని బెదిరించారని, దీనిపై విచారణ జరిపించి కబ్జా చేసిన వారితోపాటు సహకరించిన తహసీల్దార్‌పైనా చర్యలు తీసుకోవాలని మురళి కోరారు.

👉లైంగిక దాడి కేసులో ఆరు లక్షలు డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసిన ఇన్స్పెక్టర్…*అనంతపురానికి చెందిన వివాహితకు హైదరాబాద్ వస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని వివాహితను నమ్మించి లైంగికదాడి చేశాడు.. బాధిత మహిళ బయటకు వచ్చి ఏడుస్తుండటంతో మరో యువతి అక్కడికి వచ్చి.. తనకు కూడా అన్యాయం చేశాడని, వీడిని ఎలా నమ్మి ఇంతదూరం వచ్చావంటూ చెప్పింది. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు అతడి స్నేహితుడికి బాధితురాలి నంబర్ ఇచ్చాడు. అతడు కూడా తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఫోన్ చేసి.. వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ మొదట బాధితురాలిపైనే ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చాడు. ఆమె డబ్బులు ఆశిస్తుందంటూ అధికారులకు చెప్పి.. ఆ కేసు తీవ్రతను తగ్గించాడు. ఆ తరువాత రెండు కేసుల్లో నిందితులను పిలిపించాడు. ‘కేసు పెద్దదవుతోంది.. నేను ఆ అమ్మాయితో మాట్లాడుతాను.. మీరు రూ.6 లక్షలు ఇవ్వండి అంటూ సెటిల్మెంట్ చేశాడు. నిందితుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి.. అందులో సగం బాధితురాలికి ఇచ్చి.. మిగతా సగం రూ.3 లక్షలు ఇన్స్పెక్టర్ కొట్టేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పెండ్లయ్యింది.. పిల్లలున్నారు కేసులు పెట్టు కొని ఎన్నాళ్లు కొట్లాడుతావు. డబ్బులు వచ్చాయి. ఈ కేసు మర్చిపో అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చాడు. నీవు కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే. అటు నిందితులు సేఫ్ అవుతారు.. మేం కూడా.. నీవు కోర్టులో పిటిషన్ వేశావని కేసు క్లోజ్ చేస్తాం.. ఎవరి చేతికి మట్టి అంటకుండా అన్ని సర్దుకుంటాయి.. అంటూ ఆ ఇన్స్పెక్టర్ బాధితురాలు, నిందితుల మధ్య రాజీ కుదిర్చి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

👉 ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు. మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు.ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్‌ తగలబెట్టడు. మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసు విచారణలో ఉంది. ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదు. ఫైల్స్‌ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా.? రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులు ఉన్నారా? రాష్ట్రంలో అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

👉 ఎన్నికలకు ముందు మదనపల్లెలో తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆక్రమించి, అక్రమంగా ఇల్లు కూడా కట్టారని చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మజరా సుద్దగుంట గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ జి. మురళి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి మురళి వినతి పత్రం ఇచ్చారు. ఆక్రమణలపై నిలదీస్తే తనను చంపుతామని బెదిరించారని, దీనిపై విచారణ జరిపించి కబ్జా చేసిన వారితోపాటు సహకరించిన తహసీల్దార్‌పైనా చర్యలు తీసుకోవాలని మురళి కోరారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త