**తాడిపత్రి గ్రామీణ పీఎస్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిరసన..అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు
..అక్రమ రవాణాదారులు, జేసీ అనుచరుల మధ్య తోపులాట -అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలన్న జేసీ అస్మిత్ రెడ్డి-కేసులు నమోదు చేయాలని సీఐ లక్ష్మీకాంతరెడ్డికి ఫోన్ చేసిన అస్మిత్ రెడ్డి -*నువ్వు చెబితే కేసు పెట్టాలా అని జేసీ అస్మిత్‍రెడ్డిని ప్రశ్నించిన లక్ష్మీకాంతరెడ్డి- సీఐ లక్ష్మీకాంతరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పీఎస్ వద్ద ఆందోళన -సీఐ తీరుకు నిరసనగా తాడిపత్రి గ్రామీణ పీఎస్ వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన..
👉 మార్కాపురంలో మాధవి గ్రాండ్ ఇన్ కళ్యాణ మండపం లో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఐ. వి. సుబ్బారావు ఆధ్వర్యంలో లో ఆంధ్రప్రదేశ్ యునియాన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ప్రకాశం జిల్లా వారు నిర్వహించిన విస్త్రుత సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ,కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహ రెడ్డి , సంతనూతలపాడు శాసనసభ్యులు బి. న్. విజయ్ కుమార్ , చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య , తెలుగుదేశం పార్టీ యువనేత దామచర్ల సత్య ,యర్రగొండపాలెం ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ,దర్శి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మి ,మరియు పలువురు జర్నలిస్టులు, జాయిర్నలిస్టు సంఘాల నాయకులు, రాజకీయ ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి మంగళవారం ఒంగోలు రాంనగర్ 2వ లైన్ లో నివాసముంటున్న కొత్తమాసు శ్రీనివాస్ కుమార్, శ్రీదేవి ల కుమార్తె చి. ల. సౌ రమ్య, చి. సాయిరాజ్ ల వివాహమహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. .
**హెల్మెట్లు ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన..హెల్మెట్ లో ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి కంభం ఎస్సై బి నరసింహారావు మంగళవారం ద్విచక్ర వాహనదారులకు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్లు ధరించకపోవడం వల్లనే అత్యధిక శాతం ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని తెలిపారు. కావున ప్రజలు వారి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా హెల్మెట్లను ధరించాలని కోరారు .కంభం ఆర్టిసి బస్టాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బందితో మాజీ సైనికుల సంఘం నాయకులు,ప్రజలు, పాల్గొన్నారు
**నరసరావుపేట మండలం రావిపాడు వద్ద రైతుల ఆందోళన*పల్నాడు జిల్లా..నకరికల్లు-చీరాల ఓడరేవు రోడ్ కొలతలకు వచ్చిన అధికారులు.కొలతలకు వచ్చిన అధికారులను అడ్డగించి రైతుల ఆందోళన..ప్రస్తుతం వేస్తున్న రోడ్డు వలన రావిపాడు, ఇస్సాపాలెం, జొన్నలగడ్డ రైతులు రూ 400 కోట్లునష్ట పోతున్నారని ఆవేదన..కావాలనే గత ప్రభుత్వం రోడ్డు మార్చిందని రైతుల ఆగ్రహం…రోడ్ యలైనమెంట్ మార్చి రైతులకు మేలు చేయాలని డిమాండ్.
👉ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులపై త్వరలో నిర్ణయం*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2 లేక మూడు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.నోటిఫికేషన్లో హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.
👉ఏలూరులో వైసీపీకి భారీ షాక్…*టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు**కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్*
అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైకాపా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.
👉మొన్న గోరంట్ల, నిన్న దువ్వడా,విజయ సాయి రెడ్డి, నేడు అనంత్ ,వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీని అభాసుపాలు చేస్తున్న నేతలు – వైసీపీ పార్టీ అధినేత కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?…పార్టీ కి ఎంత నష్టమో తెలియడం లేదా…మాస్టర్ ప్లాన్ ఏమిటి?*
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన సమస్యల్లో ఉంది. మళ్లీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవ్వాల్సి ఉంది. అయితే ఇలాంటి సమయంలో పార్టీకి తలనొప్పులు తెచ్చేలా కొంత మంది వ్యహారశైలి ఉంది. విజయసాయిరెడ్డి వ్యవ హారం పూర్తిగా సద్దుమణగక ముందే ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం దుమారం రేపుతోంది.అది మార్ఫింగ్ అని చెబుతున్నారు కానీ.. ఆ వీడియోను చూపించి చాలా కాలంగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు.అంటే.. అలాంటి వీడియో ఉందని ఆయనకు ముందే తెలుసన్నమాట.అది మార్ఫింగే అయితే అప్పట్లోనే ఫిర్యాదు చేసి ఉండేవారు కదా అని ఎక్కువ మంది డౌట్. అనంతపురం రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలు చూసిన వారు..తెలిసిన వారు అదేమి మార్ఫింగ్ అని అనుకోవడం లేదు.వరుసగా వివాదాస్పదమవుతున్న వైసీపీ నేతల వ్యవహారాశైలి అనంతబాబు ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఉన్నారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కానీ లేకపోతే జైల్లోనే ఉండేవారు. ఇటీవల విజయసాయిరెడ్డి విషయంలో .. ఓ దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్త చేసిన ఆరోపణలు సంచలనాత్మకమయ్యాయి. వాటిపై రోజుల తరబడి చర్చ జరిగింది. ఆ ఉద్యోగిని భర్త.. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డేనని డీఎన్ఎ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మాత్రం ఆమెను ఓ కూతురిగా భావించి మాత్రమే సాయం చేశానని అంతే తప్ప.. మరేలాంటి ఆరోపణలకు చాన్స్ లేదని వాదించారు. ఆయనపై పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఎలాంటి వివరణ తీసుకోలేదు.అంబటి, అవంతి, దువ్వాడ.. విజయసాయిరెడ్డి ! మరో వైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ వంటి వారి ఆడియోల వైరల్ అయ్యాయి. వేర్వేరు మహిళలతో వారు చేసిన సంభాషణలు.. శృతి మించి ఉన్నాయి. వారు కూడా ఆ మాటలు తమవి కావని వాదించారు. నిజంగా అవి మార్ఫింగ్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే.. వాటిని మార్ఫ్ చేసిన వారిని పట్టుకుని కఠఇనమైన సెక్ష్షన్ల కింద కేసులు పెట్టేవారు. కానీ అలాంటి ప్రయత్నమే చేయకపోవడంతో అవన్నీ నిజమైన టేపులేనన్న అభిప్రాయం ప్రాజల్లో కూడా బలపడింది. ఇక హిందూపురం ఎంపీగా ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన గోరంట్ల మాధవ్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో విషయంలోనూ అదే ఎదురుదాడి చేశారు. చర్యలు తీసుకునే విషయాన్ని పట్టించుకోని వైసీపీ హైకమాండ్ ..తాాగా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటూ.. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనం సంచలనం అయింది. ఇలా నేతల వ్యక్తిగత ప్రవర్తన పార్టీని ప్రజల్లో చులకన చేసేలా ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవానికి వైసీపీ అధినేత సంశయిస్తున్నారు. దువ్వాడను ఇంచార్జ్ పదవి నుంచి మాత్రం తప్పించారు. మిగతా వారిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. వైసీపీ హైకమాం్ తీరు కూడా ఆయా నేతల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతోంది.
👉భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?*మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పై ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ సహకారం తో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C) విచారణ జరుపుతున్నది. టెలిగ్రామ్లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణ లో తేలనుంది.
*నేడు పల్నాడు ఎస్పీని కలవనున్న బుద్ధా వెంకన్న,డా౹౹చదలవాడ అరవింద బాబు…పిన్నెల్లి అనుచరుడు కిషోర్ పై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న బుద్ధా వెంకన్న.వైసీపీ హయాంలో తన పై హత్యకు యత్నించారని ఆరోపణ.
**31 నుంచి ‘వాలంటీర్ల నివేదన’ కార్యక్రమం*మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది.గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు(ఆగస్టు 28) జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే CM చంద్రబాబు, Dy. CM పవన్ కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. తిరుపతి,మంగళవారం.టిటిడి పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.మీడియాతో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కామెంట్స్.టీటీడీలో 100 కోట్ల ముడుపులను వెంటనే నిగ్గు తేల్చాలి.అలిపిరి సమీపంలోని దైవలోక్ కి కేటాయించిన 150 ఎకరాలను రద్దుచేసి, టిటిడిలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. డిప్యూటేషన్ విధానాలకు టిటిడి లో స్వస్తి పలకాలి. ఉద్యోగస్తులకే ప్రమోషన్లు ఇచ్చి, మంచి పోస్టులు ఇవ్వాలి.కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలి.విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
**పుష్ప స్టయిల్‌లో గంజాయి స్మగ్లింగ్.. పట్టుకున్న పోలీసులుపాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లు.అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుంచి తీసుకొస్తుండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పట్టుకున్న పోలీసులు.వాహనం వదిలి పరారైన గంజాయి ముఠా.. 820 కేజీల గంజాయి స్వాధీనం, ఒకరి అరెస్టు.
**ఫుడ్ పాయిజన్.. 49 మంది విద్యార్థులకు అస్వస్థత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఘటన.
👉కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవి రెడ్డిపై అనుచిత ఆరోపణలు చేసిన కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు ఇంటిని ముట్టడించిన ఎమ్మెల్యే అభిమానులు! తమ ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ చెత్తను మేయర్ ఇంటిలోకి విసిరేసిన ఆందోళనకారులు! వివరాల్లోకి వెళితే కడప పట్టణంలో చెత్తను సేకరిస్తున్న వాహనాలను అదేపనిగా తగ్గించి రోజులతరబడి చెత్తను సేకరించకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మేయర్ ప్రయత్నిస్తున్నాడని, దీనివలన ప్రజలు తిరగబడి తమ ఇళ్లలోని చెత్తను తీసికెళ్ళి సంబంధిత కార్పొరేటర్, మేయర్ ఇళ్లలో వేస్తారని మాధవి రెడ్డి ఇటీవల హెచ్చరించారు! మాధవి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మేయర్ మాధవి రెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిందని ఆమె వ్యవహారం చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశాడు! ఎమ్మెల్యేపై మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి అభిమానులు ఈ విధంగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు!
👉నారాయణ స్కూల్ పైవిచారణ చేసి సీజ్ చేయాలి.. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ భాస్కర్.. నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు డోన్ పట్టణంలో ఉన్నటువంటి స్కూల్ నందు వివిధ రకాల చాలా కంప్లీట్ ఉన్నప్పటికీ విద్యాధికారులు చూసి చూడటం వ్యవహరిస్తున్నారు అయితే ఇలా విద్యాధికారులు నిర్లక్ష్యం చేయటం వలన నారాయణ స్కూల్ నందు విద్యార్థులతో వివిధ రకాల పనులైన అటువంటి మట్టి పని కావచ్చు చైర్లు మోపించడం కావచ్చు లేక అనేక పనులు చేపిస్తూ పిల్లలను కొట్టడం ఇలా చాలా విధాలుగా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి సంబంధిత విద్యాధికారులు తక్షణమే స్పందించి నారాయణ స్కూలు సీజ్ చేయవలసిందిగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ఉన్నత విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు
*కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశం.. సాక్షులను ప్రభావితం చేయొద్దు, కవిత పాస్‌పోర్ట్‌ను అప్పగించాలి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది.. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు.. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నాం.. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది-సుప్రీంకోర్టు
*హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత..?తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణా లు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోం ది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో పలువరు హైడ్రా కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా రు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది. మధుర నగర్‌లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా.. కమిష నర్ రంగనాథ్ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిష నర్ గా ఉన్న రంగనాథ కు ముప్పు పొంచి ఉండటంతో ఈ భద్రత ఏర్పాటు చేశారు.
👉ఆంధ్రాలో కూడా హైడ్రా 😯😯😯: ఎమ్మెల్యే గంటా
ఏపీలో కూడా తెలంగాణలో మాదిరిగానే హైడ్రా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంత్రి నారాయణతో నాగలుప్పాడు డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను సహించమని నారాయణ స్పష్టం చేయగా.. పక్కనే ఉన్న గంటా స్పందిస్తూ ‘ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటిది వస్తది మళ్లీ’ అని అన్నారు.
*అమరావతి: ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నేను పార్టీకి దూరంగా ఉంటున్నా.. ఈవీఎంలపై నేను చేస్తున్న పోరాటాన్ని పార్టీ పట్టించుకోవడం లేదు.. పార్టీకి చెబుదాం అంటే కనీసం వీనే పరిస్థితిల్లో లేరు.. పార్టీ కోసం కష్టపడి పని చేశాను.. అయినా ఎవరు నా వైపు చూడటం లేరు.. జనసేనలోకి వెళ్తున్నానని నాపై ప్రచారం చేస్తున్నారు.. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారేమో. -బాలినేని శ్రీనివాస్ రెడ్డి
**రుణమాఫీ అడిగిన రైతులను తిట్టి చేయి చేసుకున్న మంత్రి తుమ్మల*..రైతులకి, మంత్రికి మధ్య తీవ్ర వాగ్వాదం.*ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకున్న రైతులు*
**అధికారుల నిర్లక్ష్యం,RMP డాక్టర్ వైద్యంతో ఇంటర్ విద్యార్థి మృతి*..పలమనేరులో కొంతమంది RMP డాక్టర్లు కుట్లు వేసి చిన్న చిన్న ఆపరేషన్లే చేసేస్తున్నారు. గర్భిణి మహిళలకు డెలివరీలు కూడా చేస్తున్నారు.అబార్షన్లు కూడా చేసే స్థాయికి ఎదుగుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు పోతున్నారు ఎందుకు? ఆర్ఎంపీ డాక్టర్ల యూనియన్ తరపున లక్షల రూపాయల్లో ప్రతినెల కొంతమంది పై అధికారులకు(పర్యవేక్షకులకు) మామూలు చెల్లిస్తున్నట్టు కూడాసమాచారం ఉంది. ప్రాణం పోతే కానీ అధికారులు పట్టించుకోరా? ఇలాంటివి జరిగినప్పుడు వస్తారు హడావిడి చేస్తారు తర్వాత మనకెందుకులే అనివదిలేస్తారు.ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి RMP లపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.